గౌతమీనగర్‌లో దసరా వేడుకలు...


 అశ్వాపురం, న్యూస్‌లైన్: భారజల కర్మాగార ఉద్యోగుల నివాసంలో ప్రతీ ఏటా నిర్వహిస్తు న్న దసరా ఉత్సవాలు సంతోషకర వాతావరణంలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని కర్మాగార సీజీఎం శేషసాయి అన్నారు. మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో స్వరఝరి కల్యాణవేదికలో ఏర్పాటు చేసిన దసరా వేడుకలను శుక్రవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గాదే వి అమ్మవారు ప్రతీ కుటుంబాన్ని చల్లగా చూడాలని అన్నారు.

 

 అలరించిన శివనాగులు బృందం

 జానపద నృత్యాలు :

 ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌కు చెందిన రేలారే రేలా ఫేం శివనాగులు బృందం ప్రదర్శించిన జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. తొలుత దుర్గాదేవి అమ్మవారి గీతాన్ని ఆలపించి కార్యక్రమం మొదలు పెట్టిన వారు తర్వాత వివిధ జానపదగేయాలు ఆలపిం చారు. ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమానికి కాలనీవాసులు హాజరై సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మానికి చెందిన బహుదూర్ బృందం ప్రదర్శించిన మ్యాజిక్‌షో, ఫైర్‌షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  

 

 నేడు బతుకమ్మ వేడుకలు

 దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం గౌతమీనగర్ కాలనీలో వారందరు స్వరఝరి కల్యాణ వేదిక వద్దకు బతుకమ్మలతో వచ్చి పూజలు నిర్వహిస్తారని, బతుకమ్మ పాటలతో ఆనందంగా గడుపుతారని కన్వీనర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాల పంపిణీ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటీ కార్యదర్శి జి. రామానుజం, సభ్యులు ఎస్. కళ్యాణ చక్రవర్తి, బి. పుల్లారావు, జేవీఎస్‌ఆర్ కృష్ణ, జి. శ్రీనివాస్, గడ్డం రమేష్, పి. రామిరెడ్డి, పెంటి శ్రీనివాస్, ఎంవీ. రంగనాథన్, పి. అశోకరావు, బేతి రమేష్, పి. ఉపేందర్‌రెడ్డి, ఎన్‌వీ. రమణారెడ్డి, పెంటి సురేష్ పాల్గొన్నారు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top