ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీ విషయమై సోమవారం నాడు తుది నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో రైతుల రుణమాఫీ విషయమై సోమవారం నాడు తుది నిర్ణయం తీసుకుంటామని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తెలిపారు. అదే రోజు బ్యాంకు అధికారులతో చర్చిస్తామని, అప్పుడే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. రైతులకు కార్పొరేషన్ నుంచి బాండ్లు జారీ చేసే ఆలోచన ఉందని ఆయన అన్నారు.
ఏది ఏమైనా ఈ అంశంలో ఈ నెలాఖరులోగానే ఒక పరిష్కారం కనుగొంటామని సుజనా చౌదరి చెప్పారు. లేనిపక్షంలో రైతుల పంటల బీమాకు ఇబ్బంది కలుగుతుందని, అలాంటి ఇబ్బందులు ఏవీ ఉండకుండా చూడాలనే తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. మరోవైపు జన్మభూమి కార్యక్రమంలో రైతులు రుణమాఫీ విషయం మీద ఎక్కడ నిలదీస్తారోనని టీడీపీ వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని గట్టిగా పట్టుకోవడం, జన్మభూమిలో అధికార పక్షాన్ని నిలదీయాలని నిర్ణయించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.