breaking news
-
‘బాబూ.. ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?’
సాక్షి, అనంతపురం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైనట్టు తెలిపారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి చంద్రబాబుది అసమర్థత పాలన. హామీలను అమలు చేయడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం విఫలమైంది. రైతు సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధం. ఈనెల 13వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం జరుగుతుంది. అనంతపురంలో ర్యాలీ, అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేస్తాం. రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20వేల ఆర్థిక సాయం ఏమైంది?. ధాన్యం కొనుగోలు, మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందన్నారు.మాజీ ఎంపీ తలారి రంగయ్య మీడియాతో మాట్లాడుతూ..‘రైతులకు భరోసా కల్పించడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైంది. రైతులకు ఇచ్చిన హామీలను టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. ఈనెల 13వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం చేయండి అని పిలుపునిచ్చారు. -
కూటమి ప్రభుత్వం తాజా టార్గెట్ దళిత నేతలు, అధికారులు!
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజకూ అరాచకత్వం పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన అధికార కూటమి తాజాగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అరడజను మంది దళిత నేతలతోపాటు ఇదే వర్గానికి చెందిన ఐదుగురు ఆలిండియా సర్వీసు అధికారులను ఈ ప్రభుత్వం వేధిస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా...పలువురు సామాన్య దళితులు సైతం వివక్ష, అవమానాలకు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న వస్తోంది. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఒకసారి గతంలోకి వెళదాం... టీడీపీ నేతల ప్రోద్బలంతో నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు సుధాకర్ మాస్క్‌లు లేవంటూ అప్పట్లో రచ్చ చేశారు. ఆస్సత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. సుధాకర్ ఆ పని చేయకుండా టీడీపీ అండతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం చేశారు. దీంతో దీనిపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేశారు. దీనిపై టీడీపీ అగ్గిమీద గుగ్గిలమైంది. దళిత డాక్టర్‌ను సస్పెండ్ చేస్తారా? అని, అతడి క్రమశిక్షణ రాహిత్యాన్ని వదలివేసి దుర్మార్గపు ప్రచారం చేశారు. ఆ తర్వాత కొద్ది నెలలకు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో ఒక రోడ్డుపై తాగి గొడవ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించారు. పోలీస్ కానిస్టేబుల్ వారించినా వినిపించుకోలేదు.పోలీస్ స్టేషన్ కు రాకుండా గొడవ చేయడంతో, ఆ కానిస్టేబుల్ అతని చేతులు వెనక్కి కట్టి తీసుకువెళ్లారు. ఆ పోటోలు, వీడియోలు తీసి చాలా ఘోరం జరిగిందని దుష్ప్రచారం చేశారు. అంతే తప్ప బాధ్యత కలిగిన ఆ డాక్టర్ అసభ్యంగా వ్యవహరించారని మాత్రం చెప్పకుండా అబద్దాలు వండి వార్చారు. అక్కడితో ఆగలేదు. వెంటనే ఆయన పేరుతో హైకోర్టులో పిల్ వేయడం, గౌరవ న్యాయ స్థానం దానిపై సీబీఐ విచారణకు ఆదేశించడం జరిగిపోయింది. కానిస్టేబుల్ పై సీబీఐ విచారణ ఏమిటా అని అంతా నివ్వెరపోయారు. కానీ అప్పట్లో చంద్రబాబు తన న్యాయవాదుల ద్వారా అలా చేయించగలిగారని అంటారు. ఆ తర్వాత సీబీఐ ఏమి నివేదిక ఇచ్చిందో ఎవరికి తెలియదు. మరికొంత కాలానికి సుధాకర్ అనారోగ్యానికి గురై చనిపోయారు. దానికి కూడావైఎస్సార్సీపీనే కారణమని టీడీపీ, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేశాయి. ఇదంతా దళితుడు అన్న పేరుతో సాగించిన కుట్రగా అర్థమైంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సుధాకర్ ఊసే లేదు. ఆ కుటుంబాన్ని పట్టించుకున్నట్లు కూడా వార్తలు కనిపించ లేదు. ఇలా ఉంటుంది టీడీపీ రాజకీయం, ఎల్లో మీడియా దుర్మారపు ప్రచారం!!! కారణం ఒకటే! దళిత వర్గాలలోవైఎస్సార్సీపీ పట్ల వ్యతిరేకత పెంచాలన్న ప్రయత్నం. కూటమి నాయకత్వానికి దళితులపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది దళితులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై హత్య కేసుతో సహా పలు కేసులు పెట్టి నెలల తరబడి జలులో ఉంచుతున్నారు. 201419 మధ్యకాలంఓనూ నందిగం సురేష్ పై చంద్రబాబు ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. అమరావతిలో పంటల దగ్ధమైన ఘటనలో జగన్ పేరు చెప్పాలని ఆయనపై పోలీసులు తీవ్ర ఒత్తిడి చేసి హింసించారు. అయినా ఆయన లొంగలేదు. ఆ విషయం తెలిసిన జగన్ తదుపరి సురేష్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై ఒక మహిళతో కేసు పెట్టించారు. ఆసక్తికరంగా ఆ మహిళ తనతో అధికార పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టించారని అఫిడవిట్ దాఖలు చేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏపీలో ఉన్న పేకాట క్లబ్‌లు నడుస్తున్న తీరును విమర్శిస్తూ మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేశారు. లోకేష్ దీనిని ఖండించి ఉండవచ్చు. అలా కాకుండా ఏకంగా ఆయనపై పోలీసులు కేసు పెట్టేశారు. ఇదే ప్రామాణికంగా తీసుకుంటే లోకేష్ అప్పటి సీఎం. జగన్ పైతో సహా పలువురు వైఎస్సార్సీపీ వారిపై తీవ్రమైన ఆరోపణలు అనేకం చేసేవారని, అప్పట్లో తాము ఇలా కేసులు పెట్టలేదనివైఎస్సార్సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే నందిగామలో ఎప్పుడో చంద్రబాబు టూర్ లో జరిగిన చిన్న గొడవ మీద మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు , ఎమ్మెల్సీ అరుణకుమార్ లపై కేసులు పెట్టారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై కూడా హత్య కేసు బనాయించారనివైఎస్సార్సీపీ ఆరోపించింది. వీరంతా దళిత నేతలే. దళిత నాయకత్వాన్ని దెబ్బతీయడానికే టీడీపీ ఇలా చేస్తోందనివైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. గతంలో ఒక కానిస్టేబుల్ పైనే సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయ వ్యవస్థ, ఇంతమంది దళిత నేతల విషయాలలో కూడా న్యాయం చేయాలని, తద్వారా పౌర హక్కులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. అధికార వ్యవస్థపై కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి పలు వేధింపులకు పాల్పడుతోంది. వీరిలో ఎక్కువమంది దళిత అధికారులు ఉండడం గమనించదగ్గ అంశం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 201419 మధ్య జరిగిన స్కిల్ స్కామ్‌తోసహా పలు కుంభకోణాలలోవైఎస్సార్సీపీ టైమ్‌లో ఆధార సహితంగా కేసులు పెట్టడమే వారు చేసిన తప్పు. దీన్ని మనసులో ఉంచుకుని వారిలో పలువురిని వేధిస్తున్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్‌ను రకరకాలుగా వేధిస్తుండగా, పాల్ రాజు, జాషువా అనే ఇద్దరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదట. మరో సీనియర్ అధికారి విజయపాల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇందులో విశేషం ఏమిటంటే కుల, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ నిత్యం టీవీలలో మాట్లాడిన అప్పటివైఎస్సార్సీపీ అసమ్మతి నేతపై కేసు పెడితే, దానిని డైవర్ట్ చేసి, ఆయనను విచారణలో హింసించారంటూ కొత్త కేసును ముందుకు తీసుకురావడం. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఎలాంటి హింస లేదని సర్టిఫికెట్ ఇచ్చినా, కూటమి అదికారంలోకి వచ్చాక, మొత్తం కేసును తిరగతోడి, ఐపిఎస్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. వారిని లొంగదీసుకునివైఎస్సార్సీపీ నేతలపై కూడా కక్ష సాధించాలన్నది వీరి ప్లాన్ గా చెబుతున్నారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ మార్గదర్శి కేసును విచారించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శిలో రూ. 800 కోట్ల నల్లధనం ఉందని, మార్గదర్శి చిట్స్ లో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేయడమే ఆయన చెసిన తప్పు. ఇప్పుడు దానికి ప్రతిగా ఏదో రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ దౌర్జన్యాలకు గురి అవుతున్నవారిలో పలువురు దళిత కార్యకర్తలు కూడా ఉన్నారు. రాజమండ్రిలో ఒక దళిత సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను స్టేషన్ కు తీసుకువెళ్లి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానించారట. ఆ విషయాన్ని అతనే మాజీ ఎంపీ భరత్ సమక్షంలో వివరించారు. జగన్ పాలన సమయంలో ఒక దళిత డాక్టర్ సస్పెన్షన్ నే అంతగా రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితరులు ఇప్పుడు ఇంతమంది దళితులపై ఈ స్థాయిలో జరుగుతున్న దాష్టికాలకు బాధ్యత వహించరా? కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మాట దాటేసిన చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై సీఎం చంద్రబాబు పాతపాటే పాడారు. శుక్రవారం విశాఖలో ఆయన పర్యటించారు. మీడియా ప్రశ్నకు సమాధానంగా స్టీల్‌ప్లాంట్ విషయంలో మాట్లాడుతున్నాం అంటూ మాట దాటేశారు. దీంతో స్టీల్‌ఫ్లాంట్‌పై చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాత స్వరమే వినిపించడంతో ఉక్కు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ప్లాంట్‌ను కాపాడుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ఈ ఆరు నెలల్లో పట్టించుకున్న పాపానపోలేదు. ఎన్నికల ముందు, ఆ తర్వాత ఒకవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కోటలు దాటేలా మాటలు మాట్లాడారు. దానిని కాపాడుకునేందుకు ఎంత వరకైనా వెళతామని ఇద్దరూ హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం నాలుక మడతేశారు.మరో వైపు, స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు చేపడుతున్న నిరసనలను అణిచివేయడానికి చంద్రబాబు సర్కార్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోగా.. ఉద్యమిస్తున్న కార్మికులపై ఉక్కుమోదం మోపుతోంది. ఇదీ చదవండి: దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి -
దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ సీపోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని.. ఏదో జరిగిపోయిందంటూ కట్టు కథలు రాయిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్ధానాలు ఇచ్చారని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తునారు. ఈనాడు మోసపూరిత పత్రిక. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్‌పై కేసు నడుస్తోంది. చంద్రబాబు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉన్నవాళ్లపై కక్ష సాధిస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘పవన్ కల్యాణ్ పీడీఎస్ రైస్ పట్టుకుంటానన్నారు.. ఎందుకు పట్టుకోలేదు. పవన్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బినామీ కేవీరావు అని పవన్ మాట్లాడారు. చెప్పింది చేయడం బాబుకు అలవాటు లేదు. బెల్టు షాపు తెస్తే బెల్టు తీస్తానన్నాడు.. గాలికొదిలేశాడు. ఏపీలో దోపిడీ రాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేవీరావును అడ్డుగా పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. దొడ్డిదారిన కేవీరావుకు పోర్టును కట్టబెట్టింది నిజం కాదా?. ఇప్పుడు కేవీరావును అడ్డంపెట్టుకుని డ్రామాలాడుతున్నారు.’’ అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు..రైతాంగ సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెల 11నుంచి 13కి వాయిదా వేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుమల లడ్డూ విషయంలో రద్దాంతం చేసి టీడీపీ అభాసుపాలయింది. ఇప్పుడు కాకినాడ సెజ్ మీద పడ్డారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు బెదిరించి పోర్టుని లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పచ్చమీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటున్నారు..కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి పోర్టును రాయించుకున్నట్టు ఈనాడు కట్టు కథలు రాసింది. ఈనాడు పత్రిక మోసపూరితంగా పుట్టింది. అవినీతి పుత్రిక ఈనాడు. అలాంటి పత్రికలో సాయిరెడ్డి మీద దారుణమైన వార్తలు రాస్తున్నారు. చంద్రబాబుకు ఆస్తుల సంపాదనపై దాహం తీరలేదు. అందుకే ఇతరుల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నారు. గతంలో కేవీరావు గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ కామెడీ డైలాగు వేశారుచంద్రబాబు తన అధికారంతోపాటు వేలాది కోట్లను లోకేష్ కి అందించాలని చూస్తున్నారు. ఏపీలో అవినీతికి పాల్పడని టీడీపీ ఎమ్మెల్యేనే లేడు. ప్రతిపనిలోనూ అడ్డంగా దోచుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మీడియా ముందు భీకర మాటలు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగితే సహించనంటూ బడాయి మాటలు మాట్లాడుతున్నారు. కానీ జరిగేదంతా అవినీతి, దోపిడీలే. పయ్యావులకేశవ్ వియ్యంకుడు కాకినాడ పోర్టులో రారైస్ బిజినెస్ చేస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించటానికి మేము సిద్ధం. ఆయన చేసే దోపిడీని కప్పిపుచ్చేందుకు పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనకు చెందిన షిప్‌ని సైలెంట్‌గా వదిలేశారు..కాకినాడ పీర్టులో అరబిందో షేర్లు చట్టబద్దమైనవి. కానీ పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. గంజాయి మీద ఈగల్ దర్యాప్తు, బియ్యం మీద, తిరుపతి లడ్డూల మీద సిట్లు అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అంతకుమించి రాష్ట్రంలో ప్రజాపాలనే జరగటం లేదు. లోకేష్ డబ్బులు లెక్కలేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడపటం కలకాలం జరగదు’’ అని అంబటి రాంబాబు నిలదీశారు. -
పులి సాగర్‌పై దాడి ఘటన.. పీఎస్‌లో మార్గాని భరత్ ఫిర్యాదు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రికి చెందిన దళిత యువకుడు పులి సాగర్‌పై జరిగిన దాడి ఘటనపై రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫిర్యాదు చేశారు. దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో బంధించి సీఐ దాష్టీకంపై ఆయన మండిపడ్డారు. దళితులపై కూటమి సర్కార్ వేధింపుల పట్ల భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పులి సాగర్‌కు జరిగిన అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని భరత్ తెలిపారు.కాగా, రాజమండ్రి పోలీసుల చేతిలో దారుణంగా హింసించబడ్డ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదంతంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాధితుడు పులి సాగర్‌కు అండగా నిలవాలని వైఎస్సార్సీపీ నేతలను ఆదేశించారాయన.రెండురోజుల క్రితం పులిసాగర్‌ను కొందరు వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ జగన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ సందర్భంలో.. రాజమహేంద్రవరం పోలీసులు తనతో ఎంత అవమానవీయంగా వ్యవహరించారో జగన్‌కు సాగర్ వివరించాడు. అయితే సాగర్‌కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు.. పోలీసుల తీరుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. -
వైఎస్సార్సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ సీపీ ధర్నాల్లో స్వల్ప మార్పు జరిగింది. ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా ఆ పార్టీ ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని 13వ తేదీకి వాయిదా వేసింది. ఐదు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉన్నందున వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 13న రైతాంగ సమస్యలపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించింది. మిగతా కార్యక్రమాలు యథాతథంగా జరగనున్నాయి.కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీసి, ప్రజా సమస్యలపై ఉద్యమబాటకు వైఎస్ జగన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రైతు సమస్యలపై ఈ నెల 13న, కరెంటు ఛార్జీల మోతపై 27న, విద్యార్ధులకు బాసటగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై జనవరి 3 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం కుదేలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్బీకేలు స్థాపించి, ఈ–క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా అందించింది. దళారుల వ్యవస్థ లేకుండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టింది. చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్దతు ధర రావడం లేదని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: దుర్మార్గ పాలనపై పోరాటం: వైఎస్ జగన్ -
వైఎస్సార్సీపీలో ఉంటే ఆస్తులు కొనుక్కోకూడదా?: దాడిశెట్టి రాజా
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు, బీసీ, కాపులను అణివేసే ధోరణీ జరుగుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. రైతులను చంద్రబాబు ప్రభుత్వం దోచుకుంటోందని విమర్శించారు. గత వైఎస్ జగన్ హయంలో ధాన్యం ధర రూ.2వేలు ఉంటే.. చంద్రబాబు పాలనలో రూ.1400 లకే రైతులు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రింబయిర్స్మెంట్ చెల్లించాలని, లేదంటే వైఎస్సార్సీపీ తీవ్రమైన ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.ఈ మేరకు శుక్రవారం దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. కాకినాడ సెజ్‌లో తాను ఆరు ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. మార్కెట్ మీద హెచ్చు రేటు పెట్టి భూములను రైతుల నుంచి కొనుక్కున్నానని చెప్పారు. 1940 నుంచి తమ కుటుంబం బంగారం వ్యాపారంలో ఉందన్నారు. తన దగ్గర డబ్బులు ఉండటం వల్లే రైతులు అమ్మిన భూములు కొన్నుకున్నట్లు పేర్కొన్నారు.‘చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదేదో తప్పులా అసత్య ప్రచారాలు చేశాయి. ఆ మధ్య చంద్రబాబు భూములు కొనుక్కున్నారు. ఇటీవల పిఠాపురంలో 15 ఎకరాల భూములు కొనుక్కున్నారు. ఈ పది రోజుల కాలంలో రెండు ఆస్ధులను యనమల రామకృష్ణుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, యనమల కొన్న ఆస్ధులు ప్రజల దగ్గర దోచుకున్నవే అని నేను ఆరోపించగలను.ఒక్క బకెట్ బురద చల్లేస్తే సరిపోతుందా?. వైఎస్సార్సీపీలో ఉన్నాం కాబట్టి మేము ఆస్ధులు కొనుక్కోకూడదా?. యనమల మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో రూ. రెండు లక్షలు లేకపోతే రైతు సంఘాలు ఖర్చులు బరించి గెలిపించాయి. ఇవాళ యనమల దగ్గర వేలాది కోట్ల ఆస్ధులు ఉన్నాయి. ఆ ఆస్ధులన్ని పేదలకు పంచిపెట్టాలి’ అని తెలిపారు -
నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఫేక్ పోస్టులు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వ పెద్దలపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఫైరయ్యారు. కూటమి నేతల ఆధ్వర్యంలో సోషల్‌మీడియాలో వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.శుక్రవారం(డిసెంబర్ 6)పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ వద్ద అంబటి మీడియాతో మాట్లాడారు.‘టీడీపీ సోషల్‌మీడియాపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. లేదంటే కోర్టులను ఆశ్రయిస్తాం’అని అంబటి హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే.. ఇవాళ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో రెండు ఫిర్యాదులిచ్చాంనామీద, మా పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి మీద టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్నారుజై టీడీపీ అనే ట్విట్టర్ పేజీలో వైఎస్ జగన్ గారి మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెడుతున్నారుమా నాయకుడిని అవమానించే విధంగా పోస్టులు పెడుతున్నారుసీమరాజు అనే వ్యక్తి మా వైఎస్సార్సీపీ కండువా వేసుకొని మమ్ములను పచ్చి బూతులు తిడుతున్నారుఈ పోస్టింగులపై యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదు చేశాం.ఈ పోస్టులతో మా మనోభావాలు దెబ్బతింటున్నాయిడీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అక్రమ కేసులు పెడుతున్నారుసీమరాజు ఇకనైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలినారా లోకేష్ సృష్టించిన రోబో సీమరాజునారా లోకేష్ ఆధ్వర్యంలోనే సీమరాజు ఇండస్ట్రీ మాదిరిగా స్టూడియో పెట్టుకొని సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీపై రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారువైఎస్ జగన్ గారు వారి సతీమణి భారతి గారి మీద కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారుతక్షణమే పోలీసులు సీమరాజు మీద యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు వెళ్తాం14 రోజుల అనంతరం ప్రైవేట్ కేసులు వేస్తాంహైకోర్టు, అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాంభయపడి వెనకడుగు వేసే ప్రసక్తే లేదుచట్ట ప్రకారం వ్యవహరించాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాంచట్టాలు వాటి పని అవి చేసుకునే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉందిగత నెల 18, 19 తేదీలలో గుంటూరు నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లలో సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదులు చేశాంఇంతవరకు కేసులు నమోదు చేయలేదు.. మాకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది న్యాయం జరిగే వరకూ చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం -
కేవీ రావుపై పవన్ చేసిన ఆరోపణలు మరిచిపోయారా?: కురసాల కన్నబాబు
సాక్షి, కాకినాడ: పాలనలో తన వైఫల్యాలను, బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారం ఆయన కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై ఈనాడు పత్రిక దిగజారిపోయి రోత రాతలు రాసిందని ధ్వజమెత్తారు.కాకినాడ ఎస్ఇజెడ్ భూములపై కుట్రపూరితంగా చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న ఈనాడు పత్రిక అసత్యాలు, అభూతకల్పనలతో వైఎస్ జగన్‌పైన బుదరచల్లేందుకు ప్రయత్నించాయని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన రైతులకు, వారి భూములను తిరిగి ఇప్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని కన్నబాబు అన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..2003లో తొండింగి మండలంలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్ భూములను ఎపిఐఐసికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. తర్వాత కాలంలో ఎస్ఇజెడ్ కు భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు వ్యతిరేకించారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో కాలుష్య కారక పరిశ్రమలను ఇక్కడకు రానివ్వను, రైతుల భూములను తిరిగి వారికి అప్పగిస్తానంటూ హామీలు గుప్పించారు. భూపోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా 2012లో ఏకంగా ఏరువాకలో సైతం పాల్గొన్నారు.ప్రతిపక్ష నేతగా వ్యతిరేకించారు.. సీఎం కాగానే రైతులపై దాష్టీకం2014లో అధికారంలోకి రాగానే గతంలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరిచిపోయారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రైతులు ఉద్యమించారు. తమ భూములను దున్నుకునేందుకు వెళ్ళిన రైతులపై చంద్రబాబు పోలీసులను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేసి, రాజమండ్రి జైలుకు తరించారు. వారితో బాత్రూంలు కడిగించి, పలు రకాలుగా వేధించారు. కనీసం 2013 నాటి భూసేకరణ చట్టం కింద అయినా పరిహారం ఇవ్వాలన్న రైతుల కోరికను చంద్రబాబు నిరాకరించారు.తొమ్మిది గ్రామాలను కబళించేందుకు తెగబడిన చంద్రబాబు సర్కార్ ఎస్ఇజెడ్ కు భూములను బలవంతంగా కట్టబెట్టేందుకు ఏకంగా తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించాలని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల్లో గ్రామసభల ద్వారా ఎస్ఇజెడ్ కు వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తారనే భయంతో ఆనాడు పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్న నారా లోకేష్ 73, 74 అధికారణ కింద పంచాయతీలకు ఉన్న హక్కులను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులు వేరే వారికి భూములు అమ్ముకోకుండా ఉండేందుకు ఏకంగా వారి భూములను చంద్రబాబు ప్రభుత్వం నిషేద భూముల జాబితాలో పెట్టి పైశాచిక ఆనందం పొందింది.పాదయాత్రలో వైఎస్ జగన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్న రైతులుపాదయాత్రలో భాగంగా జగన్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎస్ఇజెడ్ భూముల బాధిత రైతులు ఆయనను కలిశారు. ఆనాడు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను. వారి బాధలను విన్న జగన్ గారు ప్రతిపక్ష నేతగా పిఠాపురం సభలో ఒక హామీ ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులకు సంబంధించిన భూములను వెనక్కి ఇచ్చేస్తామని వాగ్ధానం చేశారు. అధికారంలోకి రాగానే దీనిపై నా నేతృత్వంలోనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటీ రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పలుసార్లు చర్చలు జరిపింది. అనంతరం 2021లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాం. దాని ప్రకారం ఎస్ఇజెడ్కు రిజిస్టర్ చేయకుండా ఉన్న 2180 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇచ్చేయాలని, స్థానిక ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆరు గ్రామాలను తరలించాలనే ప్రతిపాదనను విరమించాలని, శ్రీరాంపురం, బండిపేట, ఉమ్మడివారికోడు, రావివారికోడు, రామరాఘవాపురం, తాటివారిపాలెం గ్రామాలను తరలించాల్సిన అవసరం లేదని కమిటీ సిఫార్స్ చేసింది. అంతకు ముందు భూసేకరణలో భాగంగా స్మశానాలు, పాఠశాలలు, సామాజిక స్థలాలను కూడా తీసుకున్నారు. సేకరించిన శ్మశాన భూములను అప్పగించాలని, 2180 ఎకరాల రైతుల భూమిని నిషేదిత జాబితా 22ఎ నుంచి తొలగించాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిఫార్స్ చేశాం. వీటిని జగన్ గారి నేతృత్వంలో కేబినెట్ ఆమోదించింది.వేగంగా రైతులకు తిరిగి భూములు ఇప్పించేందుకు కృషిసీఎంగా వైఎస్ జగన్ ఎస్ఇజెడ్ బాధిత రైతుల కష్టాలను తీర్చేందుకు సత్వర చర్యలు తీసుకున్నారు. ఎసిఇజెడ్ కోసం కోనా గ్రామానికి సంబంధించి 657 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు పది లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, దివీస్ కోసం కేటాయించిన భూములకు కూడా అదనంగా అయిదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానికంగా ఉన్న హెచరీలకు భద్రత కల్పించాలని, స్థానికులకే 75శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, ప్రభుత్వం సూచించింది. కేంద్ర నోటిఫికేషన్ పరిధిలో ఎస్ఇజెడ్ అనేది ఉంటుంది. దీనిని కేంద్రం నోటిఫికేషన్ నుంచి తొలగించాలనే ఉద్దేశంతో అధికారులు కేంద్రంతో సంప్రదించి సర్వే నెంబర్ల వారీగా భూములను ఉపసంహరింపచేశారు. దాదాపు నాలుగు వందల ఎకరాల వరకు విత్ డ్రా చేయించారు. భూ యాజమాన్య, వారసత్వ సమస్యలను కూడా సమగ్రంగా పరిశీలించి రైతులకు రిజిస్టర్ చేయించాలని కూడా సిఫారస్ చేశాం.రైతులకు మేలు చేసిన వైఎస్ జగన్‌పై ఈనాడు బురదదేశంలోనే మరెవ్వరూ రైతుల కోసం ఇంతగా చేయలేదు. ఎస్ఇజెడ్ కోసం బలవంతంగా చేస్తున్న భూసేకరణను నిలువరించి, రైతులకు భూములను తిరిగి ఇప్పించిన ఘనత సీఎంగా ఆనాడు వైఎస్ జగన్‌కే దక్కుతుంది. బాధిత రైతుల బాధలు తీర్చేందుకు ఆనాడు కన్నబాబు కమిటీ ఇంత కృషి చేస్తే.. రైతులను మోసం చేశారు అంటూ ఈనాడు పత్రిక తప్పుడు రాతలు రాయడం సిగ్గుచేటు. రైతులు తమకు తిరిగి దక్కిన భూమిని వారి అవసరాల కోసం ఇతరులకు అమ్ముకున్నారు.దాడిశెట్టి రాజా, పిఠాపురంకు చెందిన కొందరు ఈ భూములను కొనుగోలు చేసి ఉంటారు. అంతమాత్రాన రైతులను బెదిరించి భూములను లాక్కున్నారంటూ బుదరచల్లుతారా? రైతులకు మార్కెట్ రేటు ప్రకారం డబ్బు ఇచ్చిన తరువాత కొనుగోలు చేయడం కూడా అక్రమమే అవుతుందా? రైతుల భూములను బలవంతంగా గుంజుకున్న చంద్రబాబు ఈనాడు దృష్టిలో గొప్ప నాయకుడు. రైతుల బాధను చూసి వారికి అండగా నిలిచిన జగన్ గారు మాత్రం రైతులకు అన్యాయం చేసినట్లుగా ఈనాడు చిత్రీకరించడం వారి దిగజారుడుతనంకు నిదర్శనం.కాకినాడ డీప్ సీ పోర్ట్ పైనా చంద్రబాబు మార్క్ కుటిల రాజకీయంకాకినాడ సీ పోర్ట్ లో రెండు కంపెనీల మధ్య వాటాల కొనుగోలును చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి లావేదేవీలు ఎప్పుడూ జరగలేదా? కేవీ రావును బెదరించి వాటాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. అలా అయితే మొత్తం వాటాలు తీసుకునేవారు కాదా? కేవలం 41 శాతం తీసుకుని, మిగిలినవి కెవి రావు చేతుల్లోనే ఉంచుతారా? నేటికీ కేవీ రావు చేతుల్లోనే సీపోర్ట్ యాజమాన్యం ఉంది. అజమాయిషీ వారిదే. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు బలవంతంగా వాటాలు గుంజుకున్నారని ఎందుకు కేవీరావు ఆనాడు ఫిర్యాదు చేయలేదు.కేవీరావుకు సీపోర్ట్ కట్టబెట్టడంలో చంద్రబాబు కుట్రకాకినాడ సీపోర్ట్ ను సైతం చంద్రబాబు కుట్రపూరితంగానే కేవీ రావుకు దక్కేలా చేశాడు. 1997లో ప్రభుత్వ సొమ్ముతో నిర్మించి దాన్ని బ్యాక్ డోర్ ద్వారా కేవీరావుకు చంద్రబాబు అప్పనంగా అప్పగించేశారు. సీపోర్ట్ నిర్వహణకు ముందుగా విదేశీ కంపెనీలను తీసుకువచ్చి, కేవీరావు సంస్థలతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ తరువాత విదేశీ సంస్థలను వెళ్ళగొట్టి, మొత్తం కేవీ రావు సంస్థలకే దారాదత్తం చేశారు.యాంకరేజీ పోర్ట్ ను మాత్రం ప్రభుత్వం నిర్వహిస్తుంటే, సీపోర్ట్ మాత్రం కేవీరావు సంస్థకు ఇవ్వడం వెనుక చంద్రబాబు స్వప్రయోజనాలు ఉన్నాయి. సినిమా రంగానికి చెందిన కేవీ రావుకు పోర్ట్ వ్యాపారాల్లో ఎటువంటి అనుభవం లేదు. అటువంటి వ్యక్తితో ఇప్పుడు చంద్రబాబు బలవంతంగా వాటాలు తీసుకున్నారు అని ఫిర్యాదు చేయిస్తున్నాడు. బలవంతగా తీసుకుంటే… మైనర్ వాటా తీసుకుంటారా? పైగా వాటాలు అమ్ముకుని, దానికి డబ్బులు తీసుకుని, ఆడబ్బును వేరేచోట పెట్టబుడి దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లి, తప్పుడు కేసులు పెడితే ప్రజలు నమ్ముతారా? పోర్టును కొట్టేయడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది.పెట్టబడులకు, కట్టుకథలకు పుట్టిన విష పుత్రికలు అన్న శ్రీశ్రీ మాటలను ఈనాడు పత్రిక గుర్తు చేస్తోంది. కాకినాడ యాంకరేజీ పోర్ట్ నుంచి ఎక్కువగా బియ్యం ఎగుమతి అవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మనోహర్‌లు ఈ పోర్ట్ ను తనిఖీ చేసిన తరువాత అరబిందో సంస్థ డీప్ సీ పోర్ట్ లో వాటాలు తీసుకున్న తరువాత నుంచే పీడీఎస్ బియ్యంను ఇక్కడి నుంచి అక్రమంగా రవాణా చేయడం ఎక్కువైందని ప్రకటనలు చేశారు. డీప్ సీ పోర్ట్ యాజమాన్యం కేవీ రావు చేతుల్లోనే ఉంది. ఆయన సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు.రాష్ట్రంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు తెలుగుదేశం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు. ఇవ్వన్నీనిజాలు అయితే, వైఎస్ఆర్ సిపిపై బుదరచల్లేలా వారు అబద్దాలు మాట్లాడటం, దానికి ఈనాడు పత్రిక బాకా ఊదడం దారుణం. 2019లో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణాపై ఏం మాట్లాడారో మరిచిపోయారా? కేవీ రావు అనే వ్యక్తి వచ్చిన తరువాతే కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ బియ్యం రవాణా పెరిగిపోయిందని ఆనాడు పవన్ ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఉండటం వల్ల అరబిందో వాటాలు తీసుకున్న తరువాత అంటూ మాట మారుస్తున్నాడు. -
ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
పవన్ కళ్యాణ్‌ను సరిగా వాడుకోవడం ద్వారా కాకినాడ పోర్టును సైతం కబ్జా చేయొచ్చని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. నౌకలో బియ్యం విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి... నేను కనిపెట్టేశాను.. సీజ్ ది షిప్ అంటూ రీల్స్ చేసి సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నడిపిస్తున్న కథకు ఇరుసుగా మారారు.ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... కూటమి నేతల అరాచకాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నెలకో అంశాన్ని తీస్తున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఈ కాకినాడ పోర్టు అంశాన్ని అందుకున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమేఅందులో భాగంగానే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాల్సిన పవన్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు.చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అరబిందోఇందులో భాగంగా చంద్రబాబు తన సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు చేయించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేసారు. ఆ వెంటనే సీఐడీ కేసు కూడా నమోదు చేసేసింది.వాస్తవానికి కేవీ రావు 2020లో పోర్టులో తన 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు రూ. 494 కోట్లకు అమ్ముకున్నారు. అప్పట్లో ఆ అమ్మకం తనకు ఇష్టం లేనిపక్షంలో ఆనాడే అయన దాన్ని వ్యతిరేకించి అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు కేవీ రావు మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చారన్నది తెలుస్తోంది.అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అరబిందో సంస్థ కెవిరావు నుంచి 41 శాతం వాటాలను కొనుగోలు చేసాక పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే మేలని భావించిన అరబిందో సంస్థ భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన (రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది.పోర్టును కారుచౌకగా అమ్మేసింది చంద్రబాబేవాస్తవానికి 1999లో అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టారు. నిజం సుగర్స్ వంటి సంస్థలను అమ్మేసింది చంద్రబాబేనన్నది అందరికి తెలిసిందే. అదే క్రమంలో లాభాల్లో ఉన్న ఆ పోర్టును సైతం కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.-సిమ్మాదిరప్పన్న -
కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయి
సాక్షి, ఢిల్లీ: చంద్రబాబుకు మతి భ్రమించి ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు ముఖ్యం కాదు.. వైఎస్ జగన్‌పై కక్ష తీర్చుకోవడమే ఆయనకు టార్గెట్ అంటూ ధ్వజమెత్తారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ జగన్‌తో సహా వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా బాబు పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి శూన్యమన్న విజయసాయిరెడ్డి.. కూటమి పాలనపై చర్చ జరగకుండా ఏదోక అంశాన్ని తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘కాకినాడ పోర్టును ఏడీబీ నిధులతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగంలోని పోర్టును చంద్రబాబు ప్రైవేట్ పరం చేశారు. మలేషియా ప్రధానమంత్రి మహాతిర్ మహమ్మద్ తనయుడు కొంటున్నారని చంద్రబాబు చెప్పారు. ఆ ముసుగులో కేవీ రావుకు కాకినాడ పోర్టు కట్టబెట్టారు. కేవీ రావుని దొడ్డిదారిన సీఎండీ స్థానంలో కూర్చోబెట్టారు. కాకినాడ పోర్టు వ్యవహారంపై 1997 నుంచి దర్యాప్తు జరపాలి. చంద్రబాబు జేబు సంస్థ సీఐడీ ద్వారా కాకుండా సీబీఐ ద్వారా దర్యాప్తు జరపాలి’’ అని విజయసాయి డిమాండ్ చేశారు.‘‘అందరినీ క్రిమినల్ అంటాడు.. కానీ, చంద్రబాబే ఒక క్రిమినల్. కేవీరావు ఒక బ్రోకర్.. చంద్రబాబుకు చెంచా. ప్రజలను మభ్యపెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. కేవీరావుకు అన్యాయం జరిగిఉంటే అప్పుడే కోర్టులను ఆశ్రయించొచ్చు. కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టాడని ప్రచారం చేస్తున్నారు. కేవీరావుకు ఫోన్ చేసినట్లు, బెదిరించినట్లు ఆధారాలు ఉన్నాయా?. బ్రోకర్ పనులు చేసే కేవీరావును విక్రాంత్‌రెడ్డి భయపెట్టారంటే నమ్మొచ్చా?. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు కట్టబెట్టడానికే బాబు నాటకాలు. నాపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి?. కేవీరావు, చంద్రబాబుపై పరువు నష్టం దావా వేస్తా’’ అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. -
జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆరు నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని.. రాష్ట్రంలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైద్యరంగం పరిస్థితి దయనీయంగా ఉందని.. వ్యవసాయ రంగం కూడా కుదేలైందన్నారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయిన వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరునెలలు కావస్తోంది. ఆరునెలల కాలంలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేదు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాల్టికి కూడా మన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. సగర్వంగా..కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగులు కాగితాలు ఇచ్చి దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితుల నుంచి.. తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం.వైఎస్సార్సీపీ హయాంలో మాత్రమే ఇలా..మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ... అందులో 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పధకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు సంక్షేమ కేలండర్ ను విడుదల చేసి క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది.ఈ మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తుందిఆ రకమైన మంచి మనం చేశాం. ఆ రకమైన మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కనపెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే ఈ సారి 40 శాతం వచ్చింది. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటువైపు పోయింది. తీరా ఇవాల చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తుంది. కానీ మనం అలా చేయలేదు..ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రమైన ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరు కనిపించినా.. చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15వేలు అని వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు వాళ్ల అత్తగారు కనిపిస్తే నీకు రూ.48వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్దాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు.అతి మంచితనం.. అతి నిజాయితీఇవాళ్టికి నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మరలా మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరునెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలు నా రూ.15వేలు ఏమైందని.. రైతులు నా రూ.20వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి.తిరోగమనంలోకి స్కూళ్లు..మరో వైపు వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. స్కూళ్లలో నాడు నేడు లేదు. ఇంగ్లిషు మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. 8వతరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరోతరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడతాయా అన్న పరిస్థితి నుంచి... ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి స్కూళ్లు వెళ్లిపోయాయి.అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది..ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు అని పేదవాడు అనుకునే పరిస్ధితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చేవాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు బకాయిలు పెట్టారు. వసతి దీవెన గాలికెగిరిపోయింది. పిల్లలు చదువుకునే కాలేజీలు యాజమాన్యాలు మీరు ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని వారిని ఇంటికి పంపిస్తున్నారు.దయనీయం.. ఆరోగ్యశ్రీ సేవలువైద్యరంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్ వర్క్ ఆసుపత్రులకు మార్చి నుంచి ఇంతవరకు బిల్లులు చెల్లింపులేదు. మార్చి నుంచి నవంబరు వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2400 బకాయిలు ఉన్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104,108 ఆగష్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్ కుయ్ మంటూ రావాల్సిన అంబులెన్స్‌లు చతికిలపడుతున్నాయి.మన ప్రభుత్వ హయాంలోఆరోగ్యశ్రీ పరిధిని 3350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్ల్యూహెచ్ ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తెచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి, ప్రతి పదిహేను రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.వ్యవసాయ రంగం కుదేలువ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఇ-క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా పెట్టాం. దళారీ వ్యవస్థ లేకండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే... ఈరోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్ధతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఇ-క్రాప్ గాలికెగిరిపోయింది. పారదర్శకత పక్కకుపోయింది. తిరోగమనంలో వ్యవసాయం ఉంది.అసలు పథకాలుంటే కదా!డోర్ డెలివరితో ప్రతి పథకం ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్ధితి కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు.. అసలు పథకాలుంటే కదా.విచ్చలవిడిగా అవినీతి..విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే..మన కన్నా తక్కు రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2-3 లక్షలకు బెల్టుషాపులు నడుపుతున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా... ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి,ఆయన కొడుకుకి ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది.ప్రజల తరపున నిలబడాల్సిన సమయంఆరు నెలలు అయింది. మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు. అందరం చురుగ్గా ప్రజల తరపున పనిచేయాలి. ప్రజల తరపున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను. ప్రతిఒక్కరూ ప్రజలకేం కావాలి, వారికి తోడుగా అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి.బలోపేతం చేసే దిశగా అడుగులురాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధవారం, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అన్న పేరుతో ఈ కార్యక్రమం చేస్తాను.ఇదీ చదవండి: వినేవాడుంటే... కథలు చెప్పేది కూటమి ప్రభుత్వమని..అన్యాయాన్ని ప్రశ్నించాలి..పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. నా కార్యక్రమం మొదలైనప్పుడు గ్రామ స్థాయి, బూత్ కమిటీల వరకు నియామకాలు పూర్తి చేద్దాం. ఈ కమిటీల పూర్తైన తర్వాత ప్రతి సభ్యుడికీ సోషల్ మీడియా మాధ్యమంలో ఉండే ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ అన్ని అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో ఏం జరుగుతున్నా అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆసుపత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫోటో తీసి అప్ లోడ్ చేయాలి.ప్రతి కార్యకర్త విప్లవంలా పనిచేయాలి..మనం కేవలం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నాం. వీళ్లు ఆకాశం నుంచి ఒక అబద్దాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలు కట్టి ఇంత మందితో ప్రచారం చేస్తారు. ఇవన్నీ తిప్పికొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవంలా పనిచేయాలి. మోసంతో అధికారంలో వచ్చిన వీళ్లు ప్రజల కోపానికి గురికాకతప్పదు. అప్పుడు వీళ్లు ఎంత దూరంలో పడతారంటే... తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం. మనం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇది. -
రాజకీయ కుట్రతోనే నాపై ఆరోపణలు: తలశిల రఘురాం
సాక్షి, తాడేపల్లి: తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అని.. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై కొందరు కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు.‘‘గొల్లపూడిలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి టీడీపీ నేత. టీడీపీ నేతలకు అతను రూ.30 కోట్ల వరకు ఇవ్వాలి. వాళ్లు గొడవలు పడి కేసులు పెట్టుకున్నారు. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసుకోవచ్చు. నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు...నేను ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదు. ఆత్మహత్య చేసుకునే ముందు అతను వీడియో తీసుకున్నాడు. టీడీపీ వారే తన చావుకు కారణమని వీడియోలో చెప్పాడు. నాపై కుట్రలు మాని.. విచారణ జరిపించాలి. నా మీద ఆరోపణలు చేయటం విచిత్రంగా ఉంది. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర’’అని తలశిల రఘురాం మండిపడ్డారు. -
శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్‌తో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
వినేవాడుంటే... కథలు చెప్పేది కూటమి ప్రభుత్వమని..
ఆంధ్రప్రదేశ్‌లో నెలకో కొత్త డ్రామా మొదలవుతోంది. సూపర్‌సిక్స్ హామీలను ఎప్పుడో గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నెలకో కొత్త కథ చెబుతోందనుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గద్దెనెక్కగానే వైఎస్సార్సీపీ నేతలపై దౌర్జన్యం, దాడులతో తొలి నెల కథ మొదలు కాగా.. ఆ తరువాత ముంబై నటి జత్వానీతో వైఎస్సార్సీపీ నేతలను, తమకు అనుకూలంగా లేని అధికారులను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఈ తంతు ముగుస్తోంది అనుకునేంతలోపే తిరుపతి లడ్డూ వివాదాన్ని ప్రజల నెత్తిన రుద్దారు. ఆపై.. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు, కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రి అల్లిన కథ.. ఇలా సాగిపోతోంది కూటమి రాజకీయ డ్రామా!ఇప్పటికే పలు వ్యవస్థలను ద్వంసం చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం తాజాగా ఆర్థిక విధ్వంసానికి పూనుకున్నట్లు కనిపిస్తోంది. సామాజిక కోణమూ ఇందులో ఉందంటున్నారు. రెడ్డి సామాజికవర్గ పారిశ్రామిక వేత్తలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రభుత్వం దాష్టికాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. కాకినాడ డీప్ పోర్టు కంపెనీలో బలవంతంగా షేర్లు పొందారని అంటూ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రావుతో ఒక ఫిర్యాదు చేయించి అందులో గత ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఎలాగైనా ఇరికించాలన్న ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది. తెలుగుదేశం పత్రిక ఈనాడులో వచ్చిన ఆ కథనం చదివితే అచ్చంగా ఒక కాల్పనిక కథను తయారు చేసేందుకు విఫలయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది. చాలాచోట్ల తర్కం అసలు కనిపించకుండా పోయింది మరి!గతంలో మాజీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ కాలుష్యానికి కారణమవుతోందని ప్రభుత్వం నోటీసిస్తేనే.. రాష్ట్రంలోంచి పరిశ్రమలను తరిమికొడుతున్నారని తెలుగుదేశం, ఆ పార్టీ మీడియా పచ్చి అబద్దాలను ప్రచారం చేశాయి. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కేంద్ర ప్రభుత్వ సంస్థతో జరిగినా, జగన్‌పై ద్వేషంతో అదానీ కంపెనీలపై బురద చల్లారు. ఈ పరిణామాలు అదానీ కంపెనీ ఏపీలో పెట్టాలనుకున్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదు. తాజాగా కూటమి ప్రభుత్వం అరబిందో గ్రూప్‌పై దాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది. అరబిందో మందుల తయారీతో సహా పలు రంగాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నిర్వహిస్తున్న సంస్థ. దాదాపు రూ.72 వేల కోట్ల పెట్టుబడులతో 150 దేశాల్లో యూనిట్లు నడుపుతోంది. కంపెనీ యజమానులు వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డికి దగ్గర బంధువులు కావడంతో వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన లావాదేవీలపై ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఇందులో భాగమే అనిపించక మానదు. పోనీ దానికి ముందు అరబిందో కి లీగల్ నోటీసులు ఇచ్చారా? లేదు. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేయడం, వెంటనే కేసు నమోదు కావడం సందేహాలకు తావిస్తోంది. కాకినాడ డీప్ పోర్టు లిమిటెడ్ లోని రూ.2500 కోట్ల విలువైన వాటాలను రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్ లోని రూ.1109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకే బలవంతంగా బదలాయించుకున్నారని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో నిజం ఏమాత్రం ఉన్నా చర్య తీసుకోవచ్చు కానీ ఆ వార్తను చూస్తే ఏదో కల్పిత గాథ చదువుతున్నట్లు అనిపిస్తుంది.ఎందుకంటే కేవీరావు చిన్న వ్యక్తేమీ కాదు.1997లోనే ప్రభుత్వ అధీనంలోని కాకినాడ పోర్టును అతి తక్కువ పెట్టుబడితో తన కంట్రోల్ కు తెచ్చుకున్న వ్యక్తి. చంద్రబాబు సన్నిహితుడు కావడం వల్లనే పోర్టు ఆయనకు చౌకగా దక్కిందని అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది కూడా. ఈ అంశంపై అసెంబ్లీలో చాలా రచ్చ జరిగింది. అంత ఫవర్ ఫుల్ వ్యక్తి, కేవలం ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి బెదిరిస్తే లొంగిపోతారా? అన్న అనుమానం రాకమానదు. పనిలో పని ఈనాడు మీడియా జగన్‌ను కుట్రదారుడిగా ప్రొజెక్టు చేయడానికి గట్టి ప్రయత్నమే చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆడిట్లో కాకినాడ సీ పోర్ట్ సంస్థ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965 కోట్ల నష్టం కలిగించిందని తేల్చిందట. అది తప్పుడు నివేదిక అని ఇప్పుడు కేవీ రావు అంటున్నారు. ఒకవేళ అది నిజమే అనుకుంటే, సంస్థ ఎండీగా ఆయనే ఉన్నారు కదా? మరో ఆడిటింగ్ సంస్థతో ఆడిట్ చేయించి ప్రభుత్వ వాదనను తప్పు అని రుజువు చేసి ఆ పత్రాలు తన వద్దకు ఎందుకు ఉంచుకోలేదో తెలియదు. లేదా ప్రభుత్వంపై దావా వేసే అవకాశం ఎందుకు వదులుకున్నారు? విక్రాంత్ రెడ్డి రమ్మనగానే హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లవలసిన అవసరం కేవీ రావుకు ఏమిటి? ఒప్పంద పత్రాలు సిద్దమవుతున్నప్పుడు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ వాటాలు అరబిందోకి అమ్ముతున్నట్లు తెలిసిందని ఆయన అన్నదానిలో నిజం ఉండే అవకాశం ఉందా? ఈ కంపెనీ మొత్తాన్ని నిజంగానే అరబిందో స్వాధీనం చేసుకోదలచుకుంటే 41.12 శాతం మాత్రమే ఎందుకు తీసుకుంటుంది? అన్నదానికి జవాబు రావల్సి ఉంది. అరబిందో కి ఇచ్చిన వాటాల విలువ రూ.494 కోట్లుగా లెక్కవేశారని, నిజానికి అది రూ.2500 కోట్ల పై మాటే అని, దానిపై నిరసన తెలిపానని ఆయన చెబుతున్నారు. అదే వాస్తవమైతే ఆ మేరకు నిరసన లేఖ కూడా ఉండాలి కదా!వాటాలు అమ్మకపోతే తనను, తన కుటుంబ సభ్యులను జైలులో పెడతామని బెదిరించారని, ఇతర వ్యాపారాలు నిలిపివేస్తామని భయపెట్టారని కేవీ రావు ఫిర్యాదులో తెలిపారు. కొన్ని వేల కోట్ల రూఏపాయల వ్యాపారానికి అధిపతి అయిన కేవీ రావును అంత తేలికగా భయపెట్టే పరిస్థితి ఉంటుందా? ఈ డీల్ అయ్యాక విక్రాంత్ రెడ్డి తదితరులు ఆయనను జగన్ వద్దకు తీసుకువెళ్లారట. అప్పుడు నిరసన చెప్పడానికి ప్రయత్నించినా జగన్ మాట్లాడనివ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇష్టం లేకపోతే డీల్ పూర్తి అయ్యాక జగన్ వద్దకు వెళ్లవలసిన అవసరం ఏమిటి? ఇదంతా జగన్ కోసమే జరుగుతోందని ఆయనకు అనిపించిందట. అంతే! ఐదేళ్ల తర్వాత ఫిర్యాదులో ఆ విషయం చెబుతున్నారు. నిజంగానే జగన్‌కు ఈ కంపెనీలో వాటా ఉంటే వేరే వారి పేరుతో ఎందుకు తీసుకుంటారు? గత అనుభవం చూస్తే జగన్ అలా చేయరన్న భావన కలుగుతుంది. సాక్షి మీడియా, పవర్ ప్రాజెక్టులు,సిమెంట్ కంపెనీ వంటివాటిని స్థాపించినప్పుడు ఆయన బినామీ పేర్లను వాడలేదు కదా? అలా వాడి ఉంటే అసలు కేసులే ఉండేవి కావు కదా! వాటాల బదిలీ తర్వాత ఆడిట్ నివేదికలో నష్టం రూ.తొమ్మిది కోట్లకు తగ్గించుకున్నారని అంటున్నారు. అందులో నిజం ఉంటే అప్పుడే ప్రొటెస్ట్ చెప్పాలి కదా. కాకినాడ సీపోర్టు లిమిటెడ్ యాజమాన్యం ఆయన చేతిలో ఉంటే, అలా ఎందుకు చేయలేదో అర్థం కాదు. విక్రాంత్ రెడ్డి వాటాలు బదిలీ చేయకపోతే ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇస్తుందని అన్నారట. ఈ మాటకే కేవీ రావు వణికి పోతారా? అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏమిటంటే వాటాలను ఎంతకు అమ్ముతున్నది, ఎంతకు కొంటున్నది ఒప్పందంలో లేదని, మర్చంట్ బ్యాంకర్లు నిర్ణయిస్తారని అంటే ఈయన ఎందుకు అంగీకరించింది తెలియదు. ఇలా కేవీ రావు ఫిర్యాదులో అనేక లొసుగులు కనిపిస్తాయి. ఈ వ్యవహారం అంతా చూస్తే పక్కా ప్లాన్ ప్రకారమే ఈ కథ నడిపిస్తున్టన్లు అనిపిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఇదే కేవీరావు, చంద్రబాబు నాయుడులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు మెప్పుకోసమో, మరెందుకోసమో గాని పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు వద్ద డ్రామా నడిపారు. రేషన్ బియ్యం అక్రమంగాఎగుమతి అవుతున్నాయంటూ యాంకరేజీ పోర్టు వద్ద గొడవ చేశారు. దీనికి, డీప్ సీ పోర్టుకు తేడా తెలియకుండా ఆరోపణలు చేశారు. తదుపరి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం పెట్టి అరబిందో సంస్థ చేతికి వెళ్లాకే పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. తీరా చూస్తే రేషన్ బియ్యం పట్టుబడింది ప్రభుత్వ అధీనంలోని యాంకరేజి పోర్టులో. ఆ తర్వాత రోజు కాకినాడ పోర్టు వాటాల మార్పిడిపై వివాదం ఉందంటూ, సీఐడీకి ఫిర్యాదు చేశారని ఎల్లో మీడియా కథనం. అరబిందో సంస్థను, విక్రాంత్ రెడ్డి తదితరులను టార్గెట్ చేస్తూ, అందులో జగన్‌ను ఇరికిస్తూ కేవీరావుతో ఫిర్యాదు ఇప్పించారు. నిజంగానే కేవీరావుకు వాటాల అమ్మకం ఇష్టం లేకపోతే అప్పుడే ప్రొటెస్ట్ చెప్పి ఉండవచ్చు. కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేసి ఉండవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేత గా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా దీనిని వివాదం చేసి ఉండవచ్చు. ఎల్లో మీడియా జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్న నేపధ్యంలో కేవీరావు 2020లోనే కనుక ఈ ఆరోపణలు చేసి ఉంటే ఆ మీడియా పండగ చేసుకునేదే కదా! ఎవరైనా తమ ఆస్తిని అమ్ముకుని, ఐదేళ్ల తర్వాత దాని విలువ పెరిగిందనో, మరో కారణంతోనో కేసులు పెట్టడం మొదలైతే పరిస్థితి ఏ దశకు వెళుతుందో అర్థం చేసుకోవచ్చు.దీనిపై అరంబిందో కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. కేవీరావు ఇవేవి తెలియని అమాయకుడని, నోట్లో వేలు పెడితే కొరకలేని భయస్తుడని చెబితే ఎవరైనా నమ్ముతారా? చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు వ్యవహారాలలో ప్రముఖ పారిశ్రామిక సంస్థలపై, పెట్టుబడిదారులపై కేసులు పెట్టుకుంటే వెళితే అది అత్యంత ప్రమాదకరం అవుతుంది. అంతేకాక ప్రత్యేకంగా రెడ్డి సామాజిక వర్గం వారిపై ఒక వైపు సోషల్ మీడియా కేసులు, మరో వైపు రెడ్డి పారిశ్రామికవేత్తలపై వేధింపులు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.ఇవన్ని చూస్తుంటే తమ రాజకీయాలకోసమో, కక్ష సాధింపుల కోసమో ఏపీలో ఆర్థిక విధ్వంసానికి చంద్రబాబు ప్రభుత్వం వెనుకాడడం లేదన్న అభిప్రాయం కలుగుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
AP: టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రారంభం
Teachers MLC Election Updates..పోలింగ్ ప్రారంభం.. ప్రారంభమైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్ఏలూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 2667..మొత్తం పోలింగ్ కేంద్రాలు 20..పశ్చిమ గోదావరి జిల్లాలోని 20 మండలాల్లో 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుజిల్లాలో మొత్తం ఓటర్లు..3,729పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.బ్యాలెట్ పద్ధతి ద్వారా జరుగుతున్న పోలింగ్👉గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు.👉ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల్లో 16,737 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 116 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్టు అధికారులు తెలిపారు. 👉ఇక, సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.👉ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. -
ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం: వైఎస్ జగన్
కేవలం ఆరు నెలల్లోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రజలు కోపంతో రగిలిపోతున్నారు. ఓ వైపు ఎక్కడ చూసినా అక్రమాలు, కమీషన్లు, మామూళ్ల గోల. పరిశ్రమ నడుపుకోవాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా కప్పం కట్టాల్సిందే. వేలం పాటలుపెట్టి ఊరూరా బెల్ట్ షాపులు కేటాయిస్తున్నారు. అన్నింటికీ నీకింత.. నాకింత అని పంచుకుంటున్నారు. ఎమ్మెల్యే మొదలు సీఎం వరకు వాటాలు. ఇంకో వైపు సంక్షేమ పథకాలన్నీ పడకేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోతోంది. భరోసా ఇచ్చే వారు లేక అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. విద్యుత్ చార్జీల షాక్‌లతో ప్రజలకు దిక్కుతోచడం లేదు. ఈ పరిస్థితిలో బాధిత వర్గ ప్రజల తరఫున నిలబడాల్సింది మనమే. వారి గొంతుకగా నిలిచి ఈ దుర్మార్గ ప్రభుత్వంపై పోరాడుదాం.– పార్టీ శ్రేణులతో వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: రాష్ట్రంలో సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కి.. అన్ని వర్గాలనూ దగా చేస్తున్న చంద్రబాబునాయుడి ప్రభుత్వంపై ఆరు నెలల్లోనే ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెల్లుబుకుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. కనీస మద్దతు ధర దక్కక రైతులు.. ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు.. కరెంటు ఛార్జీల బాదుడుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే దురాలోచనలతో అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి.. ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయడానికి కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. పార్టీని మరింతగా బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై నేతలకు మార్గ నిర్దేశం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఎప్పూడూ చూడని విధంగా విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేకత ఎక్కడా చూడలేదు. ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలు గాలికెగిరిపోయాయి. వాటిని పక్కన పెట్టి మిగిలినవి చూస్తే.. చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ప్రజల్లో కోపం కింద మారి ఎక్కడికక్కడ వారు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరోవైపు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరు గారిపోయాయి. నానాటికీ వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయి’ అని చెప్పారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదు ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే.. మన ప్రభుత్వ హయాంలో ప్రతి క్వార్టర్ (మూడు నెలలు) అయిపోయిన వెంటనే అంటే.. జనవరి, ఫిబ్రవరి, మార్చి ముగిసిన వెంటనే ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో విడుదల చేసే వాళ్లం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్‌లో ఇవ్వాల్సిన ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు సరి కదా.. ఏకంగా మూడు త్రైమాసికాల సొమ్ము పెండింగ్‌లో పెట్టారు. ⇒ ఈ డిసెంబర్ గడిస్తే నాలుగు క్వార్టర్లు ఇవ్వని పరిస్థితి. జనవరి వస్తే ఏకంగా రూ.2,800 కోట్లు విద్యా దీవెన బకాయిలు పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. వసతి దీవెనకు సంబంధించి రూ.1,100 కోట్లు పెండింగ్ ఉంది. మొత్తంగా రూ.3,900 కోట్లు పెండింగ్ పెట్టారు. మరో వైపు ఫీజులు కడితే తప్ప కాలేజీలకు రావొద్దని పిల్లలకు యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పిల్లలు చదువులు మానేసి పనులకు వెళ్తున్నారు.ఆరోగ్యశ్రీకి అనారోగ్యం ఆరోగ్య శ్రీ బకాయిలు కూడా అలాగే ఉన్నాయి. మార్చి నుంచి ఇంత వరకు నెట్వర్క్ ఆస్పత్రులకు సంబంధించిన బకాయిలు ఇవ్వలేదు. మార్చి నుంచి నవంబరు వరకు దాదాపు 9 నెలలకు సుమారు రూ.2,400 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులు గొడవ చేస్తే ఏదో రూ.200 కోట్లు ఇచ్చారు. పేషంట్లు ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్యశ్రీ పూర్తిగా నీరుగారిపోతోంది. ఇంకా 108, 104 ఉద్యోగులకు సంబంధించి నాలుగు నెలల జీతాలు పెండింగ్. వాళ్లు సర్వీసు అందించే పరిస్థితి లేదు. ధాన్యం సేకరణ.. మద్దతు ధర లేదు ⇒ ఏ జిల్లాలో కూడా రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) లభించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ చేసి, ఆర్బీకేల ఆధ్వర్యంలో కొనుగోలు చేసే వాళ్లం. ప్రతి రైతుకూ కనీస మద్దతు ధర వచ్చేది. ఇదొక్కటే కాకుండా జీఎల్టీ (గన్నీ బ్యాగ్స్, లేబర్, ట్రాన్స్పోర్ట్) ఛార్జీలు కూడా చెల్లించే వాళ్లం. జీఎల్టీ కింద ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు అదనంగా రూ.10 వేలు వచ్చే పరిస్థితి ఉండేది.⇒ ఇవాళ రైతులకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదు. 75 కేజీల బస్తా కనీస మద్దతు ధర రూ.1,725 అయితే ఆ ధర ఎక్కడా ఇవ్వడం లేదు. కావాలనే ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమం నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు దళారులు, రైస్ మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్లు రైతుల నుంచి రూ.300 నుంచి రూ.400 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం సేకరణ చాలా అన్యాయమైన పరిస్థితుల్లో జరుగుతోంది. మరోవైపు వర్షాలతో రైతులు పూర్తిగా దెబ్బతిని కుదేలవుతున్నారు. ధాన్యం రంగు మారుతోంది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు ⇒ కరెంటుకు సంబంధించి ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడు మొదలైంది. మరో రూ.9 వేల కోట్ల బాదుడు వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ స్థాయిలో రూ.15 వేల కోట్ల బాదుడు కార్యక్రమాన్ని భారతదేశ చరిత్రలో చంద్రబాబు తప్ప మరెవ్వరూ చేసి ఉండరు. ఆరు నెలల్లోనే ఎవరూ రోడ్డు మీదకు రాకూడని, ఎవరూ నిరసన వ్యక్తం చేయకూడదని తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు, ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు. ⇒ కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి, ఎవిడెన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ జరగలేదు. రాష్ట్రమంతా భయాందోళన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఆయన చేస్తున్న బాదుడు కార్యక్రమాన్ని నిరసిస్తూ ఎవరూ రోడ్డు మీదకు రాకూడదని ఇలా చేస్తున్నారు. ఎవరైనా ఆందోళన చేయాలనుకుంటే కేసులు పెడతారేమోనని భయపడే పరిస్థితులు కల్పిస్తూ పోలీసులను ఉపయోగించుకున్నారు. అవినీతి విచ్చలవిడిగా సాగుతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది.ఇసుక, మద్యం మాఫియా ⇒ అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకపోగా, మన ప్రభుత్వం కంటే డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. నీకింత.. నాకింత అని.. చంద్రబాబు, లోకేష్ మొదలు ఎమ్మెల్యేల వరకు పంచుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం నడిపిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు. దాని కోసం కిడ్నాప్లతో పాటు, పోలీసుల ద్వారా బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. లాటరీలో ఎవరికైనా షాపులు వస్తే వారి దగ్గర నుంచి బలవంతంగా రాయించుకున్నారు. పైగా గ్రామంలో వీళ్లే వేలం పాటలు పెట్టి బెల్ట్‌షాప్‌లు కేటాస్తున్నారు. ⇒ ఈ రోజు బెల్ట్‌షాప్‌లు లేని వీధి, గ్రామం లేదు. ఒక్కో బెల్ట్‌షాప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వేలం పాట పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో పరిశ్రమ నడుపుకోవాలన్నా, మైనింగ్ యాక్టివిటీ జరగాలన్నా, ఏది కావాలన్నా ఎమ్మెల్యేకు ఇంత.. కడితే తప్ప జరిగే పరిస్థితి లేదు. ప్రతి దానికీ కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే. రౌడీ మామూళ్ల కోసం కూడా గొడవలు జరుగుతున్నాయి. నెల్లూరులో ఏకంగా క్వార్ట్జ్ గనులు కొట్టేయడానికి పక్కా ప్లాన్ చేశారు. ప్రజల పక్షాన నిలబడదాం.. వారి గొంతుక వినిపిద్దాం ⇒ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో కోపం ఈరోజు తీవ్ర స్ధాయిలో కనిపిస్తోంది. మనం కూడా ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆ సమయం వచ్చింది. మామూలుగా ఏడాది వరకు వేచి చూసే పరిస్థితి నుంచి.. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తింది.⇒ కరెంటు ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర దక్కక పోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. మీ మీ నియోజకవర్గాల్లో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, సమన్వయకర్తలతో కలిసి వారిని ఇన్వాల్వ్ చేస్తూ, కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవసరం అయినప్పుడు మనం వారి తరఫున నిలబడాలి. వారి పక్షాన పోరాడాలి. అటువైపు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు మనం వారికి దగ్గరగా ఉంటూ వారి తరఫున పోరాటం చేయాలి. వారి తరఫున నిలబడాలి. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి ఇది కచ్చితంగా చేయాలి.సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనసంక్రాంతి తర్వాత నా జిల్లాల పర్యటన కార్యక్రమం మొదలవుతుంది. ప్రతి బుధ, గురువారాల్లో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశం అవుతాను. ‘జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో నేను పర్యటిస్తాను. నా పర్యటన వచ్చేసరికి మీరు జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీల నియామకాలు పూర్తి చేయాలి. ప్రతి కార్యకర్తకు ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ అకౌంట్ ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి కార్యకర్త ప్రశ్నించాలి. అప్పుడే గ్రామ స్థాయిలో తెలుస్తుంది. మా ఆస్పత్రులు ఎందుకు ఇలా ఉన్నాయి? మా స్కూళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి? మా ధాన్యాన్ని ఎందుకు కనీస మద్ధతు ధరకు అమ్ముకోలేకపోతున్నాం.. అని ప్రశ్నించాలి. రాబోయే రెండున్నరేళ్లు మనం, మన పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఆప్పుడే మనం చేయబోయే పోరాటాలకు మద్దతు బలంగా ఉంటుంది. ఇదంతా పక్కాగా జరగాలంటే జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న పార్టీ కమిటీల నియామకాలను త్వరితగతిన పూర్తి చేయాలి.మూడు ప్రధాన అంశాలపై కార్యాచరణప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మూడు ప్రధానమైన అంశాలు.. రైతుల ఇబ్బందులు, కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు, ఫీజులు కట్టలేని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.ఈ నెల 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల కార్యాలయాల వద్ద రైతులకు సంబంధించి ధాన్యం సేకరణలో జరుగుతున్న అన్యాయంపై నిలదీయాలి. ధాన్యం సేకరణలో వారికి కనీస మద్ధతు ధర కల్పించాలని డిమాండ్ చేయాలి. పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు రైతులకు అందుతున్న ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని కూడా డిమాండ్ చేయాలి. రైతులతో కలిసి ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలి.చంద్రబాబు ప్రభుత్వ కరెంటు ఛార్జీల బాదుడే బాదుడు కార్యక్రమానికి నిరసనగా డిసెంబర్ 27న ఆందోళన చేపట్టాలి. ఎన్నికలప్పుడు తాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని ఇచ్చిన హామీని విస్మరించిన నేపథ్యంలో పెంచిన కరెంటు ఛార్జీలు, జనవరిలో పెంచబోయే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రూ.6 వేల కోట్ల బాదుడుతో పాటు, రానున్న నెలలో మరో రూ.9 వేల కోట్ల ఛార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో ఎస్ఈ, సీఎండీ కార్యాలయాల వద్ద ప్రజల తరపున నిరసన తెలపాలి. ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి.. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించమని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేయాలి.జనవరి 3న అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆందోళన చేపట్టబోతున్నాం. పిల్లలకు అందించాల్సిన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన.. మొత్తంగా దాదాపు రూ.3,900 కోట్ల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేయాలి. ఇప్పటి వరకు ఏడాదిగా అంటే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫీజులు చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. చదువుకుంటున్న పిల్లలకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్లి, వినతిపత్రాలు సమర్పించి, డిమాండ్ చేయాలి.ఈ మూడు సమస్యలతో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండ్ చేద్దాం. -
నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో రసవత్తర పోరుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. శాసనమండలిలో ఖాళీ అవుతోన్న ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. మిగిలి ఉన్న రెండేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం కోసం ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గంధం నారాయణరావు, పులుగు దీపిక, డాక్టర్ నాగేశ్వరరావు కవల, నామన వెంకటలక్ష్మి(విల్ల లక్ష్మి), బొర్రా గోపి మూర్తి బరిలో నిలిచారు. వీరంతా స్వతంత్రంగానే పోటీలో నిలిచారు. వీరిలో ప్రధాన పోటీ గంధం నారాయణరావు, బొర్రా గోపి మూర్తి మధ్యనే ఉండేలా కనిపిస్తోంది. గంధం నారాయణరావు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఒక పర్యాయం పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి పోటీ పడుతున్నారు.ఈ శాసనమండలి ఎన్నికలకు నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. 18వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. గురువారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.పోటాపోటీగా ప్రచారం ఈ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి అభ్యర్థులంతా పోటాపోటీగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కలియ తిరుగుతూ ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకోవడంలో చివరి వరకు బిజీగానే ఉన్నారు. ఈ స్థానానికి గురువారం జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కాకినాడ జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో తరలి వెళ్లారు. రెండు డివిజన్ల పరిధిలో 21 మండలాలలో 22 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పురుష ఓటర్లు 1,970, మహిళా ఓటర్లు 1,448 మంది. మొత్తం 3,418 మంది ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నారు. జేఎన్టీయూ కాకినాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. జేఎన్టీయూకే రీడింగ్ రూమ్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్ నిర్వహిస్తారు, జేఎన్టీయూకేలోని రీడింగ్ హాలులో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎన్నికల రిటరి్నంగ్ అధికారిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, అసిస్టెంట్ రిటరి్నంగ్ అధికారులుగా డీఆర్ఓ జె.వెంకట్రావు, టి.సీతారామమూర్తి, వి.విశ్వేశ్వరరావు, వి.మదన్మోహన్, ఎం.వెంకటేశ్వర్లు వ్యవహరిస్తున్నారు. జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మొత్తం 22 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
ఆ ఎఫ్ఐఆర్ బాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ.. విజయసాయి ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కులవాది కేవీ రావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వెన్నుపోటుదారుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం. అబద్ధాలు చెప్పేందుకు కేవీ రావు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఎందుకు వేచి చూశారు?. నేను కాల్ చేశానని, బెదిరించానని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా?’’ అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.‘‘వాల్యుయేషన్ ఎప్పుడు చర్చలకు లోబడే ఉంటుంది?. నాకు ఆ రెండు సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థల భాగస్వాములెవరో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదు. కేవీ రావు చంద్రబాబు రాజకీయ తొత్తు. 1997లో ఏడిబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబు, కేవీ రావు ఇద్దరు కులవాదులే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.1/2: Who is this liar KV Rao? He is nobody, I haven't met him or seen him. He is a stooge propped up by TDP to file a false case against me. The FIR is a script of some masala Telugu Movie. I will go behind liar KV Rao for malicious prosecution and defamation.Further his money…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు..చంద్రబాబు నియంతృత్వ ధోరణితో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ భారత కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు తయారయ్యారు. చంద్రబాబు విధానాలకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల కార్యకర్తల జీవితాలను, స్వేచ్ఛను ప్రమాదంలో పెట్టారు. ఏపీ పోలీసులు వాగ్నర్ గ్రూప్ తరహాలో ప్రైవేటు సైన్యంలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఏపీ పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప టీడీపీ రాజ్యాంగం ప్రకారం కాదు...చంద్రబాబు ప్రభుత్వం అణిచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన చేస్తున్న రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సంబరాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు తమ జీవితాలను భయం భయంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా అణిచివేశారు. జీవించే హక్కును అధికార పార్టీ దయదాక్షిణ్యల పైన ఆధారపడేలా చేశారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.1/2 : The oppression by AP Govt. under @ncbn of thousands of people shows how scared he is. It shows his cowardice, his insecurity and his inferiority complex. Chandrababu is resorting to political vengence that even he cannot justify. He cannot look at himself in the mirror.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024 -
తాడిపత్రిలో టీడీపీ నేతల దౌర్జన్యం
సాక్షి, అనంతపురం జిల్లా: వైఎస్సార్సీపీ నేత జావేద్ ఇంటి వద్ద ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి అనుచరుడు వీరంగం సృష్టించాడు. డబ్బులు బాకీ ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత ఇంటి వద్ద అనుచరులతో దౌర్జన్యానికి దిగాడు. కుటుంబ సభ్యులను నిర్బంధించారని పోలీసులకు వైఎస్సార్సీపీ నేత జావేద్ ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి పేరుతో బెదిరింపులకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత గోరాకు ఎలాంటి బాకీ లేనని జావెద్ స్పష్టం చేశారు.హోంగార్డుపై టీడీపీ నేత దౌర్జన్యం శింగనమల మండలంలోని ఉల్లికల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేత రంగారెడ్డి తనపై దాడికి ప్రయత్నించాడంటూ శింగనమల పీఎస్‌లో పనిచేస్తున్న హోంగార్డు నాగేంద్ర మంగళవారం సీఐ కౌలుట్లయ్యకు ఫిర్యాదు చేశారు. వివరాలు... సెప్టెంబరులో ఒక రోజు రాత్రి నాయనపల్లి క్రాస్ నుంచి మరువకొమ్మ వరకూ హెడ్ కానిస్టేబుల్ గిరి మహేష్‌తో కలసి, హోంగార్డు నాగేంద్ర గస్తీ విధులు నిర్వర్తించాడు.ఆ సమయంలో టీడీపీ నేత ఉల్లికల్లు రంగారెడ్డికి చెందిన టిప్పరులో అక్రమంగా ఇసుక తరలిస్తుండడం గుర్తించి పోతురాజుకాలువ సమీపంలో అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. దీంతో అప్పటి నుంచి హోంగార్డు నాగేంద్ర ఎక్కడ కనిపించిన రంగారెడ్డి కోపంతో దుర్భాషలాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం నాయనవారిపల్లిలో జరిగిన శుభకార్యానికి ఎమ్మెల్యేలు బండారు శ్రావణి, ఎంఎస్ రాజు హాజరుకానుండడంతో ఎస్ఐ, ఎఎస్ఐ, హెడ్ కానిస్టేబులు, సిబ్బందితో ఎస్కార్ట్ విధుల్లో నాగేంద్ర కూడా పాల్గొన్నాడు. అక్కడ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో నాగేంద్రపై రంగారెడ్డి దాడికి ప్రయతి్నంచాడు. అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో నీ కథ చూస్తా అంటూ బెదిరిస్తూ వెళ్లిపోయాడు. టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
‘మరో కొత్త కుట్ర.. తెర ముందు కేవీరావు.. వెనుక చంద్రబాబు’
సాక్షి, తాడేపల్లి: రాజకీయ లబ్ధి కోసం కాకినాడ పోర్టు అంశాన్ని తెరపైకి తెచ్చారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ప్రజల దృష్టి మళ్లించడానికి కుట్రలు చేస్తూ.. పాత కేసులతో ప్రశ్నించేవారిని వేధిస్తున్నారని ధ్వజమెత్తారు.‘‘చంద్రబాబు రాష్ట్రంలో కొత్త కుట్రలకు తెరతీశారు. పాత కేసులను తిరగతోడి తమ ప్రత్యర్థులను ఇరికిస్తున్నారు. కొత్త కేసులు తయారు చేయటం అనే దుష్ట పన్నాగానికి చంద్రబాబు తెర తీశారు. కాకినాడ పోర్టు గురించి కేసులు పెట్టటం కూడా ఇందులో భాగమే. మొదట రేషన్ బియ్యం స్మగ్లింగ్ పేరుతో డ్రామా మొదలు పెట్టారు. తర్వాత పోర్టునే లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు వైఎస్సార్ కాకినాడ పోర్టును తెచ్చారు. దాన్ని చంద్రబాబు తన హయాంలో కేవి రావు అనే వ్యక్తికి కట్టబెట్టారు. ఇదే విషయాన్ని 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబుతో కలిశాక పవన్ మళ్లీ మాటలు మార్చారు’’ అని కాకాణి దుయ్యబట్టారు.లాభాల బాటలో ఉన్న పోర్టును అన్యాయంగా కేవీ రావుకి చంద్రబాబు కట్టబెట్టారు. పైకి కేవీరావు కనిపించినా తెర వెనుక చంద్రబాబే ఉన్నారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. ఇప్పుడు అదే కేవీ రావును అడ్డం పెట్టుకుని అరబిందో సంస్థపై తప్పుడు కేసులు వేస్తున్నారు. 51 శాతం షేర్ ఉన్న కేవీ రావు తనను బెదిరించి పోర్టును లాక్కున్నారని తప్పుడు ఫిర్యాదు చేశారు. నిజంగా బెదిరిస్తే మొత్తం పోర్టునే తీసుకునే వారు కదా?. అలా కాకుండా 49 శాతం షేర్లనే ఎందుకు తీసుకుంటారు?. కావాలనే అరబిందో సంస్థపై కేసులు పెట్టాలని ప్లాన్ చేశారు...ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే తామే ఇతరులపై కేసులు పెడతామనీ, ఇతరులు మాత్రం తమపై కేసులు పెట్టటానికే వీల్లేదని చట్టం కూడా తెచ్చేలాగ ఉన్నారు. హెరిటేజ్ సంస్థను ప్యూచర్ సంస్థ కొనుగోలు చేయటంపై కేసులు వేస్తే చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు?. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పరిశ్రమలను టార్గెట్ చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పరిశ్రమలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అరబిందో సంస్థ రెడ్లది కాబట్టే తప్పుడు కేసులతో వేధించాలని చూస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పారిశ్రామిక వేత్తలను బెదిరించటం సిగ్గుచేటు. ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో పారిశ్రామిక వేత్తలు ఎవరూ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉండదు’’ అని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప-2కు రాజకీయ సెగ!
ఏపీలో ఊహించిందే జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను.. పవన కల్యాణ్ అభిమానులు టార్గెట్ చేశారు. చాలాకాలంగా పుష్ప-2 సినిమాను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దానికి అల్లు అర్జున్ అభిమానులు అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు విడుదల ముందు.. ఈ వార్ తారాస్థాయికి చేరింది. ఏకంగా.. రాజకీయ మలుపులతో సినిమాను అడ్డుకుంటామనే స్థాయికి చేరింది. అల్లు అర్జున్ను టార్గెట్ చేసిన జనసేన నేతలు.. సినిమాను అడ్డుకుంటామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. పుష్ఫ-2 బెనిఫిట్ షో వేయడానికి వీల్లేదని గన్నవరం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించాడు. అలాకాని పక్షంలో.. గురువారం సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ‘‘అల్లు అర్జున్ అహంకారంతో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. మెగాఫ్యామిలీలో ఎవరిని టచ్ చేసినా ఊరుకోం. వాళ్ల సంగతి చూస్తాం’’ అంటూ రమేష్ బాబు వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు రంగంలోకి దిగారు. రమేష్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు రమేష్ ఓ వీడియో విడుదల చేశారు. అయితే ఈలోపే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సైతం అంతే ప్రతిఘటనకు దిగారు. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా జనసేన కవ్వింపు చర్యలకు దిగుతోంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను, పుష్ప 2 చిత్రాన్ని హేళన చేస్తూ ఎడిటింగ్ పోస్టర్లు, వీడియోలతో రెచ్చిపోతున్నారు. మరోవైపు.. పుష్ప 2 చిత్రానికి మద్దతుగా అభిమానులు భారీ కటౌట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంకోపక్క.. వైఎస్సార్సీపీ పేరిట పలుచోట్ల పోస్టర్లు వెలియడం గమనార్హం. అయితే.. వీటిని మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పుష్ప-2 పోస్టర్లను చించేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా చోట్ల ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. అనంతపురంలో జనసేన నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. గుత్తిలో కేపీఎస్ థియేటర్ వద్ద ఫ్లెక్సీలను చించేశారు. తిరుపతి పాకాలలో రామకృష్ణ థియేటర్ వద్ద ఫ్లెక్సీ వివాదం రేగింది. చూడాలి.. రేపు ఇది ఇంకా ఎటు పోతుందో!.ఇక.. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్.. స్నేహధర్మంతో నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పకు మద్దతుగా నిలిచారు. ఇది మెగా ఫ్యామిలీలో కొందరికి సహించలేదని.. ఫలితంగానే మెగా అభిమానులకు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యారన్నది ఓపెన్ సీక్రెట్. -
మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘సీజ్ ది షిప్’ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మల్టీ డిస్ ప్లయినరీ కమిటీతో స్టెల్లా ఎల్ వన్ నౌకలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో తమ అనుకూల మీడియాకు మాత్రమే కూటమి సర్కార్ అనుమతిస్తోంది.పోర్ట్ అథారిటీ అధికారంతో స్టెల్లా నౌకను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే అంతర్జాతీయ షిప్‌ను సీజ్ చేసే విషయంలో అధికారులు తర్జనభజర్జన పడుతున్నారు. ఐదు రోజుల క్రిందట "సీజ్ ద షిప్" అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రామాకు తెరతీసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సముద్రంలో ఉన్న కెన్ స్టార్ నౌకను పరిశీలించకుండా పవన్ వచ్చేశారు.ఇదీ చదవండి: డైవర్షన్ క్లాప్.. ఫ్లాప్ బాబు స్క్రిప్ట్ బోల్తాతమ వియ్యంకుడు బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తారంటూ పట్టాభి అగ్రో ఫుడ్ అధినేత కే.వి.కృష్ణారావు గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల చెప్పుకొచ్చారు. తాజాగా కాకినాడ పోర్టు నుండి పట్టాభి అగ్రో ఫుడ్ చెందిన రా రైస్ (పచ్చి బియ్యం) విదేశాలకు ఎగుమతి అవుతోంది. "బిరస్ బుల్లోగ్" ప్యాకింగ్‌తో పచ్చి బియ్యాన్ని ఎంవీడీడీఎస్ మరీనా నౌకలోకి ఎగుమతి చేస్తున్నారు. ఇండోనేషియాకు 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని పట్టాభి అగ్రో ఫుడ్ సంస్థ ఎగుమతి చేస్తోంది.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
YS Jagan: ప్రజల కోసం వైఎస్సార్సీపీ పోరుబాట
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీపరంగా పోరుబాటకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు ఇచ్చారు. కీలక అంశాలైన రైతుల సమస్యలు, కరెంటు ఛార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌పై పోరుబాట కార్యాచరణను ప్రకటించారాయన.బుధవారం తాడేపల్లిలోని తన కార్యాయలంలో.. జిల్లా పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రదాన కార్యదర్శులు, రీజినల్ కోఆర్డినేటర్ల జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్యాచరణ వివరాలను ప్రకటించారాయన.డిసెంబర్ 11వ తేదీన.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం సమర్పణబాబు సర్కార్‌కు డిమాండ్లురూ.20 వేల పెట్టుబడి సహాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల భీమా పునరుద్ధరణడిసెంబర్ 27వ తేదీన.. పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమంబాబు సర్కార్‌కు డిమాండ్లుకరెంటు ఛార్జీల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలిజనవరి 3వ తేదీన.. ఫీజు రీయంబర్స్మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం.బాబు సర్కార్‌కు డిమాండ్లుఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి వసతిదీవెన బకాయిలు తక్షణమే ఇవ్వాలి ఇదీ చదవండి: ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చారు- వైఎస్ జగన్ -
విద్య విషయంలో ప్రభుత్వం క్షమించరాని తప్పు చేస్తోంది: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటిని కమ్ముకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆరు నెలలు పూర్తి కావస్తోన్నా ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నారు.ఈ మేరకు బుధవారం వైఎస్సార్ జిల్లాలో మాట్లాడుతూ.. ‘సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యం చేసింది. జగన్ ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. అయిదు సంవత్సరాలు కుంటు లేకుండా అమ్మబడి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారు. వైఎస్ జగన్ హయాంలోని ‘నాడు-నేడు’ చాలా గొప్ప పథకం. రాష్ట్ర ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ప్రశంసించారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే ఎత్తేశారు. 8వ తరగతి వారికి ఇచ్చే ట్యాబ్‌ల పథకం అటకెక్కింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం విద్యార్థులకు శాపం లా మారింది.’ అని మండిపడ్డారు.