దారి మరచి.. ఆరు కిలోమీటర్లు నడిచి.. | Boy Missing Case Reveals Anantapur Police | Sakshi
Sakshi News home page

దారి మరచి.. ఆరు కిలోమీటర్లు నడిచి..

Jul 18 2019 7:20 AM | Updated on Jul 18 2019 7:20 AM

Boy Missing Case Reveals Anantapur Police - Sakshi

హేమంత్‌ను సురక్షితంగా తీసుకొస్తున్న కానిస్టేబుల్‌

తప్పిపోయిన బాలుడు హేమంత్‌ క్షేమం

అనంతపురం ,పుట్లూరు: తప్పిపోయిన బాలుడు ఎట్టకేలకు కనిపించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కొండుగారికుంటకు చెందిన హేమంత్‌ అనే ఐదేళ్ల బాలుడు మంగళవారం ఇంటి నుంచి గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి కనిపించకుండాపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి నుంచి అన్ని చోట్ల కలియదిరిగారు. బుధవారం ఉదయం చాలవేముల సమీపంలోని గాలిమరల సబ్‌స్టేషన్‌ వద్ద హేమంత్‌ను గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి సమయంలో దారి గుర్తించలేక ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లినట్లు తెలుస్తోంది. హేమంత్‌ సురక్షితంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు చిరంజీవి, శ్రావణిలు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement