సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి భయపడుతున్నారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు.
తిరుపతి : సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి భయపడుతున్నారని టీడీపీ ఎంపీ శివప్రసాద్ అన్నారు. ఆయన సోమవారం ఉదయం ఓ న్యూస్ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ నాయకులను ఓపిగ్గా ఉండాలని చెబుతున్న కాంగ్రెస్ అధిష్టానం.... సీమాంధ్ర ప్రజలను మాత్రం రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రక్రియ ప్రకటనతో చంద్రబాబునాయుడును దోషిని చేసి లబ్ది పొందాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు.
బాబు యాత్రకు విశేష స్పందన వస్తోందని... షెడ్యూల ప్రకారమే యాత్రను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటమే తమ లక్ష్యమని.... ఆ తర్వాతే సమన్యాయమని శివప్రసాద్ అన్నారు. సీమాంధ్రలో ఆందోళనలతో తెలంగాణపై నిర్ణయం వెనక్కి పోవటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాజా పరిణామాలతో విభజన ప్రక్రియ ముందుకు సాగటం లేదని శివప్రసాద్ పేర్కొన్నారు.