హైదరాబాద్ నుంచి విజయనగరం సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న మిలటరీ వ్యాన్ ఈ రోజు తెల్లవారుజామున ఇనుపాముల స్టేజీ వద్ద బోల్తా పడింది.
హైదరాబాద్ నుంచి విజయనగరం సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న మిలటరీ వ్యాన్ ఈ రోజు తెల్లవారుజామున ఇనుపాముల స్టేజీ వద్ద బోల్తా పడింది. ఆ ఘటనలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. అదే రహదారిపై వేళ్తున్న వాహనదారులు 108కి ఫోన్ చేసి సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆ వాహనంలో మొత్తం 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్నారు.
రాష్ట్ర విభజనను నిరసిస్తూ పీసీసీ అధ్యక్షుడు బొత్స సొంత జిల్లా అయిన విజయనగరంలో సమైక్య ఉద్యమం ఉవెత్తున ఎగసి పడుతోంది. దాంతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి కేంద్ర బలగాలను విజయనగరం జిల్లాకు తరలిస్తున్నారు. అందులోభాగంగా ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బయలుదేరిన మిలటరీ వ్యాన్ బొల్తా పడింది.