ఈపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనకు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది.
ఆదేశాలు జారీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ
సాక్షి, హైదరాబాద్: ఈపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల దరఖాస్తుల పరిశీలనకు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. 2013-14 విద్యా సంవత్సరంలో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ జయలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు.
కళాశాలల ఈపాస్ లాగిన్స్‌లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను నమోదు చేయాలని, ఆ వివరాలను సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్(ఈపాస్ ప్రొవైడర్)కు పంపించి ఆధార్ కార్డులను వీలైనంత తొందరగా పొందాలని సూచించారు. తరువాత ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. బయోమెట్రిక్ విధానాన్ని జూనియర్ కళాశాల విద్యార్థులకు మినహాయించినట్లు తెలిపారు.