ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు చేపట్టిన కౌన్సెలింగ్ శనివారం రెండవ రోజూ కొనసాగింది. స్థానిక ఈఎస్‌సీ ప్రభుత్వ...
నూనెపల్లె : ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు చేపట్టిన కౌన్సెలింగ్ శనివారం రెండవ రోజూ కొనసాగింది. స్థానిక ఈఎస్‌సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు క్యాంప్ కో ఆర్డినేటర్ రామ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బఃగా ఆయన మాట్లాడుతూ రెండవ రోజు కౌన్సెలింగ్‌లో 15001 నుండి 30 వేల ర్యాంకులు సాధించిన విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు.
ఇందులో సర్టిఫికెట్ పరిశీలనకు మొత్తం 167 మంది హాజరు అయ్యారని, ఎస్సీ విద్యార్థులు 4, ఓసీ, బీసీ, మైనార్టీలు 163 మంది హాజరయ్యారు. ఆదివారం కౌన్సెలింగ్‌లో 30,001 నుండి 45 వేల ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, ఈ ర్యాంకు విద్యార్థులు హాజరు కావాలని చెప్పారు. కౌన్సెలింగ్‌లో సిస్టమ్ అధికారులుగా సుబ్బరాయుడు, మంజునాథ్, కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.
సర్టిఫికెట్లు ముందుగా ఇవ్వొద్దు ..
మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తి అయిన వెంటనే ఇంజనీరింగ్ లో కళాశాలలో చేరే విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఎంసెట్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను విద్యార్థులకు రెండు విడతల్లో ఉన్నత విద్యాశాఖ మండలి నిర్వహిస్తుందని తెలిపారు. అయితే గతంలో మొదటి విడతలతో కౌన్సెలింగ్ తర్వాతనే కళాశాలలు సర్టిఫికెట్లు, ఫీజులు వసూలు చేసేవారన్నారు. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు వెళ్లిన సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు కలిగేవన్నారు.
వారి ఇబ్బందులను తొలిగించేందుకు రెండ విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతనే ఎంపిక చేసుకున్న కళాశాలల్లో సర్టిఫికెట్లు ఫీజులు చెల్లించవచ్చని చెప్పారు. కాగా రెండో కౌన్సెలింగ్‌కు వెళ్లే వారు మాత్రం సమీపంలోని ఆన్‌లైన్, వెబ్‌కేంద్రాల్లో కళాశాలలకు సూచన చేయాల్సి ఉంటుందని వివరించారు.
కర్నూలులో
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభం కాగా రెండో రోజు శనివారం కూడా కొనసాగింది. బి.తాండ్రపాడులోని జి. పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 15001 నుంచి 30 వేల ర్యాంకు వరకు పిలువగా 227 మంది విద్యార్థులు తమ సరిఫికెట్లను పరీక్షించుకున్నారు. రాయలసీమ యూనివర్సిటీలో 22,501 నుంచి 30 వేల ర్యాంకు వరకు పిలువగా 216 మంది హాజరైనట్లు ఆర్‌యూ వీసీ వై. నరసింహులు తెలిపారు.