జిల్లాలో హైట్రిక్‌ వీరులు..

The Assembly And The Lok Sabha Elections In Ihe History Of The Elections For Three Consecutive Terms - Sakshi

సాక్షి, కర్నూలు (అర్బన్‌) :  హ్యాట్రిక్‌... క్రికెట్, సినిమా, పాలిటిక్స్‌ ... ఇలా ఏ రంగంలోనైనా ఈ ఘనత సాధిస్తే చరిత్రలో నిలిచిపోతారు. కర్నూలు జిల్లాలో 1952 నుంచి 2009 వరకు జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పలువురు వరుసగా మూడు సార్లకు పైగా ఎన్నికై చరిత్రలో నిలిచిపోయారు. వారిలో భూమా నాగిరెడ్డి, శాసనసభకు సంబంధించి బుడ్డా వెంగళరెడ్డి, వి రాంభూపాల్‌చౌదరి, బీవీ సుబ్బారెడ్డి, కర్రా సుబ్బారెడ్డి, కేఈ క్రిష్ణమూర్తి, ఎస్‌వీ సుబ్బారెడ్డి, దామోదరం మునిస్వామి, ఎం శిఖామణి, బీవీ మోహన్‌రెడ్డి, కే చెన్నకేశవరెడ్డి ఉన్నారు. అయితే పలువురు పార్లమెంట్‌ సభ్యులు, శానససభ్యులు ఐదు సార్లకు పైగా ఎన్నికైనా, వారు వరుసగా విజయం సాధించలేక పోయిన నేపథ్యంలో వారు హ్యాట్రిక్‌ లీడర్స్‌గా మిస్సై పోయారు.  

వి. రాంభూపాల్‌చౌదరి
కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి వి రాంభూపాల్‌చౌదరి 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో కాంగ్రెస్‌ అభ్యర్థి దావూద్‌ఖాన్‌ను ఓడించారు. అలాగే 1985, 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కే నాగిరెడ్డి, సీపీఎం అభ్యర్థి ఎంఏ గఫూర్‌ను ఓడించారు. 

భూమా నాగిరెడ్డి
నంద్యాల పార్లమెంట్‌ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా భూమా నాగిరెడ్డి 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై విజయం సాధించారు. అలాగే 1998, 1999లో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గంగుల ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు.  

బుడ్డా వెంగళరెడ్డి
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం (ప్రస్తుతం శ్రీశైలం) నుంచి 1978, 1983,1985,1989 సంవత్సరాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో దివంగత బుడ్డా వెంగళరెడ్డి రెండు సార్లు కాంగ్రెస్, రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా వరుసగా టీ రంగసాయి, బీజే రెడ్డి, జి నాగలక్ష్మిరెడ్డి, శివరామిరెడ్డిలను ఓడించారు. 

బీవీ సుబ్బారెడ్డి
కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1955లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన బీవీ సుబ్బారెడ్డి 1962,1967,1972 వరకు  జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుసగా గెలుపొందారు. కాగా 1962, 1972లో బీవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

కేఈ కృష్ణ్ణమూర్తి
డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేఈ కృష్ణమూర్తి 1978లో ఇందిరా కాంగ్రెస్, 1983లో కాంగ్రెస్, 1985లో తెలుగుదేశం, 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. అలాగే 2009లో డోన్‌ నుంచి, 2014లో పత్తికొండ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 

కర్రా సుబ్బారెడ్డి
కోవెలకుంట్ల (ప్రస్తుతం బనగానపల్లె) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత కర్రా సుబ్బారెడ్డి వరుసగా 1985, 1989, 1994 వరకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా బీ రామస్వామిరెడ్డి, ఎస్‌వీ సుబ్బారెడ్డి, చల్లా రామక్రిష్ణారెడ్డిపై విజయం సాధించారు. 

ఎం. శిఖామణి
కోడుమూరు ఎస్‌సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దివంగత ఎం శిఖామణి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరుస విజయాలను సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థులు బంగి అనంతయ్య, వై జయరాజు, ఆకెపోగు ప్రభాకర్‌ను ఓడించారు. 

ఎస్‌వీ సుబ్బారెడ్డి
పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎస్‌వీ సుబ్బారెడ్డి 1994, 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థులు పి. శేషిరెడ్డి, కె. సాంబశివారెడ్డి, పి. నీరజారెడ్డిని ఓడించారు. 

బీవీ మోహన్‌రెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి టీడీపీ ఆవిర్భావం 1983 నుంచి వరుసగా 1985, 1989, 1994, 1999 వరకు విజయం సాధిం చారు. ఈయన చేతిలో హనుమంతరెడ్డి, దేవేంద్రగౌడు, ఎంఎస్‌ శివన్న,కేశవరెడ్డి ఓటమి చెందారు. 

చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కే చెన్నకేశవరెడ్డి 2004, 2009, 2012లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రాజకీయ భీష్ముడైన బీవీ మోహన్‌రెడ్డిని ఓడించారు. రెండు సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా, ఒకసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు.     

