చంపేశారు...! | Address, Aadhar card, all right, no matter what the name of Handicap to become certified | Sakshi
Sakshi News home page

చంపేశారు...!

Oct 17 2014 3:16 AM | Updated on Sep 2 2017 2:57 PM

చంపేశారు...!

చంపేశారు...!

ఈ బాలుడి పేరు కృష్ణమోహన్.. వయస్సు పదేళ్లు.. పుట్టుకతోనే మూగ, చెవుడు.. బద్వేలు పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ఇతనికి జనవరి నుంచే వికలాంగ పింఛన్ మంజూరైంది.

బద్వేలు: ఈ బాలుడి పేరు కృష్ణమోహన్.. వయస్సు పదేళ్లు.. పుట్టుకతోనే మూగ, చెవుడు.. బద్వేలు పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ఇతనికి జనవరి నుంచే వికలాంగ పింఛన్ మంజూరైంది.  ఈ విషయం కృష్ణమోహన్‌కు గానీ, కుటుంబసభ్యులకుగానీ తెలియదు. తనకు పింఛన్ వస్తున్నట్లు ఇటీవలే తెలుసుకున్న కృష్ణమోహన్ అక్టోబర్ నెల పింఛన్ తీసుకునేందుకు అధికారుల వద్దకు వెళ్లాడు.. నీ పింఛన్ 10 వార్డులోకి మారిపోయిందని అధికారులు చెప్పడంతో అక్కడికి  వెళ్లాడు.. అడ్రస్, ఆధార్‌కార్డు, వికలాంగ సర్టిఫికేట్ అన్నీ సరిగా ఉన్నా పేరు మారింది. కృష్ణమోహన్‌కు బదులుగా వై. కొరగింజగా పేరు మారింది. అంతేకాకుండా  పరిశీలనలో కొరగింజ మృతి చెందినట్లుగా భావించి పింఛన్‌ను తొలగించినట్లు చావుకబురు చల్లగా చెప్పారు. జనవరి నుంచి మంజూరైన మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించామన్నారు. తనకు న్యాయం చేయాలని, తాను బతికే ఉన్నానని మూగ సైగలు చేస్తూ అధికారుల చుట్టూ కృష్ణమోహన్ తిరుగుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement