శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన గవర అప్పల్నాయుడు విద్యుదాఘాతంతో మరణించాడు.
తెగి కింద పడిన కరెంట్ తీగ ఓ రైతు పాలిట మృత్యు పాశమైంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామానికి చెందిన గవర అప్పల్నాయుడు(45) మంగళవారం ఉదయం పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు ఆన్ చేస్తుండగా కరెంటు తీగ తెగి అతనిపై పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.