ఇల్లెందులోని జేకే-5 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఉపరితలంపై ఉన్న క్యాంప్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
పది షెడ్లు, స్టోర్ రూం దగ్ధం
రూ.అరకోటి వరకు ఆస్తి నష్టం
వోల్వో కార్మికుడికి తీవ్ర గాయాలు
గ్యాస్ సిలిండర్ లీకేజీతో ప్రమాదం
ఇల్లెందుఅర్బన్(ఖమ్మం), న్యూస్‌లైన్ : ఇల్లెందులోని జేకే-5 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ ఉపరితలంపై ఉన్న క్యాంప్‌లో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు *కోటిన్నర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా. వోల్వో కార్మికుడు సైతం గాయపడ్డాడు. ఓబీ పీఆర్‌ఓ శ్రీనివాసనాయుడు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రాత్రి సుమారు 9.00 గంటల సమయంలో క్యాంప్ కార్యాలయం సమీపంలో కార్మికులు నివసిస్తున్న షెడ్లకు మంటలు అంటుకుని ఎగిసిపడ్డాయి.
షెడ్లు ఒకదానికోకటి వరుసగా ఉండటంతో సుమారు 10 షెడ్లతోపాటు స్టోర్‌రూమ్ పూర్తిగా కాలిపోయింది. స్టోర్‌రూమ్‌లోని విలువైన డీజిల్, అయిల్, టైర్లు ఇతర సామగ్రి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సింగరేణి సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్లను సైతం ఉపయోగించారు. ఎట్టకేలకు మంటలను అదు పులోకి తెచ్చారు.
మంటలను నీటితో చల్లార్చేందుకు ప్రయత్నించిన క్రమంలో వోల్వో ఆపరేటర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదృష్టవశా త్తు ఎలాం టి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంది. షెడ్లలో కార్మికులు వంట చేసుకునే క్రమంలో గ్యాస్ లీకై ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.