దుస్థితిలో ‘108’ వాహనాలు | danger zone in 108 vehicles | Sakshi
Sakshi News home page

దుస్థితిలో ‘108’ వాహనాలు

Sep 30 2014 3:04 AM | Updated on Aug 18 2018 8:54 PM

దుస్థితిలో ‘108’ వాహనాలు - Sakshi

దుస్థితిలో ‘108’ వాహనాలు

రాష్ట్రంలో 108 వాహనాల పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే తెలంగాణలో డీజిల్ లేక ఆగిపోతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం

ఏ క్షణంలోనైనా ఆగిపోయే స్థితిలో 300 వాహనాలు
ఘటనా స్థలికి చేరుకోవడంలో తీవ్ర జాప్యం
ఎమర్జెన్సీ మెడికల్ పరికరాలు లేక    బాధితుల ఆవేదన

 
హైదరాబాద్: ఫోన్ రాగానే కుయ్ కుయ్ మంటూ ప్రమాద స్థలానికి ఆగమేఘాలపై చేరుకోవాల్సిన 108 వాహనాలు నిర్వహణా లోపం, కాలం తీరిపోవటంతో కుయ్యో మొర్రో అంటూ మొరారుుస్తున్నారుు! బాధితులను తరలించాల్సిన ఆపద్బాంధవుల్లాంటి వాహనాలు డీజిల్ లేక ఎక్కడ ఆగిపోతాయో తెలియని దుస్థితి దాపురించింది.

అరిగిన టైర్లు.. ఆగుతున్న అంబులెన్స్‌లు

రాష్ట్రంలో 108 వాహనాల పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే తెలంగాణలో డీజిల్ లేక ఆగిపోతుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వృద్ధాప్యం ముంచుకొచ్చి ఆగిపోతున్నాయి. బాధితులను ఆస్పత్రికి తరలించటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాధారణంగా ఫోన్ కాల్ వెళ్లిన 25 నిముషాల్లోగా వాహనం ఘటనా స్థలానికి చేరుకోవాలి. కానీ 40 నిముషాలకు కూడా 108 రాకపోవటంతో బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 108 వాహనాలు 436 ఉన్నాయి. వాహనం  2 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చడం లేదా పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాలి. రాష్ట్రంలో 300 వాహనాలు నాలుగు లక్షల కిలోమీటర్లకు పైగానే తిరిగాయి. ఇవన్నీ ఏ క్షణంలోనైనా ఆగిపోయే దుస్థితికి చేరుకున్నారుు. కొద్ది నెలలుగా పాత వాహనాలకు మరమ్మతులు చేయట్లేదు. టైర్లు అరిగిపోయిన వాహనాలైతే కొండ ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నారుు.

పరికరాలు, మందుల్లేవ్

108 అంబులెన్సుల్లో 350కి పైగా వాహనాల్లో అత్యవసర వైద్య పరికరాలు, మందులు లేవు. ప్రమాదం బారిన పడ్డ బాధితుడికి తక్షణమే పల్స్ రేటు చూసేందుకు అత్యవసరమైన పల్సాక్సీ మీటర్లు లేవు. సుమారు రెండొందలకు పైగా వాహనాల్లో ఇవి లేకపోగా మరో 150 వాహనాల్లో పరికరాలు పనిచేయడం లేదు. గాయపడ్డ రోగిని సున్నితంగా అంబులెన్సులోకి తరలించటం, ఆస్పత్రిలోకి తీసుకెళ్లడంలో కీలకమైన కొలాప్సిబుల్ స్ట్రెచర్ (ట్రాలీతో కూడినవి) లాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటంతో బాధితులు వేదనకు గురవుతున్నారు. కృత్రిమ శ్వాసనందించే అంబ్యూబ్యాగ్‌లు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్ ఇంజక్షన్, మిడజోలెమ్ (5ఎంఎల్) ఇంజక్షన్, బుస్కొపాన్ ఇంజక్షన్, థియోపైలిన్ (2ఎంఎల్) ఇంజక్షన్‌లూ అందుబాటులో లేవు.

 కొత్త వాహనాలకు ప్రతిపాదనలు

 రాష్ట్రంలో 150 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపినట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో వాహనం రూ.11 లక్షల వ్యయంతో సుమారు రూ.16.50 కోట్లు అవసరమని అంచనా. అత్యవసర మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను సైతం రూ.6 కోట్ల వ్యయంతో కొనేందుకు అంచనాలు రూపొందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement