ఆత్మకూరులో బాంబుపేలుడు, బాలుడికి గాయాలు | bomb blast in atmakur, boy injured | Sakshi
Sakshi News home page

ఆత్మకూరులో బాంబుపేలుడు, బాలుడికి గాయాలు

Nov 21 2014 3:43 PM | Updated on Sep 2 2017 4:52 PM

కర్నూలు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం బాంబు పేలి ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు.

ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరులో శుక్రవారం బాంబు పేలి ఎనిమిదేళ్ల బాలుడు గాయపడ్డాడు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న చెత్తకుండీలో ఈ పేలుడు జరిగింది. బాధితుడు చెత్త సేకరిస్తుండగా తనకు దొరికిన ప్లాస్టిక్ సీసా మూత తెరవడంతో బాంబు పేలినట్టు చెబుతున్నారు.

ఈ ఘటనలో ఖలీల్ అనే మూడో తరగతి విద్యార్థి గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెత్తకుండీలోకి బాంబు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాంబు పెట్టారా, చెత్తబుట్టలో పడేశారా అనే దానిపై దృష్టి సారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement