కారు బోల్తా : ఏడుగురికి గాయాలు | Car roll over, seven injured | Sakshi
Sakshi News home page

కారు బోల్తా : ఏడుగురికి గాయాలు

Jul 16 2016 1:08 AM | Updated on Aug 30 2018 4:07 PM

కారు బోల్తా : ఏడుగురికి గాయాలు - Sakshi

కారు బోల్తా : ఏడుగురికి గాయాలు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే ...

ఒకరి పరిస్థితి విషమం శ్రీకాకుళం జిల్లాలో ఘటన
బాధితులంతా విజయవాడ వాసులే
ఒకే కుటుంబానికి చెందినవారే

 
కంచిలి   : శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడకు చెందిన ఓ కుటుంబం తమ సొంత వాహనంలో గురువారం విశాఖపట్నంలో జరిగిన ఒక వివాహానికి హాజరయ్యూరు. అక్కడి నుంచి ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి పుణ్య క్షేత్రానికి వెళ్లి గురువారం అర్ధరాత్రి తిరుగు ప్రయూణమయ్యూరు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బూరగాం సమీపానికి వచ్చే సమయూనికి వాహనం ముందు టైరు పంక్చర్ అరుు్యంది. వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొని బోల్తా పడి మళ్లీ పైకి లేచి రోడ్డుకు అడ్డంగా ఉండిపోరుుంది. కారులో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వాహనం నడుపుతున్న నాగరాజు తలకు బలమైన గాయమైంది.

ఆయ న పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఎన్‌హెచ్ అంబులెన్స్‌లో సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి మొదట తరలించి ప్రథమ చికిత్సచేశారు. గాయపడిన వారిలో కుటుంబ యజమాని ఎన్.పద్మనాభం, భార్య మహాలక్ష్మి, పెద్ద కుమారుడు నాగరాజు, పెద్దకోడలు గంగాభవానీ, రెండో కుమారుడు గోపీనాథ్, చిన్నకోడలు రాధ, మూడో కుమారుడు బాలకృష్ణ ఉన్నారని    ఎస్‌ఐ ఆర్.వేణుగోపాలరావు తెలిపారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement