బావిలో మృతదేహం | Dead body found in Well | Sakshi
Sakshi News home page

బావిలో మృతదేహం

Jul 11 2015 5:04 PM | Updated on Sep 2 2018 4:48 PM

వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది.

శ్రీకాకుళం : వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలంలో చోటుచేసుకుంది.  మండలంలోని సుభద్రాపురం గ్రామంలోని వ్యవసాయ బావిలో శనివారం వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతుడు పలాస మాజీ ఎంపీపీ నిమ్మన బైరాగి కుమారుడు చిన్నారి(37)గా గుర్తించారు. మృతదేహంపై పలుచోట్ల కత్తిపోట్లు ఉండటంతో.. హత్య జరిగి ఉంటుందనే అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement