breaking news
-
టీడీపీ రౌడీ రాజకీయం.. YSRCP సర్పంచ్‌పై హత్యాయత్నం
నంద్యాల, సాక్షి: కూటమి పాలనలో అరాచకాలు ఆగడం లేదు. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అనుచరులు.. కోవెలకుంట్ల మండలం కంపమల్లలోచ్చిపోయారు. వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి(Lokeshwar Reddy)పై దాడికి పాల్పడగా.. ఆయన తీవ్ర గాయాలతో ఐసీయూలో చేరారు. టీడీపీ గుండాల హల్చల్తో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన ఇంట్లో చొరబడి లోకేశ్వర్‌తో పాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ప్రాణ భయంతో పరిగెడుతున్న లోకేశ్వర్ రెడ్డిని పొలంలో పడేసి కత్తులు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి వెంకట్రామిరెడ్డి,తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి కూడా గాయాలైనట్లు సమాచారం.ప్రాణాపాయ స్థితిలో.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న లోకేశ్వర్ రెడ్డిని.. స్థానికంగా నంద్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీకి పట్టు ఉండడంతో.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఆయన్ని అడ్డుతొలగించుకోవాలని టీడీపీ ఈ దాడికి పాల్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
లోకేశ్ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకే ఇదంతా: పోసాని
సాక్షి, అమరావతి /గుంటూరు లీగల్: తన మీద ఎన్ని కేసులు కట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తాను నిజంగా తప్పు చేస్తే నరికేయండి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారాయన. పోసానిని సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. తన పరిస్థితి చాలా దైన్యంగా ఉందని దయచేసి విడుదల చేయమని వేడుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు. టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. హైకోర్టులో పోసాని పిటిషన్ కొట్టివేత సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలు చేసి కర్నూలు నుంచి మంగళగిరి మేజిస్ట్రేట్ వద్దకు పోసానిని తీసుకొస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పడంతో.. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. పీటీ వారెంట్ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్‌ను తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబును పోసాని దూషించారంటూ మంగళగిరికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
నిరంతరం ప్రజలతోనే.. : వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ ఎప్పుడూ ప్రజలకు తోడుగా, వారికి అండగా నిలబడుతుంది. ప్రజల తరపున వారి గొంతుకై నిలుస్తుంది. ‘‘యువత పోరు’’ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నాయకుడు, కార్యకర్తకు అభినందనలు. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ.. వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ (నోరు లేని ప్రజల గొంతుక)గా ఉంటుందని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి (YS Jagan Mohan Reddy) వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజల కష్టాల్లో నుంచి పుట్టింది.. వైఎస్సార్ సీపీని స్థాపించి 15 ఏళ్లు అవుతోంది. పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి.. ఈ ప్రయాణంలో ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారి తరపున వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూ వస్తోంది. మనం ప్రతిపక్షంలో కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో పదేళ్లు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. అధికార పక్షానికి ధీటైన సమాధానం ఇస్తూ వస్తున్నాం. కళ్లు మూసి తెరిచేసరికే ఇప్పటికే దాదాపు సంవత్సరం అయిపోయింది. మరో మూడు నాలుగు సంవత్సరాల్లో జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైఎస్సార్సీపీనే. ఈరోజు వైఎస్సార్సీపీకి చెందిన ప్రతి కార్యకర్త గ్రామంలోని ఏ ఇంటికైనా ధైర్యంగా వెళ్లగలడు. ఏ పేద ఇంటికైనా మన కార్యకర్త సగర్వంగా, కాలర్ ఎగరేసుకుని వెళ్లగలిగే అవకాశం ఉంది. ఆ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి సోదరుడు, ప్రతి అవ్వ, తాత, ప్రతి రైతు చిరునవ్వుతో పలకరిస్తారు. ఎందుకంటే.. వైఎస్సార్సీపీ ఎప్పుడైనా కూడా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకం ఈ రోజుకూ ప్రతి ఇంట్లో ఉంది కాబట్టే! వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్ పిల్లల ఫీజుల కష్టాలు... ‘యువత పోరు’ ఈరోజు విద్యాదీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు జరుగుతున్న అన్యాయంపై నిరసన కార్యక్రమం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అవుతోంది. ఎన్నికల వేళ వాళ్లు చెప్పిన సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ హామీలన్నీ గాలికెగిరిపోయాయి. చదువులు, వైద్యం, గవర్నెన్స్, వ్యవసాయం.. ఏది చూసినా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి, ఒక్కొక్క క్వార్టర్‌కు రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద ఏడాదికి నాలుగు క్వార్టర్లకు రూ.2,800 కోట్లు కేటాయించాలి. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్‌లో మరో రూ.1,100 కోట్లు కేటాయించాలి. అంటే.. గత ఏడాది ఈ రెండింటికి సంబంధించి పిల్లల చదువుల కోసం మొత్తం రూ.3,900 కోట్లు కేటాయించాల్సిన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే.. రూ.3,200 కోట్లు బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతేకాకుండా ఈ ఏడాది 2025–26కి సంబంధించి విద్యాదీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద మరో రూ.1,100 కోట్లు కలిపి మొత్తం మరో రూ.3,900 కోట్లు ఇవ్వాలి. అంటే గతేడాది పెట్టిన రూ.3,200 కోట్ల బకాయిలతో కలిపి మొత్తం దాదాపు రూ.7,100 కోట్లు కేటాయించి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే నామమాత్రంగా కేటాయించి పిల్లల చదువులతో ఆడుకుంటున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు జరుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నా. ⇒ శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ, పార్టీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పలువురు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అనుబ«ంధ విభాగాల అ«ధ్యక్షులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మేజిస్ట్రేట్ ముందు కన్నీరు పెట్టుకున్న పోసాని
సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిని మేజిస్ట్రేట్ ముందు సీఐడీ హాజరుపరిచింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందే న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు.. రానన్నా. నాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా?. నా మీద ఎని కేసులు పెట్టారో నాకే తెలియదు’’ అంటూ పోసాని వాపోయారు.‘‘నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. -
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కాకాణి కౌంటర్
సాక్షి, నెల్లూరు: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనన్నారు. ‘‘విజయసాయిరెడ్డి, రఘురామ కృష్ణంరాజుల మధ్య స్నేహం ఉంది. స్నేహం లేకపోతే విజయసాయిరెడ్డి ఎందుకు ఇల్లు అద్దెకు ఇచ్చారు’’ అని కాకాణి ప్రశ్నించారు.‘‘వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారు. జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవు’’ అని కాకాణి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది. తెలిసే ఇదంతా చేశారు.. ఇందులో గూడుపుఠాణి ఉందన్న అనుమానం కలుగుతోంది’’ అని కాకాణి అన్నారు. -
పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్ర
సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి. దీంతో చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ కుట్రలను ఆపలేదు. టీడీపీ, జనసేన పార్టీల నేతలు పక్కా పన్నాగంతో పోసాని కృష్ణ మురళిపై వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు పెట్టారు. అనంతరం వరుస అరెస్టులతో దాష్టీకానికి తెగించారు. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు మొదట అరెస్ట్ చేయగా అక్కడ నుంచి రాష్ట్రమంతా తిప్పుతూ వరుసగా అరెస్ట్‌ల పర్వం కొనసాగించారు. 17 అక్రమ కేసులు బనాయించగా నాలుగు కేసుల్లో అరెస్టు చేశారు. తాజాగా బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు నమోదు చేశారు. -
ప్రమాదానికి గురైన కేంద్ర సహాయమంత్రి శ్రీనివాస వర్మ కారు
సాక్షి,ఢిల్లీ : కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కారు ప్రమాదానికి గురైంది. పార్లమెంట్ నుంచి తన కార్యాలయానికి వెళ్లే సమయంలో శ్రీనివాస వర్మ కారును ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు, కాలికి గాయాలయ్యాయి. కారులో ఉన్న సిబ్బందికి సైతం గాయాలయ్యాయి.రోడ్డు ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయినప్పటికీ వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టుతోనే శ్రీనివాసవర్మ. వైజాగ్‌కు బయలు దేరారు. వైజాగ్‌కు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కాలుకు, తలకు కట్టు తోనే విజయవాడ బయల్దేరిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ. -
యువత పోరు విజయవంతం.. ‘కూటమి’పై తిరుగుబాటు మొదలైంది
సాక్షి, తాడేపల్లి: విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'యువత పోరు' విజయవంతం అయ్యిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్ళు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కార్ గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి గడిచిన 15 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ దివంగత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగుతోంది. అందుకే వైఎస్సార్సీపీ పక్షాన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా వైఎస్ జగన్ పాలన, పార్టీ విధానాలతో ఏకీభవించి ఎంతోమంది మేధావులు మాకు అండగా నిలుస్తున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు రాజీలేని పోరాటం చేస్తున్నాం.ఈ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ విద్యార్థులు యువత సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వంపైన పోరాటానికి ముందడుగేశాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల్లోనూ నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి స్వచ్ఛందంగా యువత తరలిరావడం చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 9 నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలికూటమి పార్టీలు మేనిఫెస్టోలో చేర్చిన హామీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, యువతను ప్రభుత్వం గాలికొదిలేసింది. పేదరికంతో విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యాదీవెన, వసతి దీవెనకు గాను గతేడాదికి సంబంధించి రూ. 3,200 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మరో రూ. 3,900 కోట్లు చెల్లించాలి. మొత్తంగా రూ. 7,100 కోట్లు కావాల్సి ఉండగా బడ్జెట్లో కేవలం రూ. 2,644 కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ. 3 వేలు చెల్లిస్తామని చెప్పి యువత ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాది బడ్జెట్లో సైతం పథకం ఊసెత్తలేదు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారుగత ప్రభుత్వంలో పేదవారికి ఉచితంగా నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, పేద, మధ్యతరగతి విద్యార్ధులకు వైద్య విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో 17 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన వైఎస్ జగన్, ఐదేళ్లలోనే 5 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ఇచ్చారు. మిగతా కాలేజీలు వివిధ దశల్లో నిర్మాణం జరుపుకుంటుండగా వాటిని పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు సేఫ్ క్లోజ్ పేరుతో పక్కన పెట్టారు. కేంద్రం సీట్లు ఇస్తామని ముందుకొస్తే వద్దని ఐఎంఏకి లేఖలు రాసిన నీచ చరిత్ర చంద్రబాబుది. ఆ విధంగా మెడిసిన్ చదవాలన్న పేద విద్యార్థులను కలను చంద్రబాబు నాశనం చేశాడు. కమీషన్ల కోసం కార్పొరేట్లకు మెడికల్ కాలేజీలను దారాదత్తం చేసే కార్యక్రమానికి తెరలేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు 9 నెలలకే ప్రజా స్పందన ఈ స్థాయిలో ఉందంటే, హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత ఏ స్థాయికి పెరుగుతుందో కూటమి నాయకులే అంచనా వేసుకోవాలి. ఇప్పటికే వైఎస్సార్సీపీ తరఫున రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్యమం చేశాం. ట్రూ అప్ పేరుతో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పేదల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీశాం. సమస్యలపై ప్రశ్నిస్తుంటే ఈ ప్రభుత్వం భయపడిపోతోంది. నిరసన కార్యక్రమాలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు.వారం రోజుల నుంచే నిరసన కార్యక్రమానికి సంబంధించి పోలీసులను అనుమతి కోరుతున్నా ఇవ్వకుండా కాలయాపన చేశారు. అడుగడుగునా నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అన్ని నిర్బంధాలను దాటుకుని ఈ రోజున యువత పోరు నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోకుండా హామీల అమలుపై దృష్టిసారించాలి. మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్‌కి పేరొస్తుందనే ఆలోచన వీడాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని విరమించుకోవాలి. తక్షణం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్‌తో టైం పాస్ చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విద్యార్థులు, యువత పక్షాన నిలబడి వైయస్సార్సీపీ పోరాడుతుంది. ప్రభుత్వం కూడా ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు తెలుసుకోవాలి. -
‘రఘురామకు సాయిరెడ్డి తన ఇంటిని అద్దెకు ఎందుకిచ్చారు?
సాక్షి, తాడేపల్లి: విజయసాయిరెడ్డి ఆరోపణలు సరికాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేవీరావుకు, వైవీ సుబ్బారెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీరావు కేసు ఎందుకు వేశారు?. ఎవరో ఇచ్చిన స్క్రిప్టును సాయిరెడ్డి చదివారు. వైఎస్సార్సీపీ ద్వారా ఎదిగిన వ్యక్తి సాయిరెడ్డి. నాయకుడు కష్టకాలంలో ఉంటే ఇలా పార్టీని వీడి వెళ్తారా?’’ అంటూ సుధాకర్ బాబు నిలదీశారు.‘‘రాజ్యసభను వదిలేసి రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు?. రఘు రామ కృష్ణంరాజుకు సాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకు ఇచ్చారు?. అవతలి వ్యక్తులతో సాయిరెడ్డి ఎందుకు కలిశారు?. సాయిరెడ్డి పదేపదే కోటరీ అని మాట్లాడారు. ఆయనే స్వయంగా ఎంతోమందిని మా నాయకుడికి పరిచయం చేశారు. మరి ఆయన్ని మించిన కోటరీ ఇంకేం ఉంది?. సీఐడీ విచారణ అనేది ఒక బూటకం. విచారణ పేరుతో వచ్చి సాయిరెడ్డి డ్రామా చేశారు’’ అని సుధాకర్‌బాబు మండిపడ్డారు.‘‘మా నేతలు, పార్టీపై అనవసర ఆరోపణలు చేశారు. సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయటం ద్వారా ఎవరికి లాభం చేకూర్చినట్టు?. కేసులకు, వైఎస్సార్సీపీ నేతలకు లింకు పెట్టవద్దు’’ అంటూ సాయిరెడ్డికి సుధాకర్‌బాబు హితవు పలికారు. -
చంద్రబాబూ.. తొలి హెచ్చరిక ఇది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుట్రలను ఎక్స్ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘‘పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు. నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది.. చంద్రబాబు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘‘పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. చంద్రబాబూ… మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ మీరు తీసుకు వచ్చారు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు...అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబూ....అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలి. కాని, గత ఏడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారు. అలాగే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు. ..కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబూ? ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాను. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ పార్టీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.1. @ncbn గారూ పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని… pic.twitter.com/dn2LslNZzI— YS Jagan Mohan Reddy (@ysjagan) March 12, 2025 -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: వరుదు కళ్యాణి
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు మహిళల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందంటూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయటంలేదని దుయ్యబట్టారు.‘‘ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్నా ఏపీలో ఇంకా ప్రవేశ పెట్టలేదు. ఆడబిడ్డ నిధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారు. అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారు. టీడీపీ అంటే తెలుగింటి ఆడపిల్లలను మోసం చేసే పార్టీ. 2014-19లో కూడా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. జగన్ తెచ్చిన దిశ యాప్‌ని కాపీ కొట్టి.. శక్తియాప్ అని పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారు’’ అని వరుదు కల్యాణి మండిపడ్డారు.‘‘జగన్ మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానం కల్పించారు. మహిళాభ్యుదయం జగన్ వలనే సాధ్యమైంది. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చంద్రబాబు చెప్పకుండా జగన్ గురించి విమర్శలు చేయటం బాధాకరం. చంద్రబాబు తన ఆస్తిలో చెల్లెళ్లకు ఎంత ఇచ్చారో సమాధానం చెప్పాలి. తల్లికి ఏం ఇచ్చారో చెప్పాలి. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత ఆరోపణలు చేయటం సిగ్గుచేటు’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు. -
ఇష్టానుసారం మాటలు కాదు.. దమ్ముంటే నిరూపించండి: మిథున్ రెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో టీడీపీ మరో కొత్త నాటకానికి తెర లేపిందన్నారు వైఎస్సార్సీపీ లోక్‌సభపక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి. తప్పుడు ఆరోపణలతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. టీడీపీకి దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు.వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. క్షక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తప్పుడు ఆరోపణలతో మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. టీడీపీ మళ్లీ కొత్త నాటకానికి తెరలేపింది. లిక్కర్ స్కాం చేశామని ఆరోపణలు చేస్తున్నారు.. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయండి. మొదట 50వేల కోట్ల రూపాయల స్కాం అని ప్రచారం చేశారు. ఇప్పుడు మూడువేల కోట్ల రూపాయల స్కాం అని ఆరోపణలు చేస్తున్నారు. మూడువేల కోట్ల రూపాయలు మడిచి జేబులో పెట్టుకుంటారా?.ఢిల్లీలో ప్రభుత్వ దుకాణాలను ప్రైవేటులో నడిపారు. కానీ, మా ప్రభుత్వంలో పారదర్శకంగా ప్రభుత్వమే దుకాణాలను నిర్వహించింది. మేము భూములు కబ్జా చేశామని తప్పుడు ఆరోపణలు చేశారు. అఫిడవిట్లో కాకుండా, అదనపు భూమి మాకు ఏమైనా ఉంటే చూపించండి. అరెస్టు చేసిన గౌతమ్ తేజ్ వ్యక్తికి పాలీ గ్రాఫ్ టెస్ట్ చేశారు. అందులో కూడా ఆయన నేరం చేయలేదని తేటతెల్లమైంది. వందల మైన్ కాదు ఒక్క మైన్‌లో కూడా అక్రమాలు చూపండి. ఒక్క ఆరోపణకైనా సాక్ష్యం చూపించారా?. మీకు దమ్ముంటే ఆరోపణలను రుజువు చేసి చూపించండి.ఎర్రచందనం విషయంలోను ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారు. మాపై బురద కొట్టి పారిపోతున్నారు. పసలేని ఆరోపణలు చేస్తున్నారు. అటవీ భూములు కబ్జా చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. మా కుటుంబంపైనే 75 ఎకరాల భూమి ఉందని కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు. కలెక్టర్ చేసిన దర్యాప్తులో కూడా టీడీపీ ఆరోపణలు రుజువు కాలేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
కూటమి కుట్ర.. ఐదు కేసుల్లో చెవిరెడ్డికి నోటీసులు
సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఐదు కేసుల్లో వైఎస్సార్సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎర్రగొండపాలెం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో చెవిరెడ్డి స్పందిస్తూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని కౌంటరిచ్చారు.ఏపీలో కూటమి పాలనలో పోలీసులు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన కేసుల్లో తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల నియమాలని ఉల్లంఘించారని ఎర్రగొండపాలెం, దోర్నాల, పెద్దరవీడు పోలీసులు చెవిరెడ్డికి నోటీసులిచ్చారు. ఎర్రగొండపాలెంలో మూడు కేసులు, దోర్నాల, పెద్దారవీడులో ఒక్కొక్క కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నోటీసులపై చెవిరెడ్డి స్పందించారు.అనంతరం, చెవిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. వైఎస్సార్సీపీ ఉద్యమాల నుంచి పుట్టినపార్టీ. మా నాయకుడు వైఎస్ జగన్ పోరాటాలతో ఎదిగిన వ్యక్తి. ప్రజల మద్దతుతోనే మేము ముందుకు సాగుతాం’ అని అన్నారు. -
చంద్రబాబు జీవితమంటేనే కుట్రలు, హత్యా రాజకీయాలు: లక్ష్మీపార్వతి
సాక్షి, తాడేపల్లి: హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అలాగే, చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్యా రాజకీయాలే అని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పరిపాలన చేయటం చేతగాని అసమర్థుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘కుట్రలు, కుతంత్రాలకు ప్రతిబింబం చంద్రబాబు. తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వ్యక్తి చంద్రబాబు. తన రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్యా రాజకీయాలే. అసెంబ్లీలో పచ్చి బూతులు మాట్లాడుతూ బయట మాత్రం సుద్దులు చెప్తున్నారు. వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యుల మీద పచ్చిగా మాట్లాడుతున్నారు. మరి వారి మీద కేసులు, శిక్షలు ఎందుకు విధించడం లేదు.వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఆ పథకాలకు పేరు పెడితే తప్పు పడుతున్నారు. మరి చంద్రబాబు హయాంలో ప్రతి చెట్టు, పుట్టకు పచ్చ రంగులు వేయలేదా?. చంద్రన్న తోఫా పేరుతో సంచుల మీద కూడా చంద్రబాబు ఫొటోలు వేయలేదా?. రాజకీయ కక్షతోనే ఎన్టీఆర్‌ని పదవి నుంచి దించేశారు. నన్ను రోడ్డు మీద పడేశారు.వినుకొండలో రషీద్‌ను దారుణంగా హత్య చేయించింది ఎవరు?. పోలీసులను కీలు బొమ్మల్లా చేసుకుని దుర్మార్గాలు చేస్తున్నారు. హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు. మహిళల మీద అత్యాచారాలు చేసినా.. టీడీపీ గూండాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. పరిపాలన చేయటం చేతగాని అసమర్థుడు చంద్రబాబు. వైఎస్ జగన్ తెచ్చిన పథకాలను కాపీ కొట్టటానికి సిగ్గులేదా చంద్రబాబూ?. వైఎస్ జగన్‌పై రెండు సార్లు హత్యాయత్నం చేయించిన నీచుడు బాబు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి. చంద్రబాబు నీచ, హత్యా రాజకీయాలు ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికైనా విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. -
మొత్తం చినబాబే చేశారు! రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అంతా..
ఇచ్చిన మాటను గాలికి వదిలేయడం ఎలాగో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూడాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు ఈ విషయంలో పోటీ పడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే.. శాసనమండలి ఎన్నికలు!. మొత్తం ఐదు సీట్లలో.. టీడీపీ మూడు స్థానాలు, జనసేన, బీజేపీ చెరో స్థానంలో పోటీ చేస్తున్నాయి. వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. అయితే ఈ ఎంపికలన్నీ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ సొంత టీమ్ కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. టీడీపీకి జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. జాతీయ కార్యదర్శి అయిన లోకేష్ మాటకే పార్టీలో ఎక్కువ చెల్లుబాటు అవుతున్నట్లు సమాచారం. సీనియర్లను పూర్తిగా పక్కనబెట్టి, గతంలో తాము చేసిన బాసలకు తిలోదకాలు ఇచ్చి ఈ ఎంపికలు జరిపారన్న భావన టీడీపీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. ఉన్నవి మూడు సీట్లే. కాబట్టి అందరిని సంతృప్తి పరచడం కష్టమే. కాని ఎంపిక చేసిన వారిని ఇతర ఆశావహులతో పోల్చి చూసినప్పుడు విమర్శలు వస్తున్నాయా? ప్రశంసలు వస్తున్నాయా? అనేది పరిశీలనకు వస్తుంది. ఆ రకంగా చూస్తే ఈ ఎంపికలు అంత సంతృప్తి కలిగించలేదని అంటున్నారు. 👉పార్టీలో 42 ఏళ్లు వేర్వేరు పదవులు నిర్వహించిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు టీడీపీ రిటైర్మెంట్ ఇచ్చినట్లే కనిపిస్తుంది. 1995లో యనమల స్పీకర్‌గా ఉండడం వల్లే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేసి చంద్రబాబు తేలికగా సీఎం అయ్యారని అంటారు. చంద్రబాబుకు రాజకీయ సలహాలు ఇస్తుంటారని కూడా ప్రచారం ఉంది. లోకేష్ నాయకత్వం వచ్చాక ఈయనను మెల్లగా పక్కన పెట్టారు. అయితే యనమల కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఇంకో కూతురి భర్త ఎంపీ అయ్యారు. వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది కూడా మైనస్ కావచ్చు. అయితే.. టీడీపీలో ఆయా కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వలేదా అన్న చర్చ రావచ్చు. అది వేరే సంగతి. 👉ఇక అందరి దృష్టిని ఆకర్షించేది పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయాలనుకున్నప్పుడు వర్మ సీటు వదలుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ఆయన(వర్మ) ఎమ్మెల్సీ అయిపోయినట్లేనని ప్రచారం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా.. రెండుసార్లు ఎమ్మెల్సీ పదవులు భర్తీ అయ్యాయి. కాని వర్మకు అవకాశం ఇవ్వకుండా హామీని గాలికి వదలివేసి అవమాన భారం మిగిల్చారు. ఇప్పుడు వర్మ కక్కలేక, మింగలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో పోటీ కేంద్రం అవుతారన్నది పవన్ భయమట. ఏది ఏమైనా మాట ఇచ్చి ఎలా తప్పవచ్చో చెప్పడానికి వర్మ వ్యవహారం ఉదాహరణ అవుతుంది. కొంతకాలం క్రితం వరకు కనీసం తన వాయిస్ వినిపించే వారు. కాని ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ భయమో, మరేదైనా కారణంతోనో వర్మ కనీసం నిరసన కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో పడ్డారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. 👉వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను ఎలా ప్రలోభ పెట్టారో.. ఏకంగా ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని అన్నారు. కాని ఆయనకు పదవి హుళక్కి అయింది. పలువురు ఇతర ప్రముఖులు దేవినేని ఉమ, ప్రభాకర చౌదరి, బుద్దా వెంకన్న, వంగవీటి రాధాకృష్ణ మొదలైన వారంతా గత ఎన్నికలలో టిక్కెట్లు ఆశించి భంగపడ్డారు. అప్పుడు వారిని ఓదార్చడానికి ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఇస్తామన్నారు. కాని వారికి ఏ పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కూడా రాలేదు. వైఎస్సార్సీపీ నుంచి పార్టీ మారిన జంగా కృష్ణమూర్తి పరిస్థితి అంతే. 👉ఒక్క బీటీ నాయుడుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి తిరిగి వచ్చారు. చంద్రబాబుకు బాగా ఉపయోగపడ్డారని టీడీపీ మీడియా ఒక ప్రచారం చేస్తోంది కాని, ఆయనను మించి ఎవరూ లేరా? అనే సందేహం కూడా వస్తుంది. బీదా రవిచంద్రకు పదవి ఇవ్వడం మామూలుగా అయితే అభ్యంతరం ఉండదు. కాని, వైఎస్సార్సీపీ నుంచి ఆయన సోదరుడు టీడీపీలోకి వచ్చి మళ్లీ రాజ్యసభ సభ్యుడు అయ్యారు. ఇప్పుడు రవిచంద్రకు కూడా పదవి దక్కింది. ఇక కావలి గ్రీష్మకు ఇప్పటికే ఒక కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి ఉంది. ఆమెను ఎమ్మెల్సీ చేయడం విశేషం. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తెగా కన్నా, ఆమె మహానాడులో చంద్రబాబు సమక్షంలోనే వేలాది మంది చూస్తుండగా, తొడలు గొట్టడం, అభ్యంతరక భాషలో వైఎస్సార్సీపీ వారిని దూషించడం వంటి కారణాలే ప్రామాణికతగా పదవి వచ్చిందన్న ప్రచారం సాగుతోంది. మరి ఆమె మండలిలో ఇంకెలాంటి బూతులకు దిగుతారోనన్న వ్యాఖ్యలు టీడీపీలో వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బూతులను ఎంకరేజ్ చేసినట్లు వ్యవహరించిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక సుద్దులు చెబుతున్నారు. ఎల్లోమీడియా మాత్రం సహజంగానే ఈ టీడీపీ ఎమ్మెల్సీ ఎంపికలకు బిల్డప్ ఇస్తూ బలహీనవర్గాలకు పెద్ద పీట అని రాసి ప్రచారం చేశాయి. జనసేన అభ్యర్దిగా పవన్ సోదరుడు, నటుడు నాగబాబును ఎంపిక చేశారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. కాని ఎందువల్లో ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నందున ఇవ్వకతప్పదేమో!. 👉ఎల్లో మీడియా నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం లేదని, కార్పొరేషన్ చైర్మన్ పదవి మాత్రమే ఇస్తారంటూ కథనాలు రాసింది. అందుకు పవన్ కూడా ఓకే అన్నట్లు చెప్పాయి. కాని ఏమైందో కాని, మరుసటి రోజు నాగబాబు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయబోతున్నారని జనసేన ప్రకటించింది. విశేషం ఏమిటంటే గతంలో పవన్ తన బంధువులకు పదవులు ఇవ్వడం కోసం పార్టీని పెట్టడం లేదని గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాక కుల రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోరకంగా మాట్లాడారు. ఇప్పుడు జనసేన అంటే ఒక సామాజిక వర్గ పార్టీనే అన్న భావన కలిగించేలా పదవులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా అదే వర్గానికి ఇచ్చారు. ఇప్పుడు తన సోదరుడు నాగబాబుకు ఇచ్చుకున్నారు. తనతో పాటు కందుల దుర్గేష్ కూడా అదే వర్గం వారు కావడం గమనార్హం. నాదెండ్ల మనోహర్ మంత్రిగా ఉన్నారు. దీంతో జనసేనలో ఇతర సామాజిక వర్గాలకు అసలు ప్రాధాన్యత లేదన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడడానికి ఆస్కారం కలిగింది. 👉గతంలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి ఎమ్మెల్సీ అవుతున్నారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై బీజేపీ లో ఆక్షేపణ ఉండకపోవచ్చు. కాని ఈ పదవిని ఆశిస్తున్న ఇతర సీనియర్ లు కొందరికి ఆశాభంగం అవుతుంది. వీర్రాజుకు పదవి రావడం పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు అంతగా ఇష్టం ఉండకపోవచ్చు. కాని బీజేపీ అధిష్టానాన్ని కాదనే పరిస్థితి వీరికి లేదు. వీర్రాజు నామినేషన్ చివరి క్షణంలో వేసిన తీరును బట్టి హైకమాండ్ కావాలనే ఆయనకు పదవి ఇచ్చిందని, తద్వారా టీడీపీకి, పురందేశ్వరికి చెక్ పెట్టే ఆలోచన చేసి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. గతంలో వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2014-19 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై ఎక్కడకక్కడ కడిగి పారేసేవారు. నీరు-చెట్టు స్కీమ్ కింద తెలుగు తమ్ముళ్లు రూ.13 వేల కోట్లు దోచేశారని సంచలన ఆరోపణ కూడా చేశారు.ఇప్పుడు వాటన్నిటిని మరచి పోయి టీడీపీతో స్నేహం చేయకతప్పదు. ప్రధాని మోదీనే టీడీపీ పెద్దలు దారుణంగా దూషించినా పొత్తు పెట్టుకోగా లేనిది, వీర్రాజుది ఏముందిలే అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఎంపికల వల్ల టీడీపీ, జనసేనలలో కొంతమేర అంతర్గతంగా లుకలుకలు రావచ్చు. తెలంగాణలో ప్రముఖ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అధిష్టానం ఆమెను ఎంపిక చేసిందని చెబుతున్నారు. మరో నేత అద్దంకి దయాకర్ గతసారి ఎన్నికలలో తన సీటును వదలుకుని ప్రచారానికి పరిమితం అయ్యారు. అయినా టిక్కెట్ వస్తుందా? రాదా? అనే టెన్షన్ ఉన్నప్పటికీ ఎట్టకేలకు సాధించగలిగారు. మరో సీటును శంకర్ నాయక్ అనే నేతకు కేటాయించారు.ఇంకో స్థానం సిపిఐకి కేటాయించారు. కాగా బీఆర్ఎస్ పక్షాన దాసోజు శ్రావణ్ కు ఇవ్వడం ద్వారా గతంలో ఆయనకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసినట్లయింది. అప్పట్లో కేసీఆర్ నామినేట్ చేసినా, గవర్నర్ ఆమోదం జాప్యం అవడం, ఇంతలో ఎన్నికలు రావడం ,కాంగ్రెస్ గెలవడం వంటి కారణాలతో ఆయన ఎమ్మెల్సీ కాలేకపోయారు. ఇప్పటికి ఆయనకు పదవి లభించింది. తెలంగాణలో ఈ ఎంపికలు.. ఏపీతో పోల్చితే కాస్త బెటర్ గా ఉన్నట్లే కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నాతో నడుస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం(YSRCP 15th Formation Day) సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఇన్నేళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓ సందేశం విడుదల చేశారాయన.‘‘నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ఆర్(YSR) గారి ఆశయాల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాటి నుంచి నేటి వరకూ తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. .. నా ఒక్కడితో మొదలై, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సుదీర్ఘ కాలంలో పార్టీ నిరంతరం ప్రజలతోనే ఉంది, ప్రజల కోసం పనిచేస్తూనే ఉంది. అధికారంలో ఉన్న ఆ ఐదేళ్లలో దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధిని అందించింది.క్లిక్ చేయండి: జనం జెండా.. ఈ చిత్రాలు చూశారా?.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, సుస్థిర ఆర్థిక వృద్ధిని సాధించడం, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. విలువలకు విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో విశ్వాసంతో నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు అంటూ ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల చిత్రాలను షేర్ చేశారాయన.ఇదీ చదవండి: 3-4 ఏళ్లలో అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీనే! -
ఇదేం సంస్కృతి.. పెద్దల సభలో ఇలా వ్యవహరిస్తారా?: బొత్స ఆగ్రహం
అమరావతి, సాక్షి: కూటమి ప్రభుత్వం హామీలను గాలికొదిలేసి.. విద్యార్థులను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని, వాళ్ల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో మండలిని మారుమోగిపోయేలా చేశారు. ఈ క్రమంలో మార్షల్స్‌ను ప్రయోగించే ప్రయత్నం చేయగా.. ఆ ప్రయత్నానికి నిరసనగా ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఇది అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. సభలో వారి కోసం ఆందోళన చేశాం. తొమ్మిది నెలలైనా రియింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?. మా హయాంలో ఫీజు రియింబర్స్‌మెంట్‌లో బకాయిలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ, మా హయాంలో ఎక్కడా బకాయిలు లేవు. దమ్ముంటే.. ఎక్కడున్నాయో చూపించండి అంటూ కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరారాయన. నిరుద్యోగులకు అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి ఇస్తాం అన్నారు.. అది ఏది?. పోని ఎప్పుడిస్తారో అదైనా చెప్పండి?. జాబ్ కాలండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పండి. మెగా డీఎస్సీ అన్నారు.. అదీ ఇవ్వలేదు. మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను దారుణంగా మోసం చేశారు. కానీ గత వైఎస్సార్సీపీ హయాంలో మేం శాశ్వత ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చాం. అలాంటి మేం ఇప్పుడు విద్యార్థులు, యువత కోసం నినదిస్తే.. మా మీదే మార్షల్స్ ని ప్రయోగిస్తారా?. ఇదేం సంస్కృతి అని మండిపడ్డారాయన. అంతకు ముందు.. మండలి ప్రారంభానికి ముందు నిరుద్యోగ భృతి విడుదల, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వగా, చైర్మన్ దానిని తిరస్కరించారు. అయినప్పటికీ వైఎస్సార్సీపీ చర్చకు పట్టుబట్టింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలతో పాటు నిరుద్యోగ భృతి రూ.3 వేలు తక్షణమే చెల్లించాలని, జాబ్ క్యాలెండర్ హామీలను నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో చైర్మన్ మూడుసార్లు మండలిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, బాబు షూరీటీ.. మోసం గ్యారెంటీ అంటూ నినాదాలు చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలంతా. -
వైఎస్సార్సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..
Yuvatha Poru Updates..👉ఏపీలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు.. నిరుద్యోగుల పక్షాన అన్ని జిల్లాల్లో వైఎస్సార్సీపీ తలపెట్టిన ‘యువత పోరు’ కార్యక్రమం విజయవంతమైంది. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, వారి తల్లుతండ్రులు, నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని.. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని, పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు.యువత పోరును అడ్డుకున్న పోలీసులు..విజయవాడలో యువత పోరుకు అడ్డంకులు.వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.యవత పోరుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు.వైఎస్సార్సీపీ నేతల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు.ర్యాలీకి అనుమతి లేదని బారికేడ్లు ఏర్పాటు. కృష్ణాజిల్లా..కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని ఫైర్మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్..చంద్రబాబు, పవన్, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేశారుపార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ను, ఓటేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుమీ ఖర్చులకు డబ్బులుంటాయి కానీ.. విద్యార్ధుల ఫీజులకు డబ్బులుండవా?.చంద్రబాబు, పవన్, లోకేష్‌కు పదేసి కార్లలో తిరగడానికి.. వాటి సిబ్బందికి డబ్బులుంటాయిపిల్లలకు ఫీజుల బకాయిలు చెల్లించడానికి మనసు రాదాఎన్ని ఆంక్షలు పెట్టినా కూటమి ప్రభుత్వంపై మా పోరాటం కొనసాగుతుందిఅరెస్టులతో మమ్మల్ని అడ్డుకోలేరుఅరెస్టులు చేసి వైఎస్సార్సీపీ కార్యకర్తలతో జైళ్లను నింపుకున్నా మేం వెనకడుగువేసేది లేదుశ్రీకాకుళం..యువత పోరు కార్యక్రమానికి వెళుతున్న వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులుజిల్లా కేంద్రానికి వస్తున్న ఆముదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, నేతలను అడ్డుకున్న పోలీసులు.రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్సీపీ పార్టీ నాయకులుచింతాడ వద్ద పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదంఅనంతరం, వైఎస్సార్సీపీ నేతలకు అడ్డుతప్పుకున్న పోలీసులు. విశాఖలో ఉద్రిక్తత..విశాఖ జిల్లా కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు..కలెక్టరేట్‌లోకి వైఎస్సార్సీపీ శ్రేణులను అనుమతించని పోలీసులు..కేవలం పది మందికి మాత్రమే కలెక్టర్‌ని కలిసేందుకు అనుమతి..గేటు బయట పోలీసులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం..జై జగన్ నినాదాలతో హోరెత్తిన జిల్లా కలెక్టరెట్విజయవాడ..రాష్ట్ర వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయం వద్ద పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుపునూరు గౌతమ్ రెడ్డి కామెంట్స్విద్యార్థులకు ఫీజులు వసతులు కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందిచంద్రబాబు 7100 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ప్రజలను మోసం చేశారుగతంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం వైఎస్ జగన్ 18వేల కోట్లు విడుదల చేశారుచంద్రబాబు అరకొర నిధులు విడుదల చేసి విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశాడువిద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు తక్షణమే అందించాలిఢిల్లీ..పార్లమెంట్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..వేడుకల్లో పాల్గొన్న ఎంపీలు వైవీ.సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గురుమూర్తి, తనుజారాణి, గొల్ల బాబురావు, అయోధ్య రామిరెడ్డి,వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కామెంట్స్..వైఎస్సార్ ఆశయ సాధన మా పార్టీ ధ్యేయంపేదల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేసిందిపేదల పక్షాన నాడు కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేశాంప్రజలకు అండగా నిలబడ్డాం.విశాఖ..వైఎస్సార్సీపీ యువత పోరుపై పోలీసులు ఆంక్షలు..జెడ్పీ జంక్షన్‌కు భారీగా చేరుకుంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు అనుమతి లేదంటున్న పోలీసులు..ఆంక్షలు అమలు కోసం భారీగా పోలీసుల మోహరింపు..ర్యాలీగా వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు సిద్దమైన వైఎస్సార్సీపీ నేతలు.తిరుపతి..ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్..వైఎస్సార్సీపీ 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెడుతోందిఎన్నో ఆశలు పెట్టుకొని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తీసుకువచ్చారువైఎస్ జగన్ పాలనలో 90 శాతం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పంపిణీ చేశారుపిల్లలు అందరూ కాలేజీలకు వెళ్లకుండా పంట పొలాలకు వెళ్తున్నారుఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరు కొనసాగిస్తున్నాముయువతకు 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారుప్రతి విద్యార్థికి పది నెలల్లో ముప్పై వేలు ఇవ్వాలిమహిళా సంఘాలు అక్కౌంట్ లు 50శాతం నిర్వీర్యం అయిపోయాయిఈ ప్రభుత్వం కక్ష సాధింపు పాలన సాగిస్తోంది.దీని పర్యవసానం చెల్లించక తప్పదుయువత పోరులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలినెల్లూరు..వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించిన కాకాణి.హాజరైన అన్ని నియోజకవర్గ ఇన్చార్జులు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలుమాజీ మంత్రి కాకాణి కామెంట్స్..ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ఇది.ప్రతిపక్ష పార్టీగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు.కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. విలువలు విశ్వసనీయంతో ఐదేళ్లు జగన్ ప్రభుత్వాన్ని నడిపారుపార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా వాడవాడలా వైఎస్సార్సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్ జగన్.వైఎస్ జగన్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది.వైఎస్ జగన్ రూపం రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది.పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమానికి ప్రజల స్వచ్ఛందంగా హాజరవుతున్నారు..యువత పోరుకు సైతం భారీ సంఖ్యలో హాజరుకావాలి. కృష్ణాజిల్లా..పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం.కానూరు నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ.దేవభక్తుని కామెంట్స్..కూటమి యువతను, విద్యార్థులను మోసం చేసింది.విద్య, వైద్యంపై ఉక్కు పాదం మోపుతుంది.విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఫీజు కట్టే స్తోమత లేక పొలం పనులకు యువత వెళ్తున్నారు.విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు.జగనన్న హయాంలో పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాం.దున్నపోతు మీద వర్షం పడినట్లు ప్రవర్తిస్తుంది.ప్రజల సమస్యలను గాలికి వదిలేసింది.అనంతపురం..వైఎస్సార్సీపీ యువత పోరుకు భారీ స్పందనజెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ దాకా భారీ ర్యాలీచంద్రబాబు సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలుయువత పోరులో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువకులుమాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి ,మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ మంత్రి శైలజానాథ్, ఎమ్మెల్సీ మంగమ్మ,వై.శివరామిరెడ్డి, ప్రభుత్వ విద్య మాజీ సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి. -
పోసాని రిలీజ్ అడ్డుకునే కుట్ర.. ఎల్లో మీడియాలో హింట్!
కర్నూలు, సాక్షి: వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం ఫలితంగా.. కూటమి కక్ష సాధింపు చర్యల నుంచి నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట దక్కింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై 5 నెలల కిందట ఏపీ సీఐడీ(AP CID) కేసు నమోదు చేసింది. తాజా కేసుల నుంచి ఊరటతో ఆయన జైలు నుంచి విడుదల కాబోతుండగా.. హఠాత్తుగా ఆ కేసును తెరపైకి తెచ్చారు. ఆఘమేఘాల మీద గుంటూరు కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయగా.. కోర్టు సీఐడీ విజ్ఞప్తికి అనుమతించింది. దీంతో.. ఈ ఉదయం సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సమాచారం. జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట ప్రవేశపెడతారని తెలుస్తోంది. పోసానిపై సీఐడీ నమోదు చేసిన కేసు వివరాలు తెలియాల్సి ఉంది. పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) పై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూనా ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు. అయితే చివరకు.. న్యాయమే గెలిచింది. బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రకారం వ్యవస్థీకృత నేరాల కింద కేసుల నమోదుకు న్యాయస్థానాలు సమ్మతించలేదు. పోసానిపై నమోదు చేసిన కేసులకు ఆ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశాయి. పోసాని కృష్ణ మురళిపై నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు బెయిళ్లు మంజూరు చేశాయి.అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో కేసు.. బెయిల్‌పల్నాడు జిల్లా నరసరావుపేటలో కేసు.. బెయిల్‌ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురం పీఎస్‌లో కేసు.. బెయిల్‌కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసు.. బెయిల్ హైకోర్టులో ఆయనపై పెట్టిన కొన్ని కేసులు.. క్వాష్ మరోవైపు.. పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వం తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొందంటూ ముందుగానే కథనాలు ఇచ్చేసింది. పోసానిపై పలుచోట్ల కేసులున్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యే లోపు, ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చంటూ పేర్కొనగా.. ఈలోపే సీఐడీ ఆయన విడుదలను అడ్డుకునేందుకు తెర మీదకు రావడం గమనార్హం. -
‘అమరావతి అప్పులపై చంద్రబాబు పచ్చి అబద్దాలు’
తాడేపల్లి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్దాలేననే విషయం బట్టబయలు అయ్యిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ప్రపంచబ్యాంక్ ద్వారా ఇప్పిస్తోందని, ఇది పూర్తి గ్రాంట్ అంటూ ఇప్పటి వరకు చేసిన వాదనలు పూర్తి అవాస్తవాలేనని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలతో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చేస్తున్న బుకాయింపులన్నీ అసత్యాలేనని బయటపడిందన్నారు కారుమూరి వెంకటరెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారంటే...అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది గ్రాంట్ మాత్రమేనని, దీనిని అప్పుగా తిరిగే కట్టాల్సిన అవసరం లేదంటూ ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి దీనిపై ఇచ్చిన స్పష్టతతో ఇదంతా అబద్ధమేనని తేలిపోయింది. వైయస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఈనెల 10వ తేదీన పార్లమెంట్లో అడిగిన క్వశ్చన్ నెంబర్ 1703కు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రపంచబ్యాంకు, ఏడీబీ సహా ఇతర రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిధిలోకి రాని రుణాలే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చెల్లించాలని కేంద్ర మంత్రి తన సమాధానంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం కేవలం పది శాతం మాత్రమే అంటే రూ. 1500 కోట్లు వరకే గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. అమరావతికి కేంద్ర సాయం ఒట్టిదేనని, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇన్నాళ్లు వైయస్సార్సీపీ చెబుతూ వస్తున్నదే ఇప్పుడు నిజమైంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా చంద్రబాబు చేసిన ప్రచారం అబద్ధమేనని తేలిపోయింది.రూ.5 వేల కోట్లు అప్పుకి రూ.15 వేల కోట్లు చెల్లింపు2014-19 మధ్య కూడా అమరావతి నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.5,335 కోట్లు రుణాలు తీసుకుంది. ఇందులో హడ్కో నుంచి రూ. 1,098 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 1862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ. 2 వేల కోట్లు తీసుకుంది. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏటా రూ. 1,573 కోట్లు వడ్డీలుగానే కడుతోంది. అంటే రూ.5,335 కోట్ల రుణాలకు పదేళ్లలో రూ. 15,773 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పుకుంటూ ప్రజాధనంను వడ్డీల రూపంలో అమరావతి కోసం దోచిపెడుతున్నారు. మళ్లీ ఇదే అమరావతి కోసం బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించారు.అమరావతి కోసం మొత్తం రూ.37 వేల కోట్ల రుణాలుప్రస్తుతం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు .. మొత్తం రూ. 31 వేల కోట్లు మళ్లీ అప్పులు చేస్తున్నారు. వీటితోపాటు సీఆర్డీఏ ద్వారా నిధులు సమీకరించాలని చూస్తోంది. గతంలో చేసిన అప్పులు కూడా కలిపి ఇప్పటికే రూ. 37 వేల కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారు.. ఎలా చెల్లిస్తారు? అమరావతి అంటేనే ఒక దోపిడీ. రాజధాని నిర్మాణం ముసుగులో భారీ అవినీతి జరుగుతోంది. జాతీయ రహదారుల నిర్మాణానికే కిలోమీటర్‌కి రూ. 20 నుంచి రూ. 22 కోట్లు ఖర్చవుతుంటే, అమరావతి ప్రాంతంలో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి రూ. 53.88 కోట్లు అవుతుందట. గతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల నిర్మాణం కోసం ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.9400 లు ఖర్చు చేశారు. ఏ గేటెడ్ కమ్యూనిటీ నిర్మానానికి కూడా ఇంత భారీగా ఖర్చు కాదు. అమరావతి పేరుతో బినామీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్గతంలో 2014-19 మధ్య రూ. 40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులోనూ దిగిపోయేనాటికి రూ. వెయ్యి కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి దిగిపోయారు. ఇదే వ్యవహారం ఇప్పుడూ జరుగుతోంది. ఇదంతా ప్రజలకు తెలియకుండా అసెంబ్లీ సాక్షిగా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. బడ్జెట్ లో ఉన్న లొసుగులపై ప్రభుత్వాన్ని వైయస్ఆర్సీపీ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక కేబినెట్ మీటింగులో రంగయ్య మరణంపై చర్చ పెట్టారు. కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి సహజ మరణాన్ని అనుమానాస్పద మరణంగా చిత్రీకరించే కుట్రకు తెరలేపారు. సుప్రీంకోర్టు డైరెక్షన్లో సీబీఐ దర్యాప్తు చేస్తున్న వివేకా కేసుపై కేబినెట్లో ముఖ్యమంత్రికి చర్చించాల్సిన అవసరం ఏంటి? అసెంబ్లీలో ఎందుకు చర్చిస్తున్నారు? ఇంత చెబుతున్న చంద్రబాబు.. వివేకాను దారుణంగా నరికి చంపానని ఒప్పుకున్న దస్తగిరి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్.బాబు హయాంలోనే హత్యారాజకీయాలుతన జీవితంలో పాలనలో హత్యారాజకీయాలు చేయలేదని, చూడలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. ఆయన బావమరిది బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులు, చనిపోయిన వాచ్మెన్ మరణంపై విచారణ కోరండి. దీంతోపాటు మల్లెల బాబ్జి, వంగవీటి మోహనరంగ హత్య, పింగళి దశరథరామ్ హత్యలపై కూడా సిట్ విచారణ జరిపించవచ్చు కదా! ఇవన్నీ ప్రజలకు తెలియాలి. ఎన్టీఆర్ మానసిక క్షోభకు ఎవరు కారణం? ఆయన ఎలా చనిపోయారో ఈనాటి తరానికి తెలియాలి. పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడిపై కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని పట్టాభి అనే వ్యక్తి నాటి సీఎం వైయస్ జగన్ గురించి అసభ్య పదజాలంతో రెచ్చిపోయినందుకు కాదా? దాడి వెనుక కారకులు తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ కాదా? తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు నీతివంతమైన రాజకీయం చేశాడా? అడుగడుగునా అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, వెన్నుపోటు రాజకీయాలు చేసిన వ్యక్తి తన మీద మరకలు లేవని చెబుతున్నాడు’అని మండిపడ్డారు. -
లోకేశ్ ‘లెక్కే’ వేరు..!
సాక్షి, అమరావతి: టీడీపీలో పదవులు ఒకప్పుడు చంద్రబాబు (Chandrababu) ఇష్ట ప్రకారం లభించేవి. రకరకాల సమీకరణలు, ప్రాధాన్యతలు, ఆర్థిక వ్యవహారాలను బట్టి పదవులను కట్టబెట్టేవారు. కానీ ఇప్పుడు ఆయన తనయుడు లోకేశ్ (Lokesh) ఆశీస్సులు ఉంటేనే పదవులు వస్తాయని టీడీపీలో కింది స్థాయి కార్యకర్తలు సైతం చెబుతున్నారు. ఆయన ఆశీస్సులు ఉండాలంటే ఆర్థికంగా బలవంతులై ఉండాలనే సూత్రం చాలాకాలం నుంచి అమలవుతోంది. గత ఎన్నికల్లో సీట్లు డబ్బు మూటలిచ్చిన వాళ్లకే ఇచ్చారని ఆ పార్టీలోనే బహిరంగంగానే ఆరోపణలు వినిపించాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక మంత్రి పదవులకూ అదే సూత్రాన్ని పాటించినట్లు పార్టీ సీనియర్ నేతలు వాపోయారు.ఆయన కోటరీకే ఎమ్మెల్సీ పదవులు ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులోనూ అదే పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. టీడీపీకి మూడు పదవులు దక్కితే మూడు లోకేశ్‌కి అత్యంత విధేయులుగా ఉన్న వారికే లభించాయి. నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర లోకేశ్ కోటరీలో కీలక వ్యక్తి కావడంతోపాటు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఈ నేపథ్యంలోనే రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి వెతుక్కుంటూ వచ్చినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. బీటీ నాయుడు (BT Naidu) కూడా లోకేశ్‌కు దగ్గరి వ్యక్తి కావడంతోపాటు ఆర్థిక పరిపుష్టి కలిగిన నాయకుడే. కావలి గ్రీష్మ (Kavali Greeshma) లోకేశ్ కోటరీకి చెందిన నేతే. మహానాడులో బూతులు తిడుతూ తొడ కొట్టిన నాయకురాలు కావడంతో ఆమెకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. ఉత్తరాంధ్రలో అనేక మంది సీనియర్ నేతలు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన నేతలుంటే అంత చురుగ్గా పని చేయని గ్రీష్మకు ఎమ్మెల్సీ పదవి దక్కడానికి చినబాబు ఆశీస్సులు ఉండడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.రాజ్యసభ స్థానాల్లోనూ అంతేమూడు రాజ్యసభ స్థానాల్లో టీడీపీకి రెండు దక్కగా ఆ రెండింటినీ ధన బలం ఉన్నా సానా సతీష్‌బాబు, బీద మస్తాన్‌రావుకి ఇచ్చారు. సానా సతీష్‌బాబు.. లోకేశ్ కోటరీలో ప్రస్తుతం అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చారు. బీద మస్తాన్‌రావు కూడా డబ్బు మూటలతో వచ్చిన వ్యక్తేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు.చదవండి: యనమలకు బాబు 'షాక్' హ్యాండ్చినబాబు ఆశీస్సులు ఉంటే.. చింత అక్కర్లేదు..మరోవైపు నామినేటెడ్ పదవుల విషయంలోనూ లోకేశ్ చెప్పిన వారికే పదవులు వచ్చాయి. కార్పొరేషన్ చైర్మన్లు, సభ్యులు, ఇతర పదవులను ఆయన ఇచ్చిన జాబితా ప్రకారమే కేటాయించారు. పదవుల కోసం ఎవరైనా చంద్రబాబు వద్దకు వెళితే ఆయన తన కొడుకును కలవమని చాలామంది నేతలకు చెప్పినట్లు సమాచారం. దీంతో సీనియర్లు చంద్రబాబు మారిపోయాడని, ఆయన కొడుకును కలవాల్సిన అవసరం ఏమిటని భావించి వెళ్లలేదు. కొందరు వెళ్లి కలిసినా, ప్రయోజనం లేదని చెబుతున్నారు. మొత్తంమీద ఈ పరిణామాలు పార్టీలో సీనియర్లకు ఆందోళన కలిగిస్తున్నాయని సమాచారం. -
వెంకయ్య నాయుడు గారూ.. అవేం మాటలు?
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తారు. మనకెవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే.. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై మాత్రం చర్చ జరగాల్సిందే. ఎన్నికల్లో గెలిచేందుకు మూడు పార్టీలు కలిసికట్టుగా వచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం, ఆచరణ సాధ్యం కానీ అనేక హామీలివ్వడం.. ఆపై వాటిని విస్మరించడం వంటి అంశాలపై వెంకయ్య నాయుడు తన అభిప్రాయం చెప్పకుండా.. చేయగలిగిన పనులపైనే ఎక్కువ దృష్టి పెడితే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యకు అర్థమేమిటి?. ఎన్నికల హామీలు పట్టించుకోవద్దని చెప్పడమే అవుతుంది కదా?. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తరువాత వెంకయ్య నాయుడు(M Venkaiah Naidu).. రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ అప్పుడప్పుడూ మాత్రమే పాల్గొంటున్నారు. స్వర్ణభారతి ట్రస్టు కార్యకలాపాల్లో భాగస్వామి అవుతుంటారు. ఆయన ఉచిత పథకాలకు వ్యతిరేకమని ప్రతీతి. ఈ విషయాన్ని ఆయన చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా. అయితే.. కొన్ని దశాబ్దాలుగా మిత్రుడిగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఈ విషయాలేవీ ఆయన చెప్పినట్లు కనిపించదు. 👉ఇటీవల వెంకయ్య నాయుడు విశాఖపట్నంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో చంద్రబాబు(Chandrababu)ను అభివృద్ది కాముకుడిగగా ప్రశంసించారు. అయితే సూపర్సిక్స్తోపాటు 150 ఇతర హామీలు ఇవ్వడంలో ఆయనకు ఏ అభివృద్ధి కాముకత కనిపించిందో తెలియదు. ఏదో రకంగా మిత్రుడు గెలిచారన్న ఆనందం ఉంటే ఉండవచ్చు??. చంద్రబాబు ప్రభుత్వం చేసిన హామీలను అమలు చేస్తోందా? లేదా? అనేది ఆయనకు తెలియకుండా ఉంటుందా!. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హామీలు అమలు చేయాలని సూచించాల్సిన వెంకయ్య.. చేయగలిగిన పనులపైనే దృష్టి పెట్టాలని చెప్పడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది కదా. 👉చంద్రబాబు ఆలోచనలు మంచివని వెంకయ్య సర్టిఫికెట్ ఇస్తూ.. అవి చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అవి ఏరకంగా ఉంటాయి? సూపర్‌సిక్స్‌తో సహా అనేక వాగ్దానాలు చేయడంలో ఉన్న మంచి ఆలోచనలు ఏమిటో కాస్త వివరంగా చెప్పి ఉంటే జనానికి కూడా బాగా అర్థమయ్యేది కదా?. ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని టీడీపీ, జనసేనలు ఎన్నికల హామీ ఇచ్చాయి. కాని తాజాగా ప్రవేశపెట్టన బడ్జెట్లో ఆ ఊసే ఎత్త లేదు. ఇది మంచి ఆలోచనా కాదా? అదే కాదు..నిరుద్యోగులకు రూ.3,000 భృతి ఇస్తామని,.. వలంటీర్లకు జీతం రూ.10,000 చేస్తామని రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, బలహీన వర్గాల వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేలు పంపిణీ చేస్తామని.. పలు వాగ్దానాలు చేశారు. ఇవన్నీ చంద్రబాబులో వచ్చిన మంచి ఆలోచనలే అని వెంకయ్య చెప్పదలిచారా?.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి సుమారు లక్షన్నర కోట్ల వరకు ఉండొచ్చు. కేవలం సూపర్ సిక్స్ హామీలకే రూ.79,179 కోట్లు అవసరమవుతాయి. కాని చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ.17,179 కోట్లే కేటాయించడం మంచి ఆలోచనేనని వెంకయ్య చెబుతారా?. 👉విద్య సంగతి ఎలా ఉన్నా మద్యం బాగా సరఫరా చేస్తున్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం తీరు చూసి వెంకయ్య నాయుడు పరవశిస్తున్నారా?. చంద్రబాబు మాతృబాషలోనే విద్యా బోధన జరగాలని అన్నందుకు వెంకయ్య సంతోషించారు. విద్యాబోధన పదో తరగతి వరకు మాతృభాషలోనే ఉండాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులో జరగాలని అన్నారు. మరి ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉందో, లేదో వెంకయ్య అడిగి తెలుసుకుని ఉండాలి. అలాగే చంద్రబాబు మనుమడు కాని, ఆయన బంధుమిత్రులలో ఎందరు తెలుగు మీడియంలో విద్యను అభ్యసిస్తున్నారో ఆరా తీసుకుని మెచ్చుకుని ఉంటే బాగుండేది కదా!. 👉ఇక్కడే సమస్య వస్తోంది. తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసే చంద్రబాబు, వెంకయ్య నాయుడు తదితర ప్రముఖుల కుటుంబాలలో ఎంతమంది దానిని పాటిస్తున్నారో ఇంతవరకు ఎవరూ చెప్పడం లేదు. కేవలం పేదలు, బలహీన వర్గాల వారు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే తెలుగు మీడియం ఉండాలని అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. సోషల్ మీడియాను అదుపులో పెట్టకపోతే పరిణామాలేమిటో ఏపీలో చూశామని, దాని పరిణామాలు అనుభవిస్తున్నారని ఆయన అన్నారు. వెంకయ్య నాయుడు కూడా ఏదో తెలుగుదేశం నాయకుడు మాట్లాడినట్లే స్పీచ్ ఇవ్వడం దురదృష్టకరం. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ సోషల్ మీడియా ఎంత అరాచకంగా పోస్టులు పెట్టినా ఈయన ఎన్నడైనా నోరు తెరిచారా? అప్పుడేమో భావ వ్యక్తికరణ స్వేచ్చ అని చంద్రబాబు.. ఎల్లో మీడియా ప్రచారం చేశారే. సీఎంగా ఉన్న జగన్‌ను పట్టుకుని బూతులు తిట్టినా కేసులు పెట్టడానికి వీలులేదని వాదించారే. ఆ విషయాలు వెంకయ్య నాయుడుకు తెలియకుండా ఉంటాయా? 👉అధికారంలోకి వచ్చాక సైతం వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ వారు ఎంత అరాచకంగా వ్యవహరిస్తునేది ఆయన తెలుసుకోలేక పోతున్నారు. కావాలంటే టీడీపీ వారు పెట్టిన బండబూతుల పోస్టింగులు చూడాలని ఆయన భావిస్తే.. మాజీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు వంటివారు పంపిండానికి సిద్దంగా ఉంటారు. అచ్చంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి చదివి అవి రాసే పచ్చి అబద్దాలనే ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా ఉంది. ఉప రాష్ట్రపతి పదవి చేసిన పెద్దాయన ఎవరూ అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని అన్ని పార్టీల వారికి చెప్పాలి కాని, ఒకవైపే మాట్లాడడం సమంజసం అనిపించదు.👉అంతెందుకు జగన్ ప్రభుత్వం(Jagan Government)పై ఎన్ని అసత్య ఆరోపణలు చంద్రబాబు, పవన్, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ప్రచారం చేసింది తెలియదా?. వెంకయ్య నాయుడుకు అవి సూక్తి ముక్తావళిలా నిపించేవేమో తెలియదు. అప్పులపై చంద్రబాబు, పవన్, పురందేశ్వరి తదితరులు చేసిన పచ్చి అబద్దాలు ఇప్పుడు ఆధార సహితంగా కనిపిస్తున్నాయే. అసెంబ్లీ సాక్షిగానే స్వయంగా ఆర్థిక మంత్రి కేశవ్ అవి అబద్దాలని అంగీకరించారే. అలా ఆర్గనైజ్డ్గా మూడు పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేయడం నేరమో, కాదో వెంకయ్య నాయుడు చెప్పగలిగి ఉంటే బాగుండేది. వైఎస్సార్సీపీ వారికి పనులు చేయవద్దని ఆదేశిస్తున్న చంద్రబాబు నాయుడును అభివృద్ధి కాముకుడని, మంచి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని ప్రశంసిస్తుంటే ప్రజలు ఏమనుకోవాలి?. కనీసం అలాంటి వివక్ష వద్దని చంద్రబాబుకు సలహా ఇవ్వలేక పోయారే! ఏది ఏమైనా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్లిన వెంకయ్య నాయుడు.. ఏపీలో ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీని సమర్థిస్తున్నట్లు మాట్లాడడం, కనిపిస్తున్న కక్షపూరిత రాజకీయాలు, అరాచక పరిస్థితులపై స్పందించ లేకపోవడం బాధాకరం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాలా వ్యాఖ్యాత. -
బుడమేరు వరద సాయంలో చంద్రబాబు సర్కార్ విఫలం: బొత్స
సాక్షి, అమరావతి: వరద సహాయంలో కూటమి సర్కార్ విఫలమైందని విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. బుడమేరు వరద సాయంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించామని బొత్స తెలిపారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మాట్లాడుతూ, వరద బాధితుల్లో అనేక మందికి ఇంకా పరిహారం అందలేదని మండిపడ్డారు. వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ.. బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు. అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధమని రుహుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మండలి: మేం అనుసరించిన విధానాలను నీతి ఆయోగ్ ప్రశంసించింది: బొత్స
మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు తీవ్ర నిరాశను కలిగించాయి : వరుదు కళ్యాణి👉పెట్టుబడి సాయం 20 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు👉ఇప్పుడు కేంద్రం సాయంతో కలిపి 20 వేలు ఇస్తామంటున్నారు👉మండలి సాక్షిగా రైతుకి వెన్నుపోటు పొడిచారు👉ఈ ప్రభుత్వం రైతులను మోసం చేసింది👉అన్నమో రామచంద్రా అనే పరిస్థితికి రైతును తీసుకొచ్చారు👉జగన్ మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయం పండుగలా సాగింది👉కూటమి పాలనలో సాగు విస్తీర్ణం తగ్గిపోయిందిఅచ్చెన్నాయుడు మాటలు వింటుంటే నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు : బొత్స👉2016లో రుణమాఫీకి బాండ్ ఇచ్చారు👉రుణమాఫీ చేయకుండా 2019 వరకూ ఏం చేశారు👉మిర్చి ఒక్క టన్నైనా 11,700 రూపాయలకి కొన్నారా👉గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవాలని కోరుతున్నాం60% శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు: బొత్స👉గత ప్రభుత్వంలో రైతులను సకాలంలో ఆదుకున్నాం👉విపత్తు వస్తే సీజన్ ముగిసేలోపు పరిహారం అందించాం👉విత్తనాలు...ఎరువులు రైతుల వద్దకే తీసుకెళ్లి అందించాం👉మా ప్రభుత్వంలో అనుసరించిన వ్యవసాయ విధానాలను నీతిఆయోగ్ కూడా ప్రశంసించింది👉మేం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేశాం👉వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చేనాటికి సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ చెల్లించాల్సిన బకాయిలు 5286 కోట్లు👉వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటే రైతుల పేరుతో డబ్బులు తీసుకున్నారనడం కరెక్ట్ కాదు👉ఇలా మాట్లాడటం రైతులను అవమానపరచడమేమంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ అభ్యంతరం👉తప్పు జరిగితే విచారణ జరిపించుకోవడం ఆయా ప్రభుత్వాల విధానం👉తాడేపల్లి ప్యాలెస్‌లో రికార్డులు తగలబెట్టేశారనడం సరికాదు👉రికార్డుల నుంచి మంత్రి వ్యాఖ్యలు తొలగించాలి👉ఆధారాలుంటే రుజువుచేయండి👉బాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదు👉తగలబెట్టినట్లు ఆధారాలుంటే కేసు ఫైల్స్‌లో ఎంక్వైరీ బైండింగ్స్‌లో చేర్చుకోండిబుడమేరు వరద సాయంపై మండలిలో చర్చ👉వరద బాధితుల్లో అనేకమందికి ఇంకా పరిహారం అందలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్👉వరద సహాయం విషయంలో ప్రభుత్వం విఫలమైంది👉ఆపరేషన్ బుడమేరు అన్నారు.. ఇప్పటివరకు ఏం చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి👉బుడమేరు గేట్లను ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రుహుల్లా👉వరదల తర్వాత బుడమేరును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు👉ఇప్పటికీ అనేకమంది బాధితులు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు👉ఒక ఇంటికి పరిహారం ఇచ్చి 10 ఇళ్లకు ఇచ్చినట్లు రాసుకున్నారు👉అందరికీ సాయం అందిందని చెప్పడం పచ్చి అబద్ధం👉కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు: బొత్స సత్యనారాయణ👉వైఎస్ జగన్ ప్రకటించిన కోటి రూపాయలను మేమే బాధితులకు అందించాం👉నేనే అందుకు బాధ్యత తీసుకున్నా👉కూటమి సర్కార్ సాయం అందించడంలో విఫలమైంది👉ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదు👉అందుకే మేమే స్వయంగా మా పార్టీ తరపున బాధితులకు సాయం అందించాంఏపీ శాసనమండలిలో ఉచిత ఇసుకపై వాడివేడిగా చర్చ 👉కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ధర పెరిగింది: బొత్స సత్యనారాయణ👉విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇసుక ధర తగ్గలేదు👉ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక ఇవ్వడం లేదు👉గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఎంతకిస్తున్నారో వెరిఫై చేయాలి👉కూటమి నేతలు చెప్పే లెక్కలు తప్పుగా ఉన్నాయి.👉కూటమి నేతలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు👉ఉచిత ఇసుక, ఇసుక అక్రమ అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల స్టాక్‌ను కొత్త ప్రభుత్వానికి అప్పగించిందని.. దానిలో ఎంత స్టాక్ రికార్డెడ్‌గా జమ చేశారు?. ఎంత ఆదాయం వచ్చిందని ప్రశ్నించారు. రీచ్‌లలో ట్రాక్టర్ల నుంచి లారీల్లోకి ఇసుక వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మొత్తం మెషినరీల ద్వారానే ఇసుకను తీసి లారీలకు లోడు చేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది’’ అని తోట త్రిమూర్తులు మండిపడ్డారు.👉‘‘ఒక్కొక్క లారీకి సుమారు 11 నుంచి 12 వేల వరకు వసూలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పగించిన ఇసుకకు, చెబుతున్న లెక్కలకు తేడాలు ఉన్నాయి. మెషినరీల ద్వారా ఇసుకను మొత్తం తోడేస్తున్నారు. గత 2016లో తెచ్చిన పాలసీనే ఇప్పుడు కూడా ఉంది. పేద ప్రజలకు ఇసుక అందే పరిస్థితి లేదని తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.👉శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో లారీ ఇసుక ఎంతకు దొరికేది?.. ఈ రోజు ఎంతకు దొరుకుతుందంటూ కూటమి సర్కార్‌ని నిలదీశారు. ఉచిత ఇసుక అంటే టన్నుకు కనీసం 400 రూపాయలు తగ్గాలి. సామాన్యులకు ఉచిత ఇసుక అందే పరిస్థితి లేదని మండిపడ్డారు. -
పోలీసులే ఫిర్యాదు చేసి.. పోలీసులే కేసు నమోదు!
ఏలూరు: టీడీపీ ఆదేశాలతో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా టీడీపీ చెలరేగిపోతోంది. తాజాగా దెందులూరు నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసింది కూటమి ప్రభుత్వం. ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై అక్రమ కేసులు బనాయించారు దెందులూరు పోలీసులు. తన నివాసం వద్ద ఉన్న కామిరెడ్డి నాని.. తమ విధులకు ఆటంకం కల్గించారంటూ రివర్స్ కేసులు పెట్టారు ఏపీ పోలీసులు. ఈ కేసులో పోలీసులే ఫిర్యాదు చేసి.. వాళ్లే కేసు నమోదు చేయడం గమనార్హం. కామిరెడ్డి నానిపై హెడ్ కానిస్టేబుల్ హమిద్ ఫిర్యాదు చేయగా, ఎస్పై శివాజీ కేసు నమోదు చేశారు. 132R/w 3(5)bns సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.ఏపీలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తువారిపై, కూటమిలో ఉన్న పార్టీలపై గతంలో విమర్శలు చేసిన వారిపై టీడీపీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడు నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం రాసుకుంటున్నానని గతంలో ఏదైతే చెప్పారో అదే అమలు చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదొక అక్రమ కేసును వారిపై మోపి.. బెదిరింపు చర్యలకు పాల్పడుతోంది. ఇందుకు రాష్ట్ర పోలీసులు కూడా సహకరిస్తూ ఉండటంతో అక్రమ కేసుల పరంపరంకు అడ్డుకట్టలేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం అరాచకపాలను ప్రశ్నిస్తే చాలు ఏదొక అక్రమ కేసును చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రశ్నిస్తేనే తప్పు అన్నట్లుగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం.