అగ్రిగోల్డ్ కేసు సోమవారానికి వాయిదా | agri gold case adjourned monday | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ కేసు సోమవారానికి వాయిదా

Sep 3 2015 1:14 PM | Updated on Aug 31 2018 9:15 PM

హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసులపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతోందని బాధితులు...

హైదరాబాద్ : హైకోర్టులో  అగ్రిగోల్డ్‌ కేసులపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతోందని బాధితులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆస్తులు అమ్మినా బాధితులకు న్యాయం జరగలేదని తెలిపారు.  అగ్రిగోల్డ్‌ అనుబంధ సంస్థలు, డైరెక్టర్ల వివరాలు సమర్పించాలని న్యాయస్థానం ఈ సందర్భంగా ఏపీ సర్కార్‌ను ఆదేశించింది.

 

ఆ సంస్థకు చెందిన  14 చోట్ల  ఆస్తులను అమ్మకానికి పెట్టి ...ఆ మొత్తాన్ని బాధితులకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటికీ న్యాయం జరగకపోతే ...మిగతా ఆస్తులను అమ్మి...బాధితులకు చెల్లించాలని సూచించింది.  కోర్టు ఆధీనంలోనే బాధితులకు డబ్బులు పంపిణీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement