'సమైక్య శంఖారావం'కి ఉత్తరాంధ్ర నుంచి 4 ప్రత్యేక రైళ్లు | 4 Trains ready to bring supporters for YS Jagan's 'samaikya sankharavam' | Sakshi
Sakshi News home page

'సమైక్య శంఖారావం'కి ఉత్తరాంధ్ర నుంచి 4 ప్రత్యేక రైళ్లు

Oct 18 2013 1:41 PM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలిరానున్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్లో నిర్వహిస్తున్న 'సమైక్య శంఖారావం' సభకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో జనం తరలిరానున్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఇప్పటిదాకా నాలుగు ప్రత్యేక రైళ్లను సిద్దం చేసినట్టు వైఎస్ఆర్ సీపీ నాయకుడు సుజయ్కృష్ణ రంగారావు తెలిపారు.

ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సమావేశమై సమైక్య శంఖారావం సభ ఏర్పాట్లను సమీక్షించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వెళ్లనున్నట్టు రంగారావు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లడానికి రవాణా సదుపాయాలు కల్పించనున్నట్టు చెప్పారు. సమైక్య శంఖారావం సభకు రావడానికి మరిన్ని రైళ్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement