ఈ-కేవైసీపై అపోహలొద్దు: గడికోట

AP Government Chief Whip Srikanth Reddy Clarity On EKYC - Sakshi

సాక్షి, కడప(వైఎస్సార్‌ జిల్లా): ఈ-కేవైసీ చేయించకపోతే కార్డులు తొలగిస్తారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ-కేవైసీ నమోదుపై స్పష్టతనిచ్చారు. ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారంటూ డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంటి బిడ్డలతో గంటల తరబడి ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదన్నారు.

ఈ-కేవైసీకి గడువులేదని.. ఎప్ప్పుడైనా చేయించుకోవచ్చన్నారు. దేశ, విదేశాల్లో వున్న వారు ఈ-కేవైసీలు చేయించడానికి పరుగులు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. (చదవండి: ఈకేవైసీ గడువు పెంపు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top