ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జన్మభూమి కార్యక్రమం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించింది. అక్టోబర్ 2 వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జన్మభూమి కార్యక్రమం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. 13 జిల్లాలకు 13మంది ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 'జన్మభూమి'లో పాల్గొననున్నారు. ప్రతిరోజు రెండు గ్రామాల్లో పర్యటించనున్నారు. అధికారులు కూడా జన్మభూమిలో పాల్గొవాలని ఆయన సూచించారు.
శ్రీకాకుళం జిల్లా - శాలినీ మిశ్రా
విజయనగరం - రజిత్ కుమార్
విశాఖ జిల్లా - రాజశేఖర్
పశ్చిమ గోదావరి - శ్యాంబాబు
తూర్పు గోదావరి - జవహర్ రెడ్డి
కృష్ణాజిల్లా - పునీత
గుంటూరు - జేసీ శర్మ
ప్రకాశం - కరికళ్ళ వళవణ్
నెల్లూరు - అనంతరాం
చిత్తూరు - ఎస్ ఎస్ రావత్
కర్నూలు - ఏఆర్ సుకుమార్
అనంతపురం - కె.విజయానంద్
కడప - వీణా ఈష్