మరిన్ని వార్తలు

18-03-2019
Mar 18, 2019, 07:47 IST
ఎన్నికల అక్రమాలు, ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఎన్నికల సంఘానికి నేరుగా ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల సంఘం అందుబాటులోకి...
18-03-2019
Mar 18, 2019, 07:38 IST
‘‘కాపీలు కొట్టడం బాగా అలవాటైపోయిన చంద్రబాబు ఒకచోట సక్సెస్‌ అయిన కాన్సెప్టు ప్రతిచోటా అలాగే అవుతుందనీ, అది తనకూ అచ్చం...
18-03-2019
Mar 18, 2019, 07:36 IST
సాక్షి, శ్రీకాకుళం : పడుగు.. పేకలా అల్లుకున్న బంధం వారిది. నిజానికి వాళ్లు కార్మికులు కాదు.. కళాకారులు. చితికిపోయిన చేనేత...
18-03-2019
Mar 18, 2019, 07:35 IST
పీపుల్స్‌ ఎజెండా - మహబూబ్‌నగర్‌ :కరువు... వలసలకు కేరాఫ్‌గా పేరొందిన పాలమూరు జిల్లా పూర్తి స్థాయిలో ఇంకా అభివృద్ధికి నోచుకోలేదనే...
18-03-2019
Mar 18, 2019, 07:32 IST
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే గెలుపు గుర్రాలను వైఎస్సార్‌ సీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌...
18-03-2019
Mar 18, 2019, 07:29 IST
జనసేన పార్టీ కార్యాలయంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలా అటెన్షన్‌లో నిల్చుని ఉన్నాడు జేడీ లక్ష్మీనారాయణ. నల్లటి ప్యాంటు మీదికి తెల్లటి పొడవాటి...
18-03-2019
Mar 18, 2019, 07:28 IST
సాక్షి, యాదాద్రి :కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్‌లను ఆన్‌లైన్‌లో స్వీకరించే ప్రక్రియను ప్రవేశపెట్టింది. సువిధ యాప్‌ ద్వారా నామినేషన్‌ ఫారం...
18-03-2019
Mar 18, 2019, 07:24 IST
సాక్షి, అమరావతి:  చేనేత కుటుంబాలకు 100 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్‌ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ మూడు నెలల క్రితం...
18-03-2019
Mar 18, 2019, 07:22 IST
నిజాం నిరంకుశ పదఘట్టనలు.. వెట్టిచాకిరి బతుకులు.. బాంచెన్‌ దొర.. నీ కాల్మొక్త దొర అంటూ.. తలదించుకుని.. బతికే కాలం.. మట్టి...
18-03-2019
Mar 18, 2019, 07:17 IST
బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్నబీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. అంతెందుకు? 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం...
18-03-2019
Mar 18, 2019, 07:12 IST
సాక్షి, అమరావతి: ‘‘కాపీలు కొట్టడం బాగా అలవాటైపోయిన చంద్రబాబు ఒక చోట సక్సెస్‌ అయిన కాన్సెప్టు ప్రతిచోటా అలాగే అవుతుందనీ, అది...
18-03-2019
Mar 18, 2019, 07:05 IST
ఇప్పటి దాకా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి 16సార్లు ఎన్నికలు జరిగితే 11సార్లు కాంగ్రెస్, ఒకసారి బీజేపీ, జనతా పార్టీ, టీఆర్‌ఎస్‌...
18-03-2019
Mar 18, 2019, 06:53 IST
ఈ ఫొటో సరిగ్గా చూశారా.. కుడివైపున సీఎం చంద్రబాబు అని అందరికీ తెలుసు.. పక్కన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబులు...
18-03-2019
Mar 18, 2019, 06:40 IST
వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో ఎన్నికల ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రాష్ట్రంలో ఏప్రిల్‌ 11నజరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలకు ప్రకటించిన అభ్యర్థుల జాబితా..పార్టీ శ్రేణుల...
18-03-2019
Mar 18, 2019, 05:07 IST
సాక్షి ప్రతినిధి కడప: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు వైఎస్‌...
18-03-2019
Mar 18, 2019, 04:54 IST
సాక్షి, అమరావతి బ్యూరో/ సాక్షి, అమరావతి: పద్మశాలీలకు సంబంధించిన మంగళగిరి అసెంబ్లీ సీటును కబ్జా చేసిన నారా లోకేష్‌ను ఓడించి...
18-03-2019
Mar 18, 2019, 04:50 IST
సాక్షి, గుంటూరు/మంగళగిరి: అధికారపార్టీకి ఓటమి తప్పదని తెలిసి బరితెగించింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ సర్వేల పేరుతో ఓటర్లను కొనుగోలు...
18-03-2019
Mar 18, 2019, 04:41 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకార పర్వం ప్రారంభమవుతుంది. ఇందుకు...
18-03-2019
Mar 18, 2019, 04:31 IST
సాక్షి, గుంటూరు: ప్రసంగంలో తత్తరపాటో లేక మనసు లోతుల్లో ఉన్న నిజం బయటకొచ్చిందో గానీ.. సీఎం చంద్రబాబు తనయుడు నారా...
18-03-2019
Mar 18, 2019, 04:25 IST
పీలేరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది శూన్యమని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన రాజ్యమేలుతోందని...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top