విజయనగరంఅర్బన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను చెప్పుకోకపోతే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఎక్కడా డిపాజిట్లు దక్కవని బీజీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధు అన్నారు. రాష్ట్రంలో ఒంటరిగా పోటీచేస్తే బీజేపీకి డిపాజిట్లు గల్లంతవుతాయని ప్రభుత్వ విప్ గద్దెబాబూరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మధు మాట్లాడారు. దేశ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాలను ఏర్పరచుకున్న ఘనత బీజేపీదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పబ్బం గడుపుకుంటోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కనిపిస్తు ప్రతి అభివృద్ధి వెనుక కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందనన్న విషయాన్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనరసింహం, జిల్లా యువమోర్చా అధ్యక్షుడు మజ్జి రమేష్, ప్రధాన కార్యదర్శి కార్తీక్, పట్టణ యువమోర్చా ప్రధాన కార్యదర్శి మిశ్రా తదితరులు పాల్గొన్నారు.