1040 సినిమాల్లో నటించా.. | Actor Ali acted in 1040 films | Sakshi
Sakshi News home page

1040 సినిమాల్లో నటించా..

Mar 8 2016 2:36 AM | Updated on Oct 2 2018 2:40 PM

1040 సినిమాల్లో నటించా.. - Sakshi

1040 సినిమాల్లో నటించా..

ఇప్పటివరకూ తాను 1,040 సినిమాల్లో నటించినట్టు సినీ హాస్య నటుడు ఆలీ అన్నారు. చినకొండేపూడిలో....

సినీ హాస్యనటుడు ఆలీ
సీతానగరం : ఇప్పటివరకూ తాను 1,040 సినిమాల్లో నటించినట్టు సినీ హాస్య నటుడు ఆలీ అన్నారు. చినకొండేపూడిలో ‘ఆక్సిజన్’ సినిమా షూటింగ్‌కు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఏఎం రత్నం కుమారుడు తీస్తున్న ‘ఆక్సిజన్’ సినిమా పేరు మార్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తీస్తున్న సర్దార్, సాయిధరమ్‌తేజ్ హీరోగా తిక్క, ఊపిరి, రన్, నారా రోహిత్ హీరోగా తుంటరి, ఒక అమ్మాయి తప్పా సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ భూములు కేటాయిస్తున్నారని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విశాఖలో సినీ పరిశ్రమకు భూములు కేటాయించే అవకాశం ఉందని అన్నారు.

టాలీవుడ్‌లో సినిమాలు రూ.70 కోట్లు, రూ.80 కోట్లు వసూలు చేస్తున్నాయని, ఇండస్ట్రీ చాలా బాగుందని తెలిపారు. తనకు నచ్చిన ప్రదేశం రాజమహేంద్రవరమని, అలాగే చెన్నై, విదేశాల్లో స్విట్జర్‌ల్యాండ్ ఇష్టమని చెప్పారు. త్వరలో తాను హీరోగా ఓ సినిమాలో నటించబోతున్నట్లు ఆలీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement