మరో సెక్స్ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్‌లో యువతుల ఫొటోలు పెట్టి వ్యభిచారం
పోలీసుల అదుపులో రియల్ వ్యాపారులు
విజయవాడ సిటీ : మరో సెక్స్ రాకెట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్‌లో యువతుల ఫొటోలు పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలను, ముంబై మోడల్‌తో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న హాస్యనటు ని సమీప బంధువు ఆటకట్టించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..తాజాగా ఢిల్లీ యువతితో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనితోసహా గుడివాడకు చెందిన నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను అదుపులోకి తీసుకొని రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. గుడివాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులను కేసు నుంచి బయటపడేసేందుకు కొందరు అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగినట్టు తెలిసింది. సేకరించిన సమాచారం ప్రకారం..గురునానక్ కాలనీకి చెందిన భరత్ అలియాస్ రెడ్డి రెండేళ్లుగా మెట్రోపాలిటన్ సిటీల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడి దళారులకు పెద్ద మొత్తంలో కమీషన్లు ముట్టచెప్పి విమానంలో యువతులను తీసుకొచ్చి విలాసవంతమైన డూప్లెక్స్ గృహాల్లో వ్యభిచారం చేయిస్తున్నాడు.
ఈ క్రమంలోనే కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్న ఢిల్లీ యువతిని 10 రోజులకు రూ.70వేలకు కాంట్రాక్టు పద్దతిన తీసుకొచ్చాడు. ఇతని చర్యలపై గట్టి సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ ఏసీపీ పి.వి.ఆర్.పి.బి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి గురునానక్ నగర్‌లోని భరత్ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఇతనితోసహా గుడివాడకు చెందిన నలుగురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను అదుపులోకి తీసుకొని పటమట పోలీసులకు అప్పగించారు. వీరిపై వ్యభిచార నిరోధక చట్టం(ఐటిపి) కింద కేసులు నమోదు చేసినట్టు పటమట ఇన్‌స్పెక్టర్ కె.దామోదర్ తెలిపారు.
వాట్సప్‌లో షేరింగ్
మెట్రో నగరాల్లోని బ్రోకర్లు వాట్సప్ ద్వారా యువతుల ఫొటోలు, ప్రొఫైల్స్, 10రోజుల కాంట్రాక్టుపై యువతికి ఇవ్వాల్సిన మొత్తం షేర్ చేస్తారు. వారిలో నచ్చిన యువతిని ఎంపిక చేసుకొని సంబంధిత బ్రోకరుకు రూ.10వేలు కమిషన్ కింద అకౌంట్‌లో జమ చేస్తాడు. ఇదే సమయంలో విమానం టిక్కెట్లు తీసుకొని పంపి యువతులను రప్పించి వారికి ఖరీదైన వసతి ఏర్పాటు చేసి వ్యభిచారం చేయిస్తుంటాడు. 10రోజుల్లో ఆ యువతి ద్వారా రూ.2 నుంచి 3 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నట్టు పోలీసు అధికారులు చెపుతున్నారు. అక్కడి బ్రోకర్లపై కేసులు నమోదు చేస్తే మరోసారి యువతులను ఇక్కడికి పంపేందుకు ఇష్టపడరని పోలీసు కమిషనర్ సవాంగ్ అభిప్రాయం. ఆ దిశగా కేసులు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.