అలుపెరుగని ఉద్యమ గురువు రవూఫ్‌ 

comrade sheikh abdul rauf death anniversary story - Sakshi

సాక్షి , కదిరి: ఉద్యమ సహచరులు ‘విశ్వం’ అని పిలిచినా..పీడిత, తాడిత పేదలు రవూఫ్‌ సార్‌ అని పిలిచినా..ఉద్యమం వైపు ఆకర్షితులైన యువకులు ‘తాతా’ అని పిలిచినా ఆయనే కామ్రేడ్‌ రవూఫ్‌. ఆయన ఉద్యమమే ఊపిరిగా పనిచేశారు.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేశారు.  నక్సల్‌బరి ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విస్తరింపజేయడంతో పాటు చైనా దేశీయ కమ్యూనిస్టులను సైతం ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. కమ్యూనిస్ట్‌ సిద్ధాంతాలు ఎప్పుడూ మూసధోరణిలో కాకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలని ఆరోజుల్లోనే ఆయన నిర్మొహమాటంగా చెప్పేవారు. ఆయన మాటలను పాటించినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్ట్‌లకు ప్రస్తుత దుస్థితి ఉండేది కాదేమో... 

షేక్‌ అబ్దుల్‌ రవూఫ్‌ (ఎస్‌ఏ రవూఫ్‌) 1924లో కదిరి పట్టణంలోని సాహెబ్‌బీ, మదార్‌సాబ్‌ దంపతులకు జని్మంచారు. ఇంటర్‌ వరకూ కదిరిలో చదివి తర్వాత కర్ణాటకలోని గుల్బర్గాలో న్యాయవాద విద్యనభ్యసించారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్ట్‌ భావాలకు ఆకర్షితుడైన రవూఫ్‌ 1964–65 కాలంలో  కమ్యూనిస్ట్‌ పారీ్టలో చేరారు. కొన్ని కారణాల వలన అందులో ఇమడలేక పోయారు. కామ్రేడ్‌ చార్‌మజుందార్‌ పిలుపు మేరకు 1967లో న్యాయవాద వృత్తిని సైతం వదులుకొని సీపీఐ (ఎంఎల్‌)లో పూర్తి స్థాయి కార్యకర్తగా చేరి ఉద్యమ నిర్మాణంలో కీలక భూమిక పోషించారు. 1970లో సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1973లో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేశారు. దీంతో ఆయన ఆయన జీవితమే మలుపు తిరిగింది. సాయుధ పోరాటానికి కొంతకాలం విరామం ప్రకటిద్దామని సీపీఐ(ఎంఎల్‌)అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య ప్రతిపాదనను రవూఫ్‌ తిరస్కరించారు. ‘ఉద్యమంలో విరామం ఉండదు..ఉద్యమం నిరంతర ప్రవాహం లాంటిది’ అంటూ జైలు నుంచే తన నిర్ణయాన్ని కొండపల్లి సీతారామయ్యకు చేరవేశారు.  

ఉద్యమానికే జీవితం అంకితం.. 
కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాణంలో రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ, అంతర్జాతీయ స్థాయిలో కూడా రవూఫ్‌ కీలక పాత్ర పోషించారు. తన జీవితాన్ని ఉద్యమానికే అంకితం చేశారు. కదిరి నగర పంచాయతీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన అప్పట్లో పేదలకు పన్ను నుంచి విముక్తి కల్పించారు. 1967లో కదిరి అసెంబ్లీకి సీపీఎం తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వివాహానికి, బంధుప్రీతికి దూరంగా ఉండిపోయిన ఆయన..తన చివరి రోజుల్లో కదిరి మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్లలోని ఓ పూరి గుడిసెలో సాదాసీదా జీవితాన్ని గడిపారు. 2014 ఫిబ్రవరి 9న ఆయన కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి కుటాగుళ్లలోనే అంత్యక్రియలు నిర్వహించి, గుర్తుగా రవూఫ్‌ స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆయన పేరిట కదిరి–కుటాగుళ్ల అనంతపురం జాతీయ రహదారిలో ఒక కాలనీ కూడా కుటాగుళ్లకు చెందిన గ్రామస్తులు ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. 

అంతర్జాతీయ రాజకీయ  మార్పులకనుగుణంగా ఉద్యమ పంథా.. 
రవూఫ్‌ అభిప్రాయాన్ని కొండపల్లి ఖాతరు చేయలేదు. ఈ సమయంలోనే అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు ప్రభుత్వాల చేత అణచివేయబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని కాపాడుకునేందుకు చైనాలోని టెంగ్‌–హువా,ఆల్బేనియన్‌ పార్టీలు నూతన సిద్ధాంతాన్ని (మావో సేటుంగ్‌ థాట్‌)ను ప్రతిపాదించగా కొన్ని మినహా దాదాపు అన్ని కమ్యూనిస్ట్‌ పారీ్టలు ఆమోదించాయి. ఎమర్జెన్సీ అనంతరం జైలు నుంచి విడుదలైన కామ్రేడ్‌ రవూఫ్‌ ఈ సిద్ధాంతాలు కొన్ని మార్పులు చేసి ఏపీ రీఆర్గనైజేషన్‌ కమిటీ–సీపీఐ (ఎంఎల్‌)ను 1979లో స్థాపించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రాలకు విస్తరింపజేశారు. అంతర్జాతీయ రాజకీయ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ రవూఫ్‌ వాటికనుగుణంగా ఉద్యమ పంథాలో కూడా మార్పులు చేస్తూ వచ్చారు. 1983లో మరోసారి రవూఫ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన జైలులో ఉన్న సమయంలో 1985లో ఆర్‌ఓసీలో చీలిక ఏర్పడింది. జైలు నుంచి విడులయ్యాక రవూఫ్‌ 1989లో సీపీఐ (ఎంఎల్‌) రెడ్‌ఫ్లాగ్‌లో చేరి ఉద్యమాన్ని ఆం«ధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరింపజేశారు. 1999లో నక్సల్‌బరి, సీపీఐ(ఎంల్‌) విలీనమయ్యాయి. ఆ విలీన పారీ్టకి కామ్రేడ్‌ రవూఫ్‌ జాతీయ కార్యదర్శిగా పని చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top