
సాక్షి, కాకినాడ: మాజీ హోంమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇంటిని కల్లు గీత కార్మికులు ముట్టడించారు. మాధవపట్నం గ్రామంలో బెల్టు షాపులను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు తమ భార్యలను వెంటబెట్టుకుని మాధవపట్నం నుంచి అచ్చంపేటలోని చినరాజప్ప నివాసం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
మాధవపట్నంలో 16 బెల్టు షాపులు ఉన్నాయని చినరాజప్పకు తెలిపిన గీత కార్మికులు.. బెల్టు షాపుల వల్ల తమ ఉపాధి పోయిందని ఏకరువు పెట్టారు. బెల్టు షాపులు తొలగించాలని అడిగితే నిర్వాహకులు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కార్మికులు రాజప్పకు ఫిర్యాదు చేశారు. సామర్లకోట సీఐతో మాట్లాడిన రాజప్ప.. గీత కార్మికులకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు.
