
ప్రజల ఆకాంక్ష మేరకు సంక్షేమ పథకాలు
ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త సంవత్సరంలో సంక్షేమపథకాలు అమలవుతాయని డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
పెద్దాపురం : ప్రజల ఆకాంక్ష మేరకు కొత్త సంవత్సరంలో సంక్షేమపథకాలు అమలవుతాయని డిప్యూటీ సీఎం, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం రాత్రి పెద్దాపురం సుధాకాలనీలోని క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత తెలుగుప్రజలు నూతన సంవత్సరం వేడుకలు ఆనందదాయకంగా జరుపుకుంటున్నారన్నారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని గుర్తించి పథకాలు అమలు చేస్తామన్నారు. బలహీన వర్గాలక్షేమాన్ని కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా మంచే జరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు. అభిమానులు, అధికారులు తీసుకువచ్చిన కేక్‌లను ఆయన కట్‌చేసి సంబరాలు పాలుపంచుకున్నారు. డిప్యూటీ సీఎం కలసిన వారిలో కలెక్టరు నీతూప్రసాద్, ఎస్పీ రవిప్రకాశ్, ఏజేసీ మార్కండేయులు, జిల్లా పరిషత్ సీఈఓ పద్మ, రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణ, మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు, పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, పెద్దాపురం డీఎస్పీ రాజశేఖర్‌రావు, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజాసూరిబాబురాజు, సామర్లకోట మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి, బొడ్డు బంగారుబాబు, వైస్ చైర్మన్ త్సలిక సత్యభాస్కరరావు, జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీలు, టీడీపీ, వివిధ రాజకీయపార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.