సీపీఐ నారాయణ కాలికి గాయం | cpi leader narayana injured at visakhapatnam | Sakshi
Sakshi News home page

సీపీఐ నారాయణ కాలికి గాయం

Jun 25 2017 1:03 PM | Updated on May 3 2018 3:20 PM

సీపీఐ నారాయణ కాలికి గాయం - Sakshi

సీపీఐ నారాయణ కాలికి గాయం

సీపీఐ నేత నారాయణ స్వల్పంగా గాయపడ్డారు.

విశాఖపట్నం: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం విశాఖలో ఆక్రమిత భూములను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఆయన కాలికి గాయమైంది.

ఆక్రమిత భూముల పరిశీలన సందర్భంగా.. కొమ్మాది సర్వే నంబర్‌ 34లోని 22 ఎకరాల ఆక్రమిత భూమిని నారాయణ పరిశీలించారు. భూమి చుట్టూ ఉన్న ప్రహరీని పార్టీ నాయకులతో కలిసి నారాయణ కూలదోసే ప్రయత్నం చేశారు. పదేపదే ఫెన్సింగ్‌ గోడను తన్నుతున్న సమయంలో అది ఒక్కసారిగా ధ్వంసమైంది. దీంతో ఫెన్సింగ్‌ మధ్యలో నారాయణ కాలు ఇరుక్కుపోయింది. ఫెన్సింగ్‌ దిమ్మె నారాయణ కాలుపై పడింది. వెంటనే స్పందించిన సీపీఐ కార్యకర్తలు ఆయనకు సహాయం అందించారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement