
సాక్షి, హైదరాబాద్: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ సోమవారం త్రిసభ్య కమిటీ (సిర్పుర్కర్ కమిషన్) ఎదుట హాజరయ్యారు. ఎన్‌కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేయనుంది. కాగా, ఇప్పటికే ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్ స్టేట్‌మెంట్ కీలకం కానుంది.