కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి | behave atleast like chittoor nidu, ambati rambabu suggests chandra babu | Sakshi
Sakshi News home page

కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి

Nov 19 2014 4:36 PM | Updated on Aug 13 2018 3:10 PM

కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి - Sakshi

కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండండి: అంబటి

చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

చంద్రబాబు నాయుడు సింగపూర్ నాయుడిగా కాక.. ఏపీ నాయుడిగా వ్యవహరించాలని, కనీసం చిత్తూరు నాయుడిగానైనా ఉండాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. రాజధాని భూముల విషయంలో నమ్మశక్యం కాని వాస్తవాలు బయటపడుతున్నాయని ఆయన అన్నారు. రైతులు తీవ్ర నిస్పృహలో కాలం గడుపుతున్నారని, రైతు పరిస్థితి పిల్లికి చెలగాటం.. ఎలకకు ప్రాణసంకటం అన్నట్లుందని చెప్పారు.

భూములిచ్చి తాము ఏమైపోవాలన్న దిగులుతో రైతులు కుంగిపోతున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపి, రైతులను అర్థం చేసుకోవాలన్నారు. ఆయనను రైతుద్రోహిగా ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, ప్రజా ఉద్యమం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement