
ప్రజలకు బాబు వెన్నుపోటు
వెన్నుపోటు పొడ వటం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. మా మను గద్దె దించిన చాకచక్యంతో చంద్రబాబు
రుణమాఫీ హామీ నెరవేర్చకుండా సన్మానాలా?: రఘువీరా
హైదరాబాద్: వెన్నుపోటు పొడ వటం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆరోపించారు. మా మను గద్దె దించిన చాకచక్యంతో చంద్రబాబు గొంతు కూడా కోశారని రైతులు ఆర్తనాదాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు వంద రోజుల పాలనపై 11 అంశాలతో కూడిన 11 పేజీల శ్వేత పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ సోమవారం ఇందిరాభవన్‌లో విడుదల చేసిం ది. పార్టీ నేతలు కేవీపీ రామచంద్రరావు, చిరంజీవి, సి.రామచంద్రయ్య, ఆనం రాంనారాయణరెడ్డి, అహ్మదుల్లా, రుద్రరాజు పద్మరాజు, సుధాకర్, మాదాసు గంగాధరం, గౌతం తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికల వాగ్దానాలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసగించటంలో నూటికి నూరు మార్కులు సాధించారని రఘువీరా పేర్కొన్నారు.
బ్యాంకుల ఒత్తిడిని తట్టుకోలేక, కొత్త రుణాలు పుట్టక రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఓ వ్యక్తి ముఖ్యమంత్రి పేషీలో ఓఎస్‌డీగా విధులు నిర్వర్తిస్తూ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. ఐఏఎస్, మంత్రులను అవహేళన చేసేలా ఫైళ్లు ఆయన వద్దకు వెళ్తున్నారుు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 25 మంది ప్రతిపక్షాల కార్యకర్తలను హతమార్చారు. మాజీ మంత్రులు, మావోయిస్టులతో ప్రాణహాని ఉన్న వారికి గన్‌మెన్లను తొలగించి టీడీపీలో సర్పంచ్ పదవి కూడా లేని వారికి గన్‌మెన్లను కేటాయించడం దారుణం.