breaking news
-
విద్య విషయంలో ప్రభుత్వం క్షమించరాని తప్పు చేస్తోంది: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ చీకటిని కమ్ముకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆరు నెలలు పూర్తి కావస్తోన్నా ఎలాంటి హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రభుత్వం చేసిన తప్పులు చాలా ఉన్నాయన్నారు.ఈ మేరకు బుధవారం వైఎస్సార్ జిల్లాలో మాట్లాడుతూ.. ‘సమాజానికి అత్యంత అవసరమైన విద్య విషయంలో ప్రభుత్వం క్షమించడానికి వీలులేనంత తప్పు చేస్తోంది. అక్షరాభ్యాసం పెంచాలని గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంత ప్రయత్నం చేశాడో.. ఈ ఆరు నెలలకాలంలోనే కూటమి ప్రభుత్వం అంత నిర్లక్ష్యం చేసింది. జగన్ ప్రభుత్వంలో విద్యా విధానానికి స్వర్ణ యుగమని చెప్పవచ్చు. అయిదు సంవత్సరాలు కుంటు లేకుండా అమ్మబడి ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మబడి ఇస్తానని చెప్పారు. ఈ సంవత్సరం అమ్మఒడి ఇవ్వకుండా ఎత్తేశారు. వైఎస్ జగన్ హయాంలోని ‘నాడు-నేడు’ చాలా గొప్ప పథకం. రాష్ట్ర ఎల్లలు దాటి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యా విధానాన్ని ప్రశంసించారు. ఇప్పుడు నాడు నేడు అనే స్కీమే ఎత్తేశారు. 8వ తరగతి వారికి ఇచ్చే ట్యాబ్‌ల పథకం అటకెక్కింది. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయడం విద్యార్థులకు శాపం లా మారింది.’ అని మండిపడ్డారు. -
‘కూటమి సర్కార్ లిమిట్స్ దాటిపోయింది.. మనం ఏపీలోనే ఉన్నామా?’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లో చిత్ర హింసలు పెడుతోంది. అసలు మనం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నామా? లేదా? అని ప్రశ్నించారు.అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మీడియాతో మాట్లాడుతూ.. దళిత యువకుడిపై అక్రమ కేసు బనాయించి హింసించారు. వర్షాలతో రాజమండ్రి రోడ్లు మునిగిపోతే ప్రశ్నించకూడదా?. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రోద్బలంతోనే హింసించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. బాజీలాల్ అనే సీఐ దళిత యువకుడిని దారుణంగా కొట్టారు. దుస్తులు ఊడతీయించి మహిళా కానిస్టేబుల్ ఎదుట కూర్చోపెట్టారు. పరువు పోయిందని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.అక్రమ కేసులపై బాధితుడు పులి సాగర్ మాట్లాడుతూ.. వర్షానికి కాలనీలో నీళ్లు నిలిచిపోతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టాను. అనంతరం, పోలీసులు స్టేషన్‌కు పిలిచి పచ్చి బూతులు తిట్టారు. చంపేస్తామని బెదిరించి పోలీసు స్టేషన్లో బట్టలూడదీశారు. పీక కోసి రైలుపట్టాలపై పడేస్తానని ప్రకాష్‌నగర్ సీఐ బెదిరించారు. గోదావరిలో పడేస్తామని సీఐ దూషించారు. కానిస్టేబుల్‌తో దుస్తులు ఊడతీయించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దుస్తుల్లేకుండా లాకప్‌లో కూర్చోపెట్టారు. మహిళా పోలీసుల ఎదుట నా పరువు తీశారు. విద్యావంతుడినైనా నన్ను ఇంత చిత్రహింసలకు గురి చేయటం ఎందుకు?. నాకు ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్చ లేదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. దళితులు అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చులకన భావమే. చంద్రబాబు దళిత వ్యతిరేకి. సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే తప్పేంటి?. సాగర్‌ను బండబూతులు తిట్టి, బట్టలు విప్పిన సీఐపై చర్యలు తీసుకోవాలి. పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది?. కూటమి పాలనలో కులం పేరుతో దూషణలు, దళిత వ్యతిరేక భావనలు ఉన్నాయి. కూటమి సర్కార్ పూర్తిగా లిమిట్స్ దాటిపోయింది. బాధితుడు సాగర్‌కు జరిగిన అన్యాయంపై పోరాడుతామని చెప్పారు. రైలు కింద అతని తలకాయ పెడతానని బెదిరించారు. తాడు కట్టి గోదావరిలో వేస్తామనటం ఏంటి?. సీఐ బాజీలాల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. దళితులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయంపై స్పందించాలి. పెద్ద ఎత్తు ఉద్యమం చేస్తాం. దళిత అధికారులపై కూడా కక్ష కట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్న తప్పులను ప్రశ్నిస్తే కూడా కేసులు పెడతారా?. దళితుల గొంతు మీద కాలు పెట్టి తొక్కుతున్నారు. దళిత అధికారులు, దళిత మహిళలపై దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో దళితులకు బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. పులి సాగర్ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. -
తీరుతెన్నూ లేని చందంగా ఏపీ!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం, పోలీసులు ఎంత ఘోరంగా పని చేస్తున్నారో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదేమో! మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై పెట్టిన దుర్మార్గపు కేసు ఒక ఉదాహరణైతే, ప్రముఖ సినీ దర్శకుడు వర్మకు సంబంధించి పోలీసులు ప్రవర్తించిన తీరు మరొకటి. ఇంకోపక్క తెలుగుదేశం సోషల్ మీడియా సీనియర్ ఐఎఎస్ అధికారులను కూడా వదలకుండా ఇష్టారీతిలో బురదవేసి అవమానిస్తున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. చిత్తూరు జిల్లాలో ఎర్రావారిపాలెం అనే గ్రామం వద్ద ఒక బాలిక పై అఘాయిత్యం జరిగింది.ఆ బాలిక తండ్రి ఈ విషయాన్ని ఫోన్ ద్వారా చెవిరెడ్డికి వివరిస్తే, ఆయన ఆ కుటుంబానికి సాయపడడానికి ఆ గ్రామానికి వెళ్లారు.ఆ క్రమంలో ఆ బాలిక తండ్రి రమణను పరామర్శించి బాలికకు ధైర్యం చెప్పారు. వారిని ఆస్పత్రికి తరలించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఉదంతం ఏలికలకు కోపం తెప్పించింది. ఎలాగైనా చెవిరెడ్డిపై కేసు పెట్టాలని పోలీసులు భావించినట్లు ఉన్నారు. ఇలాంటి కేసులలో బాలికల ఐడెంటిటిని ఎవరూ బయటపెట్టకూడదు. చెవిరెడ్డి కూడా ఆ జాగ్రత్తలు తీసుకుంటూనే మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏమైందో కాని ఘటన జరిగిన కొద్ది రోజులకు చెవిరెడ్డిపై పోక్సో కేసుతోపాటు మరికొన్ని పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం లాయర్ కూడా అయిన చెవిరెడ్డి వంతైంది. బాలిక తండ్రిని బెదిరించి ఫిర్యాదు తీసుకున్నారా అన్న అనుమానం అప్పట్లో వచ్చింది.చెవిరెడ్డి ఈ కేసును ఎదుర్కోవడానికి సిద్ధపడి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధిత తండ్రి మీడియా సమావేశం పెట్టి తానసలు చెవిరెడ్డిపై కేసు పెట్టలేదని, తమకు సాయపడడానికి వచ్చిన వారిపై కేసు ఎలా పెడతామని ప్రశ్నించారు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డిని పిలిచామని ఆయన చెప్పారు. తాను చదువుకోలేదని, పోలీసులు సంతకం చేయమంటే చేశానని ,దానిని వాడుకుని చెవిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన స్పష్టం చేశారు. దీనిపై పోలీసులు స్పందించలేకపోయారు. ఇది కేవలం చిత్తూరు పోలీసులకే కాదు..రాష్ట్ర పోలీసు శాఖకు కూడా అప్రతిష్ట తెచ్చిందని చెప్పాలి. రాష్ట్రంలో వైసిపివారిపై జరుగుతున్న దాడులు, హింసాకాండకు సంబంధించి పలు ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఇష్టారీతిన కేసులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా, అసభ్య పోస్టులు ప్రచారం చేసినా పోలీసులు వారి జోలికి వెళ్లడం లేదు. వీటికి తోడు ఇప్పుడు వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న తీరు ఎపిలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూనీ అవుతుందో చెప్పడానికి నిదర్శనంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ బాలికను పరామర్శించడానికి చంద్రబాబు అక్కడకు వెళ్లారు. బాధిత కుటుంబం పిలవకపోయినా ఆయన వెళ్లారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న వాసిరెడ్డి పద్మ ఆనాడు ఎంత వారించినా వినలేదు. చంద్రబాబు వెళ్లి పరామర్శ చేస్తే రైటు, చెవిరెడ్డి వెళితే తప్పా అన్నదానికి బదులు దొరకదు. అప్పట్లో చంద్రబాబు పై వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కేసు పెట్టలేదు. మహిళా కమిషన్ చంద్రబాబుకు నోటీసు పంపించినా, ఆయన పట్టించుకోలేదు. చెవిరెడ్డి విషయంలో మాత్రం తప్పుడు ఫిర్యాదు తీసుకుని మరీ దారుణమైన చట్టాన్ని ప్రయోగించారు. పోక్సో కేసు అంటే మైనర్లపై అత్యాచారం వంటి నేరాలకు పాల్పడ్డ వారి మీద పెట్టే కేసు అన్నమాట. చెవిరెడ్డిపై అలాంటి కేసు పెట్టడం పోలీసులు ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తున్నారో చెప్పకనే చెబుతోంది. ప్రమఖ దర్శకుడు వర్మపై టీడీపీ వారితో సోషల్ మీడియా కేసులు పెట్టించి, ఆయనను అరెస్టు చేయడానికి జరిగిన ప్రయత్నాలు శోచనీయం. ఆయన ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారు.ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలు కూడా సంధించారు. తాను ఎప్పుడో పెట్టిన పోస్టింగ్‌లకు తాను ఎవరిపైన కార్టూన్లు పోస్టు చేశానో వారికి కాకుండా ఇంతకాలం తర్వాత ఎవరివో మనో భావాలు దెబ్బతినడం ఏమిటని ఆయన అడిగారు. తొమ్మిది మందికి ఏడాది తర్వాత ఒకేసారి మనోభావాలు దెబ్బ తిన్నాయా అని అన్నారు. తాను పారిపోయినట్లు ఎల్లో మీడియా చేసిన ప్రచారంలో వాస్తవం లేదని, తన ఆఫీస్‌లోకి పోలీసులు రాకుండానే వెళ్లిపోయారని ఆయన చెప్పారు. ఇలాంటి పోస్టింగులు లక్షల కొద్ది వస్తున్నాయని, వాటి సంగతేమిటని ఆయన ప్రశ్నించారు. చట్టంలో దీనికి సంబంధించి ఉన్న అంశాలకు, తనపై పెట్టిన సెక్షన్లలకు లింకు కనిపించడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏ ఏ సందర్భాలలో సోషల్ మీడియా కేసులు పెట్టవచ్చో కూడా వివరించారు. ఆయన వేసిన ప్రశ్నలకు పోలీసుల నుంచి జవాబు వచ్చినట్లు లేదు. నిజానికి వర్మ తరహాలో అనేక మంది పోస్టులు పెడుతుంటారు. ఆ మాటకు వస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఈనాడు వంటి ఎల్లో మీడియా ఎంత నీచమైన కార్టూన్లు వేసిందో గుర్తు చేసుకుంటేనే భయానకంగా ఉంటుందని, వాటిపై ఎన్నడూ కేసులు పెట్టకపోవడం తప్పు అయినట్లుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకప్పుడు ఎన్.టి.రామారావుకు దుస్తులు లేకుండా వేసిన కార్టూన్లను వారు ప్రస్తావిస్తున్నారు. ఎవరైనా బూతులు పెడితే చర్య తీసుకోవచ్చు. అలాగే కుల, మతాల మధ్య విద్వేషాలు నింపేలా వ్యవహరిస్తే కేసు పెట్టవచ్చు. విచిత్రం ఏమిటంటే రోజుల తరబడి ఎల్లో మీడియా టివి ఛానళ్లలో కూర్చుని కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తిపై అప్పటి ప్రభుత్వం కేసు పెడితే దానిని వేరే విధంగా డైవర్ట్ చేశారు. పైగా ఆయనకు మంచి పదవిని కూడా చంద్రబాబు ఇచ్చారు. తాజాగా ఐటీడీపీకి చెందిన విజయ్ సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుపై పెట్టిన పోస్టింగ్ మాటేమిటి? కృష్ణబాబుకు ఏ ప్రభుత్వం ఉన్నా మంచి పేరు ఉంది.ఇప్పటికి ప్రధాన శాఖలలోనే పని చేస్తున్నారు. కానీ ఆయనపై నిందలు మోపుతూ, వైసీపీ కోసమే పనిచేస్తున్నారని, పులివెందులకు చెందిన ఒక కంపెనీకి బిల్లులు చెల్లించారని ఆరోపిస్తూ పోస్టు పెట్టారు. దీనిపై కృష్ణబాబు ఆవేదన చెందిన ముఖ్యమంత్రికి పిర్యాదు చేశారట. అసలు తాను కొత్త ప్రభుత్వం వచ్చాక ఎవరికి బిల్లులు చెల్లించ లేదని ఆయన చెబుతున్నారు. అయినా చట్టప్రకారం బిల్లులు ఒక అధికారి చెల్లిస్తే అది ఎలా తప్పు అవుతుంది? విజయ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుమారుడు. అయ్యన్న కూడా విపక్షంలో ఉండగా, ఆ తర్వాత కూడా కొందరు అధికారులను తూలనాడుతూ మాట్లాడిన వీడియోలు వచ్చాయి. ఆయన మహిళ అధికారులను కూడా దూషించినట్లు వార్తలు వచ్చాయి. మరో వైపు వైసీపీ సోషల్ మీడియాకు చెందిన కార్యకర్తలు కొందరిపై అనేక కేసులు పెట్టి ఊరూరా తిప్పుతూ దారుణంగా వేధిస్తున్నారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదలివేసిన చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘనత ఇదే అనుకోవాలి.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్..
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పదును పెడుతున్నారు. ఓవైపు ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మరోవైపు యథేచ్ఛగా దోపిడీకి తెర తీసిన ప్రభుత్వ పెద్దలు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుతంత్రాలు పన్నుతున్నారు. అందులో తాజా అంకమే ‘కాకినాడ పోర్ట్ వద్ద బియ్యం రాద్ధాంతం’! చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో తన కోవర్టు, మంత్రి నాదెండ్లను ముందుపెట్టి పక్కా పన్నాగంతో సాగించిన డైవర్షన్ రాజకీయ కుట్ర ఇది. మోకాలికి, బోడుగుండుకూ ముడిపెడుతూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం కూటమి పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంతో సాగిన ఈ హైడ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్ట్ నుంచే ఎగుమతి కాకినాడ సీవాటర్ పోర్ట్‌పై నిరాధార ఆరోపణలతో డ్రామా రేషన్‌బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాకినాడ హైడ్రామా ఎపిసోడ్ తేల్చి చెబుతోంది. ఎందుకంటే.. కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్ వేరు... కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ పోర్ట్ నుంచే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఆ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీయాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తమను తాము నిలదీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రం కాకినాడ సీ పోర్ట్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కన్షార్షియాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అదికూడా కేవలం 41 శాతం వాటా మాత్రమే ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ అరబిందో సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం మరో విచిత్రం. సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి లోడింగ్ దేశంలో అన్ని పోర్టుల నుంచి బియ్యం సహా వివిధ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. షిప్పుల్లోకి లోడింగ్ చేసేముందు సమగ్రంగా తనిఖీలు చేసే వ్యవస్థ ఉంది. కేంద్రానికి చెందిన కస్టమ్స్, పోర్ట్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. అందుకోసం నిర్దిష్ట కస్టమ్స్ ప్రోటోకాల్ ఉంది. ఎగుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు ఎగుమతి చేసే సరుకును కూడా పరీక్షిస్తారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించిన తరువాతే ఎగుమతి కోసం షిప్పుల్లోకి లోడ్ చేసేందుకు అనుమతిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసేందుకు యత్నిస్తే వారు ముందుగానే పోర్టుల వద్దే నిలిపివేస్తారు కదా! అటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని వ్యవస్థలు చంద్రబాబు చేతిలోనే..రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్ పోస్టులు... అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోర్టుల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కదా! మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదీ... టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదీ అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పారీ్టకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను... తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును...! ఇంకా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి నేతలే రేషన్ మాఫియా లీడర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీస్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నించారు. పౌరసరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతోందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌నే! ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కుట్రే హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ధాన్యం కొనుగోలులో వైఫల్యంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారానే ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ–క్రాప్ అమలు చేయడం లేదు. మరోవైపు మిల్లర్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీ కమీషన్ల డీల్ కుదుర్చుకుంది. మిల్లర్లకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అనంతరమే మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారని మిల్లర్లే చెబుతున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ‘బియ్యం’ డ్రామను మొదలెట్టారు.మద్యం.. ఇసుకలో దోపిడీ ఇతరులెవరూ మద్యం టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి అడ్డుకుని మరీ టీడీపీ పెద్దలు దోపిడీకి రాచబాట పరిచారు. వేలం పాటలు నిర్వహిస్తూ మరీ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ పెద్దలు ఇసుక రీచ్‌లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెగించారు. ఓ వైపు ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పోతోంది. మరోవైపు ఇసుక రేట్లు భారీగా పెంచేసి సాగిస్తున్న దోపిడీతో టీడీపీ కూటమి పెద్దల సొంత ఖజానా నిండుతోంది. వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అసలు వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించి వారిని రోడ్డున పడేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో నీటినిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలన్న నిర్ణయంతో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహానికి పాల్పడ్డాయి. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడలో సాగించిన రాజకీయ డ్రామా అందులో భాగమేనన్నది తేటతెల్లమవుతోంది. పయ్యావుల కేశవ్ వియ్యంకుడి సంస్థ బియ్యం తరలిస్తున్న షిప్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్ద లంగరు వేసి ఉన్న స్టెల్లా షిప్ వద్ద హైడ్రామా చేసిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్... ఆ సమీపంలోనే లంగరు వేసి ఉన్న ఎంవీ కెన్స్టర్ అనే షిప్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన సంస్థ ఆ షిప్ ద్వారానే బియ్యాన్ని నైజీరియాకు ఎగుమతి చేస్తోంది. ఆయనకు చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఆ షిప్‌ను మాత్రం పవన్ కళ్యాణ్, నాదెండ్ల తనిఖీ చేయలేదు. కేవీ రావు సంస్థ చేతిలోనే కాకినాడ పోర్ట్ యాజమాన్యంఅరబిందో బెదిరించి ఉంటే ఏకంగా 51శాతం వాటా తీసుకునేవారు కదాబెదిరిస్తే ఫ్రీగానే వాటాలు తీసుకునేవారు కదాకాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో వాటాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ప్రైవ్రేటు వ్యవహారం. పోర్ట్ ప్రమోటర్ కేవీ రావు నుంచి 41శాతం వాటాను మాత్రమే అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. మిగిలిన 59 శాతం వాటా కేవీ రావు సంస్థ వద్దే ఉన్నాయి. అంటే కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్‌పై యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలోనే ఉన్నాయి. పోర్ట్ వ్యవహరాల్లో నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉంది. పోర్ట్ ఎండీగా కేవీ రావే ఉండగా... సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. అలాంటిది అరబిందో సంస్థ బెదిరించి పోర్ట్‌లో వాటాలు కొనుగోలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అసత్య ఆరోపణలు చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంతగా బెదిరించి వాటాలు కొనుగోలు చేసి ఉంటే... డబ్బులు ఇచ్చి ఎందుకు వాటాలు కొంటారు..? ఫ్రీగానే తీసేసుకునేవారు కదా. కనీసం మెజార్టీ వాటాలు అంటే 51శాతం వాటాను దక్కించుకునేవారు కూడా. దాంతో పోర్ట్ వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అరబిందో సంస్థకే దక్కేది. అంతేగానీ పోర్టుపై నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకు ఎందుకు విడిచిపెడతారు...! కానీ అరబిందో సంస్థ 41శాతం వాటానే కొనుగోలు చేసి పోర్టులో మైనార్టీ పార్టనర్‌గానే ఉంది. మిగిలిన 59శాతం వాటా కలిగిన కేవీ రావు సంస్థే పోర్ట్‌పై నిర్ణయాధికారాన్ని అట్టిపెట్టుకుంది. వాస్తవాలు ఇవీ...కానీ వాటిని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు లావాదేవీల్లో చంద్రబాబు ప్రభుత్వ జోక్యం ఎందుకో...! కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో నిర్వర్తించాల్సి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి... కానీ వాటిని విస్మరించి రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతుకుముందు ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ? ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి గతంలో తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే అసలు కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసిందే గతంలో చంద్రబాబు ప్రభుత్వమేననే వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీలపరం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ప్రభుత్వ పోర్టులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గతంలో ధారాదత్తం చేసిన... ప్రస్తుతం మరో మూడు పోర్టులను కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు అసలు కుంభకోణానికి పాల్పడినట్టు అవుతుంది కదా..! నిలదీయాల్సింది చంద్రబాబునే కదా...! -
కోనసీమలో ‘కోడ్’ ఉల్లంఘన
సాక్షి, అంబేద్కర్ జిల్లా: కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోంది. సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు కొనసాగుతున్నా.. ఎక్సైజ్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 5వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ వైన్ షాపులు యథేచ్ఛగా వైన్ షాపులు కొనసాగుతున్నాయి. -
‘కూటమి సర్కార్ కుట్ర.. విద్యుత్ కనెక్షన్ కట్’
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల జీవితాల్లో చీకట్లు అలుముకుంటున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రభుత్వమే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలోని ఇళ్లలో నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్ వాడినా బిల్లులు చెల్లించాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఫ్రీ వపర్దళిత, గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపాలనే మంచి ఉద్దేశంతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నెలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే.. అంటే 2019, జూలై 25న, జీఓ జారీ చేశారు. ఆ విద్యుత్ సబ్సిడీ మొత్తం ప్రభుత్వం భరిస్తుందని అందులో ప్రకటించారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు రూ.2,362 కోట్లు, 4,57,686 గిరిజన కుటుంబాలకు రూ.483 కోట్ల మేర ప్రయోజనం కల్పించారు. అంటే మొత్తంగా 19,86,603 కుటుంబాలకు రూ.2846 కోట్ల విలువైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేశారు.ఉచిత విద్యుత్‌కు చంద్రబాబు సర్కార్ మంగళం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారన్న కక్షతో, కూటమి ప్రభుత్వం ఒక హేయమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం మంగళం పాడింది. నెలకు 100 యూనిట్ల లోపు విద్యుత్ వాడినా సరే, బిల్లులు జారీ చేస్తోంది. బకాయిలు కూడా కట్టాలంటూ, వేలకు వేల బిల్లులు ఇస్తూ, కట్టకపోతే, నిర్దాక్షిణ్యంగా కనెక్షన్లు కట్ చేస్తున్నారు. మీటర్లు తొలగిస్తున్నారు. స్పష్టమైన ఉత్తర్వులు (జీఓ) జారీ చేయకుండా చీకటి ఆదేశాలతో విద్యుత్ సిబ్బందిని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు పంపి, అర్థరాత్రి సమయంలో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు. ప్రశ్నించిన దళిత, గిరిజన కుటుంబాలను, మహిళలను విద్యుత్ అధికారులు మాటల్లో చెప్పలేని విధంగా దూషిస్తూ, హేళన చేస్తూ దౌర్జన్యకాండ ప్రదర్శించారు.ప్రభుత్వ దమనకాండకు ఉదాహరణలుఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని రెడ్డిగణపవరంలో కొల్లి విమల అనే గృహిణి ఇంటికి రూ.22 వేల బిల్లు ఇచ్చి, అది కట్టలేదంటూ కనెక్షన్ తొలగించారు. అదే గ్రామంలో మరొకరికి రూ.40 వేల బిల్లు ఇచ్చి చెల్లించాలని, ఈనెల మరో రూ.20 వేల బిల్లు కూడా ఇచ్చి దానిని కూడా కలిపి కట్టాలని చెప్పి కనెక్షన్ కట్ చేశారు. రాఘవాపురంలో ప్రతి ఇంటికి దాదాపు రూ.30 వేల వరకు విద్యుత్ బిల్లుల బకాయిలు చూపుతూ కనెక్షన్లు తొలగించారు.అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రూ.35 వేల బిల్లు చెల్లించాలంటూ ఓ దళిత కుటుంబాన్ని చీకటిమయం చేశారు. తూర్పు గోదావరి జిల్లా ఎ.మల్లవరంలో అర్థరాత్రి ఎస్సీ కాలనీలోకి విద్యుత్ అధికారులు చెప్పాపెట్టకుండా వెళ్ళి కూటమి పార్టీలకు మీరు ఓట్లు వేయలేదు, మీకు ఉచిత విద్యుత్ ఎలా ఇస్తామంటూ వారి కనెక్షన్లు బలవంతంగా తొలగించారు. దీనిపై ప్రశ్నించిన దళిత మహిళలపై దుర్భాషలాడారు. అర్థరాత్రి మొత్తం గ్రామాన్ని చీకట్లో కూర్చోబెట్టారు. విద్యుత్ బిల్లు చెల్లిస్తాం కనీసం రెండు రోజులు గడువు ఇవ్వాలని వారు వేడుకున్నా కూడా పట్టించుకోలేదు.ఎస్సీ ఎస్టీలు కళ్ళు తెరిస్తే ఈ ప్రభుత్వం భస్మం అవుతుందిఎస్సీ, ఎస్టీలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలపై దారుణం. ఒకవేళ వారు కళ్లు తెరిస్తే ఈ ప్రభుత్వం భస్మం అవుతుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే దాన్ని ఈ పాలకులు తట్టుకోలేరు. ఏ ఉత్తర్వులు ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్నారు? మీ వద్ద దానికి సంబంధించిన లిఖిత ఆదేశాలు ఉన్నాయా? ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వడం ఇష్టం లేకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓను రద్దు చేస్తున్నామని, అసెంబ్లీలో బిల్లు పెట్టి మీరు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. కానీ దొంగదారిలో దళిత, గిరిజన కాలనీలపై కక్ష సాధింపులకు పాల్పడటం ఏ మాత్రం తగదని జూపూడి ప్రభాకర్‌రావు తేల్చి చెప్పారు. -
లోక్‌సభలో టీడీపీ బండారం బయటపెట్టిన మిథున్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో సోలార్ పవర్ విషయంలో వైఎస్సార్సీపీపై గత కొన్నాళ్లుగా టీడీపీ, దాని అనుకూల మీడియా అడ్డగోలు ప్రచారానికి దిగాయి. ప్రముఖ వ్యాపారవేత్త అదానీపై అమెరికాలో నమోదైన అభియోగాలను.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అన్వయిస్తూ ఇష్టానుసారం కథనాలతో వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాయి. అయితే.. ఈ కుట్రను తాజాగా లోక్‌సభలోనూ వైఎస్సార్సీపీ బయటపెట్టింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఇదే సమయంలో అదానీతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పార్టీ తరఫున ఆయన మరోసారి వివరణ ఇచ్చారు.పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘సోలార్ పవర్ విషయంలో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు . ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుంది. అదానీతో ఒప్పందం చేసుకోలేదు. సెకీతో అనేక రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయి. చాలా తక్కువ రేటుకు మేము ఒప్పందం చేసుకున్నాం. 2021లో సోలార్ పవర్ 5.90 యూనిట్‌కు ఉంది. మేము 2.49కు మాత్రమే కొనడానికి ఒప్పందం చేసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఐదు రూపాయలకు పైగా యూనిట్‌కు చెల్లించి పవర్ కొన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక వర్గం మీడియా, మేధావులు మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చట్ట సభ దృష్టికి తీసుకెళ్లారు. దేశంలో బ్యాంకింగ్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతుంది. దేశంలో 62% జనాభా వ్యవసాయంపైన ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగం అభివృద్ధికి తగిన చర్యలు కనిపించడం లేదు. రుణమాఫీ, అందుబాటులోని రుణాలు క్షేత్రస్థాయిలో సరిగ్గా అమలు కావడం లేదు. చాలా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. చిన్నతరహ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. విద్యార్థులకు ఇచ్చే రుణాలకు సరైన విధానం రూపొందించాలి’ అని మిథున్ రెడ్డి సూచనలు చేశారు. -
మనం చంద్రబాబులాగా కాదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్యం వచ్చాక ఎవరూ చేయని సంక్షేమ యజ్ఞం వైఎస్ జగన్ చేశారని.. కానీ 2024 ఎన్నికలు మనకు రకరకాల అనుభవాలను మిగిల్చిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీలను ఉద్దేశించి ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..‘‘వైఎస్సార్సీపీ అనేది అందరికీ అందుబాటులో ఉండే పార్టీ. పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకుని దాన్ని అమలు చేసే పార్టీ మనది కాదు. అభిమానులతో నడిచే పార్టీ ఇది.. అందరి అభిప్రాయాలను తీసుకుని నడిచే పార్టీ. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉంది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవటానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉంది’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఐదారు నెలలుగా అందుకు ఆయన ఏం చేస్తున్నారో చూస్తున్నాం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చింది. 2019 తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్లపాటు అసలు కనపడలేదు. తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారు. మనం ఎప్పుడూ జనంలోనే ఉన్నాం. ఇప్పుడు మళ్లీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చింది..మన సంక్షేమ పథకాల వలన ప్రజల్లో కూడా చెక్కుచెదరని అభిమానం ఉంది. ప్రజల కోసం మళ్లీ మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయి. ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవటానికి దోపిడీలు చేసేస్తున్నారు. 2014-19 మధ్యలో ఉన్నట్లు కొంతైనా మొహమాటం కూడా లేకుండా దోపిడీ చేస్తున్నారు..ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎంగా ప్రమాణం చేయకముందే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారు. ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయిలో అక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చాక రోజుకొక కొత్త ఇష్యూతో రచ్చ చేస్తున్నారు. చివరికి తిరుపతి లడ్డూ మీద కూడా రాజకీయం చేశారు. జగన్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తే.. చంద్రబాబు అన్నిటినీ ప్రయివేటు పరం చేస్తున్నారు. పోర్టులు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, చివరికి రోడ్లు కూడా ప్రయివేటు పరం చేస్తున్నారు. వచ్చిన మెడికల్ కాలేజీ సీట్లను పోగొట్టారు. ఐదు, ఆరు వందల మంది విద్యార్థులకు అన్యాయం చేశారు..ఇప్పుడు ఏం చేసినా జనం ఏమీ పట్టించుకోరని, ఎన్నికల నాటికి అన్నీ మర్చిపోతారని చంద్రబాబు భావిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మన హయాంలో చేసిన మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. మన పార్టీ కార్యకర్తలు, నాయకులకు జనంలో గౌరవం ఉంది. పార్టీ కార్యకర్యక్రమాలను ప్రతిస్థాయిలోనూ గట్టిగా తీసుకెళ్లాలి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా ఎవరూ వెనుకడుగు వేయలేదు. కార్యకర్తలు కసిగా పనిచేసి 2019లో గెలిపించారు. మనవెంట నడుస్తున్న వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం..ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండలాధ్యక్షులకు ఇకనుంచి కచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. అనేక అభివృద్ది కార్యక్రమాలను భుజాన వేసుకుని ఐదేళ్లలో పూర్తి చేయాలనే తపనతో పని చేశాం. దానివలన కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. ప్రభుత్వ పనిలో పడి, పార్టీకి ఏం అవసరమో అది చేయలేకపోయాం. ఇకమీదట అలా ఉండదు. మీకే ప్రాధాన్యత ఉంటుంది...ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాల్సిన బాధ్యత ఇప్పుడు మనమీద ఉంది. జడ్పీ అధ్యక్షులతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాను యాక్టీవ్ చేయాల్సిన అసవరం ఉంది. సమస్యల మీద ఎంపీపీలు కూడా చిన్న వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టాలి. ఎంపీపీలందరితోనూ వైఎస్ జగన్ సమావేశమయ్యే ఏర్పాటు కూడా చేద్దాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
ఇక ప్రజా పోరాటాలే.. 4న వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి సమావేశం
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రేపు ఆ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. పార్టీ బలోపేతం అంశంతో పాటుగా చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజాపోరాటం ఎలా చేయాలనే అంశంపైనా రేపటి సమావేశం ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.తాడేపల్లిలో రేపు జరగబోయే భేటీలో.. పార్టీ బలోపేతం, నిర్మాణంపై దృష్టి సారించడం చర్చించననున్నారు. అలాగే పార్టీ పరంగా కమిటీల ఏర్పాటు, వాటి భర్తీపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో..రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన ప్రజా పోరాటాలపైన చర్చించనున్నట్లు భేటీలో సమాచారం. అలాగే ఒక ప్రణాళికను రూపొందించి.. ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై వైఎస్ జగన్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.భేటీలో చర్చించబోయే ప్రధానాంశాలుభారీగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోంది చంద్రబాబు సర్కార్.ధాన్యం సేకరణ అంశంతో పాటు రైతులను దోచుకుంటున్న దళారులుఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలపై చర్చప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంపై కార్యాచరణ రూపకల్పనఇదీ చదవండి: కష్టమొచ్చినప్పుడు నన్ను గుర్తు తెచ్చుకోండి! ఈ భేటీకి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ సెక్రటరీలకు ఆహ్వానం వెళ్లింది. ఇదిలా ఉంటే.. పార్టీ బలోపేతం కోసం సంక్రాంతి తర్వాత వైఎస్సార్సీపీ అధినేత క్షేత్రస్థాయి పర్యటన చేపనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ప్రతీ బుధ, గురు వారాల్లో పూర్తిగా కార్యకర్తలతోనే గడుపుతూ.. వాళ్ల నుంచి సలహాలు స్వీకరించనున్నట్లు ప్రకటించారాయన. -
ఆ సమాచారం జనసేనకు ఎలా చేరింది?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఎవరికీ వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని.. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారని అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అతన్ని బెదిరించి నంబర్ తీసుకుని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు.పెద్దపెద్ద పోలీసు అధికారులు మాత్రమే చేయగలిగే ట్రాకింగ్‌ని జనసేన నేతలు ఎలా చేస్తున్నారు?. అనిల్ కుటుంబ సభ్యుల వివరాలను కూడా వెల్లడిస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది?’’ అంటూ పుత్తా శివశంకర్ ప్రశ్నించారు. నియంతలను మించి పాలన సాగుతోందని ఆయన ధ్వజమెత్తారు.‘‘ప్రభుత్వం ప్రజల వివరాలు తీసుకుంటే అప్పట్లో పవన్ రచ్చ చేశారు. మరి ఇప్పుడు ప్రజల వివరాలు ఏ విధంగా జనసేన వారి దగ్గరకు వచ్చాయి?. ఇది చట్టవ్యతిరేక చర్య. చట్టాలను వారి చేతుల్లోకి తీసుకోవటం ఏంటి?. దీనిపై కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాలి. ‘డిప్యూటీ సీఎంగారి తాలూకా’ అనే ట్విట్టర్ హ్యాండిల్‌పై చర్యలు తీసుకోవాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
బాబూ.. ప్రధాని మోదీ మాటలు గుర్తున్నాయా?: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుందని ఆరోపించారు. అలాగే, బుడమేరు మునగడానికి కారణం కూటమి నేతలు కాదా? అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు అని అంటున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 67వేల కోట్లు ఏ పథకాలకు ఖర్చుపెట్టారు?.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కరెంట్ బిల్లులు పెంచారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం 67వేల కోట్లు భారం మోపారు. సోలార్ పవర్ 2400 మెగావాట్స్ వైఎస్సార్సీపీ హయాంలో 2.49 రూపాయలకు కొంటే, టీడీపీ హయాంలో 5.90 రూపాయలకు కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయంలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో 750 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుంది.అమరావతికి కొత్త కళ అంటున్నారు. 2014 నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా?. బుడమేరు బాధితులకు భారీగా విరాళాలు సేకరించారు.. అవి ఎవరికి ఖర్చుపెట్టారు?. బుడమేరులో డ్రామా నాయుడు చేసిన పనుల్లో అప్పుడే లికేజ్ మొదలయ్యాయి. పోలవరంలో అవినీతి జరిగింది అనడానికి సిగ్గు ఉందా?. ప్రధాని మోదీనినే చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీంఎంలా వాడుకున్నారని కామెంట్స్ చేశారు. ప్రధాని మాటలను కూటమి నేతలు మర్చిపోయారా?.మొన్నటి వరకు అమరావతి, తిరుపతి లడ్డు, పోలవరం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేశారు.. ఇప్పుడు కొత్తగా సీజ్ ది షిప్ అని మొదలుపెట్టారు. అక్కడ రెండు షిప్‌లు ఉంటే ఒక్కటే సీజ్ చేయడానికి కారణం ఏంటి?. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ పోర్టుకి వెళ్తే నన్నే రానివ్వలేదు అనడానికి సిగ్గుపడాలి. తాడేపల్లిగూడెంలో మూడు లారీల పీడీఎస్ బియ్యం సీజ్ చేస్తే వాటిని ఎవరు వదిలేశారు?. రైతులకు ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.. రైతులను ఆదుకోలేదు.రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. 30వేల మంది ఆడపిల్లలు కనిపించడంలేదన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎంత మంది ఆడపిల్లలను కనిపెట్టారు?. తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పట్టణంలో ఐదు హత్యలు జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు, పేకాట క్లబ్‌లు నడుపుతున్నారు. పోలవరం గట్లపై ఉన్న ఎర్ర కంకరను కూటమి నాయకులు దోచుకుంటున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో రైతులు ఆనందంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి అనేక రకాల కొత్త వేషాలు వేస్తున్నారు. ప్రజలను అన్ని విషయాల త్వరలోనే తెలుస్తాయి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు మోసపోయారు: కారుమూరి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న రూ. 20 వేలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మాట్లాడుతూ.. కూటమి పాలనలో దళారి వ్యవస్థ పెరిగిపోయిదని దుయ్యబట్టారు. కూటమి సర్కార్‌లో దళారి రొక్కం, రైతుకు దుఃఖం మిగిలిందని అన్నారు.చంద్రబాబు పాలనలో రైలతులు బస్తాకు మూడు నుంచి నాలుగు వందలు నష్టపోతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు మోసపోయారని అన్నారు. తుఫాన్ వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అదే గత వైఎస్ జగన్ పాలనలో నేరుగా రైతుల ఖాలలో డబ్బులు పడేవని గుర్తు చేశారు. -
జేసీ ప్రభాకర్‌రెడ్డిపై కేతిరెడ్డి ఫైర్
సాక్షి,అనంతపురం:మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు అభ్యంతరకరమని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దారెడ్డి మంగళవారం(డిసెంబర్3)మీడియాతో మాట్లాడారు.‘జేసీ వర్గీయులు తాడిపత్రిలో విచ్చలవిడిగా మట్కా,పేకాట ఆడిస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతలపై దాడులు తీవ్రమయ్యాయి. బాధితులపైనే అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. నన్ను తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నన్ను వెళ్లనీయకపోయినా పర్వాలేదు కానీ వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ఆపాలి. అధికారంలో ఉన్నారని టీడీపీ ఏమి చేసినా చెల్లుతుందంటే చూస్తూ ఊరుకోం’అని పెద్దారెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రాణహాని -
ఈవీఎంలపై మరిన్ని అనుమానపు మబ్బులు!
దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)పై మరోసారి గట్టిగా గొంతెత్తింది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపరుతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈవీఎంలపై సందేహాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయని, వాటిని తీసేసి అహ్మదాబాద్ గోడౌన్లో పెట్టాలని విమర్శించారు. బీజేపీ ఈవీఎంల సాయంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.ఇటీవలి కాలంలో ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోతున్న మాటైతే నిజం. వాటి పనితీరు, ట్యాంపరింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాన్ మస్క్ లాంటి టెక్ దిగ్గజాలు ఈవీఎంలను నియంత్రించవచ్చునని అంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించాల్సిన, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ఆ పని సమర్థంగా చేయలేకపోతోంది. దీంతో అందరి అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్, ఒడిశాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత హర్యానా, తాజాగా మహారాష్ట్రలోనూ ఈవీఎమ్‌లతో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. ఇందుకు పలు ఆధారాలను చూపుతున్నా ఎన్నికల కమిషన్ మాత్రం కిమ్మనడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వకుండా దబాయింపునకే పరిమితం అవుతోంది.అభ్యర్థులు కోరితే వీవీప్యాట్ స్లిప్‌లలో ఐదు శాతం ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చినా ఎన్నికల సంఘం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరి అంచనాలను తారుమారు చేస్తూ వైఎస్సార్సీపీకి కేవలం11 స్థానాలే దక్కడం కూడా ఈవీఎంలపై అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పించాయి. ఒంగోలు, విజయనగరం వైఎస్సార్సీపీ అభ్యర్థులు వీవీప్యాట్ స్లిప్‌లను, ఈవీఎంలలోని సమాచారంతో సరిపోల్చి చూడాలని ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా ఎన్నికల సంఘం దాటవేయడం ఇంకో అనుమానాస్పద చర్య. పైగా ఏపీలో అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి పోలింగ్ అయిన పది రోజులకే వీవీపాట్ స్లిప్‌లను దగ్ధం చేయాలని ఆదేశాలు పంపడం వాటిని మరింత పెంచింది. ఆశ్చర్యకరంగా కొన్ని బూత్ లలో వైఎస్సార్సీపీకి ఒక్క ఓటే నమోదైంది.హిందుపూర్లోని ఒక వార్డులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ ఇంట్లోనే ఏడు ఓట్లు ఉంటే, సంబంధిత బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఒక్క ఓటు వైఎస్సార్సీపీకి నమదైంది. ఇదే బూత్‌లో వైఎస్సార్సీపీ లోక్‌సభ అభ్యర్థికి మాత్రం 475 ఓట్లు రావడం విశేషం. క్రాస్ ఓటింగ్ జరిగినా అది ఈ స్థాయిలో ఉండటం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్, కౌంటింగ్ల మధ్యలో సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా నమోదై ఉండటం, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో తేడాలు ఉండటం మనం ఇప్పటికే చూశాం. పోలింగ్ నాడు ఏబై శాతం మాత్రమే ఉన్న బాటరీ ఛార్జింగ్, కౌంటింగ్ నాటికి 90 శాతానికి చేరడం పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.మాజీ మంత్రి రోజా వైఎస్సార్సీపీకి అత్యధిక బలం ఉన్న వడమాల పేట మండలంలో టీడీపీకి మెజార్టీ రావడంపై సంశయాలు వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండు, మూడువేల ఓట్ల ఆధిక్యతతోనే గెలుపొందగా, ఆయన కుమారుడు టీడీపీ పక్షాన పోటీచేయగా ఏకంగా నలభైవేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంతటి ఆధిక్యత టీడీపీకి రావడం ఎలా సాధ్యమైందని రోజా ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు ఉందన్నది ఆమె అనుమానం. వీవీప్యాట్ స్లిప్‌లను లెక్కించాలని కోరిన అప్పటి ఒంగోలు వైఎస్సార్సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో చేరి దీని గురించి మాట్లాడకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ ఎన్నికలలో మోసం జరిగిందని అభిప్రాయపడ్డారు.ఆ తర్వాత ఆయన ఈవీఎంల ద్వారా కాకుండా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన ఒక సందేశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా.. అలా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కూడా కలిగించాలని అన్నారు.అంతేకాదు.. ఒకప్పుడు ఈవీఎంలపై పలు విమర్వలు చేయడమే కాకుండా.. బ్యాలెట్ల పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిపై తగిర రీతిలో స్పందించినట్లు కనిపించడం లేదు.ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో ఏభై సీట్లు గెలుచుకున్న బీజేపీ అదేరోజు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు గెలవకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ, ఒడిశాల తర్వాత హర్యానా ఎన్నికలలో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. ఫలితాల ట్రెండ్ కూడా తొలుత దానికి అనుగుణంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం బీజేపీకి అనుకూలంగా మారింది. ఇదంతా ఈవీఎమ్‌ల మహిమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్కడ వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించాలని కోరినా, ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు. తాజాగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో విజయం సాధించడంతో ఈవీఎంల టాంపరింగ్ పై కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాలు ఆరోపణలు చేశాయి. అక్కడ కూడా పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య లక్షల ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక నియోజకవర్గంలో 1170 ఓట్లు అధికంగా నమోదు అయ్యాయని తేలిందట. అక్కడ బీజేపీ అభ్యర్ది సుమారు 1100 ఓట్లతో గెలిచారట. నాందేడ్‌లో కూడా ఓట్ల శాతంలో మార్పులు కనిపించాయి.అక్కడ లోక్ సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే, ఆరు సెగ్మెంట్ లలో బీజేపీ గెలించింది. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ ఇదంతా ఈవీఎంల టాంపరింగ్ మహిమే అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా 288 సీట్లకుగాను, ఏభై సీట్లు కూడా సాధించ లేకపోయింది. వీటిని దృష్టిలో ఉంచుకునే మల్లిఖార్జున్ ఖర్గే ఈవీఎంలు వద్దు..బాలెట్ పత్రాలే ముద్దు అని అంటున్నారు. దీని కోసం దేశ వ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమే అయితే.. జమ్ము-కశ్మీర్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ కూటమి ఎలా గెలిచిందన్నది బీజేపీ ప్రశ్నిస్తోంది. సీనియర్ నేత శరద్ పవార్ సమాధానం దీనికి ఇస్తూ పెద్ద రాష్ట్రాలలో ఈవీఎంలను మేనేజ్ చేస్తూ, చిన్న రాష్ట్రాలను వదలి పెడుతున్నారని, అందువల్ల ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ కూడా ఈ అంశంపై దీనిపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.మహారాష్ట్ర మ్యాజిక్ ఏమిటీ అని అంటూ, ఎన్నికలు జరిగిన నవంబర్ ఇరవయ్యో తేదీ సాయంత్రం ఐదు గంటలకు పోలైన ఓట్ల శాతం 58.22 గా ఉందని, ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు అది 65.02 శాతంగా తేల్చారని, కాని కౌంటింగ్ కు ముందు ఆ శాతం 66.05 శాతం ఈ రకంగా మొత్తం 7.83 శాతం పెరిగిందని, అదే మహారాష్ట్ర మేజిక్ అని వ్యాఖ్యానించారు. అదే మ్యాజిక్ జార్ఖండ్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్‌లో తొలిదశలో పోలింగ్ సాయంత్రానికి 64.66 శాతం నమోదైతే, రాత్రి 11.30 గంటలకు 66.48 శాతంగా ప్రకటించారు.అంటే తేడా కేవలం 1.79 శాతమేనని, రెండో దశ పోలింగ్ లో సాయంత్రానికి, రాత్రికి ప్రకటించిన ఓట్ల శాతాలలో తేడా 0.86 శాతమేనని, అంటే ఇక్కడ మాజిక్ తక్కువగా జరిగిందని ప్రభాకర్ సెటైర్ గా వ్యాఖ్యానించారు. మహరాష్ట్రలోని కొన్ని గ్రామాలు ఈవీఎంల పలితాలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మాజీ ముఖ్య కమిషనర్ ఖురేషి కూడా మహారాష్ట్రలో పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల తేడా 7 శాతంపైగా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యినికి మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో బాలెట్ పత్రాల వైపు ఎన్నికల సంఘం మొగ్గు చూపకపోయినా, లేదా ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని నిరూపించకపోయినా, దేశంలో ఎన్నికలపై నీలి నీడలు అలుముకునే అవకాశం ఉంది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆళ్లనానిపై భగ్గుమంటున్న తెలుగుతమ్ముళ్లు
సాక్షి,ఏలూరుజిల్లా: ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న ఊహాగానాలతో ఏలూరు టీడీపీలో అసంతృప్తి సెగలు భగ్గుమంటున్నాయి.ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని ఏలూరు తెలుగుతమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.నాని రాకను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో తెలుగుతమ్ముళ్లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.తన 32 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణగదొక్కిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజకీయ జీవితాన్ని ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబానికే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఆళ్ల నాని అంటూ టీడీపీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు.తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పకుండా నాని పార్టీలో చేరితే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు. -
సోషల్‌మీడియా కార్యకర్తలకు ప్రాణహాని..జనసేన శ్రేణుల దుశ్చర్య
సాక్షి,విజయవాడ : సోషల్ మీడియా కార్యకర్తలకు ప్రాణహాని తలపెట్టేలా కూటమి పార్టీల చర్యలున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారం బయటికి పొక్కి సోషల్‌మీడియా కార్యకర్తల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. కార్యకర్తల వ్యక్తిగత సమాచారాన్ని జనసేన సోషల్ మీడియా విభాగం పోస్ట్ చేస్తోంది.కేవలం పోలీసులు వద్ద ఉండాల్సిన సమాచారాన్ని సోషల్‌మీడియాలో పెట్టి బహిరంగపరుస్తున్నారు.తాజాగా సోషల్‌మీడియా యాక్టివిస్టు అనిల్ నాయక్ లొకేషన్‌ను జనసేన కార్యకర్తలు సోషల్‌మీడియాలో పోస్టుచేశారు. లొకేషన్‌ను అక్షాంశాలు,రేఖంశాలతో సహా పోస్ట్ చేశారు.ఈ పోస్టులతో తనకు ప్రాణహాని కలిగేలా చేస్తున్నారని అనిల్‌నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టులు చట్ట వ్యతిరేకమని ఆయన ఆరోపించారు.Shocking breach! Sensitive data, meant only for police access, is now public. If this isn’t dealt with seriously, privacy in AP is doomed, paving the way for dangerous misuse. If a third party is involved, they need to be held accountable . pic.twitter.com/sbeUfL01hp— bagira (@bigcatt09) December 2, 2024 -
చల్లపుచ్చుకుని ముంత దాచుకుంటున్న పవన్!
చల్లకొచ్చి ముంత దాచుకోవడం అనే సామెత ఒకటుంది. ఆ సామెత వెనుక ఓ బుల్లి కథ కూడా ఉంది. ఓ ఊళ్లో ఆదెమ్మ, సోదెమ్మ అనే ఇద్దరున్నారు. ఇద్దరూ ఇరుగు పొరుగువారే. ఆదెమ్మకు ఏదైనా అవసరం వస్తే మొహమాటమూ సిగ్గు లేకుండా సోదెమ్మను అడిగి పుచ్చుకుంటుంది. కానీ సోదెమ్మకు కాస్త సిగ్గు ఎక్కువ. ఓసారి సోదెమ్మకు చల్ల (మజ్జిగ) కావాల్సి వచ్చింది. ఇంట్లో నిండుకున్నాయి. మొగుడికేమో మజ్జిగ చుక్క లేకపోతే ముద్ద దిగదు. అందుకని వేరే గత్యంతరం లేక చేతిలో ఓ ముంత పట్టుకుని ఆదెమ్మ దగ్గరకు వెళ్లింది. ‘రా రా సోదెమ్మక్కా.. ఏంటి సంగతులు’ అని అడిగింది ఆదెమ్మ. సోదెమ్మకు చల్ల అడగాలంటే సిగ్గేసింది. ముంతను కొంగు చాటున దాచుకుంది. కాసేపు కబుర్లు చెప్పి ఖాళీ ముంతతోనే తిరిగి ఇంటికి వెళ్లింది. భోజనంలోకి మజ్జిగ లేనందుకు మొగుడితో తిట్లు కూడా తినింది. ..ఇదీ కథ!ఏదైనా పనిమీద ఒకరి వద్దకు వెళ్లినప్పుడు, ఏ పనిగా వచ్చామో చెప్పకుండా దాచుకుంటే, మొహమాటపడితే పని జరిగేదెలాగ? కాబట్టి కార్యార్థవై ఉన్నప్పుడు మొహమాటం తగదని ఈ సామెత చెబుతుంది. ఈ సామెత నీతి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు!కానీ పవన్ కల్యాణ్ రూటే సెపరేటు. ఆయన చల్లకోసం వస్తారు. మొగమాటలం లేకుండా అడిగి పుచ్చుకుంటారు. కానీ.. తాను పొరుగింట్లో చల్ల అరువు పుచ్చుకున్న సంగతి మరెవ్వరికీ తెలియకూడదని మాత్రం అనుకుంటారు. చల్ల పుచ్చుకున్న తర్వాత ఆ ముంతను.. దాచిపెట్టుకుని, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోవాలని అనుకుంటారు. తమ మధ్య కేవలం కబుర్లు మాత్రమే సాగాయని వాడలోని ఇతరుల్ని మభ్య పెట్టాలని అనుకుంటారు. ఆయన అటు ఢిల్లీ, ఇటు ఉండవిల్లీ నేతలతో సాగిస్తున్న భేటీల మర్మం అలాగే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజ్యసభ ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో తన వ్యవహారాలన్నీ చూసుకున్న అన్నయ్య నాగబాబును ఎంపీగా రాజ్యసభకు పంపాలని పవన్ కోరిక. అడిగితే కాదనేంత సీన్ చంద్రబాబుకు లేదుగానీ.. ఈసారే ఇస్తారా.. నెక్ట్స్ టైం అంటారా అనేది అనుమానం. అందుకే ముందుగా ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో చర్చలు జరిపి.. తన మనోవాంఛను వారి ఎదుట చెప్పుకున్నారు. మూడింటిలో ఒక ఎంపీ సీటు కోసం బిజెపి పట్టుపట్టకుండా ఉంటే.. తాను దక్కించుకోవచ్చునని ముందుగా అక్కడ చక్రం తిప్పారు. తీరా ఇవాళ చంద్రబాబు ఉండవిల్లి నివాసానికి వెళ్లి మాట తీసుకునే ప్రయత్నం చేశారు.బాబు వద్దకెళ్లడమూ మాట పుచ్చుకోవడమూ అయింది. అయితే తాను ఎంపీ సీటు కోసం వీరందరి ఇళ్లకూ కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నానని ప్రజలకు తెలియరాదు– అనేది ఆయన కోరిక. అంటే చల్ల పుచ్చుకోవాలి గానీ.. ఆ సంగతి ఇతరులకు మాత్రం తెలియద్దన్నమాట.పైకి మాత్రం.. కాకినాడ బియ్యం స్మగ్లింగ్ గురించి బాబుతో చర్చించినట్లుగా, రాష్ట్ర ప్రయోజనాలు సాధించడం గురించి ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసినట్టుగా.. బాహ్య ప్రపంచానికి ఆయన డప్పు కొట్టుకుంటున్నారు. తాను అన్నయ్య నాగబాబు ఎంపీ సీటు కోసమే తిరుగుతున్నట్టుగా జనం గుర్తిస్తే పలుచన అవుతానని భయపడుతున్నారో ఏమో పాపం!.. ఎం. రాజేశ్వరి -
రైతులను రోడ్డున పడేశావ్!: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో టీడీపీ కూటమి సర్కారు దారుణ వైఫల్యంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్దతు ధర కల్పించి ఆదుకోవాలన్న కనీస ధ్యాస కూడా ఈ ప్రభుత్వానికి లేదని.. రైతులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా వర్షాలకు తడిసిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని.. కృష్ణా, గోదావరి డెల్టాలో ఎటు చూసినా కిలోమీటర్ల మేర ధాన్యం రాసులే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ముఖం చాటేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు 75 కిలోల బస్తాకు రూ.300–400 నష్టానికి దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. గత ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ప్రతి రైతన్నకూ కనీస మద్దతు ధర కల్పించి తోడుగా నిలబడ్డామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చేందుకు మోసపూరిత హామీలతో మోసగించిన చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. అందులో ఆయన ఇంకా ఏమన్నారంటే..పంటలకు మద్దతు ధర ఏదీ...రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయింది. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి, అవసరమైన సౌకర్యాల కల్పనలో మీ ప్రభుత్వం విఫలమైంది. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడే లేకుండాపోయారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్తే తేమ శాతం వంకతో రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారు. బస్తాకు రూ.300–400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైంది. 75 కిలోల బస్తాకు రూ.1,725ల చొప్పున ఏ ఒక్కరికి అందే పరిస్థితి లేకుండా పోయింది.రోడ్లపైనే ధాన్యం... కొనేవారేరీ...ధాన్యం కొనేవారు లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లపైనే ధాన్యాన్ని పోసి కొనేవారి కోసం నిరీక్షిస్తున్నారు. పైగా ఇప్పుడు మరో కష్టం వచ్చిపడింది. ఫెంగల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగుమారిపోయే పరిస్థితి ఏర్పడింది. తుపాను వస్తుందని నాలుగు రోజుల ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయినాసరే ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు.యుద్ధ ప్రాతిపదికన రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ధ్యాస, ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండాపోయింది. కనీసం ఒక్కసారైనా సీఎం స్థాయిలో సమీక్ష చేసిన దాఖలాలు లేవు. కనీసం సరిపడా సంచులు కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్దీ ధాన్యం రాశులు రోడ్లపైనే కనిపిస్తున్నాయి. విజయవాడ – మచిలీపట్నం మధ్య 60 కిలోమీటర్ల పొడవునా ఆరబెట్టిన ధాన్యం కొనేనాథుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నా మీకు కనిపించడం లేదా?కనీస సాయం అందించిన పాపాన పోలేదువైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తున్నా సాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. వరదలు, వర్షాలు, వర్షాభావ పరిస్థితుల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో సాయం అందించిన పాపాన పోలేదు. కనీసం రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనాలన్న ఆలోచన కూడా మీ ప్రభుత్వానికి లేకుండా పోయింది.ఈ– క్రాప్ ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలనే తపన, రైతులందరికీ సంపూర్ణ మద్దతు ధర దక్కాలనే ఆశయం పూర్తిగా నీరుగారిపోయింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్‌తో నువ్వు, మీ మంత్రులు కాలం గడుపుతున్నారు.మా హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాం. ఐదేళ్లూ పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేశాం. ప్రతీ రైతుకు కనీస మద్దతు ధర కల్పించాం. అంతేకాదు గన్నీ సంచులు, లేబర్, రవాణా (జీఎల్టీ) చార్జీలను ప్రభుత్వ ద్వారానే అదనంగా ఇస్తూ వచ్చాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్లోని టోల్ ఫ్రీ నంబర్ 155251తో పాటు ధాన్యం కొనుగోలు సందర్భంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా 1967తో కూడిన టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. గతేడాది ఇదే సమయంలో వచ్చిన మిచాంగ్ తుపాను సమయంలో రైతులను ఆదుకునేందుకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేశాం. కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు నాడు ప్రతీ జిల్లాకు రూ.కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చాం. తుపాను ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చూశాం.రంగుమారిన, తడిసిన, మొలకెత్తిన ధాన్యం కూడా కొన్నాం..తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశాం. మిల్లర్ల దోపిడీని అరికట్టేందుకు ఆర్బీకేల కేంద్రంగా ఈ–క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించాం. క్షేత్ర స్థాయిలో ఆర్బీకే సిబ్బంది రైతు క్షేత్రాల వద్దకు వెళ్లి జియోట్యాగింగ్ ద్వారా ఫొటోలు తీసి నాణ్యతను పరిశీలించడంతోపాటు ఆన్లైన్లోనే రైతుల వివరాలను నమోదు చేసి ట్రక్ షీట్ జనరేట్ చేశాం. ధాన్యం తరలించాల్సిన మిల్లును కూడా ఆటోమెటిక్‌గా ఎంపిక చేసే సాంకేతిక విధానాన్ని తీసుకొచ్చాం.ధాన్యం లోడులు పక్కదారి పట్టకుండా రవాణా వాహనాలకు జీపీఎస్‌ను అమర్చాం. మిల్లుల్లో రైతులతో సంబంధం లేకుండా ధాన్యం నాణ్యత సమస్యలను పరిష్కరించాం. డిప్యూటీ తహసీల్దార్ స్థాయి అధికారులను ప్రతీ మిల్లుకో కస్టోడియన్ అధికారిగా నియమించాం. మండలానికో ప్రత్యేక మొబైల్ బృందాన్ని ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కరించాం. వ్యవసాయశాఖాధికారి, టెక్నికల్ అసిస్టెంట్ పర్యవేక్షణలో ప్రతీ జిల్లాకో మొబైల్ మినీ మిల్లును ఏర్పాటు చేశాం.రైతులకు, మిల్లర్లకు సంబంధం లేకుండా ఆర్బీకేల ద్వారానే ఇవన్నీ చేశాం. మా హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దతు ధర దక్కలేదని రోడ్డుమీదకు రాలేదు. 2014–19 మధ్య మీ పాలనలో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, 2019–24 మధ్య మా హయాంలో 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం.రైతులకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడఅధికారంలోకి వచ్చేందుకు హామీలతో మోసం చేసిన చంద్రబాబు ప్రస్తుతం రైతులను పట్టించుకోవడం లేదు. ప్రతి రైతుకు రూ.20వేల చొప్పున ఇస్తామన్న పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదు? సూపర్ సిక్స్ హామీనే గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం ఇక రైతుల ఇతర సమస్యలను ఎందుకు పట్టించుకుంటుంది ? సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకక రైతులు నానా అగచాట్లు పడ్డారు. లాభసాటిగా సాగు ఎలా చేయాలో రైతులకు సలహాలు ఇచ్చే నిపుణులు లేరు. ఆర్బీకేలు నీరుగారిపోయాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పథకాల రద్దుతో రైతులకు తీవ్ర నష్టం కలిగించారు.విత్తు నుంచి విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, సున్నావడ్డీ రాయితీ వంటి పథకాలను అటకెక్కించేశారు. రైతులపై పైసా భారం పడకుండా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి ఆ భారాన్ని రైతుల నెత్తిన మోపారు. 2023–24 సీజన్లో రైతుల తరఫున చెల్లించాల్సిన రూ.930 కోట్ల ప్రీమియం బకాయిలు జూన్‌లో కట్టాల్సి ఉండగా, నువ్వు ఎగ్గొట్టడం వలన రైతులకు రూ.1,385 కోట్ల పంటల బీమా పరిహారం అందకుండాపోయింది. పెట్టుబడి సాయం లేక,రుణాలు అందక రూ.3లు, రూ.5లు వడ్డీలకు అప్పులు చేసి మరీ రైతులు సాగు చేశారు. అడుగడుగునా నువ్వు నిర్లక్ష్యం, మొండి చేయి ప్రదర్శించినా, వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన రైతులు నీ నిర్వాకం వలన తీవ్రంగా నష్టపోతున్నారు. -
‘నాదెండ్ల వాస్తవాలు తెలుసుకో.. పీడీఎస్ బియ్యం మంత్రి వియ్యంకుడిదే’
సాక్షి, గుంటూరు: కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే.. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సీజ్ చేసిన షిప్‌నే మళ్లీ సీజ్ చేయడమేంటి?. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలివెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు.అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు హాయాంలోనే అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. చెక్‌పోస్టులు ఉండగా.. పీడీఎస్ బియ్యం ఎలా తరలిపోతుంది?. అధికారం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంది కదా?. వైఎస్ జగన్‌పై బురద జల్లడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా బియ్యం తరలి వెళ్తోంది. జనసేనకు చెందిన వారంతా పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారు. జనసేన నేతలు కుమ్మకైపోయి అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. -
‘పవన్.. రాజకీయాల కోసం పోర్టును దొంగగా చిత్రీకరిస్తారా?’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. ఇదే సమయంలో కాకినాడ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు.కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ చేసిన హంగామాపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోర్టు విషయమై పవన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సీపీఐ నేత మధు.. కాకినాడ యాంకరేజ్ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోంది. రాజకీయాల కోసం పోర్టును నాశనం చేయాలనుకుంటున్నారా?. పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు ఉన్నారు.రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా.. స్మగ్లింగ్ డెన్‌గా చిత్రీకరించకండి. కాకినాడ ప్రజలు మానసికంగా బాధపడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. పోర్టు ద్వారా అక్రమ వ్యాపారాలు జరిగితే సీబీఐ విచారణ జరపండి. పోర్టు గౌరవాన్ని దెబ్బ తీయకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘కూటమి అలసత్వం.. నాడు బుడమేరు.. నేడు రైతులు’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిసినా కూటమి ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని ఘాటు విమర్శలు చేశారు. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్పారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘రైతుల గురించి ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులు ధాన్యం రాశుల వద్ద గగ్గోలు పెడుతున్నారు. బుడమేరుకు వరదలు వస్తాయని తెలిసినా విజయవాడని ముంచేసినట్టుగానే ఇప్పుడు కూడా వ్యవహరిస్తున్నారు. తుపాను వస్తుందని తెలిసినా రైతులను అప్రమత్తం చేయలేదు. రైతుసేవా కేంద్రాల వద్దకు వెళ్తే మిల్లర్ల దగ్గరకు వెళ్లమని ఉచిత సలహాలు ఇస్తున్నారు.విజయవాడ నుండి మచిలీపట్నం వరకు ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ధాన్యం రాసులే కనిపిస్తున్నాయి. అప్పులు తెచ్చుకుని రైతులు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. రైతులను ఈ ప్రభుత్వం వెంటిలేటర్ల మీదకు నెట్టేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి మాటలు కోటలు దాటుతున్నాయేగానీ చేతల్లో ఏమీ కనపడటం లేదు. కనీసం టార్బలిన్ పట్టాలు, గోనె సంచులు కూడా ఇవ్వటం లేదు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రైతు క్షేమంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలిరాష్ట్రంలో ఒక్క బస్తా ఐనా మద్దతు ధరతో రైతుల నుండి కొనుగోలు చేశారా?. మాతో వస్తే రైతుల గోడు మంత్రులకు చూపిస్తాం. చివరికి టీడీపీ కార్యకర్తలు కూడా ఈ ప్రభుత్వం వైఖరితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేల కోట్ల రూపాయలు స్కామ్ చేయటానికి ప్రభుత్వ పెద్దలు రెడీగా ఉన్నారు. గ్రామాల్లో తేమ శాతం 15% ఉంటే మిల్లర్ల దగ్గరకు వెళ్తే 20% ఉన్నట్టు చూపిస్తున్నారు. మధ్యవర్తులు, దళారుల ద్వారా వేల కోట్ల రూపాయలు రైతుల నుండి దోచుకుంటున్నారుఒక్కో బస్తా మీద రూ.425ల చొప్పున ఈ మాఫియా కొట్టేస్తోంది. వైఎస్ జగన్ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఏ ఒక్క రైతు కూడా సంతోషంగా లేడు. మద్యం, ఇసుక మీద ఉన్న ప్రేమ.. రైతుల మీద ప్రభుత్వానికి లేదు. రైతు సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. హాయ్ అని మెసేజ్ పెడితే ధాన్యం మొత్తం కొనిపిస్తానని మంత్రి నాదెండ్ల మనోహర్ మాటలు చెప్తున్నారు. ఎంతమంది మెసేజ్‌లు పెట్టినా ఆ మంత్రికి చలనం లేదు. మెసేజ్ కాదు ఇకమీదట గిల్లితేనైనా రైతుల అవస్థలు గుర్తొస్తాయేమో? అంటూ చురకలంటించారు. -
‘కెన్‌స్టార్’ షిప్పును పవన్ ఎందుకు వదిలేశారు: పేర్నినాని
సాక్షి,మచిలీపట్నం:డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.స్టెల్లాషిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్‌షిప్‌ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లకూడదని పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు చెప్పారా అని పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. -
రూ.70వేల కోట్ల అప్పు ఏం చేశారు ?: బొత్స సత్యనారాయణ
సాక్షి,విశాఖపట్నం:కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలయిందని, ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు,గుడివాడ అమర్నాథ్,మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.‘ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది. ఎన్నికల హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు పొంతన లేదు.హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారు.యూనిట్‌కు 1రూపాయి20పైసలు పెంచారు.ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారు. అప్పుల భారం పెంచుతున్నారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారు.మరి కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోంది. ఆరు నెలల్లో చేసిన రూ.70 వేల కోట్ల అప్పు ఎక్కడికి పోయిందో చెప్పాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి’అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. బొత్స ఇంకా ఏమన్నారంటే..ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో చోటు లేదు.హామీలకు బడ్జెట్ లెక్కలకు పొంతన లేదు.ఎన్నికలకు ముందు కూటమి నేతలు నిత్యావసర వస్తులు పెంచమని చెప్పారు.చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ధరలు పెంచమని పదే పదే చెప్పారు.యూనిట్ విద్యుత్ ధర 1.20 రూపాయలు పెరిగింది.రూ. 15 వేల కోట్ల విద్యుత్ బారాన్ని ప్రజలపై ఈ ప్రభుత్వం మోపుతుంది.విద్యుత్ చార్జీలు పెంచడం ఎంతవరకు సమంజసంఅన్ని పరిణామాలు ఆలోచించే కదా ఎన్నికల్లో చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పారు.రూ. 15 వేల కోట్ల బారాన్ని ప్రభుత్వమే భరించాలిప్రభుత్వమే డిస్కంలకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాంరూ 67 వేల 237 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వంఈ మంగళవారం మళ్ళీ రూ. 4 వేల కోట్లు అప్పు చేయబోతున్నారు.మొత్తం అప్పు రూ. 70 వేల కోట్లకు చేరుతుంది.గతంలో మా ప్రభుత్వం డిస్కంలకు డబ్బులు చెల్లించాం.పెన్షన్ తప్ప ఒక్క పథకం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ ఆరు నెలల్లో రూ.18 వేల కోట్ల పేద ప్రజల ఖాతల్లో వేసేవాళ్ళం.గత సంవత్సరం ఇదే సమయానికి అమ్మఒడి,వసతి దీవెన,విద్యా దీవెన,రైతు భరోసా,సున్నా వడ్డీ,మత్స్యకార భరోసా,ఈబీసీ నేస్తం నిధులు ప్రజలకు ఇచ్చాంఈరోజుకి గత సంవత్సరంలో రూ. 18 వేల 200 కోట్లు ఇచ్చాంప్రజలకు పథకాలు ఇవ్వడం ఈ ప్రభుత్వం ప్రయారిటీ కాదుపేద ప్రజలకు పథకాలు ఎప్పటి నుంచి ఇస్తారురూ. 67 వేల కోట్లు అప్పు తెచ్చి దేనికి ఖర్చు చేశారుప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాంపథకాలు ఇవ్వడం లేదు సరి కదా విద్యుత్ చార్జీల మోత మోగించి ప్రజల నడ్డి విరుస్తున్నారుమా ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు చేశామని గగ్గోలు పెట్టారు.. ఇప్పుడు అప్పులు చేసి మీరేం చేస్తున్నారుమీ సోకులకు వాడుకుంటున్నారా..?గతంలో కూడా చంద్రబాబు అప్పులు చేసి వెళ్తే మేం కూడా ఆ అప్పులు చెల్లించాంప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయిందిగతంలో పథకాలు అందడం వలన మార్కెట్ మంచిగా ఉండేదిజీఎస్టీ తగ్గిపోతోంది..చాలా ఆందోళనగా ఉంది..వ్యాపారాలు ఏమి జరగడం లేదువాటాల కోసం ఎమ్మెల్యేలు తన్నుకుంటున్నారుదానికి సీఎం చంద్రబాబు పంచాయితీ ఏమిటిప్రభుత్వం అంటే భయం, భక్తి ఉండాలి.. ఏది లేకపోతే ఎలా..?నూతన మద్యం పాలసీ వచ్చాక బెల్టు షాపులు ఎక్కువయ్యాయిబెల్టు షాపులకు బహిరంగ వేలం వేస్తున్నారుమా సమీప గ్రామంలో బెల్టు షాపు రూ. 50 లక్షలకు వేలం వేశారుఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా..?ఈనాడు, జ్యోతి కథనాలనే నేను చెప్తున్నానుపవన్ కాకినాడ పర్యటన..గబ్బర్ సింగ్-3పవన్ కాకినాడ పర్యటన.. గబ్బర్ సింగ్..3ని తలపించిందిపీడీఎస్ బియ్యం అక్రమ రవాణా తప్పే.. చర్యలు తీసుకోండిఎమ్మెల్యేని కాంప్రమైస్ అయ్యావా..? అని పవన్ అడుగుతున్నారుపక్కన ఉన్న మీ మంత్రి మాటేంటి..?ఆయన చేతకాని వాడా..?పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండిరెడ్డి, చౌదరి ఎవ్వరైనా తప్పు చేస్తే ఒకేలా స్పందించాలిబియ్యం అక్రమ రవాణాపై బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి అనుమతులు ఇప్పించారునిజమా కాదా..? గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచించుకోండి..