breaking news
-
‘చంద్రబాబు మిర్చి రైతులను పచ్చిమోసం చేస్తున్నారు’
గుంటూరు రాష్ట్రంలో ధరలు పతనమై తీవ్రంగా నష్టపోతున్న మిర్చిరైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు డ్రామాలతో కాలం గడుపుతున్నారని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పరిధిలోని మార్క్ ఫైడ్ నుంచి మిర్చి కొనుగోళ్ళు చేయించకుండా, కేంద్రప్రభుత్వం కొనుగోళ్ళు చేయాలని చంద్రబాబు కోరడం అర్థరహితమని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కూటమి ప్రభుత్వం మద్దతుధరకు కొనుగోలు చేయలేదని, దీనిని బట్టే మిర్చి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం తెట్టతెల్లమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంకా ఆయన ఏమన్నారంటే... రాష్ట్రంలో మిర్చి ధర దారుణంగా పతనమైంది. జనవరిలో హార్టీకల్చర్ విభాగం మిర్చి పంటకు సంబంధించిన నివేదికను ముందుగానే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో మిర్చిరైతులు సంక్షోభంలో ఉన్నారు, పెట్టుబడి వ్యయాలు పెరిగాయి, దిగుబడి తగ్గుతోంది, మిర్చి రేటు కూడా పడిపోతోంది, మార్కెట్ ఇంట్రవెన్షన్ లేకపోతే రైతులు దెబ్బతింటారు అని చాలా స్పష్టంగా ప్రభుత్వానికి నివేదించింది. అయినా కూడా సీఎం చంద్రబాబు స్పందించలేదు. చివరికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గారు మిర్చి రైతుల బాధలను తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో స్పందించింది. కనీసం ఇప్పటికైనా మిర్చిరైతుల సమస్యను గుర్తించి మద్దతుధరకు కొనుగోళ్ళు చేస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం తరుఫున ఒక్క క్వింటా మిర్చి కూడా కొనుగోలు చేయలేదు. పైగా మిర్చి రైతులను ఆదుకుంటున్నామంటూ సీఎం చంద్రబాబు డ్రామాలు ప్రారంభించారు.నాఫెడ్ ఎప్పుడైనా మిర్చికొనుగోళ్ళు చేసిందా?శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం రాసిన లేఖలో గత ప్రభుత్వంలో క్వింటా మిర్చి రూ.27వేల వరకు అమ్ముడుపోయింది. నేడు మిర్చిధర దారుణంగా పతనమైంది. వెంటనే కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సీఎం కోరారు. అసలు మిర్చి కొనుగోళ్ళకు కేంద్రప్రభుత్వానికి ఏం సంబంధం? నాఫెడ్ ఎప్పుడైనా కొనుగోళ్ళు చేసిందా? మార్క్ ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్ళు చేయించడానికి ఉన్నా కూడా సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఒకవేళ కేంద్రం స్పందించి ముందుకు వస్తే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మిర్చీని వారికి విక్రయించండి.వైఎస్సార్సీపీ హయాంలో మార్కెట్ ఇంట్రవెన్షన్2021లో వైఎస్సార్సీపీ హయాంలో మిర్చిరేటు పడిపోయినప్పుడు క్వింటాకు రూ.7వేలు మద్దతుధర ప్రకటించాం. ఈ రోజు ఉన్న రేట్ల ప్రకారం మిర్చికి కనీసం రూ.14 నుంచి 15వేల రూపాయల వరకు మద్దతుధరను ప్రకటించాల్సి ఉంది. ఆనాడు వైయస్ జగన్ గారు రైతులపక్షన నిలబడి మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించారు. రూ. 65వేల కోట్లను వెచ్చించి ధాన్యంను కొనుగోలు చేశాం. ఇతర పంటలకు సంబంధించి రూ.7800 కోట్లతో కొనుగోలు చేశాం. రూ.3000 కోట్లు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. కరోనా సమయంలో అరటి, గుమ్మడికాయలను కూడా కొనుగోలు చేశాం. వ్యవసాయరంగంలో వైయస్ జగన్ గారు విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా ఉండేలా రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యదోరణితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మల్లా ఐపీఎస్ అధికారులురేటులేక నష్టపోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్ళిన మాజీ సీఎం వైయస్ జగన్ గారు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు కుంటిసాకులు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించేందుకు సీఎం, వ్యవసాయ మంత్రులకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తే, కనీసం ఎందుకు అధికారులను అయినా పంపించలేదు? రైతుల పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రైతుల పక్షనా వారి బాధను అర్థం చేసుకునేందుకు వైయస్ జగన్ గారు గుంటూరు వెడితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారంటూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఇదే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విజయవాడలో మ్యూజికల్ నైట్ నిర్వహిస్తే దానికి సీఎం చంద్రబాబు, మంత్రులు హాజరైనా దానికి కోడ్ వర్తించదా? రైతుల కోసం వెళ్ళిన వైయస్ జగన్, ఇతర వైయస్ఆర్సీపీ నేతలపైనా కేసులు పెట్టడం కక్షసాధింపు కాదా? భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఒక మాజీ సీఎంకు ఉన్న జెడ ప్లస్ కేటగిరి సెక్యూరిటీని రైతులను పరామర్శించేందుకు వెళ్ళిన రోజున ఉపసంహరించారు. కుట్రపూరితంగానే భద్రతను తొలగించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. ఇందుకు రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలి. చంద్రబాబు, లోకేష్ చేతుల్లో కీలుబొమ్మలా ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రైతుల కోసం ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి మేం సిద్దంగా ఉన్నాం.’అని అంబటి స్పష్టం చేశారు. -
నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ స్టూడెంట్స్ వింగ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. గ్రూపు-2 అభ్యర్థులకు మేలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నియమించిన ఉద్యోగులను కూటమి ప్రభుత్వం తొలగిస్తోంది. శాశ్వత ఉద్యోగాల్లో కోతలు విధిస్తోంది. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ఉన్నవి తొలగించటం అన్యాయం’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘గ్రూప్-2 అభ్యర్థలను నమ్మించి వారి గొంతు కోశారు. అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామని నమ్మబలికి వారి జీవితాలను నాశనం చేశారు. ఈరోజు 92,250 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. వారందరి జీవితాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెలగాటమాడారు. నిరుద్యోగుల జీవితాలను సీఎం చంద్రబాబు నట్టేట ముంచారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలి. లేకపోతే వైఎస్సార్సీపీ తరపున రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం’’ అని రవిచంద్ర హెచ్చరించారు. -
రేపు అసెంబ్లీకి వైఎస్సార్సీపీ నేతలు.. ప్రధాన ప్రతిపక్ష హోదా డిమాండ్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రేపు(సోమవారం) అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేయనున్నారు. ఆ హోదాలో ఉంటేనే సభలో ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు గట్టిగా గళం విప్పాలని వైఎస్సార్సీపీ ప్లాన్ చేసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో తగిన సమయం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని పట్టబడనుంది.కూటమి ప్రభుత్వం కుట్రలను అసెంబ్లీ సాక్షిగా తిప్పి కొట్టేందుకు వైఎస్సార్సీపీ రెడీ అయింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే ఒక ప్లాన్ ను రూపొందించింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నది నాలుగు పార్టీలు మాత్రమే. అందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్సీపీకే రావాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశ్యంతో వ్యవహరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ హోదా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. ఆ హోదా ఇస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఎక్కడ గట్టిగా నిలదీస్తుందోననే భయంతో కూటమి పార్టీలు ఉన్నాయి. నిజానికి ప్రతిపక్షంగా గుర్తిస్తే కచ్చితంగా అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షానికి అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజల గొంతు విప్పటానికి ఒక హక్కుగా తగిన సమయం కూడా లభిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఈ అవకాశం ఉండదు. అందుకనే వైఎస్సార్సీపీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. వైయస్సార్ సీపీ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ ఇప్పటి వరకు ఈ పిటిషన్ పై తన అభిప్రాయాన్న చెప్పలేదు. అంటే ప్రజా సమస్యలపై గొంతెత్తే అవకాశం వైఎస్సార్సీపీకి ఇవ్వకూడదన్నదే తమ నిర్ణయమని చెప్పకనే చెప్పినట్లు అయింది.కూటమి నేతల కుట్రలు..వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఇష్టం లేదన్న సంగతి గతంలోనే కూటమి నేతల మాటల్లోనే తేలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనేకసార్లు మీడియా సమావేశాల్లోనే తమ బుద్దిని బయట పెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం వారిలో ప్రతిసారీ కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయటం లేదు. పైగా గతంలో జగన్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామనీ, ఏ పథకాన్ని నిలిపేసేది లేదని చెప్పిన చంద్రబాబును వైఎస్సార్సీపీ ఎక్కడ నిలదీస్తుందోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. మిర్చి రైతుల కోసం..అదేకాదు.. మిర్చి రైతులకు కనీసం గిట్టుబటు ధరలు కూడా లేకపోవటం దగ్గర్నుంచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లటం, మహిళలు-ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం, దారుణ హత్యల వరకు అన్ని అంశాలపై వైఎస్సార్సీపీ గట్టిగా నిలదీస్తుందనే భయంతో కూటమి నేతలు ఉన్నారు. గ్రూపు-2 అభ్యర్థులను మోసం చేసిన తీరు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనంపై వైఎస్సార్సీపీ చంద్రబాబు సర్కారుకు చుక్కలు చూపిస్తుందనే ఆందోళన కూటమి నేతల్లో ఉంది. ఇలా వరుస వెంబడి ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్సీపీ ఎక్కడ నిలదీస్తుందోననే భయంతో కూటమి నేతలు ఉన్నారు. సభ సాక్షిగా ప్రజల గొంతుకగా వైసీపీ నిలవడం, సమస్యలపై నిశితంగా మాట్లాడటం అనేది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సాధ్యం కాదు. కాబట్టే వైయస్సార్ సీపీకి ఆ హోదాను ఇచ్చేందుకు కూటమి పెద్దలు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదాపై శాసనసభలో డిమాండ్ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ డిమాండ్‌కు వెనుక ఉన్న సదుద్దేశాన్ని, న్యాయబద్ధతను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనని వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం సోమవారం జరగబోయే సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కానుంది. -
కూటమి.. చంద్రన్న పగ, దగ పథకాన్ని అమలు చేస్తోంది: కన్నబాబు
సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్.. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చంద్రబాబులాగా మోసం చేయడం వైఎస్ జగన్‌కు తెలియదని కన్నబాబు చెప్పుకొచ్చారు. గ్రూప్-2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కురుసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘నాకు బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎంతో బలంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూశారు.ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. సినిమా హీరోలను మించి వైఎస్ జగన్‌కు జనాలు వస్తున్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ 60 ఇచ్చేవారు. రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్ జగన్ చెప్పిందే చేస్తారు. పేదల పక్షపాతి వైఎస్ జగన్. ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడుతుంది. ప్రజల కోసం పోరాడుతుంది. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు, నేతలు ఎందరో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో వలసలు సాధారణం. జగన్ సేన అన్ని పార్టీల సేనల కంటే బలంగా ఉంది. లక్షా 20వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏమి చేశారో తెలియదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఆకేపాటి అమర్నాథరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
అన్నమయ్య జిల్లా: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. తాజాగా రాజంపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగింది. ఆకేపాడు గ్రామంలో భూములు ఆక్రమించారంటూ ఆకేపాటికి జిల్లా అధికారులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాల్సిందిగా ఆకేపాటికి జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. అయితే దళితుల ఇళ్లు, షాపులు కూలదోసారని ప్రశ్నించిన ఆకేపాటిని టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే చర్యల్లో భాగంగా భూముల ఆక్రమణ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపింది.ప్రజల పక్షాన ఉన్నందుకే నోటీసులుతాను ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించినందుకే నోటీసులు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. తనకు ఎన్ని నోటీసులు ఇచ్చినా, వేధింపులకు దిగినా భయపడేది లేదని ఆకేపాటి స్పష్టం చేశారు. తన భూముల్లో ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకోవచ్చని పేర్కొన్న ఆకేపాటి.. తాను విచారణకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. మీరేమి చేసుకున్నా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటానని ఎమ్మెల్యే ఆకేపాటి పేర్కొన్నారు. -
ఫైబర్ నెట్ క్లోజ్ చేసేలా చంద్రబాబు కుట్ర: గౌతంరెడ్డి
గుంటూరు, సాక్షి: లాభాల బాటలో నడిచిన ఫైబర్ నెట్‌ను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారని ఫైబర్ నెట్ కార్పోరేషన్(FiberNet Corporation) మాజీ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫైబర్ నెట్ ని లాభాల బాటలోకి తెచ్చాం. అలాంటి సంస్థని నాశనం చేసేందుకు కుట్ర పన్నారు. 2014-19లో చంద్రబాబు ఫైబర్ నెట్లో భారీగా అవినీతి చేశారు. అందుకే దానిపై మా హయాంలో విచారణ జరిపించాం. చంద్రబాబు అక్రమాలు, అవినీతిని సీఐడీ నిరూపించిందిచంద్రబాబు, యనమల రామకృష్ణుడు సంతకాలతోనే అవినీతి చేశారు. ఫైబర్ నెట్ లో ఇచ్చిన ప్రతి కాంట్రాక్టులోనూ చంద్రబాబు అవినీతి చేశారు. ఆ అవినీతిని జగన్ గుర్తించి విచారణ జరిపించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా చంద్రబాబు అవినీతి(Chandrababu Corruption) చేసి అరెస్టు అయ్యారు. ఇప్పుడు.. తన మీద ఉన్న కేసులను చంద్రబాబు మాఫీ చేయించుకుంటున్నారు. అందులో భాగంగానే ఫైబర్ నెట్ ని నిర్వీర్యం చేస్తున్నారు. సంస్థను పూర్తిగా క్లోజ్ చేసేలా కుట్ర పన్నారువైఎస్ జగన్ ప్రోత్సాహంతో మా హయాంలో రూ.190లకే ఇంటర్నెట్ ఇచ్చాం. సిగ్నల్ ప్రాబ్లం లేకుండా చర్యలు చేపట్టాం. ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో కనెక్షన్లు ఇచ్చాం. అందుకే మా హయాంలో ఫైబర్ నెట్ లాభాల బాట పట్టి ఆదాయం పెరిగింది. ఏడాదికి 1,000 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాం. కానీ.. చంద్రబాబు కుట్రతో ఫైబర్ నెట్ ని క్లోజ్ చేయబోతున్నారు. మా హయాంలో 20 లక్షల బాక్సులను కేంద్రం నుండి ఉచితంగా వచ్చేలా మేము ఏర్పాటు చేశాం. వాటిని ఈ ప్రభుత్వం తీసుకువచ్చి ఫైబర్ నెట్ కి ఆదాయం పెంచాలి. అంతేగానీ సంస్థలను నాశనం చేయవద్దు. తనమీద ఉన్న కేసుని తప్పించుకోవటానికి చంద్రబాబు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే కేసును ఎదుర్కోవాలి. రైతుల కోసం మిర్చి యార్డుకు వెళ్లిన జగన్ పై కేసు పెట్టారు. మరి మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న చంద్రబాబు మీద ఎందుకు పెట్టలేదు?. ఎలక్షన్ కమిషన్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మీడియా సంస్థలను తమ చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోంది. -
‘దిశ’ పేపర్లు చించేసి ‘సురక్ష’ తెస్తున్నారా?: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ‘దిశ’ యాప్‌ను నిర్వీర్యం చేశారని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్. రాష్ట్రంలో అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. అమ్మాయిలపై జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘ఏపీలో మహిళల రక్షణ కోసం వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ ‘దిశా’ యాప్ తెచ్చారు. దిశా యాప్‌ను కోటి యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఏ మహిళ, ఆడపిల్ల ఆపదలో ఉన్నా ఈ యాప్ ద్వారా రక్షణ పొందే అవకాశం కల్పించారు. క్షణాల్లోనే బాధితులను కాపాడిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దిశను నిర్వీర్యం చేశారు.అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ప్రజల నుండి తీవ్ర విమర్శలు వచ్చేసరికి మళ్ళీ సురక్ష పేరుతో యాప్‌ను తీసుకువస్తున్నారు. ఇప్పటికే దిశా యాప్, పోలీసు స్టేషన్లు, వాహనాలు ఉన్నాయి. వాటిని సక్రమంగా వాడుకుని మహిళలను రక్షించండి. గతంలో ఈ యాప్‌ను తెచ్చినప్పుడు ఇప్పటి హోంమంత్రి అనిత పేపర్లను తగులబెట్టారు. ఇప్పుడు మళ్ళీ సురక్ష పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జనసేన, టీడీపీకి చెందిన కొందరు నేతలు.. మహిళలపై అఘాయిత్యాలు పాల్పడ్డారు. వారిపై కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వారిపై ఏం చర్యలు తీసుకున్నారు. ఇటువంటి కూటమి పాలనలో మహిళలకు ఇంకేం రక్షణ ఉంటుంది?’ అని ఘాటు విమర్శలు చేశారు. -
పవన్ కల్యాణ్ ఇలాంటి సైకోలను తయారుచేసి పంపించాడా?
సాక్షి, ఏలూరు: పోలవరం(Polavaram)ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై(Janasena MLA Chirri BalarajuJanasena MLA Chirri Balaraju) అసమ్మతి గళాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే, జనసేన నాయకుల తీరుపై ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఆవేదనతో శు క్రవారం ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని ప్రకటించిందని, ఇక్కడ మాత్రం జనసేన మండల ప్రెసిడెంట్ ట్రాక్టర్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నా రని ఆ సెల్ఫ్ లో ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇలాంటి సైకో ఎమ్మెల్యేను తయారు చేసి ఇక్కడికి పంపించాడా అంటూ ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త కూడా ఇటువంటి సెల్ఫీ వీడియోలు పెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు చేరేలా చూడాలని చెప్పారు. బోర్ వేసుకోవాలన్నా, వృద్ధాప్య పింఛన్ కావాలన్నా, బెల్ట్ షాపు పెట్టుకోవాలన్నా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే గత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎంతో బెటర్ అంటూ చెప్పారు. ఆఖరికి పొలంలో బోరు వేసుకోవాలన్నా రూ.25 వేలు లంచంగా అడుగుతున్నారంటూ తెలిపారు. బెల్ట్ షాపు పెట్టుకోవాలంటే రూ.1.50 లక్షలు, వీఆర్వోల బదిలీకి రూ.10 వేల నుంచి రూ.లక్ష, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భూములు మార్చుకుంటే రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారంటూ వివరించారు. రాత్రి సమయానికి ఆ కార్యకర్త మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను తాను గతంలో మనస్పర్థలు ఉన్నప్పుడు చేశానని, దానిని కొంతమంది కా వాలనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసు పెడతానంటూ ఆ కార్యకర్త అందులో పేర్కొనడం గమనార్హం. -
‘మద్దతు ధర ఆలోచన అప్పుడే ఎందుకు చేయలేదు?’
విశాఖ : మిర్చి రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేదని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మిర్చి రైతులను పరామర్శించే వరకూ మీరు స్పందించ లేదంటే ఏమనుకోవాలని బొత్స నిలదీశారు.‘కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చెప్పడం ఎంత వరకు సమంజసం. వైఎస్ జగన్మోహన్రెడ్డి మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసింది. మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేదు..రైతులు, వ్యవసాయం దండగ అనే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేదు. మిర్చి రైతులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లడం ఇల్లీగల్ యాక్టివిటీ అయితే అట్టహాసంగా విజయవాడలో జరిగిన మ్యూజికల్ నైట్ లీగల్ అవుతుందా...? .విశాఖలో జరిగిన భూ కుంభకోణాల పై విచారణ నివేదికల ను బహిర్గతం చెయ్యాలి. బురదజల్లడం కాదు ఆరోపణలు నిరూపించాలి...ఆ బాధ్యత ప్రభుత్వానిదే. జెడ్ కేటగిరీలో వున్నమాజీ ముఖ్యమంత్రి భద్రత ఎందుకు కుదిరించారు అని గవర్నర్ ఆశ్చర్య పోయారు. జగన్ భద్రత తనకు సంబంధం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి.....మిర్చి యార్డ్ సందర్శనకు వెల్లడం ఇల్లీగల్ అని ఎలా చెబుతారు’ అని బొత్స సూటిగా ప్రశ్నించారు. -
‘పసిపాపపై పిచ్చిపోస్టులు పైశాచికత్వానికి పరాకాష్ట ’
తాడేపల్లి: తమకిష్టం లేని పార్టీని, తమకు నచ్చని వ్యక్తులను ఎవరైనా అభిమానిస్తే ఊరుకునేది లేదు అన్నట్టుగా అధికార తెలుగుదేశం, జనసేన పార్టీలు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కక్ష సాధింపులకు దిగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ఆక్షేపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియతో మాట్లాడుతూ సోషల్ మీడియాను మంచి కోసం వాడుకుందామని భారీగా ఖర్చుతో ప్రచారం చేస్తూనే ఇంకోపక్క తమకు నచ్చని వారిని అసభ్యమైన పోస్టులతో దాడి చేసి వేధిస్తున్నాయని చెప్పారు.తన కూతురిపై పోస్టు పెట్టారని నొచ్చుకున్న పవన్‌కళ్యాణ్, వారిపై కేసులు పెట్టించి జైలుకు పంపే దాకా నిద్రపోలేదు. తాజాగా కుంభమేళాలో ఆ పార్టీ విడుదల చేసిన ఫొటోలపై కూడా మార్ఫింగ్ అంటూ అరెస్టు చేస్తున్నారు. అలాంటిది దేవిక లాంటి చిన్నారని డిప్యూటీ స్పీకర్ నుంచి కింది స్థాయి జనసేన, టీడీపీ కార్యకర్తలు వేధిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తక్షణమే డీజీపీ స్పందించి నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.తమకు నచ్చకపోతే ఎవరూ అభిమానించకూడదా?:కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకులకు, అధికారులకు మాత్రమే పరిమితం చేయలేదు. నిన్నటిదాకా సామాజికవర్గాలను టార్గెట్ చేసిన టీడీపీ, జనసేన ఇప్పుడు మరింత బరి తెగించి కుటుంబాలను, చిన్న పిల్లలను సైతం వదలకుండా కక్ష తీర్చుకుంటున్నారు. తమకిష్టం లేని పార్టీలు, వ్యక్తులపై ఎవరైనా అభిమానం చూపిస్తే తట్టుకోలేక వారిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడినా వదలకుండా వేధిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న పచ్చ ముఠా.. అసభ్యకరమైన పోస్టులతో సోషల్ మీడియా వేదికలపై పేట్రేగిపోతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.అక్రమ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించడానికి, జగన్‌గారు అక్కడికి వెళ్లిన సందర్భంగా ఒక చిన్నారి కలిసి ఫొటోలు దిగితే దాన్ని కూడా టీడీపీ ఓర్చుకోలేకపోతుంది. మాజీ సీఎం జగన్‌పై అభం శుభం తెలియని ఒక చిన్నారి చూపించిన ప్రేమను కూడా వక్రీకరించి పోస్టులు పెడుతున్నారు.జర్నలిజం విలువలకు తిలోదాకలిచ్చి.చివరకు పచ్చ మీడియా ఛానల్లో, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న నాయకుడిని తీసుకొచ్చి, డిస్కషన్లో కూర్చోబెట్టి, వెకిలి మాటలతో వికృతానందం పొందారంటే.. ఏ స్థాయికైనా దిగజారడానికి వారు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది. ఇవేనా జర్నలిజం విలువలు?. అలాంటి పదవిలో ఉన్న ప్రజాప్రతినిధి తన మనవరాలి వయసున్న పాప గురించి దారుణంగా మాట్లాడటం సంస్కారమేనా? ఆయనతో పాటు తెలుగు 360 అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి కొల్లి గోపాల్ అనే వ్యక్తి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలతో, తప్పుడు వివరాలతో ట్రోల్ చేశారు.చివరకు అనూష ఉండవల్లి, స్వాతి చౌదరి అనే హ్యాండిల్స్ నుంచి తెలుగుదేశం మహిళలు కూడా చిన్న పాపని ట్రోలింగ్ చేస్తున్నారంటే ఇంకేమనాలి. ఆఖరుకి తల్లిదండ్రులను కూడా మార్చేసి తప్పుడు వివరాలతో పోస్టులు వైరల్ చేస్తున్నారు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఈ పాపంలో జనసేన సోషల్ మీడియా కూడా భాగం పంచుకుంది. ఆ పాప ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం చదవకూడదా? ప్రభుత్వం నుంచి అమ్మ ఒడి అడగకూడదా? పేద మధ్యతరగతి పిల్లలు ఎప్పటికీ అట్టడుగున ఉండిపోవాలా?ఎంత వరకు సబబు. ఆలోచించాలిరాజకీయ కక్షలకు చిన్నపిల్లలను, సామాన్యులను బలి చేయడం ఎంత వరకు సబబు అని ఆలోచించుకోవాలి. దేవికారెడ్డి అనే చిన్నారిపై తప్పుడు పోస్టులు పెట్టిన జనసేన, టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తక్షణమే పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని డీజీపీని కోరుతున్నా. వారిని చట్టపరంగా చర్యలు తీసుకునేలా హోంమంత్రి అనిత ముందుకు రావాలని పోతిన వెంకట మహేష్ కోరారు. -
సీఐడీలో C అంటే చంద్రబాబేనా?
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.చంద్రబాబు(Chandrababu) గతంలో వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీరాజగురు రుణం తీర్చుకుంటూ..ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. చంద్రబాబు పవర్లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
ఆ ట్రోలింగ్‌ను పవన్, బాబు ఖండించరా?
అనంతపురం, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. ..కావాలనే వైఎస్ జగన్ భద్రత(YS Jagan Security)పై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైంది.రాజకీయ విలువల్లేవా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం(TDP Trolling) చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. -
అసలు ఇంతకీ తప్పు ఎవరిది?
ఐఏఎస్, ఐపీఎస్, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న సీఎస్ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్ జవహర్ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్ పేరుతో అరాచకాలకు పాల్పడుతుంటే ఐపీఎస్ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీలో అసమ్మతి.. ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చించేసిన పచ్చ నేతలు
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే తిరగబడుతున్నారు. అసమ్మతి నేతలు టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించివేయడం ఆసక్తికరంగా మారింది. కాగా, సదరు ఎమ్మెల్యే.. అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలే ఇందుకు కారణమని అసమ్మతి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు.ఉదయగిరి నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి పీక్ స్టేజ్ చేరుకుంది. ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను అసమ్మతి నేతలు చించివేశారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరో వర్గం టీడీపీ నేతలు చించేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతకుముందు.. జలదంకి, వరికుంటపాడుతో పాటు తాజాగా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు.అయితే, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అగ్రిగోల్డ్ భూముల్లో అక్రమాలపై సొంత పార్టీ నేతలే ఆగ్రహంగా ఉన్నట్టు స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, సొంత పార్టీలోనే ఇలా అసమ్మతి నేతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే సురేష్‌కు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. -
రైతుల పట్ల ఇదేనా చిత్తశుద్ధి?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తూ.. మిరప రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చించేందుకు వెళ్తున్నట్లు ఎందుకీ కలరింగ్..? ఎవరి కోసం ఈ కలరింగ్..? ఇదేనా రైతుల పట్ల మీ చిత్తశుద్ధి? అని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan mohan Reddy)ధ్వజమెత్తారు.ఈ ప్రభుత్వం కష్టాల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి.. వారికి బాసటగా వెళ్లిన తమపై కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మిరప రైతుల విషయంలో టీడీపీ కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరును తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఎండగట్టారు. ట్వీట్లో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..⇒ తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు 10 క్వింటాళ్లకు పడిపోయిన దుస్థితి నెలకొంది. కొనేవారు లేక క్వింటాల్ రూ.10 వేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి. పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు రూ.1.50 లక్షల పైమాటే. కోతల అనంతర ఖర్చులు దీనికి అదనం. ఇంతటి సంక్షోభం కళ్లెదుట కనిపిస్తున్నా.. మేం స్పందించేంతవరకూ మీలో కదలిక లేదు. మీరు ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ.. మిర్చి రైతుల కోసమే వెళ్తున్నట్లు యథావిధిగా కలరింగ్ ఇస్తున్నారు.⇒ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ఎప్పుడూ, ఏ రాష్ట్రంలోనూ, ఎక్కడా మిర్చిని కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏమిటి? మీ బాధ్యతను వేరేవాళ్ల మీద నెట్టడం ఏమిటి? మీరు చేయాల్సిన పనులు చేయకుండా సాకులు వెతుక్కోవడం ఏమిటి? ఈ రకంగా రైతులను మోసం చేస్తున్నారు. ⇒ 2021లో పెట్టుబడి ఖర్చులు ఎకరాకు రూ.లక్ష ఉన్నప్పుడు.. ఎకరాకు 20 క్వింటాళ్ల్లకుపైగా దిగుబడులు వచ్చినప్పుడు కనీస మద్దతు ధర రూ.7 వేలుగా నిర్ణయించాం. గతంలో మీరెప్పుడూ మిర్చికి కనీస మద్దతు ధరలు ప్రకటించలేదు. ఐదేళ్ల క్రితం.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంటలతోపాటు మరికొన్ని పంటలను అదనంగా చేర్చి మొత్తంగా 24 పంటలకు మద్దతు ధరలు ప్రకటించి పోటీ వాతావరణంతో ధరలు పడిపోకుండా అడ్డుకోవడమే కాకుండా ధరలు పెరిగేటట్టు చూశాం.⇒ ఆ ధరలు ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అయింది. మరి ఐదేళ్ల తర్వాత పెట్టుబడి ఖర్చులు పెరగవా? అప్పట్లో మిర్చి సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు అయితే ఇప్పుడు రూ.లక్షన్నరకు పైగా వ్యయం అవుతున్న మాట వాస్తవం కాదా? దీనికి కోతల అనంతర ఖర్చులు అదనమన్న విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్త మద్దతు ధరలు ప్రకటించి రైతులను ఆదుకోవడానికి మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వమే ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ⇒ మా హయాంలో (వైఎస్సార్ సీపీ ప్రభుత్వం) మిర్చి రైతులకు మంచి ధరలు వచ్చాయని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాసిన లేఖలో మీరే చెప్పారు. మీరు రాసిన లేఖ ప్రకారమే మా హయాంలో మిర్చికి మోడల్ ధర రూ.20 వేలు ఉంటే గరిష్ట ధర రూ.27 వేలు పలకడం వాస్తవం కాదా?⇒ మిర్చి రైతుల కడగండ్లపై ఈ జనవరిలో ఉద్యాన శాఖ అధికారులు నివేదించిన తర్వాత అయినా మీరేమైనా కనీసం పట్టించుకున్నారా? మిర్చి రైతుల పరిస్థితి అన్యాయంగా ఉందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నివేదిక ఇచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? పైగా తప్పుడు రాజకీయాలు చేస్తూ, మిర్చి కొనుగోళ్లతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి చేతులు దులుపుకొంటారా? మీ చేతిలో ఉన్న మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయకుండా ఎప్పుడూ మిర్చి కొనుగోళ్లు చేయని నాఫెడ్ ద్వారా కొనాలంటూ లేఖ రాయడం రైతులను నిలువునా మోసం చేయడం, మభ్యపెట్టడం కాదా? ⇒ మిర్చి రైతులకు బాసటగా వెళ్లినందుకు మాపై కేసులు పెట్టారు. మరి ఫిబ్రవరి 15న మీరు పాల్గొన్న మ్యూజికల్ నైట్‌కు ఎన్నికల కోడ్ అడ్డం రాలేదా? నేను మిర్చి రైతులను కలుసుకుంటే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా? పైగా మేం ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. నిన్నటి కార్యక్రమంలో ఫలానా వారికి ఓటు వేయమని కూడా చెప్పలేదు. కనీసం మైక్‌లో కూడా మాట్లాడలేదు. అయినా అన్యాయంగా కేసులు మోపడం అప్రజాస్వామికం కాదా?⇒ మీ హయాంలో పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నది వాస్తవం కాదా? పత్తి, పెసర, మినుము, కంది, టమాటా, మిర్చి, మొన్న ధాన్యం సహా అన్ని పంటల రైతులకు కనీస మద్దతు ధరలు లభించక మీరే వారిని సంక్షోభంలో నెట్టిన మాట వాస్తవం కాదా?⇒ మా హయాంలో ధాన్యం కొనుగోళ్లకు రూ.65 వేల కోట్లు ఖర్చు చేయడమే కాకుండా ఇతర పంటల కొనుగోళ్లకు దాదాపు మరో రూ.7,800 కోట్లు ఖర్చుచేసి రైతన్నలకు అండగా నిలిచాం.⇒ రైతుల కోసం మేం సృష్టించిన మొత్తం వ్యవస్థలను మీరు నిర్వీర్యం చేశారు. ఆర్బీకేలు, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరల పోస్టర్లు ప్రదర్శించే విధానం, సీఎం యాప్ ద్వారా కొనుగోలు చేసే విధానం, నాణ్యతను ధ్రువీకరిస్తూ ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను రైతులకు అందుబాటులోకి తెచ్చే విధానం, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ల వ్యవస్థ, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ నంబరును నిర్వహించే వ్యవస్థ, ఆర్బీకేల్లో కియోస్క్‌లతో రైతులకు తోడుగా నిలిచే విధానం, సున్నా వడ్డీ, పెట్టుబడి సహాయం, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి.. ఇలా మొత్తంగా వ్యవసాయ రంగంలో మేం తెచ్చిన విప్లవాత్మక విధానాలు, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. వ్యవసాయం దండగ అన్న మీ ఆలోచన, మైండ్ సెట్ ఏమాత్రం మారలేదు చంద్రబాబూ!⇒ మీ తప్పుడు కేసులకు భయపడి ప్రజా పోరాటాలు ఆపేది లేదు. నేను రైతుల పక్షపాతిని, ప్రజల పక్షపాతిని. మీరు ఎన్ని కేసులు బనాయించినా రైతుల కోసం, ప్రజల కోసం కచ్చితంగా నిలబడతా. చంద్రబాబూ..! ఇప్పటికైనా తక్షణమే మిర్చి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోండి. ఈ సంక్షోభం నుంచి అన్నదాతలు బయట పడేలా, వారికి ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే కొనుగోళ్లు ప్రారంభించండి. -
వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు
సాక్షి,తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చియార్డులో మిర్చి రైతుల కన్నీళ్లు తుడవగానే సీఎం చంద్రబాబు,లోకేష్, ఎల్లో మీడియా కంట్లో కారం పడినట్లైంది. అందుకే వైఎస్ జగన్ రైతులను పరామర్శించడం ఇల్లీగల్ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్ భద్రత తొలగించినట్టు అంగీకరించారు.వైఎస్ జగన్ పర్యటనలో ఏం జరిగిందంటే?అన్నదాతలను పరామర్శించి భరోసా కల్పించేందుకు గుంటూరు మిర్చి యార్డు వద్దకు వచ్చిన మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి సర్కారు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆయన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎం పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రశ్నార్థకంగా మారింది.వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు.చంద్రబాబు సన్నాయి నొక్కులుఈ క్రమంలో వైఎస్ జగన్ భద్రత విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీడియా చంద్రబాబును ప్రశ్నించింది. వైఎస్ జగన్ భద్రతపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు చేశారు. రైతులను పరామర్శించడం ఇల్లీగల్. ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ ఉద్దేశ్యపూర్వకంగానే వైఎస్ జగన్‌కు భద్రత తొలగించినట్టు అంగీకరించారు. అది ఎన్నికల కమిషన్ నిర్ణయమంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.థమన్‌తో చంద్రబాబు కుటుంబం మ్యూజికల్ నైట్స్ఇటీవల విజయవాడలో చంద్రబాబు కుటుంబం థమన్ మ్యూజికల్ నైట్స్ నిర్వహించింది. దీన్ని ప్రస్తావిస్తూ మ్యూజికల్ నైట్స్ ఉన్న విలువ..రైతులకు లేదా..? అని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. చంద్రబాబు కుటుంబం గత, శనివారం సాయంత్రం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘యూఫోరియా మ్యూజికల్ నైట్’ (Euphoria Musical Night)నిర్వహించింది. ఇందులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,హోమంత్రి అనిత, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు ఇతర కుటమి నేతలు సైతం హాజరయ్యారు. దీని రాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మ్యూజికల్ నైట్స్ నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నిస్తున్నారు.వైఎస్ జగన్‌పై కేసు నమోదు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకోలేకపోయిన కూటమి ప్రభుత్వం.. మరో కుట్రకు తెరతీసింది. మిర్చి యార్డులో పర్యటించి రైతుల గోడు విన్నందుకుగానూ ఆయనపై కేసు(Case Against YS Jagan) పెట్టింది. ఎలాంటి సభ, మైక్ ప్రచారం నిర్వహించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.మిర్చి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బుధవారం గుంటూరుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనకుగానూ మాజీ సీఎం హోదాలో కూడా ఆయనకు ప్రభుత్వం ఎలాంటి భద్రత ఇవ్వలేదు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో పాటు భద్రతా వ్యవహారంపై ఆయన సీఎం చంద్రబాబును నిలదీశారు కూడా. అయితే వైఎస్ జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు కొందరు నల్లపాడు పీఎస్(Nallapadu Police Station)లో ఫిర్యాదు చేశారు. దీంతో వాళ్ల ఒత్తిడి మేరకు పోలీసులు జగన్‌పై కేసు నమోదు చేశారు. -
‘వైఎస్ జగన్‌కు ఏ విధంగా భద్రత తొలగిస్తారు?’
విశాఖ. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జడ్ ప్లస్ కేటగిరిలో ఉన్న భద్రతను ఏ విధంగా తొలగిస్తారని ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ భద్రతపై తామంతా ఆందోళన చెందుతున్నామని, ఆయనకు యధావిధిగా భద్రత కొనసాగించాలని కన్నబాబు కోరారు. వైఎస్ జగన్ జడ్ ప్లస్ భద్రత అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాల్సిన అవసరం ఉందన్నారు.వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ పై తన కడుపు మంటను చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే తప్పుడు కేసులు పెడతారా అంటూ నిలదీశారు కురసాల కన్నబాబు. మీ మ్యూజికల్ నైట్ కి ఎన్నికల కోడ్ అడ్డంకి రాలేదా అని ప్రశ్నించారు. మిర్చి రైతులను వైఎస్ జగన్ పరామర్శిస్తే గానీ చంద్రబాబులో చలనం రాలేదని ధ్వజమెత్తారు.మోదీ, అమిత్ షాలకు మిథున్‌రెడ్డి లేఖప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. -
జగన్ వస్తే.. కూటమి సర్కార్‌కు ఎందుకంత కంగారు?: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంతో కూటమి సర్కార్‌కు కంగారు పుట్టిందని.. ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి.. వైఎస్ జగన్ అదే పని చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తుందన్నారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.‘‘మిర్చి రైతుకు సరైన ధర లభించలేదని.. ఒప్పుకుంటూ గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రికి అవసరమైన భద్రతను ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోయింది?. ప్రభుత్వం ఇప్పటి వరకు గిట్టుబాటు ధర నిర్ణయించలేదని మంత్రులు చెప్పడం విడ్డూరం. రైతు నష్టపోతున్నా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం దారుణం. క్వింటాల్ తర్వాత 11 వేల 600 చొప్పున కొనుగోలు చేయాలని ఉద్యానవన శాఖ రిపోర్ట్ ఇచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా రిపోర్టును పక్కన పడేశారు. తీవ్రమైన అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు’’ అని వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ఓ చిన్నారి వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీయించుకోవటానికి ప్రయత్నిస్తే ఐటీడీపీ దారుణంగా ట్రోల్ చేసింది. విమర్శలు, ప్రతిపక్షాల నోరు నొక్కడం ద్వారా పాలన కొనసాగించాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి పక్ష నేత సమస్యలను పరిశీలించడానికి వెళ్ళినా కేసు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం దారుణం’’ అని వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. -
ప్రధాని, హోంమంత్రులకు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్‌కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ పర్యటనకు వెళ్ళిన వైఎస్ జగన్‌కు పోలీసులు రక్షణ కల్పించలేదు. జగన్ పర్యటనలో తీవ్రమైన భద్రత వైఫల్యం తలెత్తింది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి వివరించారు.జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి. ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి. ఇవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న ఘటనలు. వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రత వైఫల్యం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది’’ అని లేఖలో మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లుకాగా.. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించింది. మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పింది: కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు కేఎస్ఎన్ కాలనీ వద్ద రూ. 22 కోట్ల 44 లక్షల రూపాయల నిధులతో 30 గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న(బుధవారం) రాత్రి సమయంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు జేసీబీతో శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.ధ్వంసం అయిన శిలాఫలకాన్ని మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ. పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడుతూ.. శిలాఫలకాన్ని జేసీబీతో కూల్చడం హేయమైన చర్య అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పి, అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కొట్టు సత్యనారాయణ అన్నారు. -
చిన్నారిపై ఇదేం సైకోయిజం బాబు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy)పై ఐటీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిన్నారిపై ఐటీడీపీ చేస్తున్న విష ప్రచారంపై విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థిని దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతలు సైకోల్లా వ్యవహరిస్తున్నారు.దేవికను మానసికంగా వేధిస్తున్నారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయి.దేవికపై తప్పుడు ప్రచారం చేసిన ఐటీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. గతంలో వైఎస్ జగన్వల్లే తనకు ఇల్లు వచ్చిందన్న గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియాలో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పుడు విద్యార్థినిపై అదే తరహాలో సైకోల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు’
సాక్షి,నెల్లూరు: రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్లు మూసుకుని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యార్డులో రైతు సమస్యల్ని స్వయంగా అడిగి తెలుసుకుంటే.. గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘గతంలో ఏనాడూ నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోళ్లు జరపకపోయినా మిర్చి రైతులను ఆదుకోవాలని కోరుతూ నాఫెడ్‌కి బోగస్ లేఖ రాసిన సీఎం చంద్రబాబు, మరోసారి రైతులను దారుణంగా వంచించారని స్పష్టం చేశారు. మిర్చి రైతులపై చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్)లో రైతులను ఆదుకోవాలని కోరేవారని ఆయన వెల్లడించారు. రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదు కాబట్టే, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ గురించి పట్టించుకోలేదని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారన్న ఆయన, జగన్ పర్యటనలను అడ్డుకునే ఉద్దేశంతోనే, గుంటూరు మిర్చియార్డు సందర్శనలో ఏ మాత్రం భద్రత కల్పించలేదని అన్నారు. జగన్ పర్యటనతోనే రైతుల సమస్యలపై ప్రభుత్వంలో చలనం మొదలైందని చెప్పారు.ప్రశ్నిస్తే కేసులు పెడతారా?:రైతుల అవస్థలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు. టీడీపీ కూటమి పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఒకవైపు దిగుబడులు పడిపోయి, మరోవైపు మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్ నిన్న (బుధవారం) గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడితే కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. రైతులకు అండగా నిలవాలని జగన్ వెళితే, వాస్తవాలను మరుగుపర్చి ప్రజల దృష్టి మళ్లించేందుకు విష ప్రచారం చేస్తోంది. ‘మమ్మల్ని ప్రశ్నిస్తే మీపై బురద జల్లుతాం’.. అన్నట్లుంది ప్రభుత్వ వ్యవహారం. ఆఖరుకి రైతులను కూడా అవమానించే విధంగా ప్రభుత్వం, ఎల్లో మీడియా వ్యవహరిస్తోంది.ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించ లేదు:‘జగన్ జనంలోకి వెళ్లకూడదు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. తమ వైఫల్యాలు ప్రజల వద్ద ఎండగట్టొద్దు’.. అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహారం. అందుకే జగన్ జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నా, ఆయన గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో కనీస భద్రత కూడా కల్పించలేదు. చివరకు రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేయలేదు. ‘నడిచొచ్చే నిలువెత్తు అబద్ధం చంద్రబాబు. ఆయన్ను సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించకూడదు. రైతుల సమస్యలపై అస్సలు అడగకూడదు. ఏమడిగినా అధికారం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెడతాం’.. అన్నట్లుగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్‌పైనా కేసు పెట్టారు.ఇదే నా ఛాలెంజ్:జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. రైతుల సమస్యలపై కనీసం చర్చ మొదలైంది. ప్రభుత్వం రైతులను గాలికొదిలేసినప్పుడు, వారి బాధ్యతను గుర్తు చేయడానికి మాజీ సీఎం జగన్ పర్యటిస్తే, దానిపై ఆక్రోషం వెళ్లగక్కుతున్న చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ నాయకులకు నా ఓపెన్ ఛాలెంజ్. మీరు నేరుగా మిర్చి యార్డుకు వెళ్లి రైతుల సమస్యల గురించి అడిగి రాగలరా? మిర్చి రైతులు మిమ్మల్ని కారం దంచినట్టు దంచకుండా వదిలిపెట్టరు.నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు పచ్చి అబద్ధం:అచ్చెన్నాయుడి ప్రెస్‌మీట్ చూస్తే.. టీడీపీ ఆఫీసు నుంచి వచ్చిన పేపర్ చదవడం తప్ప, ఆయనకు రైతుల సమస్యలపై ఏ మాత్రమైనా అవగాహన ఉందా? అనే అనుమానం కలిగింది. అలాంటి వ్యక్తి వ్యవసాయ మంత్రి కావడం మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. రైతుల కోసం నడుం బిగించినట్లు, నాఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ఒక బోగస్ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారు. ఈ లేఖ ద్వారా ఆయన రైతులను మరోసారి వంచించారు.గతంలో ఎప్పుడూ నాఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయడం జరగలేదు. మరి అలాంటప్పుడు మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, నాఫెడ్‌కు చంద్రబాబు లేఖలు రాయడం మిర్చి రైతులను మోసం చేయడం కాదా?.అది కూడా వాస్తవం కాదా?:మిర్చి రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఉద్యానవన శాఖ అధికారులిచ్చిన నివేదికలో, క్వింటాలుకు రూ.11,600 చొప్పున మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ఇస్తూ కనీసం 25 శాతం పంటను కొనుగోలు చేయాలని, ఇందుకోసం రూ.3,480 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవుతుందని చెప్పారు. ఆ మొత్తం భరించడానికి ఇష్టపడని చంద్రబాబు, ఆ ప్రతిపాదనను పూర్తిగా పక్కనపెట్టిన మాట వాస్తవం కాదా? మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కాకుండా మార్కెట్ ప్రైస్ సపోర్ట్ కింద నాఫెడ్ తరఫున కొనుగోలు చేయాలని లేఖ రాయడం చేతులు దులిపేసుకోవమే. చంద్రబాబు కేంద్ర మంత్రికి రాసిన లేఖ ప్రకారం చూసినా గత మా ప్రభుత్వంలో రైతుకు రూ.20 వేలకు తగ్గకుండా మద్దతు ధర లభించింది. ఒకవేళ గతం కంటే ఎక్కువ ధరకు మిర్చి కొనుగోలు చేసి ఉంటే, దావోస్‌లో మాట్లాడి నేనే చేయించానని చంద్రబాబు ప్రచారం చేసుకునే వాడు.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు:కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం మిర్చికి మాత్రమే కాదు, ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కని దుస్థితి. గత వైయస్సార్సీపీ పాలనలో దళారీ వ్యవస్థకు తావు లేకుండా పంటల కొనుగోళ్లు జరిపి రైతులను ఆదుకున్న ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ గాలికొదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా ఎత్తివేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేవలం మిర్చి పంటకే కాదు.. పసుపు, పత్తి, అరటి, ఉల్లి, పెసర, మినుము పంటలకు మద్దతు ధర కల్పించాం. కానీ నేడు చంద్రబాబు ఇస్తామన్నవి ఇవ్వకపోగా, గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు కూడా లేకుండా చేశారని కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు. -
జనం గుండెల్లో జగన్.. కూటమి గుండెల్లో రైళ్లు
వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఎక్కడకు వెళుతున్నా.. ఆయనను చూడడానికి ,మద్దతు ఇవ్వడానికి తరలివస్తున్న జనతరంగాలను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఎనిమిది నెలలకే ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇంతగా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటోందా? అనే ప్రశ్న సహజంగానే కలగనమానదు. కృష్ణా, గుంటూరు జిల్లాలను తమ గుండెకాయగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంటుంది. అలాంటి జిల్లాలలో ఒక సునామీలా వచ్చిన ప్రజలు.. జగన్‌కు జేజేలు కొట్టడం టీడీపీ కూటమి ప్రభుత్వంలో రైళ్లు పరిగెత్తిస్తుందేమో!. తప్పుడు కేసులో విజయవాడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఆ మరుసటి రోజు గుంటూరు మార్కెట్ యార్డులో గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతాంగం కష్టాలను ఆయన విన్నారు. ప్రత్యేక రవాణా ఏర్పాట్లు ఏమీ లేకుండానే ప్రజలు వారంతట వారే జగన్ కోసం వస్తున్న తీరును గమనిస్తే.. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ప్రజలలో వెల్లువెత్తుతున్న నిరసనే అని స్పష్టమవుతోంది. కూటమి సర్కార్ అమలు చేస్తున్న రెడ్ బుక్ పిచ్చికుక్క రాజ్యాంగంపై ప్రజల తిరుగుబాటా? అనే భావన కలుగుతోంది. గుంటూరులో పోలీసులు సరైన భద్రత కల్పించకపోయినా, జగన్ ప్రజల మధ్యనుంచే రైతుల వద్దకు వెళ్లి వారి బాధల గాధలు విన్నారు. విజయవాడలో జగన్ మీడియాతో చెప్పిన విషయాలు చూస్తే ఆయనలో ధైర్యం ఏ స్థాయిలో ఉందో కనిపిస్తుంది. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గేది లేదని జగన్ నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది. అలాగే పార్టీ క్యాడర్ లో కాని, లీడర్లలోకాని జగన్ నాయకత్వం పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. చచ్చేంతవరకు జగన్ తోనే అని మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఒక రకంగా.. ఇందుకు లోకేష్ పిచ్చి రెడ్ బుక్, చంద్రబాబు అబద్దాల సూపర్ సిక్స్, పవన్ కల్యాణ్ ఫెయిల్ కావడం.. ఇలా అన్ని కలిసి జగన్ పై ప్రజలలో మరింత ఆదరణ పెంచాయనిపిస్తోంది. వంశీని పలకరించి బయటకు వచ్చాక జగన్ మాట్లాడుతూ కూటమి సర్కార్ పైన, పోలీసు యంత్రాంగం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కమ్మ సామాజికవర్గంలో నాయకులుగా ఎదుగుతున్న కొడాలి నాని, వంశీ, దేవినేని అవినాశ్, శంకరరావు ,బ్రహ్మనాయుడు వంటి వారిని అణచివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమకు పోటీ వస్తారనుకునేవారిని దెబ్బతీయడానికి చంద్రబాబు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారన్నది వాస్తవం. గతంలో కూడా ఇలాంటి అనుభవాలు లేకపోలేదు. 👉చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు 1986 ప్రాంతంలో మంత్రిగా ఉండేవారు. అప్పట్లో చంద్రబాబు కర్షక పరిషత్ ఛైర్మన్ గా ఉండేవారు. వీరిద్దరూ కలిసి జిల్లాలో ఏదైనా సభలో పాల్గొన్నప్పుడు ముద్దు కృష్ణమకు ఎవరైనా ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు సహించేవారు కాదట. ఈ విషయాన్ని ముద్దే చెప్పేవారు. 👉అంతెందుకు.. ఎన్.టి.రామారావును పదవి నుంచి దించేసినప్పుడు తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. తీరా పని పూర్తి అయి తాను ముఖ్యమంత్రి అవ్వగానే దగ్గుబాటికి మొండిచేయి చూపించి ఆయన పార్టీలోనే ఉండలేని స్థితి కల్పించారు. 👉జూనియర్ ఎన్.టి.ఆర్.ను 2009 లో ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. తదుపరి ఆయన లోకేష్‌కు పోటీ అవుతారని తలచి పక్కనబెట్టేశారు. ఇలా.. చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. కమ్మ సామాజికవర్గాన్ని తన రాజకీయం కోసం పూర్తిగా వాడుకుంటారు. అదే టైంలో తన సామాజిక వర్గంలో ఎవరికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా.. పేరు రాకుండా జాగ్రత్తపడతారు. టీడీపీలో ఇప్పుడు ఎందరో సీనియర్లు ఉన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఇక.. పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు ఉన్న అధికారాలు అంతంతమాత్రమే అని చెప్పాలి. ఇది ఒక కోణం అయితే వంశీ కేసును ప్రస్తావించి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. వంశీపై ఏ రకంగా తప్పుడు కేసు పెట్టారో ఆయన సాక్ష్యాధారాలతో సహా వివరించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో సత్యవర్దన్ అనే వ్యక్తి పదో తేదీన కోర్టులో తనకు ఫిర్యాదుకు సంబంధం లేదని చెబితే.. ఆ మరుసటి రోజు వంశీ అతనిని కిడ్నాప్ చేశారని పోలీసులు కేసుపెట్టారట. దీనికి మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడో ఒక లిఫ్ట్ లో వీరిద్దరు ఉన్న ఏదో వీడియోని చూపించి మభ్య పెట్టే యత్నం చేసినట్లుగా ఉంది. వంశీని జగన్ కలవడం, అక్కడకు వేలాదిగా అభిమానులు తరలిరావడం తో రెడ్ బుక్ బాధితులందరికి నైతిక స్థైర్యం ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా పోలీసులను ఆయన తప్పు పట్టిన తీరుపై కొందరు ఆక్షేపణ చెబుతున్నారు. విశేషం ఏమిటంటే గత కొద్ది రోజులుగా హైకోర్టు కూడా ఆయా కేసులలో విచారణ చేస్తూ ఏపీ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోంది. కేసు పెట్టడం, లోపల వేయడం, కొట్టడం తప్ప ఏమైనా చేస్తున్నారా? అని పోలీసు అధికారులను ప్రశ్నించిన తీరుకు నిజంగా ఆ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. జగన్ ప్రభుత్వ టైమ్ లో చంద్రబాబు,లోకేష్ లు అప్పటి ప్రభుత్వంలోని వారిపైనే కాకుండా, పోలీసు అధికారులపై కూడా ఇష్టం వచ్చినట్లు దూషణలు చేసేవారు. రెడ్ బుక్ లో పేరు రాసుకున్నామని.. వారి సంగతి చూస్తామని బెదిరించేవారు. అయినా అప్పట్లో పోలీసు అదికారుల సంఘం కాని, ఐపీఎస్ అధికారుల సంఘం వారుకాని తప్పు పట్టలేదు. పుంగనూరు వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను పోయేలా టిడిపి వారు దాడి చేశారు. అయినా ఆ ఘటనపై పోలీస్ సంఘం గట్టిగా స్పందించలేదు. ఆ తర్వాత ఈ ఎనిమిది నెలల్లో పోలీసుల కళ్లెదుటే టీడీపీ కార్యకర్తలు విధ్వంసాలకు పాల్పడుతుంటే.. కర్రలు,కత్తులతో దాడులు చూస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఘట్టాలను చూసినవారంతా పోలీసు శాఖ అసమర్ధతను చూసి అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. అంతదాకా ఎందుకు?.. తునిలో కౌన్సిలర్లను టీడీపీవారు వెంబడిస్తే పోలీసులు ఏమి చేస్తున్నారు?. తిరుపతిలో బస్ లో వెళుతున్న కార్పొరేటర్లపై దాడి చేసి కొంతమందిని బలవంతంగా కిడ్నాప్ చేస్తే పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోయారే!. కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి ఈ అంశాలను ప్రస్తావించి ఢిల్లీలో సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. మరో వైపు వేధింపులకు గురైన వైఎస్సార్సీపీ పైనే ఎదురు కేసులు పెట్టడానికి ఏ రాజ్యాంగం అవకాశం ఇస్తుంది? అందుకే వారు ఖాకీ బట్టలు తీసేసి.. పచ్చ బట్టలు వేసుకుంటున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తీయించివేస్తామని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించవలసి వచ్చింది. గతంలో పోలీసులు అకృత్యాలకు పాల్పడితే.. జనంలో తిరగుబాటు వస్తుండేది. 1978-83 మధ్య హైదరాబాద్ లో రమీజాబి అనే మహిళ పోలీస్ స్టేషన్లో మానభంగానికి గురై మరణిస్తే, ఆ విషయం తెలిసిన రాష్ట్ర ప్రజలంతా భగ్గుమన్నారు. రోజుల తరబడి కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో షకీలా అనే మహిళ కూడా పోలీస్ స్టేషన్ లో మరణించినప్పుడు కూడా ప్రజలు తీవ్రంగా స్పందించారు. గన్నవరంలో అప్పట్లో ఒక మహిళను హింసించారన్న సమాచారంతో ప్రజలు పోలీస్ స్టేషన్ లోకి చొరబడ్డారు. ఆ మహిళను పోలీసులు స్టేషన్ బయట ఉన్న వంటగదిలో దాచిన విషయం కూడా కనిపెట్టారు. ఆ రోజుల్లో ప్రజలలో ఉన్న చైతన్యంతో పోల్చితే ఇప్పుడు ఆ స్థాయిలో ప్రజలు స్పందిస్తున్నట్లు లేదు. అలాగని వారిలో నిరసన లేదని కాదు.కాని మారిన రాజకీయాలు,ఇతర కారణాలు ప్రభావితం చూపుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక నాయకుడు జనం తరపున ముందుకు వస్తే ఎలా తిరుగుబాటుకు సిద్దం అవుతారో జగన్ పర్యటనలు తెలియచేస్తున్నాయి. గుంటూరు మిర్చియార్డులో గిట్టుబాటు ధరలు రాక ఆవేదనలో ఉన్న రైతులను పరామర్శకు జగన్ వెళితే అక్కడ పోలీసులు సహకరించకుండా ప్రభుత్వం జాగ్రత్తపడింది. పైగా కేసులు కూడా పెట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని చెబుతున్నారు. అసలు అక్కడ వైఎస్సార్సీపీనే పోటీలో లేదు. ఎన్నికల ప్రచారం చేయలేదు. ర్యాలీలు తీయలేదు. మీటింగులు పెట్టలేదు. కేవలం మిర్చి యార్డులో రైతుల వద్దకు వెళితే ఏ రకంగా కోడ్ కు ఇబ్బంది కలిగిందో చంద్రబాబు పోలీసులే చెప్పాలి. రైతులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎవరూ పలకరించకూడదా?. జగన్ టూర్ చేయబట్టే కదా? కనీసం చంద్రబాబు కేంద్రానికి మిర్చి ధరల పతనంపై లేఖ రాశారు. కాని అది కంటితుడుపు చర్య. రాష్ట్రప్రభుత్వం మిర్చి కొనుగోలుకు ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోకుండా ఈ లేఖల వల్ల ఏమి జరుగుతుందో తెలియదు.గుంటూరు యార్డుకు వెళ్లినప్పుడు జగన్‌కు పోలీసులు ఎందుకు భద్రత కల్పించలేదు?అది వారి వైఫల్యం కాదా! పోలీసులు ఈ విధంగా చేయవచ్చా? అనేదానికి ఆ శాఖ ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీవారు వినతిపత్రం ఇవ్వడానికి వెళితే కలవకుండా వెళ్లిపోయిన డీజీపీ నాయకత్వంలో ఇంతకన్నా భిన్నమైన పరి్స్థితిని ఆశించడం తప్పవుతుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పలువురు ఐపీఎస్‌లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధిస్తున్నప్పటికీ నోరు మెదపలేని స్థితిలో పోలీసు అధికారుల సంఘాలు ఉన్నాయి. రైతుల సమస్యలకన్నా టీడీపీ భజనే తమకు ముఖ్యమన్నట్లుగా ఎల్లో మీడియా వ్యవహరించడం దురదృష్టకరం. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వం జనంలో పెల్లుబుకుతున్న అసమ్మతిని తొక్కిపెట్టాలని చూస్తోంది. అయినా అణచేకొద్ది పైకి లేచి తిరగబడతామని ప్రజలు బ్యారికేడ్లు తోసేసి మరీ జగన్ పర్యటనలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటంటే ఒక పదేళ్ల వయసున్న బాలిక జగన్ ను కలవడానికి పడిన తాపత్రయం, ఆ బాలికను ఆ జనంలో తనవద్దకు తీసుకుని ఆశీర్వదించిన తీరు మొత్తం టూర్ లో హైలైట్ గా మారింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు: బొత్స
విజయవాడ, సాక్షి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోంది. తాజాగా.. గుంటూరు పర్యటనలో ఆయనకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యంపై వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు.‘‘మాజీ సీఎంగా వైఎస్ జగన్(YS Jagan Security) కు జెడ్ ఫస్ల్ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ భద్రత కల్పించాలి. కానీ గుంటూరు పర్యటనలో ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేదు. వైఎస్ జగన్ భద్రతపై మాకు ఆందోళన ఉంది. మా ఆందోళనను గవర్నర్‌కు తెలియజేశాం. ఆయనకు రక్షణ కల్పించాలని గవర్నర్‌ను కోరాం. మా ఫిర్యాదుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. .. చట్టం తను పని తాను చేసుకునేలా చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వ దురుద్దేశాలు మాకు తెలుసు. జగన్‌ను ఇబ్బందిట్టాలనే ఏకపక్షంగా భద్రత తగ్గిస్తున్నారు. మా హయాంలో ఎక్కడైనా భద్రత తగ్గించామా?’’ అని కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బొత్స నిలదీశారు. ఎన్నికల కోడ్ల్లే భద్రతల్పించలేకపోయామన్న ప్రభుత్వ వాదనను బొత్స తప్పుబట్టారు. జెడ్ ఫ్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని అన్నారాయన. ఒకవేళ, ఎన్నికల కోడ్ ఉంటే జడ్ ప్లస్ భద్రత కల్పించడం కుదరదు అని ముందుగా సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా?. ఇదే ఎన్నికల కోడ్ విజయవాడలో జరిగిన సంగీత విభావరీ సందర్బంగా ఎందుకు అమలు చేయలేదు? రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మిర్చియార్డ్ కు వైయస్ జగన్ వెడితే ఎన్నికల కోడ్ పేరుతో ఇబ్బందికర పరిస్థితిని కల్పించారు అని బొత్స మండిపడ్డారు. దయనీయంగా రాష్ట్ర రైతాంగంవైఎస్సార్సీపీ హయాంలో రైతులకు మేలు జరగలేదన్న కూటమి నేతల ఆరోపణలకు బొత్స కౌంటర్ ఇచ్చారు. దాదాపు రూ.20 వేలు ఉన్న క్వింటా మిర్చి నేడు రూ.10 వేల దిగువకు పడిపోయింది. రైతులకు అండగా ఉండేందుకు వెడితే దానిని రాజకీయం చేస్తారా?. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతుభరోసాను క్రమం తప్పకుండా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యింది. రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా, కేంద్రం నుంచి వచ్చింది కూడా రైతులకు ఇవ్వలేదు. ఆర్బీకేల ద్వారా మా హయంలో విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఉన్నాం. నేడు ఆ వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. నేడు దళారీలు రైతులను దోచుకుంటున్నారు. ఎరువులు, విత్తనాల ధరలను ఎవరూ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదని.. వీటన్నింటి వల్ల రాష్ట్ర రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.బాబు వక్రబుద్ధి బయటపడింది: మేకపాటివైఎస్ జగన్ భద్రతా వ్యవహారంపై మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంలో చంద్రబాబు తన వక్ర బుద్దిని బయట పెడుతున్నారని మండిపడ్డారాయన. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము భద్రత ఇవ్వకపోయి ఉంటే.. అయన కనీసం బయట తిరిగే వారు కాదు. జెడ్ ఫ్లస్ కేటగిరి ఉన్న ప్రతిపక్ష నేతకి భద్రత కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయ్యింది. జగన్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అయన క్రేజ్ తగ్గదు. దేశ రాజకీయాలను ప్రభావితం చెయ్యగల నేత జగన్. -
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్‌కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!.