
ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలి: మాజీ ఎంపీ
ముద్రగడ పాదయాత్రను ప్రభుత్వం, పోలీసులు అడ్డకోవాలని ప్రయత్నంచడం దారుణమని మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు.
చిత్తూరు: ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ప్రభుత్వం, పోలీసులు అడ్డకోవాలని ప్రయత్నంచడం దారుణమని, పాదయాత్రకు అనుమతినివ్వాలని మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని గతంలో అంబేడ్కర్ ప్రతిపాదించారని, ఈ ప్రభుత్వం కమిటీల పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నాదన్నారు. సీఎంకు ప్రచారం పై ఉండే ఆసక్తి అభివృద్ధిపై లేదని ఎద్దేవా చేశారు. జిల్లా వాసి అయిన సీఎం 13 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఆయన కుమారుడు, కోడలకు రెండు జాబ్‌లు ఇచ్చుకున్నారని ప్రజలకు చేసిందేమి లేదన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లోఅవినీతి పెరిగిందని డబ్బులు ఇస్తే కానీ అధికారులు పనిచేయడం లేదని తెలిపారు. జీఎస్టీ వలన కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగమని, భారం వినియోగదారులపై పడుతున్నదన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుకున్నయని, దానివలన ప్రజలు పస్తులు ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. నోట్ల రద్దు వలన వ్యాపారాలు సన్నగిల్లయని, పేదరికం పెరిగిందన్నారు. టీడీపీ పాలనతో ప్రజలు విసిగిపోపయారని ఆ పార్టీలకు ఇంక భవిష్యత్ లేదని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బీజేపీకు మద్దతు ప్రకటించి భవిష్యత్‌లో పొత్తు ఉంటుందని సూచనలు చేసిందని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ తో మంచి అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులను పాలన ప్రభుత్వం తాము చేసినట్లు ప్రకటించుకోవడం అవమానకర చర్య అని అన్నారు. ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడవద్దని మాజీ ఎంపీ చింతామోహన్ వివరించారు.