ఇదీ ఎంసెట్ ఉత్తీర్ణత | EAMCET passing | Sakshi
Sakshi News home page

ఇదీ ఎంసెట్ ఉత్తీర్ణత

May 22 2015 1:41 AM | Updated on Jul 11 2019 6:33 PM

ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి.

ఇంజనీరింగ్ : 71.30%, మెడిసిన్ : 84.02 %
 ఈసారి మెడిసిన్‌లో జిల్లా విద్యార్థులు మెరిశారు. పి.నాగసత్యవరలక్ష్మి  (ధవళేశ్వరం) 46, జి.వెంకటరత్న అంజని ( కాకినాడ) 82 ర్యాంకులు సాధించారు. మెడిసిన్‌లోనే బి.దామోదర్ 105, కె.నాగభవ్యశ్రీ (వెదురుపాక) 853, ఎస్.అమూల్యరెడ్డి 1080 ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్‌లో వి.సాయిహర్ష (రాయుడుపాలెం) 14, కె.మెహర్ దీపిక 40, పి.గోపాల కృష్ణంరాజు 91వ ర్యాంకు సాధించారు.
 
 బాలాజీచెరువు (కాకినాడ) :ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో ఇంజనీరింగ్ విభాగంలో 14,639 మంది విద్యార్థులు హాజరు కాగా 10,439 మంది ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ విభాగంలో  4,203 మంది అభ్యర్థులు హాజరుకాగా 3,543 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌లో 71.30 శాతం మంది, మెడిసిన్‌లో 84.02 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాకినాడ రీజియన్‌లో ఇంజనీరింగ్ పరీక్షకు 1,195 మంది విద్యార్థులు హాజరు కాగా 8,604 మంది ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్‌లో  3,517 మంది పరీక్ష రాయగా 2,985 మంది ఉత్తీర్ణత సాధించారు. అమలాపురం రీజియన్‌లో  2,684 మంది ఇంజనీరింగ్ పరీక్ష రాయగా 1,835 మంది ఉత్తీర్ణులయ్యూరు. మెడిసిన్ విభాగంలో 686 మంది పరీక్షకు హాజరు కాగా 558 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను జేఎన్‌టీయూకేలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మి, జేఎన్‌టీయూకే వీసీ వీఎస్‌ఎస్ కుమార్, ఎంసెట్ క న్వీనర్ సాయిబాబు, రిజిస్ట్రార్ ప్రసాద్‌రాజు  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement