Raja Saab Movie
-
నోరు జారిన కుర్రాడు.. నిధి అగర్వాల్ మాత్రం
సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్. అందుకే పలువురు నెటిజన్లు.. హీరోహీరోయిన్లపై అప్పుడప్పుడు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిని సదరు నటీనటులు పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం కాస్త గట్టిగానే ఇచ్చేస్తుంటారు. హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal).. ఇప్పుడు ఓ కుర్రాడికి అలానే కౌంటర్ ఇచ్చింది.ఏం జరిగిందంటే?నిధి అగర్వాల్ గురించి ఓ ట్విటర్ పేజీలో పోస్ట్ పెట్టగా.. దీనికి స్పందించిన ఓ నెటిజన్ ఈమెని శ్రీలల(Sreeleela) పోలుస్తూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. 2021లో వచ్చిన శ్రీలీల 20కి పైగా సినిమాలు చేసింది. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత నిధి ఏం చేసింది? ఎన్ని మూవీస్ చేసింది? అని అన్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 12 సినిమాలు.. అవేంటంటే?)ఈ ట్వీట్ పై స్వయంగా స్పందించిన నిధి అగర్వాల్.. సదరు నెటిజన్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. 'ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో మూవీ చేసింది. తమిళంలో మూడు మూవీస్ చేసింది. హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie)కి సంతకం చేసింది. మంచి స్క్రిప్ట్ లు అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకు టైమ్ తీసుకుంటున్నాను. కొన్నిసార్లు నా నిర్ణయం తప్పయి ఉండొచ్చు. కానీ మంచి సినిమాలు చేయాలనేది నా అభిప్రాయం. వరసగా సినిమాలు చేయాలనే తొందరేం లేదు. ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. కాబట్టి బ్రదర్.. నా గురించి నువ్వేం బాధపడకు' అని చెప్పుకొచ్చింది.నిధి అగర్వాల్ బాగానే కౌంటర్ చేసింది. కానీ సదరు నెటిజన్ అన్నదాంట్లోనూ కాస్త నిజముంది. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తప్పితే నిధి అగర్వాల్ కెరీర్ లో చెప్పుకోదగ్గ మూవీ లేదు. పవన్ తో హరిహర వీరమల్లు, ప్రభాస్ తో రాజాసాబ్(The Raja Saab Movie) చేసింది గానీ వీటిపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అటు శ్రీలీల కూడా సినిమాలైతే చేస్తోంది గానీ దాదాపు ఫ్లాప్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: యంగ్ హీరోకి దారుణమైన పరిస్థితి.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత) -
RAJASAAB పరిస్థితి ఏంటి..?
-
కన్ ఫ్యూజన్ లో ది రాజా సాబ్ ...!
-
నిధి అగర్వాల్.. ఓ వింత కండీషన్
హీరోయిన్లు చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో ఛాన్సుల్ని అందుకునే విషయంలో పలు సవాళ్లు ఎదురవుతుంటాయి. కానీ నిధి అగర్వాల్ కి మాత్రం తొలి మూవీ చేసేటప్పుడు వింతైన కండీషన్ పెట్టారట. అది చూసి ఈమె షాకైందట.(ఇదీ చదవండి: అమ్మ చివరి కోరిక.. కొత్త ఇంట్లోకి తెలుగు యంగ్ హీరో)''మున్నా మైకేల్' మూవీతో నా కెరీర్ మొదలైంది. ఇదో బాలీవుడ్ మూవీ. టైగర్ ష్రాఫ్ హీరో. ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత నాతో ఓ కాంట్రాక్ట్ పై సంతకం చేయించారు. అందులో నో డేటింగ్ అనే కండీషన్ కూడా ఉంది. అంటే సినిమా పూర్తయ్యేవరకు హీరోతో నేను డేటింగ్ చేయకూడదనమాట.కాంట్రాక్ట్ మీద సంతకం పెడుతున్నప్పుడు ఇవన్నీ గమనించలే గానీ తర్వాత వీటి గురించి తెలిసి ఆశ్చర్యపోయాను' అని నిధి అగర్వాల్ చెప్పుకొచ్చింది.ప్రస్తుతం తెలుగులో హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాలు చేస్తున్న నిధి.. ట్రోలింగ్ గురించి కూడా మాట్లాడింది. 'మంచి, చెడు చెప్పడానికి పద్ధతి ఉంది. హద్దులు దాటి అసభ్యంగా మాట్లాడటం మాత్రం సరికాదు. నేను అస్సలు ఇలాంటివి పట్టించుకోను' అని నిధి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సుకుమార్ కూతురి సినిమా) -
గేమ్ ఛేంజర్ దెబ్బకు ప్రభాస్ రాజసాబ్ కి టెన్షన్
-
ప్రభాస్ 'రాజాసాబ్' పాటల్ని పక్కనపడేసిన తమన్
ప్రస్తుతం ట్రెండింగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్(Thaman) ఒకడు. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా తేడా లేకుండా దాదాపు చాలా భాషల సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇతడు ప్రభాస్ 'రాజాసాబ్' (The Rajasaab Movie) కోసం కూడా పనిచేస్తున్నాడు. కానీ ఇప్పటివరకు ఈ మూవీ కోసం చేసిన సాంగ్స్ అన్నీ పక్కనపడేశానని, కొత్తగా మళ్లీ చేస్తున్నానని అన్నాడు. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: కొత్త ఇంట్లోకి సింగర్ మంగ్లీ.. ఫొటోలు వైరల్)ఓ ఇంగ్లీష్ ఎంటర్ టైన్ మెంట్ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తమన్ చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 'రాజాసాబ్' పాటల్ని డస్ట్ బిన్ లో వేశానని చెప్పడం చర్చనీయాంశమైంది. 'రాజాసాబ్'కి పాటలు కంపోజ్ చేయడం ఇప్పుడే మొదలుపెట్టా. షూటింగ్ అంతా దాదాపు పూర్తయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్ చేయడం మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సర్.. చాలా కాలం తర్వాత కమర్షియల్ పాటలతో వస్తున్నారు''ఈ సినిమాలో ఇంట్రో, మెలోడీ, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి. ఓ పాటలో ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ క్రేజీ డ్యాన్స్ చేయబోతున్నారు. రాబోయే ఐదు నెలలో సాంగ్స్ షూటింగ్ పూర్తవుతుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక్కో పాట చేస్తున్నాం. నిజానికి 'రాజాసాబ్' కోసం చాలా పాటలు చేశారు. కానీ నాకెందుకో మార్చేద్దాం అనిపించింది. ఎప్పుడో ట్యూన్స్ చేసిచ్చా. వాళ్లు షూటింగ్ మొదలుపెట్టలేదు. దీంతో ఇవన్నీ డస్ట్ బిన్ లో పడేశా. కొత్తగా సాంగ్స్ కంపోజ్ చేస్తున్నా. డైరెక్టర్ కి కూడా ఇదంతా చెప్పా. ఇవి ఇప్పుడు వర్కౌట్ కావు. నేను నా మ్యూజిక్ ని చీట్ చేయలేను. ఇలా ఉండటమే కరెక్ట్' అని తమన్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా) -
రాజాసాబ్ సంక్రాంతి స్పెషల్ పోస్టర్.. లుక్ అదిరింది!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్లో "రాజా సాబ్" సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "రాజా సాబ్" సినిమా నుంచి శుభాకాంక్షలు చెబుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ "రాజా సాబ్" సినిమాను భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తోంది. "రాజా సాబ్" సినిమా అందరికీ గుర్తుండిపోయేలా రూపొందిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం "రాజా సాబ్" చిత్రీకరణ తుది దశలో ఉంది.దిల్ రూబా పండగ పోస్టర్యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తోంది. "దిల్ రూబా" చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ రోజు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా "దిల్ రూబా" సినిమా నుంచి విషెస్ చెబుతూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో హీరో కిరణ్ అబ్బవరం జాయ్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా "దిల్ రూబా" ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.చదవండి: టీవీల్లో 'గేమ్ ఛేంజర్' ప్రత్యక్షం.. మండిపడ్డ టాలీవుడ్ నిర్మాత -
రాజా సాబ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఈ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా, చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావడం లేదని, కొత్త విడుదల తేదీపై త్వరలోనే చిత్రయూనిట్ ఓ ప్రకటన చేయనుందని తెలిసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్’ సినిమాకు చెందిన ఓ అప్డేట్ని ఇవ్వడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట. బహుశా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రావొచ్చని సమాచారం. -
ప్రభాస్ కి భయపడని చిన్న హీరోలు
-
రాజాసాబ్ కు పోటీగా వెళ్తున్న టిల్లు..?
-
ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన ‘రాజా సాబ్’ బ్యూటీ (ఫోటోలు)