కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు.
కృష్ణా జిల్లా (చందర్లపాడు) : కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణా నదిలో ఈతకు దిగిన బాలుడు ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. వివరాల ప్రకారం.. గుడిమెట్ల గ్రామానికి చెందిన ఎనిమిది మంది బాలురు సరదాగా ఆడుకుందామని కృష్ణానది సమీపానికి వెళ్లారు.
ఆడుకున్న తర్వాత నదిలోకి దిగి ఈతకొడదామని అనుకున్నారు. ఆ ప్రాంతంలో ఇసుక కోసం తవ్విన గుంతలు ఉన్న విషయం తెలియక షేక్ నాగులమీరా(15) అనే బాలుడు నదిలోకి దిగి మునిగి చనిపోయాడు. బాలుడి మృతదేహాన్ని స్థానికులు వెలికి తీశారు.