కొత్తూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం | family attmepts suicide, two killed | Sakshi
Sakshi News home page

కొత్తూరులో కుటుంబం ఆత్మహత్యాయత్నం

Jul 12 2014 6:27 PM | Updated on Nov 6 2018 7:53 PM

జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. రామసముద్రం మండలం మూగవాడి కొత్తూరులో ఒకే కుటంబానికి చెందిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

కొత్తూరు:చిత్తూరు జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. రామసముద్రం మండలం మూగవాడి కొత్తూరులో ఒకే కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ఆ కుటుంబంలో మొత్తం నలుగురు ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించారు. వీరిలో తల్లీ-కూతురు మృతి చెందగా, మరో కూతురు, కొడుకుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించి, మరో ఇద్దరు ప్రాణాలతో పోరాడుతుండటంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

కుటుంబంలో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదమే ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. తనకు బైక్ కావాలని కొడుకు మంజునాథ్ కుటుంబ సభ్యుల్ని అడగటంతోనే గొడవ ఆరంభమైంది. అదికాస్తా పెద్దగిగా మారడంతో ఆ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement