Top Stories
ప్రధాన వార్తలు

ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్లో టెన్షన్.. ఎయిర్‌పోర్టులు బంద్
Indian Army Operation Sindoor Updates.. ఆపరేషన్ సిందూర్‌లో 80 టెర్రరిస్టుల మృతిఆపరేషన్ జరిగిన ప్రాంతాలు1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - HM5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎంసరిహద్దుల్లో టెన్షన్..భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికాఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశంమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీబహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడిమురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీ భారత్ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ,కోట్లీ, బహ్వాల్పూర్, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసంత్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.భారత్ దాడుల్లో పాక్ ఆర్మీ ఐఎస్ఐ కంట్రోల్ రూమ్ ధ్వంసంఅర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు. Operation Sindoor UPDATES: Here is the list of nine terror facility locations in Pakistan and Pakistan-occupied Kashmir that have been successfully neutralised-1. Markaz Subhan Allah, Bahawalpur - JeM2. Markaz Taiba, Muridke - LeT3. Sarjal, Tehra Kalan - JeM4. Mehmoona Joya,… pic.twitter.com/Q3Q6vyw0Sa— Press Trust of India (@PTI_News) May 7, 2025 పాక్ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేతఅప్రమత్తమైన పాక్ డిఫెన్స్ వ్యవస్థలుభారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది.లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.हम जो कहते हैं, वो डेफिनिटली करते हैं...भारतीय सुरक्षा बलों ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।पाकिस्तान में 9 आतंकी ठिकाने पूरी तरह तबाह!भारतीय सेना कहा"पहलगाम का न्याय हुआ..."#OperationSindoorभारत माता की जय! 🇮🇳 pic.twitter.com/0Gve2IVl6J— Ankit Kumar Avasthi (@kaankit) May 7, 2025 పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులుపహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వంసోషల్ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలుभारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!पहलगाम का न्याय हुआ... भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025 #WATCH | Indian Army tweets, ""प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win.(Video Source: Indian Army) pic.twitter.com/5tJbfBX4Nk— ANI (@ANI) May 6, 2025భారత్ దాడులు.. పలు విమానాలు రద్దు శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్ జెట్‌ధర్మశాల, లేహ్, జమ్మూ, అమృత్సర్ విమానాశ్రయాల మూసివేతఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేతఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయంజమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేతకేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం పాక్ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యంఅంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసిన భారత్‌మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్‌జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్👉పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.👉పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. 👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. 👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రాజ్‌నాద్ సింగ్. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025

భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
ఇస్లామాబాద్: పహల్గాం దాడి ఘటనకు పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరిట.. పాక్‌లోని కొట్లీ, మురిడ్కే, బహవల్పూర్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఇక, భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాబ్ షరీఫ్ స్పందించారు. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది అని చెప్పుకొచ్చారు.భారత్ దాడులను పాక్ సైన్యం ధ్రువీకరించింది. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘పాక్ శత్రువు భారత్.. మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఈ చర్యలకు పాకిస్తాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం’ తెలిపారు. అలాగే, ఈ దాడులను ఆయన యుద్ధ చర్యలు అని పేర్కొన్నారు.మరోవైపు పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దులో పాక్ ఆర్మీ రెచ్చిపోయింది. పూంఛ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం కాల్పులు మొదలుపెట్టింది. ఎల్వోసీ వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిడ్కే టెర్రరిస్టు గ్రూప్ లష్కరే తొయిబాకు హెడ్ క్వార్టర్స్‌గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్పూర్లో మసూద్ అజార్ నేతృత్వంలోని జైష్ -ఎ- మహ్మద్ స్థావరం ఉంది.పాక్ డీజీ ఐఎస్పీఆర్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ స్పందించారు. ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురు చనిపోయారని, 12 మందికి గాయాలైనట్టు పాక్ ఆర్మీ పేర్కొంది. సమయం చూసుకొని బదులుగా స్పందిస్తామని పేర్కొన్నారు. భారత్ తాత్కాలిక ఆనందాన్ని శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తామని అన్నారు. పాక్ అప్రమత్తం.. భారత్ దాడుల అనంతరం పాక్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. దేశంలో పరిస్థితులను గమనిస్తున్నట్టు అధికారులు చెప్పుకొచ్చారు.

Operation Sindoor: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు. భారత్ జరిపిన దాడిని పాకిస్తాన్ అంగీకరించింది. తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. ఇక ఇండియన్ ఆర్మీ విజయవంతగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సిందూర్‌ను (OperationSindoor)ప్రధాని మోదీ రాత్రంతా సమీక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్పూర్ సహా పంజాబ్ ప్రావిన్స్‌లోని ఐదు ప్రదేశాలు, పీఓకేలోని నాలుగు ప్రదేశాలు ఈ దాడులు జరిగాయి. వీటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సైతం ఉంది. "प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో బుధవారం తెల్లవారు జామున ఉదయం 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్‌పై ప్రకటన చేసింది. తాము దాడులు నిర్వహించింది ఉగ్రవాద స్థావరాలేనని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నేరుగా సమీక్షించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, గూఢచార సంస్థల ఉన్నతాధికారుల నుండి నిరంతరంగా సమాచారం అందుకుంది. మంగళవారం రాత్రి నుంచే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో ప్రధాని పలుమార్లు మాట్లాడారు. పహల్గాం ఘటన అనంతరం ప్రభుత్వ గూఢచార సంస్థల ద్వారా పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచాఉరం. దాడుల అనంతరం భారత ప్రభుత్వం ముఖ్య అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించింది. అమెరికా, యూకే , రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాధికారులను భారత ఉన్నతాధికారులు సంప్రదించి ఈ దాడులు గురించి పూర్తిగా వివరించారు.

ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ ఇలా.. 1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడులు.2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.2:30 AM శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు.3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.4:00 AM ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులుభారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.

మెగా పేరుతో ఎందుకీ దగా?
సాక్షి, అమరావతి: డీఎస్సీ అభ్యర్థులను కూటమి ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. అర్హత మార్కుల నిబంధన పేరుతో దరఖాస్తు దశలోనే ఎంతో మందిని అనర్హులను చేసింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలను సైతం పరిగణనలోకి తీసుకోకుండా సగం మంది అభ్యర్థులపై ప్రాథమిక దశలోనే వేటు వేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు రిజర్వుడు కేటగిరీలో ఉన్న అభ్యర్థుల అర్హత మార్కులు తగ్గించినా, జనరల్ అభ్యర్థుల మార్కుల నిబంధనను సడలించలేదు. డీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉండడంతో లక్షల మంది జనరల్ అభ్యర్థులు తమనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవానికి టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీ రాసేందుకు అర్హత కల్పించాల్సి ఉన్నా, ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఆలోచించక పోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గత నెల 20న 16,347 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 10 నెలల పాటు ఊరించి ఇచ్చిన ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు అభ్యర్థులకు తీరని నష్టం కలిగించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్జీటీ పోస్టులకు ఇంటర్మీడియట్లో, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. వాస్తవానికి 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ చేసిన వారికి ఈ నిబంధన వర్తించదని 2019 నవంబర్‌లో భారత ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినా.. ఇవేమీ పట్టించుకోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కనీస మార్కుల అంశంలో భిన్న వైఖరి అభ్యర్థుల అర్హత మార్కుల అంశంలో అటు ప్రభుత్వం, ఇటు పాఠశాల విద్యాశాఖలు భిన్నంగా వ్యవహరించడం విస్తుగొలుపుతోంది. తొలుత ఇంటర్, గ్రాడ్యుయేషన్‌లో జనరల్ అభ్యర్థులకు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులు తప్పనిసరి చేసింది. అనంతరం టీచర్ అర్హత పరీక్ష (టెట్)లో రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం మార్కులే పేర్కొన్నందున డీఎస్సీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గిస్తూ అనుబంధ జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ జనరల్ అభ్యర్థులకు మాత్రం 50 శాతం అలాగే ఉంచింది. వాస్తవానికి జనరల్ అభ్యర్థులకు టెట్‌లో అర్హత మార్కులు 45 శాతం ఉన్నా, ఆ మేరకు అయినా తగ్గించక పోవడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో గతేడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన డీఎస్సీ–2024లో తొలుత 50 శాతం మార్కుల నిబంధన విధించగా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దాంతో ఎన్సీటీఈ నిబంధనల మేరకు ఇంటర్మీడియట్, డిగ్రీలలో కనీస మార్కులు జనరల్ అభ్యర్థులకు 45 శాతం, రిజర్వేషన్ అభ్యర్థులకు 40 శాతానికి తగ్గించారు. ఈ మేరకు నియమకాలు కూడా జరిగిపోయాయి. కానీ ఏపీలో మాత్రం ఎన్సీటీఈ నిబంధనల అమలు చేయలేదు. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే.. ఉపాధ్యాయ నియామకాలపై రాజస్థాన్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో ఇదే సమస్య ఉత్పన్నమైనప్పుటు అక్కడి అభ్యర్థులు ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించారు. దాంతో డిగ్రీలో కనీస అర్హత మార్కులపై ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఎన్‌సీటీఈకి మార్గదర్శకాలు విడుదల చేసింది. కనీస మార్కులపై తగిన నిర్ణయాన్ని ప్రకటించాలని, హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఉండేలా సూచనలు చేసింది. ఎన్సీటీఈ 2019 నవంబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ‘ఉపాధ్యాయ నియామకాల్లో 2011 జూలై 29కి ముందు బీఈడీ, డీఈడీ లేదా సమానమైన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదు’ అని ప్రకటించింది. 2011 ఆగస్టు 2నాటి ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్లోనూ కనీసం 45 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, ఏడాది కాల పరిమితి గల బీఈడీ చేసినవారు డీఎస్సీకి అర్హులుగా పేర్కొంది. ఈ లెక్కన ఎలా చూసినా జనరల్ అభ్యర్థులకు డీఎస్సీ రాసేందుకు అర్హత మార్కులు 45 శాతం మించరాదు. నిబంధనల్లో వివక్షపై తీవ్ర విమర్శలు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ నిబంధనలు పూర్తి వివక్షతో ఉన్నాయని అటు అభ్యర్థులు, ఇటు ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 15లో 2007 వరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశం పొందిన వారు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉంటే ఎస్జీటీకి అర్హులుగా పేర్కొంది. కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 29 జూలై 2011కు ముందు బీఈడీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా తత్సమాన కోర్సులో ప్రవేశం పొందిన వారికి గ్రాడ్యుయేషన్‌లో కనీస మార్కుల శాతం వర్తించదన్న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ నిబంధనలను మెగా డీఎస్సీ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఈ నిబంధనను తెలంగాణ డీఎస్సీ–2024 కోసం ఇచ్చిన సవరణ జీవో నంబర్ 14లో పేర్కొన్నారు. దీని ప్రకారం రిజర్వుడు అభ్యర్థులకు 40 శాతం, జనరల్ అభ్యర్థులకు 45 శాతం అర్హత మార్కులుగా నిర్ణయించారు. దీంతోపాటు ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం 2011 జూలై 29 నాటికి బీఈడీ, డీఈడీ చేసిన వారికి అర్హత మార్కుల నిబంధన తొలగించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎన్సీటీఈ నిబంధనలను పట్టించుకోకపోవడంతో అర్హులైన జనరల్ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగినట్లయింది. దీనిపై జనరల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.సీబీఎస్ఈ అభ్యర్థులకు అన్యాయం పదో తరగతి వరకు సీబీఎస్ఈలో చదివి, డీఈడీ ఇంగ్లిష్ మీడియంలో పూర్తి చేసిన వారికీ ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్ఈ విద్యార్థులకు మొదటి భాష ఇంగ్లిష్ మాత్రమే ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాష తెలుగు ఉంటేనే ఎస్జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సీబీఎస్ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఫిబ్రవరి–2024 డీఎస్సీ నోటిఫికేషన్లో ఈ సమస్య లేదని అభ్యర్థులు చెబుతున్నారు. జూలై–2024 టెట్‌లోనూ కూటమి ప్రభుత్వం ఈ నిబంధన పేర్కొనలేదంటున్నారు. ఉన్న ఫళంగా నిబంధలు మార్చేసి అన్యాయం చేస్తే సహించమని, తాజా టెట్ అర్హత సాధించిన అందరికీ డీఎస్సీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

భారత్ మెరుపు దాడులపై స్పందించిన ట్రంప్, పాక్
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులకు దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఏకంగా తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ చేసిన మెరుపు దాడులపై పాక్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.దాడులపై స్పందించిన పాక్ ప్రధాని, ఆర్మీభారత్ తమ దేశంపై దాడులు చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈమేరకు పాక్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఒక లేఖ విడుదల చేశారు. పాక్, భారత్ సరిహద్దులకు కొద్ది దూరంలో ఉన్న బహవల్పూర్,కొట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆయన తెలిపాడు. అయితే, ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని పాక్ ప్రకటించింది.అయితే, పదికిపైగా చనిపోయినట్లు తెలుస్తొంది. సుమారు 15మందికి తీవ్రమైన గాయాలైనట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఈ దాడికి పాల్పడిన భారత్‌పై తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రకటించింది. ఇప్పుడు భారత్ తాత్కాలిక సంతోషంతో ఉండొచ్చు.. కానీ, శాశ్వత దుఃఖంతో తాము భర్తీ చేస్తామని పాక్ లెప్టినెంట్ జనరల్ అన్నాడు. ఇదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు.పాకిస్తాన్‌లోని ఐదు ప్రదేశాలపై మోసపూరిత శత్రువు పిరికి దాడి చేసింది. భారతదేశం విధించిన ఈ యుద్ధోన్మాద చర్యకు బలవంతంగా స్పందించే హక్కు పాకిస్తాన్‌కు పూర్తిగా ఉంది. దానికి గట్టిగా ప్రతిస్పందన ఇవ్వబడుతుంది. మొత్తం దేశం పాకిస్తాన్ సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్, ఆర్మీకి బాగా తెలుసు. శత్రువు తన దుర్మార్గపు లక్ష్యాలలో విజయం సాధించడానికి మేము ఎప్పటికీ అనుమతించము.' అని ఆయన తెలిపారు.స్పందించిన అమెరికా అధ్యక్షుడుభారత్, పాక్ దేశాల మధ్య పరిస్థితిని జాగ్రత్తగా తాము గమనిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో రియాక్ట్ అయ్యారు. ఆపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా స్పందించారు. 'ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్, పాక్‌లు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి. ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలి. ఇదొక హేయమైన చర్య. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు' అని ట్రంప్ అన్నారు.Happy Diwali, Pakistan Indian army 🔥Jai Hind 🇮🇳#OperationSindoor pic.twitter.com/grYxrv26WZ— Vishal (@VishalMalvi_) May 6, 2025

ఓబుళాపురం మైనింగ్ కేసు.. సబిత నిర్దోషి
సాక్షి, హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గనుల శాఖ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మంగళవారం మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితులైన ఓఎంసీ అప్పటి డైరెక్టర్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాసరెడ్డి, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ వీడీ రాజగోపాల్, గాలి జనార్దనరెడ్డి పీఏ మెహఫూజ్ అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున,ఓఎంసీకి రూ.2 లక్షల జరిమానా విధించింది. రాజగోపాల్‌కు అవినీతి నిరోధక చట్టం కింద అదనంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, పరిశ్రమల శాఖ అప్పటి కార్యదర్శి ఐఏఎస్ అధికారి యర్రా శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు 2022లో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2009లో కేసు నమోదు ఏపీ–కర్ణాటక సరిహద్దు అనంతపురం, బళ్లారి రిజర్వు ఫారెస్టులో ఓబుళాపురం గ్రామ పరిధిలోని ఇనుప గనుల తవ్వకాలను ఓఎంసీ నిర్వహించేంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపట్టిందని 2009 డిసెంబరు 7న సీబీఐకి ఫిర్యాదు అందింది. అనుమతి పొందిన 68.5 హెక్టార్ల ప్రాంతాన్ని దాటి ఇనుప ఖనిజాన్ని తవి్వందని అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, వీడీ రాజగోపాల్, ఓఎంసీ, కృపానందం, సబితాఇంద్రారెడ్డి, గనుల శాఖ నాటి ఏడీ లింగారెడ్డి, శ్రీలక్ష్మిలపై అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్లతో పాటు కొందరిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పెట్టింది. రూ.884.13 కోట్ల మేర అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని 2011లో సీబీఐ తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 2014 వరకు ఇలా నాలుగు చార్జిషీట్లు వేసింది. 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేశారని, బినామీ లావాదేవీలు జరిగాయని సీబీఐ పేర్కొంది. కాగా, కేసు విచారణ ఏళ్లకు ఏళ్లు పడుతుండడంతో సుప్రీంకోర్టు విచారణను పర్యవేక్షిస్తూ.. మే నెలలోగా పూర్తి చేయాలని గడువు విధించింది. ఇక 219 మంది సాక్షులను విచారించి, 3,330 డాక్యుమెంట్లను పరిశీలించిన సీబీఐ న్యాయస్థానం గత నెలలో తీర్పు రిజర్వు చేసింది. కాగా, లింగారెడ్డి విచారణ దశలోనే మృతి చెందారు. కోర్టుకు హాజరైన నిందితులు తీర్పు వెల్లడి సందర్భంగా కేసులో నిందితులు కోర్టుకు హాజరయ్యారు. ఈ నెల 18న తన కుమారుడి పెళ్లి ఉందని అప్పటివరకు అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తాను ఎన్నో ప్రజాపయోగ కార్యక్రమాలు చేశానని, పేద కుటుంబం నుంచి వచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పించానని గాలి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు తనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని ఆదేశించినా, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఉపశమనం కల్పిస్తే ఆధ్యాత్మిక పథంలో వెళ్తానని విన్నవించారు. ప్రభుత్య ఉద్యోగులందరినీ వదిలేసి తనను శిక్షించడం అన్యాయమని రాజగోపాల్ నివేదించారు. తనపై ఆధారపడి తల్లిదండ్రులు, నలుగురు పిల్లలు ఉన్నారని అలీ విజ్ఞప్తి చేశారు. సబితాఇంద్రారెడ్డి, కృపానందం కూడా కోర్టుకు హాజరయ్యారు.

పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
తమిళగ వెట్రి కళగం నేత విజయ్, జనసేన నేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌లను ఉద్దేశించి సినీ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. ఓ తమిళ పత్రికలో ప్రకాష్ రాజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందుగా చైన్నెలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను ప్రకాష్ రాజ్ కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్, విజయ్‌లకు ఇద్దరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.టాలీవుడ్ స్టార్ హీరో అయిన చిరంజీవి కుటుంబం నుంచి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ అభిమానులు మాత్రమే పార్టీ కార్యకర్తలుగా మారారని గుర్తుచేశారు. విజయ్ కూడా తమిళ్లో అగ్రహీరో ఆపై ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడు కావడం కలిసొచ్చిందన్నారు. విజయ్‌కు ఎలాంటి గుర్తింపు లేనప్పుడే ఆయన ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అయితే, పవన్ కొన్నేళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తే.. విజయ్ మాత్రం ఇప్పుడే సినిమాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారన్నారు.విజయ్, పవన్‌లతో తాను చాలా సినిమాల్లో నటించానని ఆ సమయంలో వారిద్దరిలో ఎవరూ కూడా రాజకీయాల గురించి అస్సలు మాట్లాడింది లేదన్నారు. పవన్ వచ్చి పది సంవత్సరాలు అయిందని ఆయనకు దీర్ఘదృష్టి కానీ, ప్రజా సమస్యలపై అవగాహన కానీ ఉన్నట్లు తాను ఎప్పుడూ గమనించలేదన్నారు. ఆయనలో ఆవేశం తప్పా ఎలాంటి విజన్ లేదు. కాబట్టే రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మార్పు కోసం అంటూ రాజకీయాలలోకి వస్తున్న వారు తమ ఇమేజ్ను పక్కనబెట్టి ప్రజల్లోకి వచ్చి గెలుపును సొంతంగా అందుకోవాలన్నారు. విజయ్‌కు ఉన్న ఇమేజ్ కారణంగా తమిళనాట కొన్ని స్థానాలు దక్కవచ్చన్నారు. గెలుపు వచ్చిన తర్వాత ప్రజల్లో తమ సత్తా ఏంటో వారిద్దరూ నిరూపించుకోవాలని ఆయన సూచించారు. అయితే, వచ్చే ఎన్నికల్లో విజయ్‌కు ఉన్న ఇమేజ్ వల్ల ఆయన పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు.

ఇక స్వేచ్ఛా వాణిజ్యం
న్యూఢిల్లీ/లండన్: భారత్–యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)తోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ఒప్పందం కుదిరాయి. ఇరుదేశాల మధ్య మూడేళ్లుగా జరుగుతున్న చర్చలు ఫలించాయి. ఒప్పందంపై భారత్, యూకే మంగళవారం అంగీకారానికి వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై సుంకాల మోత మోగిస్తున్న తరుణంలో ఈ ఒప్పందాలు కుదరడం వల్ల భారత్, యూకే దేశాలకు ఎనలేని లబ్ధి చేకూరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బలపడనున్న బంధం యూకేతో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చరిత్రాత్మకమైన మైలురాయిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారత్–యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబ డులు, ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పన, నవీన ఆవిష్కరణలు వంటి అంశాల్లో రెండు దేశాలకు ఎంతో మేలు జరుగుతుందని హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ తాజాగా యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో ఫోన్లో మాట్లాడారు. ఎఫ్‌టీఏపై చర్చించారు. ఎఫ్‌టీఏతోపాటు డబుల్ కంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కుదరడాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద, ఓపెన్–మార్కెట్ ఆర్థిక వ్యవస్థలైన భారత్, యూకే మధ్య ఎఫ్‌టీఏ కుదరడంతో వ్యాపారాలకు నూతన అవకాశాలు అందుబాటులోకి రావడంతోపాటు రెండు దేశాల మధ్య ఆర్థిక బంధంతోపాటు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలం పుంజుకుంటాయని మోదీ, స్టార్మర్ ఉద్ఘాటించారు. ఏమిటీ ఒప్పందం? ⇒ భారత్–యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చాలాఏళ్లుగా చర్చల్లో నలుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడం, విదేశీ ఉత్పత్తులపై సుంకాల బాంబు పేల్చడంతో భారత్–యూకే మధ్య చర్చల్లో ఒక్కసారిగా వేగం పెరిగింది. 2022 జనవరిలో మొదలైన ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. అదే సమయంలో ప్రతిపాదిత ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ⇒ స్వేచ్ఛా వాణిప్య ఒప్పందంతో విస్కీ, అడ్వాన్స్డ్ తయారీ భాగాలు, వైద్య పరికరాలు, అడ్వాన్స్డ్ మెషినరీ, ఆహార ఉత్పత్తులపై టారిఫ్‌లు భారీగా తగ్గుతాయి. ⇒అంతర్జాతీయ మార్కెట్ల కోసం రెండు దేశాలు ఉమ్మడిగా వస్తువులు, సేవలను అభివృద్ధి చేయడానికి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ⇒యూకే ఉత్పత్తులను ఇండియా అనుమతించనుంది. అలాగే ఇండియా తమ ఉత్పత్తులను యూకేలో విక్రయించుకోవచ్చు. ⇒ భారత్‌లో బ్రిటిష్ స్కాచ్ విస్కీ, బ్రిటిష్ కార్ల ధరలు తగ్గిపోతాయి. అలాగే బ్రిటన్‌లో ఇండియా వస్త్రాలు, తోలు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ⇒ ఒప్పందం ప్రకారం... యూకే విస్కీ, జిన్‌పై సుంకాన్ని 150 నుంచి 75 శాతానికి భారత్ తగ్గిస్తుంది. పదేళ్లలో 40 శాతానికి తగ్గించనుంది. ⇒ బ్రిటిష్ ఆటోమొబైల్స్‌పై ఇండియాలో టారిఫ్ ప్రస్తుతం 100 శాతం ఉండగా, ఇది 10 శాతానికి తగ్గిపోనుంది. ప్రతిఫలంగా భారత్ నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై టారిఫ్‌లను యూకే ప్రభుత్వం భారీగా తగ్గిస్తుంది. ⇒ యూకే మార్కెట్లలో 99 శాతం భారతీయ ఉత్పత్తులపై టారిఫ్‌లు సున్నాకు పడిపోతాయి. పాదరక్షలు, బంగారు అభరణాలు, రత్నాలు, రసాయనాలు, ప్లాస్టిక్, రబ్బర్, కలప, కాగితం, గాజు, సెరామిక్, బేస్ మెటల్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ మెషినరీ, ఫర్నీచర్, క్రీడా సామగ్రి, శుద్ధి చేసిన ఆహారం, పాడి ఉత్పత్తులపై సుంకాలు ఉండవు. అంతేకాకుండా భారతీయులకు యూకేలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ⇒ ఎఫ్టీఏతో ఇండియా–యునైటెడ్ కింగ్డమ్ నడుమ ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెండు రెట్లు వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. 2040 నాటికి బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ ప్రతిఏటా అదనంగా 4.8 బిలియన్ పౌండ్ల మేర లాభపడుతుందని చెబుతున్నారు. ⇒భారత్, యూకే మద్య ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా 41 బిలియన్ పౌండ్లుగా ఉంది. ఎఫ్టీఏతో ఇది 56 బిలియన్ పౌండ్లకు చేరుకోనుంది. ⇒ డబుల్ కంట్రిబ్యూషన్స్ కన్వెన్షన్(సామాజిక భద్రత ఒప్పందం) ప్రకారం.. భారత్ ఉద్యోగాలు యూకేలో లేదా యూకే ఉద్యోగులు భారత్‌లో పనిచేస్తే నేషనల్ ఇన్సూరెన్స్ లేదా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ⇒ ఎఫ్టీఏకు ఇరుదేశాల పార్లమెంట్ ఆమోదం లభించి, సంతకాలు జరగాల్సి ఉంది. ఏడాది లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
'ఆపరేషన్ సింధూర్' కోసం నిలబడుదాం అంటూ ప్రముఖల పోస్ట్‌లు
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
కన్నీటి నిశ్చితార్థం
Operation Sindoor: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
Hydra: సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ కూల్చివేత
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి..
భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
'ఆపరేషన్ సింధూర్' కోసం నిలబడుదాం అంటూ ప్రముఖల పోస్ట్‌లు
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
కన్నీటి నిశ్చితార్థం
Operation Sindoor: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
Hydra: సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ కూల్చివేత
పవన్, విజయ్ ఇద్దరూ ఒక్కటే.. అవగాహన శూన్యం: ప్రకాష్‌రాజ్
భారత్ దాడులు.. పాక్ ప్రధాని రియాక్షన్ ఇదే..
బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి..
భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
సినిమా

సితార ఎక్కడా తగ్గట్లే.. చీరలో స్టైలిష్ గా శ్రీలీల
చిన్న వయసులోనే గ్లామరస్ గా సితారచీరలో శ్రీలీల బ్యాక్ లెస్ పోజులుబేబీ బంప్ తో ఈవెంట్ లో పాల్గొన్న కియారామేకప్ లేకుండా కనిపించిన నభా నటేశ్హాలీవుడ్ స్టైల్లో కనిపిస్తున్న ప్రియాంక చోప్రాహిట్ 3 శ్రీనిధి చీర స్టిల్స్.. చూస్తే మెల్ట్ అవ్వాల్సిందేడ్యాన్స్ తో ఎంటర్ టైన్ చేసిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

ఎట్టకేలకు '100' కొట్టేసిన సూర్య
సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. తెలుగులో రిలీజైన మొదటిరోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్, వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఎలాగోలా వంద మార్క్ దాటేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజైంది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో 'రెట్రో'తో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇది తమిళనాడు వరకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఐదు రోజుల తర్వాత రూ.104 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)ఎలాగైతేనేం సూర్య మూవీకి రూ.100 కోట్లు వచ్చేశాయి. ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు.ప్రస్తుతం సూర్య.. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా.(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత)

డ్రగ్స్ కేసు.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అరెస్ట్
డ్రగ్స్ కేసుల వల్ల మలయాళ చిత్రసీమ హాట్ టాపిక్ అవుతోంది. కొన్నిరోజుల క్రితం ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో.. డ్రగ్స్ వాడుతున్నాడని తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై కాసేపటికే బెయిల్ పై రిలీజయ్యాడు. వారం క్రితం ఇద్దరు మలయాళ దర్శకుల్ని ఇదే తరహా కేసులో అరెస్ట్ చేశారు. (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ఇప్పుడు ఈ కేసులో మరో అప్డేట్. అరెస్ట్ అయిన సదరు దర్శకులు ఖలీద్ రెహ్మాన్, అష్రఫ్ హమ్జాతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ సమీర్ తాహిర్ ని కూడా సోమవారం నాడు ఇదే డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లతో ఇతడికి సంబంధం ఉందనే ఆరోపణలతోపాటు ఇతడు అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో వీళ్లు ఉండటం దీనికి కారణం.అయితే తాను అద్దెకు తీసుకున్న అపార్ట్ మెంట్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తనకు తెలియదని సమీర్ తాహిర్.. పోలీసులతో చెప్పుకొచ్చాడు. అయినా సరే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఇతడిపై కేసు నమోదు చేశారు. కానీ కాసేపటికే ఇతడు కూడా బెయిల్ పై బయటకొచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)

గుడి కట్టిన అభిమాని.. సమంత ఏమన్నారంటే..
స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అభిమాని గుడి కట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో 2023లో ఓ చిన్నపాటి విగ్రహంతో ఈ గుడిని నిర్మించారు. ఇటీవల ఆ గుడిలో గోల్డెన్ కలర్ సామ్ విగ్రహాన్ని పెట్టి.. సమంత బర్త్‌డే(ఏప్రిల్ 28) నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు అనాథ పిల్లలకు సదరు అభిమాని.. భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా గుడి విషయంపై సమంత స్పందించారు. గుడి కట్టిన విషయం తెలియగానే హ్యాపీగా ఫీలయ్యా కానీ..ఇలాంటి ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ.. అభిమాని గుడి కట్టిన విషయంపై స్పందించారు. అభిమాని నా పట్ల ఇంత ప్రేమ చూపించడం తెలిసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అయితే, నేను ఇలాంటి చర్యలను ప్రోత్సహించను. అభిమానులు తమ ప్రేమను సానుకూల మార్గాల్లో, సమాజానికి మేలు చేసే విధంగా చూపించాలని కోరుకుంటాను," అని అన్నారు. సమంత ఈ సందర్భంగా తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.ఇక శుభం విషయానికొస్తే.. సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!
క్రీడలు

టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్‌రేట్ విషయంలో భారత్ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌కు ఎదురుదెబ్బసౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కశ్వీ గౌతమ్ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్ క్యాప్డ్ పేసర్ క్రాంతి గౌడ్‌తో రీప్లేస్ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్ సీజన్లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినథ్యం వహిస్తుంది.

MI VS GT Live Updates: .. ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం
ఉత్కంఠ పోరులో ముంబైపై గుజరాత్ విజయం సాధించింది. వర్షం అంతరాయం వల్ల 19 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. చివరి ఓవర్లో లక్ష్యం 15 పరుగులు కాగా వర్షం కారణంగా DLS పద్ధతిలో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే వర్షం పడటంతో మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. తిరిగి మొదలైన మ్యాచ్.. లక్ష్యానికి చేరువగా గుజరాత్14 ఓవర్ల తర్వాత వర్షం పడటంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. తిరిగి అర్ద గంట తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది.గుజరాత్ లక్ష్యానికి చేరువగా ఉంది. 14 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయంవర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలుపు దిశగా సాగుతుంది. గుజరాత్ గెలవాలంటే 36 బంతుల్లో 48 పరుగులు చేయాలి. 14 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/214 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 107/2గా ఉంది. గిల్ 8, రూథర్‌ఫోర్డ్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్11.3వ ఓవర్- 78 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో రికెల్టన్కు క్యాచ్ ఇచ్చి జోస్ బట్లర్ (30) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/110 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 68/1గా ఉంది. గిల్ 28, బట్లర్ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 156.. 6 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 29/1156 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. ఆదిలోనే వికెట్ కోల్పోవడంతో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 29/1గా ఉంది. గిల్ (12) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. బట్లర్ 10 పరుగులతో అతనికి జతగా ఉన్నాడు. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్1.2వ ఓవర్- 156 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో గుజరాత్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికల్టెన్కు క్యాచ్ ఇచ్చి ఇన్ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (5) ఔటయ్యాడు. సత్తా చాటిన గుజరాత్ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబైటాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ముంబైని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసింది. గుజరాత్ బౌలర్లందరూ సత్తా చాటడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ 2, సిరాజ్, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్, గెరాల్డ్ కొయెట్జీ తలో వికెట్ పడగొట్టారు. ముంబై ఇన్నింగ్స్‌లో విల్ జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35), కార్బిన్ బాష్ (27) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో బాష్ బ్యాట్ ఝులిపించకపోయుంటే ముంబై ఈ మాత్రం స్కోర్ కూడా సాధించలేకపోయేది. ఏడో వికెట్ కోల్పోయిన ముంబై16.2వ ఓవర్- 123 పరుగుల వద్ద ముంబై ఏడో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి నమన్ ధిర్ (7) ఔటయ్యాడు.ఆరో వికెట్ కోల్పోయిన ముంబై13.5వ ఓవర్- 113 పరుగుల వద్ద ముంబై ఆరో వికెట్ కోల్పోయింది. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి తిలక్ వర్మ (7) ఔటయ్యాడు. కష్టాల్లో ముంబై ఇండియన్స్12.3వ ఓవర్- 106 పరుగుల వద్ద ముంబై ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ పాండ్యా (1) ఔటయ్యాడు. నాలుగో వికెట్ కోల్పోయిన ముంబై11.4వ ఓవర్- 103 పరుగుల వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విల్ జాక్స్ (53) ఔటయ్యాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టాడు. మూడో వికెట్ కోల్పోయిన ముంబై10.4వ ఓవర్- 97 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ యాదవ్ (35) ఔటయ్యాడు.10 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/210 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 89/2గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ (34), విల్ జాక్స్ (45) క్రీజ్‌లో ఉన్నారు. 6 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 56/2గా ఉంది. విల్ జాక్స్ 30, సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. జాక్స్‌కు 0, 29 పరుగుల వద్ద రెండు లైఫ్స్ లభించాయి. సాయి సుదర్శన్, సిరాజ్ చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. రెండో వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్3.3వ ఓవర్- ముంబై ఇండియన్స్ 26 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి రోహిత్ శర్మ (7) ఔటయ్యాడు. రెండో బంతికే వికెట్ తీసిన సిరాజ్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ రెండో బంతికే ముంబైని దెబ్బకొట్టింది. సిరాజ్ బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అద్బుతమైన క్యాచ్ పట్టడంతో ఇన్ ఫామ్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ (2) ఔటయ్యాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్‌ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 6) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ముంబై గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తోనే బరిలోకి దిగుతుంది. గుజరాత్ తరఫున వాషింగ్టన్ సుందర్ స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(సి), జోస్ బట్లర్(w), రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణఇంపాక్ట్ సబ్‌లు: వాషింగ్టన్ సుందర్, మహిపాల్ లోమ్రోర్, అనుజ్ రావత్, దాసున్ షనక, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్ సబ్స్: కర్ణ్ శర్మ, రాజ్ బావా, రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, అశ్వనీ కుమార్

ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు.. రోహిత్ శర్మకు నో ప్లేస్
ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెట్ దిగ్గజాలు ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ తమ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో వారు ఏడుగురు భారత ప్లేయర్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటిచ్చారు. ఈ జట్టుకు సారధిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశారు. ఆశ్చర్యకరంగా ఈ జట్టులో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.🚨 G.O.A.T #IPL XI alert 🚨@gilly381 & @7polly7 build their best #IPL XI, right here#IPL2025 #ViratKohli #MSDhoni @myvoltas pic.twitter.com/NolGsfGAZ8— Cricbuzz (@cricbuzz) May 6, 2025ఈ జట్టుకు ఓపెనర్లుగా క్రిస్ గేల్, విరాట్ కోహ్లిని ఎంపిక చేశారు. విదేశీ ప్లేయర్ల ఎంపికలో గిల్‌క్రిస్ట్ క్రిస్ గేల్ పేరు ప్రతిపాదించగా.. పొలాక్ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఏబీడి ఆధునిక టీ20 బ్యాటింగ్‌కు ఆధ్యుడని పొలాక్ ప్రశంసించాడు. మిగిలిన రెండు విదేశీ ఆటగాళ్ల బెర్త్‌ల కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి లసిత్ మలింగ, సునీల్ నరైన్ పేర్లను ప్రతిపాదించారు. బౌలింగ్ ఎరీనాలో మలింగ 'గోట్' అని పొలాక్ కీర్తించాడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ కంటే సునీల్ నరైనే మోస్ట్ వ్యాల్యుయబుల్ ప్లేయర్ అని పొలాక్ అభిప్రాయపడ్డాడు.వన్‌డౌన్‌లో బ్యాటింగ్ కోసం గిల్‌క్రిస్ట్, పొలాక్ కలిసి సురేశ్ రైనాను ఎంపిక చేశారు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు ఏబీడిని ఎంచుకున్నారు. ఐదో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఆరో స్థానంలో ఎంఎస్ ధోని, ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, సునీల్ నరైన్‌ను ఎంపిక చేశారు. పేస్ బౌలర్లుగా మలింగ, బుమ్రా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చహల్‌ను ఎంపిక చేశారు.ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్ పొలాక్ కలిసి ఎంపిక చేసిన ఐపీఎల్ ఆల్ టైమ్ XI: క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోని (కెప్టెన్ కమ్ వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, సునీల్ నరైన్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్ పంత్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్ క్రికెట్. ఈ జట్టుకు సారధిగా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. ఈ జట్టులో రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్ర, ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, లియామ్ లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, రవిచంద్రన్ అశ్విన్, మతీష పతిరణ, మహ్మద్ షమీకి చోటు కల్పించింది. పంత్‌ను కెప్టెన్ కమ్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.On a rain day in Reyjavík, we give you our IPL 2025 frauds and scammers team:R TripathiR RavindraI KishanR Pant (c & wk)V IyerG MaxwellL LivingstoneD HoodaR AshwinM PathiranaM ShamiNo impact player: M Kumar— Iceland Cricket (@icelandcricket) May 5, 2025ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంపిక చేసిన ఈ టీమ్‌పై సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్‌ల్యాండ్ క్రికెట్‌కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేయడం కొత్తేమీ కాదు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఐపీఎల్ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్‌ల్యాండ్ క్రికెట్ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. రిషబ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్‌వెల్, లివింగ్‌స్టోన్ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్‌ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇషాన్ కిషన్, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్‌ను ఆడుతున్నారు.రాహుల్ త్రిపాఠి- 3.4 కోట్లురచిన్ రవీంద్ర- 4 కోట్లుఇషాన్ కిషన్- 11.25దీపక్ హుడా- 1.7 కోట్లురిషబ్ పంత్- 27 కోట్లువెంకటేశ్ అయ్యర్- 23.75గ్లెన్ మ్యాక్స్‌వెల్- 4.2 కోట్లులియామ్ లివింగ్‌స్టోన్- 8.75 కోట్లురవిచంద్రన్ అశ్విన్- 9.75 కోట్లుమతీష పతిరణ- 13 కోట్లుమహ్మద్ షమీ- 10 కోట్లు
బిజినెస్

ఏఐ వినియోగంలో దూసుకెళ్తున్న భారత్: కేపీఎంజీ రిపోర్ట్
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏ రంగంలో చూసినా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. అయితే ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కూడా ఏఐను ఎక్కువగా ఇండియా నమ్ముతోందని కేపీఎంజీ (KPMG) నివేదికలో వెల్లడించింది.ట్రస్ట్, యాటిట్యూడ్స్, అండ్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఎ గ్లోబల్ స్టడీ 2025పై KPMG వెల్లడించిన నివేదిక కోసం 47 దేశాలలోని సుమారు 48,000 మందిని సర్వే చేసింది. ఇందులో సుమారు 76 శాతం భారతీయులు ఏఐను విశ్వసిస్తున్నట్లు తెలిసింది.ఆరోగ్య సంరక్షణ మాత్రమే కాకుండా ఎకానమీ, విద్య, వినోదం వంటి దాదాపు అన్ని పరిశ్రమలలో ఏఐ వినియోగం ఎక్కువగా ఉంది. దీంతో మానవ ప్రమేయం తగ్గుతుందని.. ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని సుమారు 78 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. 97 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తమ పనిలో AIని ఉపయోగిస్తున్నారని, 67 శాతం మంది అది లేకుండా తమ పనులను పూర్తి చేయలేరని పేర్కొన్నారు.భారతదేశంలో ఏఐ వినియోగం పెరిగిపోతుండంతో.. ఏఐ-బేస్డ్ ఆర్థిక వృద్ధి & ఆవిష్కరణలలో ఇండియా అగ్రగామిగా దూసుకెళ్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఐదుగురిలో ముగ్గురు వ్యక్తులు ఏఐను విశ్వసిస్తారు. అయితే అభివృద్ధి చెందిన దేశాలలో ఐదుగురిలో ఇద్దరు మాత్రమే దీనిని విశ్వసిస్తున్నారు.

449 కిమీ రేంజ్ అందించే.. విండ్సర్ ఈవీ ప్రో: ధర ఎంతంటే?
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా.. ఇండియన్ మార్కెట్లో విండ్సర్ ప్రో లాంచ్ చేసింది. ఇది ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా 449 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.ఇప్పటికే దేశీయ మార్కెట్లో అమ్మకానికి ఉన్న 'ఎంజీ విండ్సర్' 38 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 332 కిమీ రేంజ్ అందించేది. ఎక్కువ రేంజ్ కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ ఇప్పుడు 52.9 కిలోవాట్ బ్యాటరీతో లాంచ్ చేసింది. దీని ధర రూ. 17.46 లక్షలు. ఈ ధర మొదటి 8000 మందికి మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. ఆ తరువాత ధరలలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.ఈ కొత్త వెర్షన్ చూడటానికి దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని సూక్షమైన అప్డేట్స్ పొందింది. కొత్త అల్లాయ్ వీల్స్, టెయిల్‌గేట్‌పై ఏడీఏఎస్ బ్యాడ్జ్, లైట్ కలర్ ఇంటీరియర్ వంటివి ఇందులో కొత్త అప్డేట్స్ అని తెలుస్తోంది. ఇవి కాకుండా సెలాడాన్ బ్లూ, అరోరా సిల్వర్, గ్లేజ్ రెడ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లలో ఈ కారు లభిస్తుంది.

టీ రూ.10.. సమోసా, కాఫీ రూ.20: ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ధరల్లో..
టీ రూ.10, కాఫీ రూ.20 అనే ధరలు వింటుంటే ఆ ఏముంది? రోడ్డు పక్కన టీ బండిలో రేట్లు అవే కదా అందులో వింతేముంది?.. అనిపించవచ్చు కానీ... ఆ రేట్లు ఎయిర్‌పోర్ట్‌లోని కేఫ్‌లో అంటే..మాత్రం విస్తుపోవాల్సిందే. అవును మరి.. రాబోయే కొన్నేళ్లలో విమానాలు ఎక్కని వారు అంటూ ఉండరేమో కానీ.. విమానాశ్రయాల్లో టీ కూడా తాగని వారు మాత్రం బోలెడంత మంది ఉంటారేమో అనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే..రాను రాను విమానయానం అందుబాటులోకి వస్తోంది. కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో కనీసం టీ కూడా అందుబాటు ధరలో ఉండడం లేదు కాబట్టి.అడపాదడపా ఎయిర్‌లైన్స్ వాళ్లు అందించే ఆఫర్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కన్నా కూడా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధ్యమవుతోంది. కానీ విమానాశ్రయాల్లో కాసింత సేద తీరాలని టీ, కాఫీ లాంటివి తాగాలనుకున్నా, సమోసా, బిస్కెట్స్ వంటి చిరు తిండి తినాలన్నా అదేదో పెద్ద కలలాగా మారింది. ఎందుకంటే ఆ ధరల పట్టీ ఇంకా సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంది. మన శంషాబాద్ విమానాశ్రయాల వంటి చోట అయితే కేఫ్స్‌లో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయ్.రకరకాల అవకాశాలవల్ల.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పడం లేదు. అయినప్పటికీ విమాన ప్రయాణీకులు అంటేనే సంపన్నులు అనే రీతిలో ఈ ధరలు ఉండడం సామాన్యులకు మింగుడు పడని పరిస్థితి.ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఇప్పటికి ఎదురు చూసిన రోజులు ముగిశాయి టీ రూ.10, కాఫీ రూ.20 కి పూణే విమానాశ్రయంలో అందుబాటులోకి రాబోతున్నాయి,‘ అని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు ఐదేళ్లు జైలు శిక్షప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్’ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫేని ఏర్పాటు చేశారు.. ఈ కేఫే లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో, ఈ విధంగా తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక సమయోచిత మార్పుగా భావిస్తున్నారు ప్రయాణికులు. సమోసా తదితర తినుబండారాలు సైతం రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్స్ కోల్‌కతా, చెన్నై, ముంబయిలలో కూడా సేవలు అందిస్తున్నాయి. విమానాశ్రయాలు సంపన్నులుకు తప్ప సామన్యులకు కావనే అభిప్రాయాలను మార్చేలా, అత్యధిక జనాభాకు ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు.

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 155.77 పాయింట్లు లేదా 0.19 శాతం నష్టంతో 80,641.07 వద్ద, నిఫ్టీ 81.55 పాయింట్లు లేదా 0.33 శాతం నష్టంతో 24,379.60 వద్ద నిలిచాయి.సీసీఎల్ ప్రొడక్ట్స్ ఇండియా, ఓరియంట్ బెల్, గ్రీన్‌లామ్ ఇండస్ట్రీస్, తత్వ చింతన్ ఫార్మా కెమ్, పాలీ మెడిక్యూర్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సెంచరీ ఎంకా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కేసాల్వ్స్ ఇండియా, ప్రైమ్ ఫోకస్, ఓరియంటల్ హోటల్స్ వంటివి నష్టాలను చవిచూశాయి.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).
ఫ్యామిలీ

శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!
ఆస్తమా అనేది ఓ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. నిజానికి దీన్ని ఓ ఆరోగ్య సమస్యగా చెప్పడం కంటే ఏదైనా సరిపడని వస్తువు దేహంలోకి వెళ్లినప్పుడు... మన వ్యాధినిరోధక వ్యవస్థ చూపే ప్రతిచర్యగా చూడటం సబబు. ఇలా ఏదైనా సరిపడని వస్తువు శ్వాసవ్యవస్థలోకి వెళ్లినా లేదా ఒక్కోసారి కడుపులోకి వెళ్లినా... మన సొంత వ్యాధినిరోధక వ్యవస్థ దాన్ని పరాయి వస్తువుగానూ (ఫారిన్‌బాడీ), లేదా దేహానికి హాని చేసే అంశంగానూ భావించినప్పుడు శ్వాస నాళాలు సన్నబడిపోతాయి. దాంతో శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఊపిరి చాలా బలంగా తీసుకోవాల్సిరావడం, శ్వాసనాళాలు సన్నబారడంతో పిల్లికూతలు వినిపించడం ఇవన్నీ ఆస్తమాలో కనిపిస్తుంటాయి. ఆస్తమా ఉన్నవారిలో ఊపిరితిత్తులకు ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట) వస్తుంది. ఈ ఎటాక్ రావడన్నమది దీర్ఘకాలం బాధించే (క్రానిక్) సమస్యగా ఎపిసోడ్స్‌గా వస్తూ ఇబ్బంది పెడుతుంది. ప్రపంచంలోని ఆస్తమా కేసుల్లో కేవలం 12శాతం మాత్రమే భారత్‌లో ఉన్నప్పటికీ ప్రపంచ ఆస్తమా మరణాల్లో 40%కి పైగా మనదేశంలోనే సంభవిస్తున్నాయి. మనదేశ ప్రజల్లో ఆస్తమా పట్ల అంతగా అవగాహన లేకవడం, ఇన్హేలర్ల పట్ల అనేక రకాల అపోహలూ... ఇలాంటి అంశాలన్నీ కలసి మన దేశవాసుల్లో ఆస్తమా కేసుల్లో మరణాలను పెంచుతున్నాయి. నేడు (మే 6న) ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా ఈ సమస్యపై అవగాహన కోసం ఇస్తున్న కథనమిది. ఆస్తమాను అర్థం చేసుకోవాలంటే మన ఊపిరితిత్తుల్లోని వాయు నాళాల పనితీరును అవగతం చేసుకోవాలి. మన దేహానికి అవసరమైన ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లి, అక్కడి కాలుష్య కార్బన్ డై ఆక్సైడ్‌ను మళ్లీ బయటకు వదలడానికి అంచెలంచెలుగా అనేక నాళాలు ఉంటాయి. ఇన్ఫ్లమేషన్ (వాపు, మంట, ఎర్రబారడం) కారణంగా అవి ఉబ్బుతాయి. దాంతో సెన్సిటివ్‌గా మారిపోతాయి. అంటే ఉదాహరణకు చర్మంపై ఏదైనా గాయమైనప్పుడు అది ఎర్రబారి, వాచి, ముట్టుకుందామంటేనే ముట్టనివ్వని విధంగా మారడాన్ని ఇన్ఫ్లమేషన్ అని చెప్పవచ్చు. కొంత జాగ్రత్తతో జీవితాంతం ఆస్తమాను అదుపులో ఉంచుకోని, పూర్తిస్థాయి సాధారణ జీవితం, నిండు ఆయుర్దాయం కలిగి ఉండవచ్చు. కానీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఆస్తమా పట్ల అవగాహన కొంత తక్కువగానే ఉండటంతో... పూర్తిగా అదుపులో ఉంచగలిగే ఈ సమస్య వల్ల కలిగే దుష్ప్రభావాలు మన దేశంలో ఎక్కువే. ఉదాహరణ కోసం ఓ కేస్ స్టడీ... హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్నేహ (ఇది అసలు పేరు కాదు) కేవలం ఐదు నెలల వ్యవధిలో మూడోసారి తీవ్రమైన ఆస్తమా ఎటాక్‌తో ఆమెను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కు తీసుకురావల్సి వచ్చింది. ఆమె చెప్పే మాట ఏమిటంటే... ‘డాక్టర్, నేను టాబ్లెట్స్ తీసుకుంటున్నా, కానీ ఇన్హేలర్ తీసుకోవాలంటే భయంగా ఉంది. వాటికే అలవాటు పడతానేమో అనే అభిప్రాయంతో తీసుకోవడం లేదు’’ అని చెప్పింది. నిజానికి టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆ మందు రక్తంలో కలిసి దేహమంతా ప్రవహిస్తుంది. అది అప్పటి అవసరం కాబట్టి తీసుకోక తప్పదు. అయితే ప్రివెంటివ్ ఇన్హేలర్స్ క్రమం తప్పకుండా వాడటం... అలాగే మొదటి చికిత్సగా (ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్గా) తీసుకోవాల్సిన ఇన్హేలర్స్ వాడితే అసలు ఎటాక్ రాకుండానే నివారించడానికి చాలావరకు ఆస్కారం ఉంటుంది. నిజానికి చాలా తక్కువ మోతాదులో (ఒక మాటలో చెప్పాలంటే టాబ్లెట్‌లో ఉండే దానికంటే 400వ వంతు తక్కువ మోతాదులో) మందు వెళ్లి... ఆస్తమా దుష్ప్రభావం చూపుతున్న నిర్ణీత ప్రదేశంలోనే ఇన్‌హేలర్స్‌లోని మందులు ప్రభావం చూపుతాయి. ఇవి ఎప్పటికీ అలవాటు కావు. అందువల్ల ఈ ఏడాది ఆస్తమా డే నినాదం ఏమిటంటే... ‘‘ఆస్తమా మీ జీవనానికి అడ్డంకి కాకూడదు. అంతేకాదు... ఇన్హేలర్స్ అందరికీ అందుబాటులో ఉంచుదాం... హాయిగా శ్వాస తీసుకుందాం... అన్నవి ఈ ఏడాది ఆస్తమా డే తాలూకు స్ఫూర్తిమాటలు. కారణాలు...జన్యుపరమైన అంశాలు ఆస్తమాకు ప్రధాన కారణమని చాలా అధ్యయనాల్లో తేలింది. దాంతో ;eటు సరిపడని వాతావరణం లేదా ఆహారపదార్థాల తోపాటు కొన్నిసార్లు గాలిలో ఉండే పుప్పొడి వంటివి దీన్ని ట్రిగ్గర్ చేస్తాయి. శ్వాసించే సమయంలో ఏదైనా దేహానికి సరిపడని పదార్థాలు (వీటిని అలర్జెన్స్ అంటారు) మన ఊపిరితిత్తుల మార్గంలోకి ప్రవేశించి అవి అలర్జిక్ రియాక్షన్స్ కలిగిస్తాయి. ఇలా అలర్జిక్ రియాక్షన్ రావడానికి కారణమయ్యే అంశాల్లో ఇవి కొన్ని... గదుల్లోపల (ఇన్–డోర్స్‌లో) ఉండే అలర్జెన్స్ (ఉదాహరణకు పక్కబట్టల్లో, కార్పెట్స్‌లో, ఇరుగ్గా ఉండే ఫర్నిచర్లో ఉండే డస్ట్‌మైట్స్. కాలుష్యంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే దుమ్ముధూళి కణాలు. కొన్నిసార్లు పెంపుడు జంతువులనుంచి రాలిన వెంట్రుకలు. ఆరుబయట ఉండే అలర్జెన్స్: (ఉదాహరణకు పుప్పొడి, బూజు వంటి పదార్థాలు). పొగాకు కాలినప్పుడు / మండినప్పుడు వచ్చే ఘాటైన పొగ ఘాటైన రసాయనాలు, స్ప్రేలు.. వాటి తాలూకు ఘాటైన వాసనలు కొందరిలో ఆస్తమాకు కారణం కావచ్చు. వాయు కాలుష్యం (కాలుష్యంలో ఉండే అత్యంత సూక్ష్మమైన కాలుష్య కణాలు) ఇవేగాక ఇంకా చాలా అంశాలు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అవి... చలిగాలి, చాలా తీవ్రంగా చేసే వ్యాయామాలు. కొన్నిసార్లు మనకు సరిపడని మందుల వల్ల కూడా ఆస్తమా రావచ్చు. ఇటీవల విపరీతంగా పెరుగుతున్న పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల పెచ్చరిల్లుతున్న అనేక అంశాలు ఆస్తమాను కలిగిస్తున్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది.పిల్లల్లో ఆస్తమా... చిన్న పిల్లల్లో సాధారణంగా ఐదేళ్ల వయసు తర్వాత ఆస్తమా లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే అంతకంటే తక్కువ వయసున్న చిన్నారుల్లో ఆస్తమా వస్తుంటుంది. అయితే దీన్ని గుర్తించడం తల్లిదండ్రులకు కష్టమవుతుంది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లినప్పుడు ఎగిసిపడుతున్న రొమ్మును పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఆస్తమాను గుర్తిస్తారు. చిన్నపిల్లల్లో ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే బ్రాంకియల్ ట్యూబులు మొదటే చాలా సన్నగా, చిన్నగా ఉంటాయి. ఇక జలుబు, పడిశం వంటి వాటి కారణంగా ఆ మార్గాలు మామూలుగానే ఇన్ఫ్లమేషన్కు గురవుతుంటాయి. దాంతో అవి మరింత సన్నగా మారతాయి. అందువల్ల అవి ఆస్తమా వల్ల సన్నబడ్డాయా లేక పడిశం, జలుబు లక్షణాలా అన్నది గుర్తించడం కొంత కష్టమవుతుంది.ఆస్తమా లక్షణాలు... దగ్గు, ఆయాసం... ప్రధానంగా రాత్రివేళల్లో ఎక్కువగా ఉంటుంది. శరీరానికి శ్రమకలిగే వ్యాయామం చేడం లేదా గట్టిగా నవ్వడం, ఏడ్వటం, పరుగెత్తడం వంటివి చేస్తే ఈ దగ్గు, ఆయాసాలు మరింతగా పెరుగుతాయి. ఛాతీ బిగుతుగా పట్టేసినట్లుగా ఉండటం. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది. హాయిగా ఊపిరి తీసుకోలేకపోవడం... సాఫీగా శ్వాస సాగకపోవడం. పిల్లికూతలు (శ్వాస తీసుకునే సమయంలో... అందునా మరీ ముఖ్యంగా గాలి వదిలే సమయంలో సన్నటి పిల్లికూతలు వినిపిస్తుంటాయి). కొందరిలో ఆస్తమా వచ్చినప్పుడు ఒళ్లు (చర్మం) కూడా ఎర్రబారి పొడిగా మారుతుంది. మరికొందరిలో ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, గురక వంటి లక్షణాలు కనిపించవచ్చు.నిర్ధారణ... పెద్దవాళ్లతో ΄ోలిస్తే పిల్లల్లో ఆస్తమా నిర్ధారణ కాస్త కష్టమైన ప్రక్రియ. లక్షణాల తోపాటు... అవి ఎంత వ్యవధిలో మళ్లీ మళ్లీ వస్తున్నాయనే అంశం ఆధారంగా అది ఆస్తమా కావచ్చేమోనని తొలుత అనుమానిస్తారు. దాంతో నిర్ధారణ కోసం కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా చిన్నప్పుడు వచ్చే మరికొన్ని సమస్యల లక్షణాలూ ఆస్తమా లక్షణాలతో కలసి కనిపిస్తుండవచ్చు. దాంతో ఆ లక్షణాలు కేవలం ఆస్తమా వల్లనే కనిపిస్తున్నాయా లేక ఇతర మరికొన్ని ఆరోగ్య సమస్యల వల్లనా అని నిర్ధారణ చేయడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఆస్తమా లాంటి లక్షణాలే కనబరిచే మరికొన్ని కండిషన్లు.... రైనైటిస్ సైనసైటిస్ ఆసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) వాయునాళాలలో ఏమైనా తేడాలు (ఎయిర్ వే అబ్నార్మాలిటీస్) ∙స్వరపేటిక సరిగా పనిచేయక΄ోవడం (వోకల్ కార్డ్ డిస్ఫంక్షన్) బ్రాంకైటిస్ వంటి శ్వాసమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్లు రెస్పిరేటరీ సింటాక్టికల్ వైరస్ (ఆర్ఎస్వి) వంటివి కొన్నిసార్లు ఆస్తమా లక్షణాలనే కనబరుస్తుంటాయి. ఆస్తమా నిర్ధారణ ఇంత సంక్లిష్టం ఉండటం వల్ల కొన్నిసార్లు డాక్టర్లు కొన్ని ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. అవి... ఐదేళ్లు లేదా అంతకంటే పైబడిన వయసు పిల్లల విషయానికి వస్తే పెద్దవాళ్లలోనూ నిర్ధారణ చేసేందుకు నిర్వహించే లంగ్ ఫంక్షన్ పరీక్షలు (స్పైరోమెట్రీ) వంటివి. ఇందులో పిల్లలు ఎంత సమర్థంగా గాలిని బయటకు వదలగలరో చూస్తారు. సాధారణ స్థితితో ఈ పరీక్ష చేయడంతో పాటు, కొద్దిపాటి వ్యాయామం తర్వాత, అటుపైన కొంత ఆస్తమా మందు ఇచ్చాకా... ఆ పరీక్షల్లో కనిపించే తేడాలను సునిశితంగా గమనించాకే డాక్టర్లు దాన్ని ఆస్తమా అని నిర్ధారణ చేస్తారు. ఇక ఐదేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో లంగ్ ఫంక్షన్ పరీక్షతో ఆస్తమా కాస్త కష్టమవుతుటుంది. పేషెంట్ చెప్పేవీ, తల్లిదండ్రులు గమనించినవీ... ఇలా అనేక లక్షణాలతోపాటు ఈ పరీక్షల సహాయంతో డాక్టర్లు ఆస్తమాను నిర్ధారణ చేస్తారు. చికిత్స...సాధారణంగా చిన్నపిల్లల్లో ఆస్తమా వస్తే చాలామందిలో వారు పెరుగుతున్న కొద్దీ... అంటే టీన్స్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడుగానీ లేదా యుక్తవయస్కులుగా మారుతున్నప్పుడుగానీ ఆ ఆస్తమా లక్షణాలు క్రమంగా తగ్గిపోవచ్చు. అయితే కొంతమందిలో కొన్నాళ్లు కనిపించకుండాపోయిన ఆ లక్షణాలు కొంతకాలం తర్వాత మళ్లీ వ్యక్తం కావచ్చు. ఇక చిన్నప్పుడు మరీ తీవ్రమైన ఆస్తమా ఉన్న పిల్లల్లో అది పెద్దయ్యాక కూడా తగ్గకపోవచ్చు. ఆస్తమాకు రెండు రకాల చికిత్స అవసరమవుతుంది. అది... దీర్ఘకాలంలో మళ్లీ రాకుండా నివారించేందుకు అవసరమైన ప్రివెంటివ్ చికిత్స. వాయునాళాల ఇన్ఫ్లమేషన్ నివారణకు ఈ మందులను వాడాలి. దాదాపు వీటిని ప్రతిరోజూ తీసుకోవాల్సి ఉంటుంది. తక్షణ ఉపశమనం కోసం తీసుకోవాల్సిన చికిత్స : ఆస్తమా వచ్చినప్పుడు వాయునాళాల వాపు తగ్గించి, హాయిగా శ్వాస తీసుకోవడాని దోహదపడేందుకు ఉపయోగించే మందులు వాడాల్సి ఉంటుంది. వీటినే రెస్క్యూ మెడికేషన్ అనీ, క్విక్ రిలీఫ్ మెడికేషన్ అని కూడా అంటారు. ఇది ఆస్తమా అటాక్ ఉన్నప్పుడు చేసే స్వల్పకాలిక చికిత్స. కొందరు పిల్లల్లో ఆటలు లేదా వ్యాయామానికి ముందు కూడా ఈ చికిత్సను డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. మూడేళ్ల లోపు పిల్లలకు ఇన్‌హేలర్స్‌తో చికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఆ మందు పిల్లల ఊపిరితిత్తుల్లోకి సమర్థంగా వెళ్లడానికి స్పేసర్ డివైజ్ విత్ మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇందువల్ల ఉపయోగించే మందు వృథా కాకుండా ఉంటుంది. ఇక ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల్లో స్పేసర్‌తో ఇన్హేలర్ ఉపయోగించాలి.ఆస్తమాలో సరికొత్త మందులు బయాలాజిక్స్... బయాలజిక్స్ అనే ఔషధాలు తీవ్రమైన ఆస్తమాకు ఒక వినూత్న ఆశారేఖ అని చెప్పుకోవచ్చు. ఒమలిజుమాబ్, మెపోలిజుమాబ్, బెన్రలిజుమాబ్ లాంటి బయాలాజిక్స్ తీవ్రమైన ఆస్థమా రోగులకు ఉపశమనం కలిగించేవిగా పరిశోధనల్లో వెల్లడైంది. వీటిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. వీటివల్ల ఆస్తమా తీవ్రత బాగా తగ్గిపోతుంది. ఇవి కొన్ని నిర్ణీత ‘ఇమ్యూన్ ΄పాత్వే’లను లక్ష్యంగా చేసుకుని పనిచేయడం ద్వారా ఆస్తమా తీవ్రతనూ, దాని ఉద్ధృతినీ తగ్గిస్తాయి. అలా అవి ఇమ్యూన్పాత్–వే లను అడ్డగించడం (బ్లాక్ చేయడం) ద్వారా ఒక్కసారిగా పెచ్చరిల్లే (ఫ్లేరప్స్)ను తగ్గిస్తాయి. అంతేకాదు... ఈ సరికొత్త మందులు... పదేపదే హాస్పిటల్‌కు రావాల్సిన అవస్థను తగ్గించడంతో పాటు జీవన నాణ్యతను పెంచుతాయి. కాస్త ఖరీదైనవే అయినప్పటికీ ఆస్తమాతో కలిగే అవస్థలూ, ఇబ్బందులతో పోలిస్తే వీటిని తీసుకోవడం ఎంతో మేలు.కేవలం కొన్నాళ్లు మందులు వాడటం లేదా చికిత్స తీసుకోవడంతో మాత్రమే ఆస్తమా తగ్గి΄ోతుంది. దీన్ని అనుక్షణం నియంత్రణలో ఉంచడం అవసరం. అలాగే ఆస్తమాను ప్రేరేపించే అంశాలకు రోగిని దూరంగా ఉంచడం, తమకు ఆస్తమాను ప్రేరేపించే అంశాలేమిటో క్రమంగా గుర్తించి, వాటినుంచి ఎల్లప్పుడూ దూరంగా ఉండటం, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉండటం చేస్తుండాలి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆస్తమా నివారణ, నియంత్రణ చాలా సులభమే. అందుకే ఆందోళనకు గురికాకుండా తమ డాక్టర్‌తో నిత్యం ఫాలోఅప్‌లో ఉండాలి. ∙ఆస్తమా ఎటాక్‌లో ఏం జరుగుతుందంటే...ఆస్తమా ఎటాక్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని నాళాల కండరాలు ఉబ్బడం వల్ల వాటి మధ్యభాగంలోని స్థలం సన్నబడిపోయి, శ్వాస మార్గాలు మూసుకుపోయినట్లుగా అవుతాయి. ఫలితంగా ఆ నాళాల్లో గాలి ఫ్రీగా కదిలేందుకు సరిపడనంత స్థలం లేకపోవడంతో శ్వాస సరిగా అందదు. దాంతో మనకు ఆస్తమా అటాక్ వస్తుందన్నమాట. ఏవైనా మనకు సరిపడని వాటిని తిన్నా, పీల్చుకున్నా మన వాయునాళాలు తీవ్రంగా ప్రతిస్పందించడం వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి చలి సీజన్లోనూ ఆ వాతావరణంలో గాలిలో ఉండే మంచు సరిపడని కారణంగా వాయునాళాలు ఉబ్బుతాయి. దాంతోపాటు వాయునాళాల్లో కాస్త జిగురుగా ఉండే మ్యూకస్ అనే పదార్థం స్రవిస్తుంది. అసలే నాళాలు సన్నబడి ఉండటంతోపాటు... ఈ మ్యూకస్ కూడా అడ్డుపడటం వల్ల వాయువులు కదిలే ప్రాంతం మరింత మూసుకుపోతుంది. ఫలితంగా గాలి పీల్చడమూ, వదలడమూ... అంటే మొత్తంగా శ్వాస తీసుకోవడమే చాలా కష్టమవుతుంది. పిల్లల్లో ఆస్తమాను గుర్తించడమిలా... పిల్లల్లో పైన పేర్కొన్న లక్షణాల్లో ఏదో ఒకటిగాని లేదా కొన్ని లక్షణాలు కలగలిసి గాని కనిపించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని జలుబు లేదా బ్రాంకైటిస్‌గా భావించేందుకు అవకాశముంది. అయితే అవే లక్షణాలు పదే పదే కనిపిస్తుంటే అప్పుడు అది ఆస్తమా కావచ్చని అనుమానించాలి. ఆ పిల్లలకు ఆస్తమాను ప్రేరేపించే అంశానికి (ట్రిగరింగ్ ఫ్యాక్టర్‌కు) గురైన వెంటనే ఆస్తమా లక్షణాలు మొదలైపోయి తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు. పగ, ఘాటైన వాసనలు, పుప్పొడి, పెంపుడు జంతువుల వెంట్రుకలు, డస్ట్‌మైట్స్... ఇవి సోకీ సోకగానే ఆస్తమాను తక్షణం ప్రేరేపిస్తాయి. పిల్లలను జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించినప్పుడు పిల్లలు వేగంగా శ్వాస తీసుకోవడం, వాళ్లకు సరిగా శ్వాస అందక΄ోవడం, రొమ్ము తీవ్రంగా ఎగసిపడుతున్నట్లుగా మొదలుకాగానే... తల్లిదండ్రులు దాన్ని ఆస్తమాగా అనుమానించి తక్షణం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లా. ఇన్హేలర్ వాడే సమయంలో తప్పక చేయవలసినవి... ఇన్హేలర్ వాడే సమయంలో ఊపిరితిత్తుల్లో మందు పూర్తిగానూ... అంతటా సమంగానూ విస్తరించడానికి స్పేసర్‌ను ఉపయోగించడం. స్టెరాయిడ్ ఇన్హేలర్ వాడిన తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం. తక్షణ ఎటాక్‌ను నివారించేందుకు ఫస్ట్‌లైన్ ట్రీట్మెంట్ కోసం వాడే రిలీవర్ ఇన్హేలర్ను ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం. ఇన్హేలర్ వాడే సరైన టెక్నిక్‌ను డాక్టర్ దగ్గర నేర్చుకోవడం. ఎప్పుడూ దాన్ని అనుసరించడం. అదుపులో ఉంచేందుకు వాడే ఇన్హేలర్ను ఇంట్లో ఉంచుకుని క్రమం తప్పకుండా వాడటం. ఇన్హేలర్ వాడకంలో చేయకూడని పనులు... లక్షణాలు తగ్గిన తర్వాత ఇక ఇన్హేలర్ వాడకానికి దూరంగా ఉండటం. మీ ఇన్హేలర్ను ఇతరులతో షేర్ చేసుకోవడం.... డాక్టర్ చెప్పిన మోతాదుకు మించి రిలీవర్ ఇన్హేలర్ను ఎక్కువగా వాడటం. ఒకవేళ రాత్రుళ్లు దగ్గు, ఆయాసం లాంటి ఆస్తమా హెచ్చరికలను పట్టించుకోకపోవడం... ఇవన్నీ చేయకూడని పనులు.అలర్జిక్ ఆస్తమా కోసం... మరికొన్ని అలర్జీ పరీక్షలు...కొన్ని ట్రిగరింగ్ అంశాల కారణంగా పిల్లల్లో ఆస్తమా కనిపిస్తుంటే... అలాంటి పిల్లల్లో డాక్టర్లు అలర్జీ స్కిన్ టెస్ట్ చేయిస్తారు. ఇందులో ఏదైనా అలర్జీ కలిగించే పదార్థాన్ని (అంటే జంతువుల వెంట్రుకలో లేదా బూజునో) ఉపయోగించి చర్మంలోని కొంత భాగాన్ని సేకరిస్తారు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఏదైనా అలర్జిక్ రియాక్షన్ జరుగుతుందేమోనని గమనిస్తారు. కొన్నిసార్లు చర్మంపై లక్షణాలు కనిపిస్తూ ఉండేవారికి, యాంటీ హిస్టమైన్ మందులు తీసుకునే వారికి అలర్జీ బ్లడ్ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఉంటుంది. కొంతమందిలో వాళ్లు తీసుకున్న ఆహారం కారణంగా అలర్జీతో ఆస్తమా ప్రేరేపితమై ఉండవచ్చు. అలాంటప్పుడు ఏయే రోగులకు ఏయే ఆహారం వల్ల అలర్జీ కలుగుతుందని తెలుసుకోవడం కష్టమైన పని. అది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. అందుకే పెద్దవారైతే తమకు తాము... పిల్లల విషయంలోనైతే తల్లిదండ్రులు... ఏయే పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయో జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. ఫలానా పదార్థాలతోనే ఆస్తమా లక్షణాలు కనిపిస్తున్నాయని ఒకటి రెండుసార్లు పరిశీలనల తర్వాత తెలిసిపోతుంది. అప్పుడు తమకు సరిపడనివీ, తమలో ఆస్తమాను ప్రేరేపించే సదరు ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్నిసార్లు డాక్టర్లు మరింత సూక్ష్మస్థాయి పరీక్షలూ చేయించాల్సి రావచ్చు. డా. విజయ్ కుమార్ చెన్నంచెట్టి, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనలాజిస్ట్ – స్లీప్ స్పెషలిస్ట్. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ టెస్ట్‌లు..ఆస్తమ లక్షణాలను ముందుగానే పసిగడితే..అటాక్ అవ్వకుండా నివారించొచ్చు అని చెబుతున్నారు అంకురా ఆస్పత్రి వైద్యులు శ్రీనివాస్. అలాగే పిల్లలు, పెద్దలు శ్వాసలో గురక, దగ్గు, తరుచుగా జలుబు సంబంధిత ఇన్షెక్షన్లు బారినపడటం వంటి లక్షణాలను నిర్లక్యం చేయకూడదని అన్నారు. సకాలంలో వైద్యుడిని సంప్రదించి..తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని అన్నారు. అలాగే ఆస్తమా వచ్చిన రోగులు ఇన్హేలర్ పక్కనే ఉంచుకోవాలని సూచించారు. శరీరానికి సరిపడే ఆహారాలపై శ్రద్ధపెట్టి మందులతో వ్యాధి అదుపులో ఉంచుకునేలా జాగ్రత్తలు పాటిస్తే త్వరితగతిన ఈ సమస్య నుంచి బయపడతారని చెబుతున్నారు. డాక్టర్ శ్రీనివాస్ జక్కా, పీడియాట్రిక్స్, పల్మోనాలజీ & అలెర్జీ కన్సల్టెంట్, అంకురా హాస్పిటల్13 శాతం మంది రోగులు భారత్‌లోనే..ప్రపంచవ్యాపంగా 13 శాతం మంది ఆస్తమా రోగులు భారత్ లోనే ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు ఆలివ్ ఆస్పత్రి పల్మోనాలజీ వైద్యులు సయ్యద్ తాహ మహ్మద్ దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు నిర్థారణ, తగిన చికిత్సలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ఆస్తమాకు మందుల కూడా అందుబాటులో ఉన్న విషయం రోగులకు తెలియజేసేలా అవగాహన కల్పించాలని చెప్పారు. సకాలం చికిత్స తీసుకోకపోవడంతోనే ప్రాణాంతకంగా మారుతున్నాయని చెబుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వెంటనే వైద్యుడిని సంప్రదిస్తే..ఈ సమస్యను సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుందన్నారు.ఆలివ్ ఆస్పత్రి పల్మోనాలజీ వైద్యులు సయ్యద్ తాహ మహ్మద్ (చదవండి: Water Fitness: నటుడు ధర్మేంద్ర వాటర్ వర్కౌట్లు చూస్తే మతిపోవాల్సిందే..! మంచి గేమ్ ఛేంజర్..)

తొలి ‘జన్యుసవరణ’ వరి!
వాతావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకుంటూ 30% అధిక దిగుబడిని ఇవ్వగలిగిన రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను ప్రపంచంలోనే తొట్టతొలిగా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(జిఇ) టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన రెండు వరి వంగడాలను కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఆవిష్కరించారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్)కి చెందిన పూసాలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) పూసా రైస్ డిఎస్టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఆర్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల) అనే వరి అధిక దిగుబడినిస్తుంది. మన దేశంలో ఇప్పటి వరకు అధికారికంగా సాగులో ఉన్న జన్యుమార్పిడి పంట పత్తి ఒక్కటి మాత్రమే. జన్యుసవరణకు ఇదే ్ప్రారంభం. గతంలో సంక్లిష్టమైన ‘జన్యుమార్పిడి’లో భాగంగానే ‘జన్యుసవరణ’ను కూడా చూసేవారు. అయితే, 2022లో జన్యుసవరణను కఠినమైన నియంత్రణ ప్రక్రియ నుంచి మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత జన్యు సవరణ పరిశోధనలకు రూ. 500 కోట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే జన్యుసవరణ తొలి వరి రకాలను ఇప్పుడు ఆవిష్కరించారు. ఈ రెండు వంగడాల పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్తలను ఈ సందర్భంగా మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సత్కరించారు. పూసా డిఎస్టి రైస్ 1 పై కృషి చేసిన డాక్టర్ విశ్వనాథన్ సి, డాక్టర్ గోపాల్ కృష్ణన్ ఎస్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ శివానీ నగర్, డాక్టర్ అర్చన వాట్స్, డాక్టర్ సోహం రే, డాక్టర్ అశోక్ కుమార్ సింగ్, డాక్టర్ ్ప్రాంజల్ యాదవ్‌లను సత్కరించారు. డిఆర్ఆర్ రైస్ 100 (కమల) అభివృద్ధికి కృషి చేసిన ఐఐఆర్ఆర్ శాస్త్రవేత్తలు డాక్టర్ సత్యేంద్ర కుమార్ మంగథియా, డాక్టర్ ఆర్.ఎం. సుందరం, డా. అబ్దుల్ ఫియాజ్, డా. సి.ఎన్. నీరజ, డా. ఎస్వీ సాయి ప్రసాద్‌లను సత్కరించారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది మాట్లాడుతూ, ఈ సాంకేతికత దేశీయంగా అభివృద్ధి చేసినది కావటం వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రయత్నాల ద్వారా రైతులకు త్వరగా అందించవచ్చని అన్నారు.10కి పైగా పంటలకు జన్యు సవరణఐసిఎఆర్ డైరెక్టర్ డాక్టర్ జనరల్ మంగి లాల్ జాట్ ప్రసంగిస్తూ ఈ రెండు వంగడాల ఆవిష్కరణ భారత వ్యవసాయంలో ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. రాబోయే సంవత్సరాల్లో అనేక ఇతర పంటలకు సంబంధించి జన్యు సవరణ పంట రకాలను విడుదల చేస్తామని అన్నారు. ‘కొత్త వ్యవసాయ విధానాలు కొత్త పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. మారిన వాతావరణ పరిస్థితుల్లో పాత పద్ధతులు పనిచేయవు’ అని ఆయన అన్నారు. దేశంలోని బహుళ జాతి సంస్థలు, విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పప్పుధాన్యాలు, ఆవాలు, గోధుమ, ΄÷గాకు, పత్తి, అరటి, టమోటా, నూనెగింజలు వంటి 10కి పైగా పంటలకు సంబంధించి జన్యు–సవరణపై పరిశోధనలు చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ చైర్ ఆఫ్ అగ్రికల్చర్ – ఫుడ్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ క్రాప్ అండ్ ఫుడ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ రాజీవ్ వర్షిణి మాట్లాడుతూ, ఈ ఆవిష్కరణలు వ్యవసాయ జీవసాంకేతికతలో ఒక మైలురాయన్నారు. ప్రత్యేకంగా చిన్న–సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని, ప్రపంచ పురోగతికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ రెండు జన్యు సవరణ వంగడాలను వాణిజ్య స్థాయిలో విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించడానికి మరో నాలుగైదు సంవత్సరాలు పట్టొచ్చు. కరువు, చౌడును అధిగమించి..ఎంటియు1010 వరి వంగడానికి జన్యు సవరణ చేసి ‘పూసా రైస్ డిఎస్టి 1’ వంగడాన్ని పూసాలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఎఆర్ఐ) అభివృద్ధి చేసింది. ఒత్తిడి నిరోధకతను అణిచివేసే జన్యువును తొలగించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ వంగడాన్ని రూపొందించారు. పత్ర రంధ్రాల సాంద్రతను తగ్గించటం ద్వారా తక్కువ నీటితో పంట పండేలా మార్పు చేశారు. చౌడును తట్టుకొని ఎక్కువ పిలకలు వచ్చేలా చేయటం ద్వారా అధికంగా ధాన్యం దిగుబడి వచ్చేలా చేశారు. క్షేత్రస్థాయి పరీక్షల్లో ఎంటియు 1010 రకంతో ΄ోలిస్తే కరువు, చౌడు వత్తిళ్లను తట్టుకొని గణనీయంగా అధిక దిగుబడిని చూపించాయని ఐఎఆర్ఐ తెలిపింది.సాంబ మసూరికి కొత్త రూపుదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది, విస్తారంగా సాగవుతున్న సాంబ మసూరి (బిపిటి–5204) వంగడానికి జన్యుసవరణ చేసి ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకాన్ని అభివృద్ధి చేశారు. రాజేంద్రనగర్‌లోని 30% అధిక దిగుబడిని ఇస్తుంది. 20 రోజులు ముందే కోతకు వస్తుంది. ‘క్రిస్పర్’ను ఉపయోగించి సాంబ మసూరిలోని సైటోకినిన్ ఆక్సిడేస్ జన్యువుకు తగిన విధంగా సవరణ చేశారు. ఫలితంగా ధాన్యం దిగుబడిలో 19% పెరుగుదల, 20 రోజుల వరకు ముందస్తు పరిపక్వతతో పాటు తక్కువ ఎరువుల వినియోగం, కరువు పరిస్థితులలో మెరుగైన పనితీరు వంటి గుణాలతో ‘డిఆర్ఆర్ ధన్ 100 (కమల)’ రకం రూపుదాల్చింది.ఐసిఎఆర్ శాస్త్రవేత్తల అసాధారణ విజయాలువ్యవసాయ సవాళ్లను అధిగమించడానికి ఆధునిక పద్ధతులను అవలంభించాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. ఆయన మాటల నుంచి ప్రేరణ పొందిన ఐసిఎఆర్ శాస్త్రవేత్తలు ఈ కొత్త రకాలను సృష్టించడం ద్వారా వ్యవసాయ రంగంలో అసాధారణ విజయాలు సాధించారు. వరిలో ఈ కొత్త పంటలు ధాన్యం ఉత్పత్తిని పెంచడమే కాకుండా పర్యావరణ పరంగా సానుకూల ఫలితాలను ఇస్తాయి. సాగు నీరు ఆదా అవుతుంది. కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. తద్వారా పర్యావరణంపై ఒత్తిడి తగ్గుతుంది. మొత్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని 50 లక్షల హెక్టార్లు తగ్గించాలి. ధాన్యం ఉత్పత్తిని కోటి టన్నులు పెంచాలి. ఈ 50 లక్షల హెక్టార్ల భూముల్లో అదనంగా పప్పుధాన్యాలు, నూనెగింజలను సాగు చెయ్యాలి.– శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిజన్యుభద్రతా పరీక్షల గణాంకాలను కూడా ప్రకటించాలిఐసిఎఆర్ మొట్టమొదటి జన్యు సవరణ వరి రకాలను విడుదల చేసింది. అధిక దిగుబడినిస్తూ, కరువును తట్టుకోవటం కోసం సరికొత్త క్రిస్పర్–కాస్9 టెక్నాలజీని వినియోగించి ఈ రకాలను అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన జన్యుభద్రతా పరీక్షల గణాంకాలను సైతం బహిరంగంగా ప్రకటిస్తే ఈ సరికొత్త వరి బియ్యం తినటంలో భద్రత గురించి కూడా ప్రజలు తెలుసుకుంటారు. – డాక్టర్ సుమన్ సహాయ్, స్వతంత్ర శాస్త్రవేత్త, జీన్క్యాంపెయిన్ వ్యవస్థాపకులు

పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
పేరెంట్‌హుడ్‌ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్పీపుల్కి సరోగసీ ద్వారా పేరెంట్ అయ్యే చాన్స్‌కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్ సర్జన్.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్‌లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్ రైట్స్ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్‌కీ పేరెంట్ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్ కపూర్ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్ సర్జన్ వాదన. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్ యాక్టివిస్ట్‌ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్ సర్జన్ పిటిషన్లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్‌లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. – సరస్వతి రమవివక్ష చూపిస్తోందిడైవర్స్ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్‌కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 57, హిందూ అడాప్షన్ – మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. –శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? ప్రతి ఒక్కరికీ పేరెంట్‌హుడ్‌ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్ సర్జన్ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! – బోయపాటి విష్ణు తేజ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్టీరియోటైప్స్ని బలపరుస్తోంది.. పేరెంట్‌హుడ్ అనేది ఒక జెండర్‌కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్‌హుడ్ చాయిస్‌ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్‌గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్ ఫ్యామిలీస్‌కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్ ఉమెన్‌కి ఎందుకిచ్చిందంటే కేర్ గివింగ్ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్‌ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్ రోల్స్‌ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్‌జిబీటీక్యూ కమ్యూనిటీస్కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్΄్లాయిటేషన్ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్‌హుడ్ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.– దీప్తి సిర్ల, దళిత్ అండ్ జెండర్ యాక్టివిస్ట్

అరటి పండుతో అదిరేటి రుచులు
వేసవి సెలవులొచ్చేశాయి. ఇక ఇంట్లో పిల్లల సందడి మొదలవుతుంది. ఎండల్లో బాగా ఆడుకుంటారు. అందుకే పిల్లలకి పోషకమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడం చాలా అవసరం. అలాగేఈ సమయంలో పిల్లలకి అన్ని పనులనూ మెల్లిగా అలవాటు చేయాలి కూడా. మరి పిల్లలు సైతం సిద్ధం చేసుకోగలిగే ఈజీ రెసిపీల గురించి తెలుసుకుందాం. వీటిల్లో బనానా రెసిపీలు మొదటి వరసలో ఉంటాయి. పైగా అవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇప్పుడు కొన్ని వెరైటీలు చూద్దాం..బనానా శాండ్విచ్కావాల్సినవి: రెండు లేదా మూడు అరటిపళ్లు, పీనట్ బటర్-పావు కప్పు; కొన్ని బ్రెడ్ స్లైసెస్. తయారీ: ముందుగా బ్రెడ్ స్లైసెస్ను ఓవెన్లో దోరగా వేయించుకోవాలి. ఈలోపు అరటి పండ్లను గుండ్రంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పీనట్ బటర్‌ను బ్రెడ్ ముక్కలకు ఒకవైపు అప్లై చేసుకుని, రెండేసి బ్రెడ్ముక్కల్లో కొన్ని అరటిపండు ముక్కలను పెట్టుకుని, పైన పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.బనానా ఓట్ మీల్ బాల్స్ కావాల్సినవి: అరటిపండు-1 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి); రోల్డ్ ఓట్స్ - అర కప్పు; పీనట్ బటర్-ఒక టేబుల్ స్పూన్; బెల్లం తురుము-కొద్దిగా; దాల్చినచెక్క పొడి -కొద్దిగా.తయారీ: ముందుగా ఒక పాత్రలో రోల్డ్ ఓట్స్, అరటిపండు గుజ్జు, పీనట్ బటర్, దాల్చిన చెక్క పొడి, బెల్లం తురుము ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి బ్రెడ్ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని, కొద్దిగా కొబ్బరి కోరులో దొర్లించి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుబనానా హనీ బైట్స్కావాల్సినవి: అరటిపండ్లు – 2; తేనె – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు; దాల్చినచెక్క పొడి – టీ స్పూన్‌తయారీ: ముందుగా అరటిపండ్లను గుండ్రంగా కట్ చేసుకుని ఒక పాత్రలోకి తీసుకోవాలి. అభిరుచిని బట్టి నెయ్యి లేదా బటర్లో దోరగా వేయించుకోవచ్చు. వేయించుకున్నా వేయించుకోకపోయినా వాటిపై తేనె, దాల్చినచెక్క పొడి వేసుకుని, కాసేపు ఫ్రిజ్‌లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి ఈ బైట్స్.చదవండి: దిల్ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుబనానా చాక్లెట్ పాప్స్కావాల్సినవి: అరటిపండ్లు -4; ఐస్ క్రీమ్ పుల్లలు -6 పైనే; చాక్లెట్ చిప్స్- అర కప్పు (మెల్ట్ చేసుకోవాలి); డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొన్ని (నచ్చినవి)చదవండి: Shooting Spot భువనగిరి.. సినిమాలకు సిరితయారీ: ముందుగా అరటిపండు తొక్క తీసి.. నచ్చిన విధంగా కట్ చేసుకుని.. ఒక్కో ముక్కకు ఒక్కో ఐస్ క్రీమ్ పుల్ల గుచ్చాలి. ఒక ప్లేట్లో పార్చ్మెంట్ పేపర్ వేసి అరటిపండు ముక్కలను దానిపై పేర్చి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అరటిపండు ముక్కలు గట్టిపడిన తర్వాత కరిగిన చాక్లెట్లో ముంచి, వెంటనే తరిగిన డ్రై ఫ్రూట్స్ ముక్కలను పైన జల్లి సర్వ్ చేసుకోవచ్చు.చదవండి : 60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ఫొటోలు


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)


#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)


కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)


SRH vs DC Photos : ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అభిమానులతో సందడిగా ఉప్పల్ స్టేడియం.. తారల సందడి (ఫొటోలు)


రోజురోజుకీ తమన్నా అందం రెట్టింపు.. చూస్తుంటేనే! (ఫొటోలు)


'#సింగిల్'తో అదృష్టం పరీక్షించుకోనున్న ఇవానా (ఫొటోలు)
అంతర్జాతీయం

భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్ మరో మిసైల్ ప్రయోగం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ ఫతహ్ అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిసైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో ఈ మిసైల్ టెస్ట్ ప్రధానంగా మిస్సైల్ హార్డ్‌వేర్,సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించడం, అలాగే మిసైల్‌లో ఉపయోగించిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్తాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిసైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది.కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ మిలటరీ చర్యలు పాకిస్తాన్-భారతదేశాల మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ఈ దారుణానికి ఒడిగట్టింది. పాక్‌పై భారత్ ఆంక్షలుదీనికి ప్రతిగా, భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.ఏక్షణంలోనైనా పాక్‌పై భారత్ దాడిప్రధానమంత్రి మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత సైన్యం పాకిస్తాన్‌పై ఏ క్షణంలో మెరుపు దాడి చేసే దిశగా సన్నాహాలు కొనసాగిస్తోంది.

యుద్దానికి రెడీ.. పాక్‌లో అఖిలపక్ష భేటీలో ఆర్మీ అధికార ప్రతినిధి
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ దాడులు చేస్తుందనే కారణంగా పాక్‌కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా యుద్ధ సన్నద్దతపై వివరణ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. భారత్ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్ అలర్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌తో నెలకొన్న పరిస్థితులను సివిల్, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ హాజరు కాలేదని సమాచారం.ఇదిలా ఉండగా.. భారత్ పర్యటనకు ముందు పాక్‌లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్‌లో దిగిన వెంటనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని వ్యాఖ్యాలు చేశారు. ఇక, అంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమని అబ్బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్ వార్’లో భాగంగా హాలీవుడ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

నిప్పు చల్లగా.. మంచు మంటగా!
మెల్బోర్న్(ఆస్ట్రేలియా): మంటను ముట్టుకుంటే కాలిపోతుంది. మంచును టచ్ చేస్తే చల్లగా ఉంటుంది. కానీ ఈ ఆ్రస్టేలియా వ్యక్తికి మాత్రం నిప్పు చల్లగా ఉంటుంది. చల్లని పదార్థం చురుక్కుమటుంది. అదెలా సాధ్యమంటే, అదో వింత వ్యాధి. అతని కాళ్లు, చేతులు గ్రహణ శక్తి కోల్పోయాయి. ఈ వ్యాధితో అతను ఐదేళ్లుగా బాధపడుతున్నాడు. ఎన్నో పరీక్షలు చేసినా వ్యాధేమిటో తెలిసింది కానీ చికిత్స ఏమిటో తెలియడం లేదు. ఆ్రస్టేలియాకు చెందిన 22 ఏళ్ల ఎయిడెన్ మెక్మానస్ 17వ ఏట హైస్కూల్ చివరి ఏడాదిలో ఉండగా ఈ సమస్య మొదలైంది. పాదాల్లో కొద్దికొద్దిగా అనుభూతిని కోల్పోవడం మొదలైంది. పాదాలు చక్కిలిగింతలు పెట్టినట్టుగా, తిమ్మిరెక్కినట్టుగా అనిపించడం మొదలైంది. పాదాల్లోకి రక్తం, ఇతర ద్రవాల సరఫరా లేదంటూ డాక్టర్ మందులిచ్చాడు. అవేవీ పని చేయలేదు. నడవడమే కష్టంగా మారడంతో న్యూరాలజిస్టులు 20కి పైగా రక్త పరీక్షలు చేశారు. బయాప్సీ కూడా చేసినా వ్యాధీ నిర్ధారణ కాలేదు. చివరకు అతను ఆక్సోనల్ పెరిఫెరల్ న్యూరోపతితో బాధపడుతున్నాడని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇది శరీరానికి సంకేతాలను ప్రసారం చేయకుండా నాడీ కణాలను అడ్డుకుంటుంది. దాంతో తన కుమారుడు వేడిగా ఏదైనా తీసుకున్నప్పుడు, చల్లగా అనిపిస్తుందని, చల్లగా ఉన్నప్పుడు మండుతున్న అనుభూతిని పొందుతాడని తల్లి ఏంజిలా మెక్మానస్ వాపోయారు. అతని రోజురోజుకీ పరిస్థితి దిగజారిపోతోంది. నడక సామర్థ్యం, కాళ్లు, చేతుల్లో సమతుల్యత, సమన్వయం తగ్గుతున్నాయి. నయం చేయలేని ఈ వ్యాధికి చికిత్సను భరించలేమని నేషనల్ డిజేబులిటీ ఇన్సూరెన్స్ ఏజెన్సీ (ఎన్డీఐఏ) సైతం చేతులెత్తేసింది. చికిత్సేమిటో తెలియకుండా నిధులివ్వలేమని తేల్చేసింది. కానీ నొప్పి నివారణ మందులు తప్ప ప్రస్తుతానికి అతనికి చికిత్స అందుబాటులో లేదని న్యూరాలజిస్ట్ చెప్పుకొచ్చారు. పరిస్థితి నానాటికి దిగజారిపోయే పరిస్థితి ఉంది గనుక ఎన్డీఐఏలో చేర్చాలంటూ ఏజెన్సీకి లేఖ రాశారు.
జాతీయం

పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు.

Road Accidents: రూ. లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్ మెంట్
ఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం అందించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి లక్షా యాభై వరకూ ఉచిత వైద్యం అందిండానికి వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆస్పత్రుల్లో లక్షా యాభై వేల వరకూ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అందించాలని నిర్ణయించింది. ఇది నిన్నటి(సోమవారం) రాత్రి నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం రహదారుల రవాణాశాఖ స్పష్టం చేసింది.‘క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’గా దీనికి నామకరణం చేశారు. రోడ్డు ప్రమాదాలు జగిగిన సందర్భాల్లో గోల్డెన్ అవర్ ఉచిత వైద్యం అందించాలనే సుప్రీం తీర్పును గతంలో వెలువరించడంతో దానికికనుగణంగా కేంద్రం చర్యలు చేపట్టింది. వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి ఈ పథకం వర్తించనుంది. అదే సమయంలో ప్రమాదం జరిగిన నాటి నుంచి ఏడురోజుల వరకూ ఈ సదుపాయం పొందవచ్చు.

సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా?
కోల్‌కతా: ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి సీఎం మమతా బెనర్జీ వేప మొద్దుల్ని దొంగలించారా? అంటే అవుననే అంటున్నారు ఒడిశా బీజేపీ నేతలుపశ్చిమ బెంగాల్ దిఘూలో జగన్నాథుడి పాలరాతి విగ్రహం ప్రతిష్ఠాపన జరిగింది.ఈ ఆలయంలో విగ్రహం కోసం ఒడిశా నుంచి మమతా వేప మొద్దులు దొంగిలించదని ఒడిశా బీజేపీ నేతలు మమతా బెనర్జీపై ఆరోపణలు చేశారు. అయితే, ఆ ఆరోపణల్ని దీదీ ఖండించారు. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ఇంట్లోనే నాలుగు వేప చెట్లు ఉన్నాయి. దొంగిలించాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో జగన్నాథ స్వామిని పూజించడం నేరమా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, ఒడిశా బీజేపీ పాలనలో పశ్చిమ బెంగాల్ వలసకూలీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్నాయి. ప్రతిదాడి కోసం భారత్ పక్కాగా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఈ తరుణంలో మే 7న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ 48 గంటల్లోనే రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జరగనున్న ఈ కేబినేట్ మీటింగ్‌పై అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.ఉగ్రదాడి జరిగిన సమయం నుంచి దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పాక్ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచదేశాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశ భద్రతపై ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో పాక్‌లో అలజడి రేగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కేబినేట్ సమావేశం జరగనుంది. అందులో దాయాది దేశానికి ఎలా బుద్ధి చెప్పాలి వంటి అంశాల గురించి చర్చించనున్నారు. భారత్‌పై పాక్ వైమానిక దాడులకు దిగితే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలాంటి సూచనలు చేయాలి..? దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాధం జరిగితే హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలు ఏంటి..? వంటి అంశాలు చర్చకు రానున్నాయి.ప్రధాని మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ (సీసీఎస్) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూజలాల ఒప్పందంపై ఆంక్షలు. దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు, గగనతలాన్ని మూసివేయడం వంటి నిర్ణయాలను భారత్ తీసుకుంది.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

వీడియో కాల్ ద్వారా గర్భిణికి వైద్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏడేళ్ల నిరీక్షణ తర్వాత గర్భం దాల్చిన ఓ ఇల్లాలి మాతృత్వపు కలను వైద్య నిర్లక్ష్యం విచ్ఛిన్నం చేసింది. గర్భస్థ పిండాల (మగ కవలలు) మృతికి కారణమై కాబోయే తల్లికి అంతులేని వేదనను మిగిల్చింది. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన గర్భిణికి వాట్సాప్ వీడియో కాల్లో ఓ డాక్టర్ చేపట్టిన వైద్యం వికటించి ఐదు నెలల గర్భస్థ పిండాలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వైద్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆస్పత్రిని సీజ్ చేశారు. పెళ్లయిన ఏడేళ్లకు ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తికి చెందిన కీర్తికి ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన బుట్టి గణేశ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు పుట్టకపోవడంతో చంపాపేటలోని ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడి చికిత్సలతో చివరకు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) పద్ధతిలో ఐదు నెలల క్రితం కీర్తి గర్భం దాల్చింది. తొలి మూడు నెలలు చంపాపేట ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్న ఆమె తరచూ అక్కడకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ అనూషరెడ్డిని సంప్రదించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన మహిళా డాక్టర్... కీర్తి గర్భసంచి వదులుగా ఉన్నట్లు గుర్తించి ఏప్రిల్ 6న కుట్లు వేసింది. అయితే అప్పటి నుంచే బాధితురాలికి రక్తస్రావం మొదలైంది. తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు మందులు తీసుకొని ఇంటికి వెళ్తోంది. ఇంటి నుంచే చికిత్స అందించడంతో.. ఆదివారం తెల్లవారుజామున కీర్తి రక్తస్రావంతోపాటు భరించలేని నొప్పులతో బాధపడుతుండటంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఉదయం 5:45 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్ అనూషరెడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు సమాచారం అందించారు. అయినా వైద్యురాలు ఆస్పత్రికి రాకుండా ఇంటి నుంచే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా స్టాఫ్‌నర్సు, ఆయాలతో చికిత్స ప్రారంభించింది. స్టాఫ్ నర్సు, ఆయాలకు అనుభవం లేకపోవడం, అప్పటికే పరిస్థితి విషమించడంతో గర్భ సంచి సహా గర్భంలోని కవల పిండాలు బయటకొచ్చేశాయి. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ బాధితురాలి బంధువులు సోమవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు, జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రికి చేరుకొని సీజ్ చేశారు. ఆస్పత్రిలోని ముగ్గురు బాలింతలను వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలేశారు.నిర్లక్ష్యం లేదన్న ఆస్పత్రి.. అధిక రక్త స్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన తల్లి ప్రాణాలను కాపాడేందుకు అప్పటికే గర్భంలో మృతి చెందిన కవల పిండాలను అబార్షన్ ద్వారా తొలగించాల్సి వచి్చందని.. ఇందులో ఎలాంటి వైద్య నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మానవతా దృక్పథంతో చికిత్స అందించామని.. ఆస్పత్రి బిల్లు చెల్లించడం ఇష్టంలేకే కుటుంబ సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం.

బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
కటిహార్: బీహార్‌లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ట్రాక్టర్ ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.బాధితులంతా సుపౌల్‌కు చెందినవారని, వివాహ వేడుకకు హాజరై తిరిగి సొంతూరుకు వస్తుండగా ప్రమాదం జరిగిందని కటిహార్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని వెల్లడించారు.

తప్పతాగి, ఎయిర్‌హోస్టెస్‌కు వేధింపులు : తిక్క కుదిర్చిన ఎయిర్‌లైన్స్
విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన తాజాగా వెలుగులోకి చ్చింది.ఢిల్లీ-షిర్డీ వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన సిబ్బందిలో భాగమైన ఎయిర్‌హోస్టెస్‌ను వేధింపులకు గురిచేశాడు. ఆమెను అనుచితంగా తాకి లైంగికంగా వేధించాడు. చివరికి ఏమైందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే 2న ఢిల్లీ నుంచి షిర్డీ వెళ్లే 6E 6404 ఇండిగో విమానంలో మద్యం తాగిన వ్యక్తి ఎయిర్ హోస్టెస్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదు మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఇండిగో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విమానంలోని టాయిలెట్ దగ్గర ప్రయాణీకుడు ఎయిర్ హోస్టెస్‌ను అనుచితంగా తాకినట్లు పోలీసు అధికారి తెలిపారు. అసభ్యకరమైన ప్రవర్తనతో విసిగిపోయిన ఎయిర్ హోస్టెస్ తన మేనేజర్‌కు సమాచారం అందించింది. దీంతో విమానం షిర్డీ విమానాశ్రయంలో దిగిన తర్వాత వారు భద్రతా సిబ్బందికి సమాచారం అందించారని, ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు.రహతా పోలీస్ స్టేషన్లో అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. వైద్య పరీక్షలో అతను మద్యం సేవించినట్లుగా కూడా నిర్ధారణ అయింది. దీనిపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందింస్తూ.. ‘‘అందరికీ సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని" అందించడమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రయాణికులకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే చింతిస్తున్నామని ఎయిర్‌లైన్ ఓ ప్రకటనలో పేర్కొంది.

దైవ దర్శనానికి వెళ్లొస్తూ.. మృత్యు ఒడికి..
కీసర(హైదరాబాద్): కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం చేసుకుని వెళ్లి వస్తుండగా మృత్యువు కబళించింది. కీసరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కీసర ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా మేడిపల్లికి చెందిన యశ్వంత్ (25), పీర్జాదిగూడకు చెందిన చార్లెస్ (25), ఎల్బీనగర్కు చెందిన చెన్నకేశవ గౌడ్ (23), వివేక్, సురేష, యశ్వంత్ నాయక్ శనివారం ఉదయం కారులో కర్ణాటక బీదర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్లారు. అనంతరం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నారు. యశ్వంత్ కారు నడుపుతుండగా, చార్లెస్ ముందు సీట్లో కూర్చున్నాడు. మిగతవారు వెనక సీటులో ఉన్నారు. ఉదయం 11:15 గంటల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కీసర ఎగ్జిట్ దాటిన తర్వాత ముందున్న గ్యాస్ కంటెయినర్ లారీని కారు ఢీకొట్టి, డివైడర్‌కు తగిలింది. ఈ ఘటనలో యశ్వంత్‌తో పాటు చార్లెస్ అక్కడికక్కడే మృతి చెందారు. చెన్నకేశవ గౌడ్ తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో చేర్పించారు. మిగతా ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిని చికిత్స కోసం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలో చేర్చించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలు


పహల్గాం ఉగ్రదాడికి భారత్ కౌంటర్


ఆపరేషన్ సింధూర్ ను పర్యవేక్షించిన ప్రధాని మోదీ


ఆపరేషన్ సిందూర్ ఘన విజయం


ఏపీ ప్రజలకు బాబు పాతికేళ్లకు సరిపడా షాకిచ్చారా ?


POKలో ఇండియా దాడి చేసిన ప్రాంతాలివే !


పాక్ పై భారత్ మెరుపుదాడి.. ఆపరేషన్ సిందూర్


తెలంగాణ ఆర్థిక పరిస్థితికి ఎలాంటి డోకా లేదు: జగదీష్‌రెడ్డి


పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన వంగా గీతా


Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలకు సర్వం సిద్ధం


Jammu And Kashmir: పూంచ్ జిల్లాలో లోయలో పడిన బస్సు