Top Stories
ప్రధాన వార్తలు

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్.. లైవ్
ఢిల్లీ: పాక్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరిట నిర్వహించిన దాడులపై భారత విదేశాంగ, రక్షణ శాఖ బుధవారం ఉదయం సంయుక్తంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్‌మీట్ ప్రారంభానికి ముందు భారత్‌పై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడుల తాలూకు వీడియోల్ని విడుదల చేసింది. అనంతరం, ప్రెస్ మీట్లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ,వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పాల్గొన్నారు. ముందుగా విక్రమ్ మిస్రీ మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సిందుపై మిస్రీ తర్వాత ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వివరాల్ని వెల్లడించారు. #WATCH | Delhi | #OperationSindoor| Foreign Secretary Vikram Misri says, " A group calling itself the Resistance Front has claimed responsibility for the attack. This group is a Front for UN proscribed Pakistani terrorist group Lashkar-e-Taiba...Investigations into the Pahalgam… pic.twitter.com/JqpIbHrttN— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్‌మీట్..ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ ఆపరేషన్ సిందూర్ 1.05 నిమిషాలకు ప్రారంభమై 1.30కి ముగిసింది9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేశాంపాక్లో ఉన్న టెర్రర్ ఇండక్షన్‌లతో పాటు ట్రైనింగ్ సెంటర్లను ధ్వసం చేశాం అప్జన్ కసబ్కూడా ఇక్కడే ట్రైనింగ్ తీసుకున్నాడు.ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు చేశాం విక్రమ్ మిస్రీఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారులష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ఏ ఈ దాడి చేసింది దాడిని సైతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. టీఆర్ఎఫ్కు పాకిస్తాన్ అండదండలున్నాయి.జమ్మూకశ్మీర్ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఈ దాడులు చాలా కాలం నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందిఉగ్రవాదులను చట్టం ముందు శిక్షించాలిముంబై ఉగ్రదాడి తర్వాత దేశంలో పహల్గాం అతి పెద్ద ఉగ్రదాడిభారత్..పాక్‌కు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది.ఉగ్రసంస్థల మౌలిక వసతులను ధ్వంసం చేసేలా ఆపరేషన్ సిందూర్ జరిగిందిగతేడాది 2.3 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించారుజమ్మూ కాశ్మీర్ పర్యాటకాన్ని ,ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసేందుకు పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిపాక్లో ఉన్న ఉగ్ర సంస్థల గురించి 2023 లో భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్ళిందిపాకిస్తాన్పై దౌత్య పరమైన ఆంక్షలు విధించాంఅయినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపలేదుఉగ్రదాడులు చేసిన వారికి పాక్ షెల్టర్ ఇస్తోందిసీమాంతర ఉగ్రవాదాన్ని భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. #WATCH | #OperationSindoor | Terror site Markaz Subhan Allah, Bahawalpur, Pakistan, the headquarters of Jaish-e-Mohammed, targeted by Indian Armed Forces." pic.twitter.com/iM4s91ktb8— ANI (@ANI) May 7, 2025👉ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఇవే ఎల్ఈటీ-లష్కరే తోయిబా,జేఈఎం-జైషే మహమ్మద్, హెచ్ఎం-హిజ్బుల్ ముజాహిదీన్ 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - ఎల్ఈటీ3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - హెచ్ఎం5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - ఎల్ఈటీ6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్ఎం8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - ఎల్ఈటీ9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎం #WATCH | Video shows multiple hits on the Mundrike and other terrorist camps in Pakistan and PoJKCol. Sofiya Qureshi says, "No military installation was targeted, and till now there are no reports of civilian casualties in Pakistan." pic.twitter.com/zoESwND7XD— ANI (@ANI) May 7, 2025

ఆపరేషన్ సిందూర్ అప్డేట్స్.. సరిహద్దు పరిస్థితిపై కేబినెట్ చర్చ
Indian Army Operation Sindoor Updates.. కేంద్ర కేబినెట్ భేటీ..కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంఆపరేషన్ సిందూర్‌పై చర్చిస్తున్న కేబినెట్సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులపై సమీక్ష‘ఆపరేషన్ సిందూర్’పై ప్రపంచ నేతల స్పందన ఇదే..👉అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాల మధ్య యుద్ధం ఎవరూ కోరుకోరు. భారత్, పాక్‌లకు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు.👉అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందన.. భారత్- పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. శాంతియుత పరిష్కార దిశగా చర్చలు జరపాలి👉భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్.. ఆత్మ రక్షణ కోసం భారత్ దాడి చేస్తోంది. అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలి. భారత్‌కు మా మద్దతు ఉంటుంది.👉యూఏఈ ఉప ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్.. భారత్-పాక్ మధ్య ఘర్షణలను ప్రపంచం భరించలేదు. సంయమనం పాటించాలి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలి👉చైనా స్పందన.. భారత్, పాక్ రెండూ దాయాది దేశాలు. ఇవి రెండూ చైనాకు పొరుగు దేశాలే. చైనా అన్నిరకాలుగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. శాంతి, స్థిరత్వంతో భవిష్యత్తు ప్రయోజనాల కోసం వ్యవహరించాలని ఇరు దేశాలను కోరుతున్నాం. ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలి. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలను దూరంగా ఉండాలని భారత్, పాకిస్థాన్‌లను కోరుతున్నాం👉ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్.. రెండు దేశాల సైనికులు సంయమనం పాటించాలి. పౌరులను చంపడం భావ్యం కాదు: ఒమర్ అబ్దుల్లాపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత బలగాలుపాక్ మిలిటరీ, పౌరులకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉగ్ర శిబిరాలపై దాడిఅయినప్పటికీ పాక్ అన్యాయంగా పౌరులపై దాడి చేసి 10 మందిని పొట్టనపెట్టుకుందని విమర్శ.అమిత్ షా కీలక ఆదేశాలు..సెలవులో ఉన్న పారా మిలిటరీ బలగాలను వెనక్కి రప్పించండిఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పారా మిలిటరీ బలగాలకు ఆదేశాలు జారీ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాసెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని పేర్కొన్న అమిత్ షా ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశం ప్రారంభంమీడియా సమావేశంలో మాట్లాడుతున్న విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం: అమిత్ షాభారత్, ప్రజలపై దాడి చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన విధంగా బుద్ధి చెబుతుంది.పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సిందూర్ చేపట్టాయని వెల్లడిఆర్మీ బలగాలను చూసి గర్విస్తున్నానని పోస్టు పెట్టిన అమిత్ షాజమ్ముకశ్మీర్ సీఎంతో మాట్లాడిన అమిత్ షాఆపరేషన్ సిందూర్ తర్వాత స్పందిస్తున్న కేంద్ర పెద్దలు..ప్రస్తుత పరిస్థితిపై చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, బీఎస్ఎఫ్ డీజీతోనూ చర్చించిన అమిత్ షాసరిహద్దు భద్రతపై ఒమర్ అబ్దుల్లా సమీక్షపౌరుల ప్రాణాలను కాపాడటానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన సీఎంఅత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించాలని అధికారులకు ఆదేశంజేపీ నడ్డా వార్నింగ్..మా జోలికొస్తే ఊరుకుంటామా అంటూ నడ్డా వ్యాఖ్యలు..ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు పహల్గాం ఉగ్రదాడికి దీటైన జవాబు ఇచ్చాయి.భారత గడ్డపై దాడి చేసిన వారికి కఠిన శిక్ష విధిస్తామని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన నడ్డాఉగ్రవాదం అనే పీడను విరగడ చేస్తామని పోస్టు పెట్టిన నడ్డారక్షణ మంత్రితో సీడీఎస్ భేటీరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన సీడీఎస్ అనిల్ చౌహాన్సౌత్ బ్లాక్‌లో పరిస్థితిని వివరిస్తున్న అనిల్ చౌహాన్ త్రివిధ దళాల మీడియా సమావేశం..ఉదయం 10:30 కు ఆపరేషన్ సిందూర్‌పై మీడియా సమావేశంసమావేశంలో పాల్గొననున్న రక్షణ, విదేశాంగ, ఆర్మీ ప్రతినిధులుఉగ్ర శిబిరాలపై భారత్ మెరుపు దాడులను వివరించనున్న ఆర్మీ.ఐదు భారత్ ఫైటర్ జెట్లను కూల్చేశామని చెబుతున్న పాకిస్తాన్Graphic representation of the targets taken by the Indian Armed Forces under #OperationSindoor in Pakistan and PoJK https://t.co/cEasBn51U9 pic.twitter.com/HMONRGQxWW— ANI (@ANI) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన ఖర్గే..పాకిస్తాన్ మరియు పిఓకె నుండి ఉత్పన్నమయ్యే అన్ని రకాలఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన జాతీయ విధానాన్ని కలిగి ఉంది.పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడి పట్ల చాలా గర్వపడుతున్నాం.భారత ఆర్మీ దృఢ సంకల్పం మరియు ధైర్యాన్ని మేము అభినందిస్తున్నాము.జాతీయ ఐక్యత, సంఘీభావం ఈ సమయంలో అవసరంభారత జాతీయ కాంగ్రెస్ మన సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది.మన నాయకులు గతంలో మార్గాన్ని చూపించారు.జాతీయ ఆసక్తి మాకు అత్యున్నతమైనది. India has an unflinching National Policy against all forms of terrorism emanating from Pakistan and PoK. We are extremely proud of our Indian Armed Forces who have stuck terror camps in Pakistan and PoK. We applaud their resolute resolve and courage. Since the day of the…— Mallikarjun Kharge (@kharge) May 7, 2025ఆపరేషన్ సిందూర్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందన.భారతీయ పౌరుడిగా మన సాయుధ దళాలతో బలంగా నిలబడి ఉండాలి...పాకిస్తాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాల పై ఆర్మీ జరిపిన దాడి మానకు గర్వకారణం.జాతీయ ఐక్యత కోసం అందరం కలిసి పనిచేద్దాంఈ సమయంలో మనమందరం ఒకే గొంతులో మాట్లాడదాం.. జై హింద్!#ఆపరేషన్ సిందూర్As an Indian citizen first, standing strongly with our armed forces. The strikes against terror factories in Pakistan & PoK make us proud. Let us make this a moment for national solidarity and unity, and all of us speak in one voice - Jai Hind!#OperationSindoor— Revanth Reddy (@revanth_anumula) May 7, 2025 భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు..ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారిఆత్మ రక్షణ నిమిత్తం దాడి చేసే హక్కు భారత్‌కు ఉందన్న ఇజ్రాయెల్ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేస్తోందని, దానికి తమ మద్దతు ఉంటుందని తెలిపిన రూవెన్ అజర్‌అమాయకులపై దాడి చేసి దాక్కోవడం కుదరదనే విషయాన్ని ఉగ్రవాదులు తెలుసుకోవాలన్న రూవెన్‌భారత్ దాడుల్ని స్వాగతిస్తున్నాం: అసదుద్దీన్ ఒవైసీ ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నాంపహల్గాం లాంటి మరో దాడి జరగకుండా సరైన గుణపాఠం చెప్పారుపాకిస్తాన్ ఉగ్రభూతాన్ని తరిమికొట్టాల్సిందే.. జైహింద్ मैं हमारी रक्षा सेनाओं द्वारा पाकिस्तान में आतंकवादी ठिकानों पर किए गए लक्षित हमलों का स्वागत करता हूँ। पाकिस्तानी डीप स्टेट को ऐसी सख्त सीख दी जानी चाहिए कि फिर कभी दूसरा पहलगाम न हो। पाकिस्तान के आतंक ढांचे को पूरी तरह नष्ट कर देना चाहिए। जय हिन्द! #OperationSindoor— Asaduddin Owaisi (@asadowaisi) May 7, 2025 ఆపరేషన్ సిందూర్‌పై రాహుల్ గాంధీ స్పందన ఇదే..ట్విట్టర్ వేదికగా రాహుల్ పోస్ట్‘మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నా. జై హింద్’ Proud of our Armed Forces. Jai Hind!— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025 భారత సైన్యానికి మా మద్దతు: కాంగ్రెస్‌పాక్‌లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన భారత సైన్యంసైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర మంత్రి జైశంకర్ పోస్ట్ఉగ్రవాదాన్ని సహించకూడదన్న కేంద్ర మంత్రి జైశంకర్‌ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రపంచం ఉగ్రవాదాన్ని సహించకూడదని వ్యాఖ్యలుసరిహద్దుల నుంచే దాడులు.. ఆపరేషన్ సిందూర్‌పై 10 గంటలకు మీడియా సమావేశంభారత సరిహద్దుల నుంచే ఉగ్రస్థావరాలపై దాడులుఆపరేషన్ సిందూర్.. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్త ఆపరేషన్‌ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు పేర్కొన్న భారత భద్రతా వర్గాలుఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో దాడిభారత భూభాగం నుంచే దాడులు నిర్వహించినట్లు పేర్కొన్న ఆర్మీ వర్గాలు ఆపరేషన్ సిందూర్‌లో 80 టెర్రరిస్టుల మృతిఆపరేషన్ జరిగిన ప్రాంతాలు1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఎం2. మర్కజ్ తైబా, మురిద్కే - LeT3. సర్జల్, తెహ్రా కలాన్ - జెఎం4. మెహమూనా జోయా, సియాల్కోట్ - HM5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా - LeT6. మర్కజ్ అబ్బాస్, కోట్లి - జెఇఎం7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి - HM8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ - LeT9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ - జేఎంసరిహద్దుల్లో టెన్షన్..భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టంను ఆక్టివేట్ చేసిన భారత్రాఫెల్ యుద్ధ విమానాలతో మిసైల్స్ ఉపయోగించిన భారత్తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని అంగీకరించిన పాకిస్తాన్దాడులపై అమెరికాకు ఫిర్యాదు చేసిన పాకిస్తాన్తమకు అన్ని విషయాలపై సమాచారం ఉందన్న అమెరికాఉదయం 10 గంటలకు ఆర్మీ మీడియా సమావేశంమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్న ఆర్మీబహవల్పూర్ లోని జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ మెరుపు దాడిమురిడీకే లోని హఫీజ్ సయ్యద్ ఉగ్రస్తావరాన్ని ధ్వంసం చేసిన భారత్మురిడీకే లోని భారీ ఎత్తున ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న జైషే మహమ్మద్ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఆర్మీభారత్ ఆర్మీ దాడి చేసిన ప్రాంతాలు ఇవే.. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై దాడులు..పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలో ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులు.తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ,కోట్లీ, బహ్వాల్పూర్, ముజఫరాబాద్‌లో క్షిపణి దాడులు.బహ్వల్‌పూర్‌లో 30 మంది ఉగ్రవాదులు హతం.పీవోకేతో పాటు పాక్‌లో ఉగ్ర మౌలిక సదుపాయాలు ధ్వంసంత్రివిధ దళాల సమస్వయంతో మెరుపు దాడులు.భారత్ దాడుల్లో పాక్ ఆర్మీ ఐఎస్ఐ కంట్రోల్ రూమ్ ధ్వంసంఅర్ధరాత్రి 1:44 నిమిషాలకు భారత సైన్యం దాడులు.200 ఎకరాల్లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు. Operation Sindoor UPDATES: Here is the list of nine terror facility locations in Pakistan and Pakistan-occupied Kashmir that have been successfully neutralised-1. Markaz Subhan Allah, Bahawalpur - JeM2. Markaz Taiba, Muridke - LeT3. Sarjal, Tehra Kalan - JeM4. Mehmoona Joya,… pic.twitter.com/Q3Q6vyw0Sa— Press Trust of India (@PTI_News) May 7, 2025 పాక్ అప్రమత్తం.. విమానాశ్రయాలు మూసివేతఅప్రమత్తమైన పాక్ డిఫెన్స్ వ్యవస్థలుభారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది.లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.हम जो कहते हैं, वो डेफिनिटली करते हैं...भारतीय सुरक्षा बलों ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।पाकिस्तान में 9 आतंकी ठिकाने पूरी तरह तबाह!भारतीय सेना कहा"पहलगाम का न्याय हुआ..."#OperationSindoorभारत माता की जय! 🇮🇳 pic.twitter.com/0Gve2IVl6J— Ankit Kumar Avasthi (@kaankit) May 7, 2025 పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపు దాడులుపహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేపట్టిన భారత్‌తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు ప్రకటించిన భారత ప్రభుత్వంసోషల్ మీడియాలో వైరల్‌గా మారి దాడి ఘటన వీడియోలుभारतीय सेना ने पाकिस्तान के आतंकी ठिकानों पर मिसाइल हमला किया।#OperationSindoor के तहत पाकिस्तान में 8 आतंकी ठिकाने पूरी तरह तबाह!पहलगाम का न्याय हुआ... भारत माता की जय! 🇮🇳 pic.twitter.com/bzd6bu7IWd— Ajit Doval ᴾᵃʳᵒᵈʸ🇮🇳 (@IAjitDoval_IND) May 7, 2025 #WATCH | Indian Army tweets, ""प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः" Ready to Strike, Trained to Win.(Video Source: Indian Army) pic.twitter.com/5tJbfBX4Nk— ANI (@ANI) May 6, 2025భారత్ దాడులు.. పలు విమానాలు రద్దు శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు తెలిపిన స్పైస్ జెట్‌ధర్మశాల, లేహ్, జమ్మూ, అమృత్సర్ విమానాశ్రయాల మూసివేతఉత్తరభారతంలోని పలు ఎయిర్‌పోర్టులు మూసివేతఉత్తర భారతంలోని పలు ఎయిర్‌పోర్టులను మూసివేస్తూకేంద్రం నిర్ణయంజమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్సర్ విమానాశ్రయాలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విమానాశ్రయాలు మూసివేతకేంద్రం నిర్ణయంతో ఆయా ఎయిర్‌పోర్టుల్లో విమాన సేవలకు అంతరాయం పాక్ ఉగ్ర స్థావరాలు ధ్వంసం..అంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యంఅంతర్జాతీయ సరిహద్దుకు 100 కి.మీ లోపు ఉన్న స్థావరాలపై టార్గెట్ చేసిన భారత్‌మురిడ్కే, సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కి.మీ దూరంలో ఉన్న లష్కరే క్యాంప్‌సరిహద్దు నియంత్రణ రేఖ పూంఛ్- రాజౌరీకి 35 కి.మీ దూరంలో ఉ్న గుల్పూర్‌పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్ లోపల 30కి.మీ పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్‌జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కి.మీ.ల దూరంలో ఉన్న జేఎం లాంచ్‌ప్యాడ్ బిలాల్ క్యాంప్‌రాజౌరీకి ఎదురుగా నియంత్రణ రేఖకు 10.కి.మీ పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్‌సాంబా-కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8కి.మీ దూరంలో ఉన్న సర్జల్ క్యాంప్. ఇది జేఎంకు ఒక క్యాంప్.అంతర్జాతీయ సరిహద్దు కు 15 కిమీ దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం మెహమూనా క్యాంప్👉పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.👉పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. 👉దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. 👉పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. 👉కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రాజ్‌నాద్ సింగ్. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
భారత త్రివిధ దళాల సహాయంతో ఆర్మీ బలగాలు పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఇందులో సుమారు 80 మందికిపైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. గతంలో జమ్మూకశ్మీర్‌లో భారత పర్యాటకులను ఊచకోత కోసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా భారత్ దాయాది దేశంపై పంజా విసిరింది. పాకిస్థాన్‌లోని సాధారణ ప్రజలపై కాకుండా ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. దీనిపై సానుభూతి కోసం పాక్ ఇతర దేశాల సాయం కోరకుండా భారత్ చాకచక్యంగా వ్యవహరించింది. తాజా దాడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లో ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.మార్కెట్ రియాక్షన్మార్కెట్ ప్రారంభమైన కాసేపటికి నిఫ్టీ 50 24,400 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్ 150 పాయింట్లు నష్టపోయింది. గిఫ్ట్ సిటీలోని నిఫ్టీ 50లో ఫ్యూచర్స్ సుమారు 1.19% క్షీణించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతాయని కొందరు భావిస్తున్నారు. ఇది ఇన్వెస్టర్ల ఆందోళనలకు కారణమవుతుంది.పరస్పర దాడులకు సంబంధించిన పరిస్థితులు త్వరగా సద్దుమనిగితే మార్కెట్ ప్రభావం పరిమితం కావచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఆపరేషన్ స్టాక్ మార్కెట్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. పరిస్థితులు త్వరితగతిన నియంత్రణలోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇలాంటి ఆపరేషన్ల ప్రభావానికి తాత్కాలికంగా మార్కెట్లు ఒడిదొడులకులకు లోనైనా భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఎఫ్ఐఐలు కీలకం24-48 గంటల్లో ఈ పరిస్థితి అదుపులోకి వస్తే మార్కెట్లు ముందుకు సాగవచ్చని కొందరు సూచిస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం కొంతకాలం మార్కెట్లో దిద్దుబాటుకు దారితీస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొనుగోలుదారులుగా ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) ప్రతికూలంగా ప్రతిస్పందిస్తే కొంత కాలం అనిశ్చితులు కొనసాగవచ్చు.ఇదీ చదవండి: ఎన్బీఎఫ్సీ గోల్డ్ లోన్లకు కష్టాలుగతంలో ఇలా..ఇండో-పాక్ ఘర్షణల నేపథ్యంలో మార్కెట్లు గతంలోనూ కొంత ఒడిదొడుకులకు లోనయ్యాయి. 2019 బాలాకోట్ వైమానిక దాడుల తరువాత సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్ సెషన్ ప్రారంభంలో పడిపోయినప్పటికీ మరుసటి రోజు తిరిగి పుంజుకున్నాయి. పహల్గాం దాడి తర్వాత మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేటు నిర్ణయాలు, చైనా లిక్విడిటీ చర్యలు వంటి అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం మార్కెట్లో కొంత సానుకూల సెంటిమెంట్‌ను తీసుకొచ్చింది.

వర్షమా?.. ఎక్కడ?: ఆశిష్ నెహ్రా, రాహుల్ తెవాటియా ఆగ్రహం
ఐపీఎల్-2025 (IPL 2025)లో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసులో మరో ముందడుగు వేసింది. ముంబై ఇండియన్స్ (MI vs GT)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అయితే, ఈ గెలుపు గుజరాత్‌కు అంత సులువుగా ఏమీ దక్కలేదు.వర్షం కారణంగా పదే పదే వాయిదా పడిన మ్యాచ్ ఎట్టకేలకు పూర్తి కావడంతో గిల్ సేనకు ఊరట దక్కింది. ఒకవేళ వాన వల్ల మ్యాచ్ రద్దయిపోతే ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చేది. అప్పుడు గుజరాత్ ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త క్లిష్టంగా మారేవి. మరోవైపు.. బ్యాటింగ్ పరంగా విఫలమైన ముంబై పాలిట వర్షం వరంగా మారేది. టైమింగ్‌ను మార్చడంతోఅందుకే, మధ్యలో వాన తెరిపినిచ్చినా మ్యాచ్ టైమింగ్‌ను పదే పదే మార్చడంపై గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ ఆశిష్ నెహ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనేక అవాంతరాల అనంతరం.. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:09 AM నుంచి మ్యాచ్‌ను 12:25 AMకు మార్చిన అంపైర్లు.. ఆ తర్వాత మ్యాచ్ పునఃప్రారంభాన్ని 12:30 AMకు వాయిదా వేశారు.వర్షమా?.. ఎక్కడ?ఈ నేపథ్యంలో మైదానంలోకి వచ్చిన ఆశిష్ నెహ్రా అంపైర్లతో వాదనకు దిగినట్లు కనిపించింది. మరోవైపు.. టైటాన్స్ బ్యాటర్ రాహుల్ తెవాటియా కూడా.. ‘‘వర్షం ఎక్కడ పడుతోంది’’ అన్నట్లుగా అంపైర్లతో వాదించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. కీలకమైన మ్యాచ్‌లో గెలుపునకు దగ్గరైన వేళ వరుణుడితో పాటు అంపైర్లు కూడా తమతో దోబూచులాడటం నచ్చకే వీళ్లిద్దరూ ఇలా ఫైర్ అయ్యారంటూ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.Rahul Tewatia saying where is rain.- Ashish Nehra is furious.Rain go 🤣#MIvGT #MIvsGT pic.twitter.com/oEiO7q1Qpf— its cinema (@iitscinema) May 6, 2025రాణించిన గుజరాత్ బౌలర్లుకాగా ముంబైలోని వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ చేసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైని 155 పరుగులకు కట్టడి చేయగలిగింది. సాయి కిషోర్ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జి ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇక ముంబై బ్యాటర్లలో ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (2), రోహిత్ శర్మ (7) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో వన్‌డౌన్ బ్యాటర్ విల్‌జాక్స్ (53), సూర్యకుమార్ యాదవ్ (35) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఆఖర్లో కార్బిన్ బాష్ (27) కూడా రాణించడంతో ముంబై ఎనిమిది వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారంఇక లక్ష్య ఛేదనలో టైటాన్స్‌కు పదే పదే వర్షం ఆటంకం కలిగించింది. అయితే, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (43), వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ (30), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (28) రాణించారు. అయితే, ఆఖర్లో వర్షం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 19 ఓవర్లలో గుజరాత్ లక్ష్యాన్ని 147గా నిర్ణయించారు.ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో అనేక నాటకీయ పరిణామాల నడుమ గుజరాత్ 19 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 147 పరుగులు చేసి జయభేరి మోగించింది. చివరి ఓవర్లో ముంబై పేసర్ దీపక్ చహర్ బౌలింగ్‌లో (4,1, 6, N1, 1, W, 1) తెవాటియా కొట్టిన ఫోర్, కోయెట్జి బాదిన సిక్సర్ గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాయి.ఇక ఈ సీజన్లో ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న గుజరాత్‌కు ఇది ఎనిమిదో విజయం. ఫలితంగా గిల్ సేన ఖాతాలో ఇప్పుడు 16 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేటు (0.793) పరంగానూ మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్Rain delays, wickets falling, and nerves running high 📈...@gujarat_titans edge past everything to seal a thrilling win over #MI that had fans on the edge of their seats! 🥳Scorecard ▶ https://t.co/DdKG6Zn78k #TATAIPL | #MIvGT pic.twitter.com/NLYj3ZlI3w— IndianPremierLeague (@IPL) May 6, 2025

తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
సాక్షి, అనంతపురం: అనంతపురం ఎస్పీ జగదీష్ వివాదం చిక్కుకున్నారు. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులను అందజేసేందుకు ఎస్పీ జగదీష్‌ను కలిసేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించినప్పటికీ ఆయన జాప్యం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈనెల ఎనిమిదో తేదీన తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తాడిపత్రికి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్తేందుకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎస్పీ జగదీష్‌కు ఇచ్చేందుకు పెద్దారెడ్డి అపాయింమెంట్ తీసుకున్నారు. కానీ, పెద్దారెడ్డి మాత్రం ఎస్పీ అపాయింట్మెంట్కు అనుమతి ఇవ్వలేదు. గత మూడు రోజులుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఎస్పీ జగదీష్ జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో డీఐజీ, ఎస్పీలకు వాట్సాప్ ద్వారా పెద్దారెడ్డి సమాచారం అందించారు. ఈనెల 8వ తేదీన తాడిపత్రి వెళ్తున్నట్లు స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించాలని కోరారు. ఇక, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత నెలకునే అవకాశం ఉంది.ఇదిలా ఉండగా.. గత సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఘర్షణల కారణంగా పెద్దారెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డిలు తాడిపత్రికి వెళ్లకూడదని నిబంధన విధించారు. అయితే, ఎన్నికల కౌంటింగ్ అనంతరం ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి వెళ్లారు. ఈ క్రమంలోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి పట్టణానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. తాడిపత్రికి వెళ్లడానికి ఇటీవల న్యాయస్థానం అనుమతించింది. ఆయనకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించింది.మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఎలాగైనా పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనీయకూడదన్న ఉద్దేశంతో దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలంలో జేసీ అనుచరులు టిప్పర్లతో నాపరాళ్ల వ్యర్థాలను కుప్పలుగా వదిలారు. రాళ్లదాడి చేసేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన అనుచరులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని పట్టణంతో తీవ్ర చర్చ జరుగుతోంది.

భారత సైన్యానికి అండగా ఉందాం.. జైహింద్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పాకిస్తాన్‌పై భారత్ దాడులు ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని ప్రశంసించారు.ఆపరేషన్ సిందూర్‌పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘పహల్గాంలో ఉగ్ర దాడి ఘటనకు ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాయి. మన సైన్యం సరైన నిర్ణయం తీసుకుంది. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తాం. జైహింద్’ అని పోస్టు చేశారు. The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025

మిస్ వరల్డ్ పోటీలు.. ఉచితంగానే ఇక్కడ ఎంట్రీ పాసులు
హైదరాబాద్ వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీలను మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. మిస్ వరల్డ్ అవ్వాలనే కోరికతో జాతీయ స్థాయిలోనే ఏటా పదిలక్షలకు పైగా అమ్మాయిలు దరఖాస్తు చేసుకుంటారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా 150కంటే ఎక్కువ దేశాలే ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. ఇలా ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పోటీలు ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతుండటంతో ప్రత్యక్షంగా చూడాలని చాలామందిలో ఆసక్తి పెరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కాంప్లిమెంటరీ ఎంట్రీ పాసులను అందించనున్నట్టు తెలంగాణ పర్యాటక శాఖ(Telangana Tourism) పేర్కొంది. అందాల పోటీలను చూడాలని ఆసక్తి ఉన్నవారు టూరిజం శాఖ అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి ఒక మెయిల్ పంపుతామని వారు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://tourism.telangana.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. అందుకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, బుక్‌మైషో ద్వారా డబ్బుల చెల్లించి ఎంట్రీ పాసులు కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఆపరేషన్ సిందూర్.. స్పందించిన నెల్లూరు మధుసూదన్ కుటుంబ సభ్యులు
సాక్షి, నెల్లూరు: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యల నేపథ్యంలో పహల్గాం బాధిత మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి అని వ్యాఖ్యానించారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలని అన్నారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ..‘ఎన్ని యుద్దాలు చేసినా.. నా కొడుకును తీసుకురాలేరు. నా కడుపు కోత ఏ తల్లి పడకుండా ఉగ్రవాదులను అంతం చేయాలి. నా కొడుకు అమాయకుడు, మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలి అని అన్నారు.మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దాడులు చేయడం మా కుటుంబానికి ఊరట కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నని కోల్పోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మధుసూదన్ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ..‘ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత్ మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి. అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న వారిని గట్టిగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు.

KarreGutta: కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్.. 22 మంది మావోల మృతి
సాక్షి, ములుగు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. బుధవారం భద్రతా బలగాలు జరిపిన భారీ ఎన్ కౌంటర్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోల మృతిపై బస్తర్ ఐజీ,సీఆర్పీఎఫ్ఐసీ ధృవీకరించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు,పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సివిల్స్‌లో ఇల్లాలి అపూర్వ విజయం..! వైకల్యాన్ని జయించి..
ఇరవైలలో సివిల్స్‌కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిశా మాత్రం 35వ యేట ప్రిపరేషన్ మొదలు పెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిశా ఏడవ ప్రయత్నంలో, 40 సంవత్సరాల వయసులో సివిల్స్‌లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేసేది నిసా ఉన్నిరాజన్. నందన (11), తన్వీ(7) ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్‌కు సిద్ధం అవుతున్నప్పుడు... ‘ఈ వయసులో కష్టం’ ‘ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్‌లో సక్సెస్ కావడం కష్టం’... ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు.వినికిడి సమస్య వల్ల సివిల్స్ ప్రిపరేషన్లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్‌కు సంబంధించిన ఆడియోలు వినడం కష్టం అయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైమ్ కేటాయించుకునేది. ‘వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్‌కు ఎలా ప్రిపేరవుతావు!’లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది.ఆమె కష్టం వృథా పోలేదు. నలభై ఏళ్ల వయసులో యూపీఎస్సీ–2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40 శాతం వినికిడి లోపం ఉన్న నిశా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది.కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిశా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని సివిల్స్‌లో విజయం సాధించాడు. ‘మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు’ అంటుంది నిశా. (చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..)
గుడ్ ఫార్మర్ స్టాన్లీ..!
పవన్ కల్యాణ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
మేకను బలి ఇచ్చిన అభిమానులపై కేసు
వాళ్లకు డబ్బులు ఇచ్చానో లేదో మీకెందుకు?
మెగా గుమ్మడి!
ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
RCB vs CSK: స్టేడియంలో వీఐపీ కుటుంబాల ఘర్షణ
ప్రసాదంలో పాము పిల్ల
మరాఠా ధీశాలి రాణి 'అహల్యా బాయి' జీవితంపై సినిమా
తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
గుడ్ ఫార్మర్ స్టాన్లీ..!
పవన్ కల్యాణ్‌పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు
మేకను బలి ఇచ్చిన అభిమానులపై కేసు
వాళ్లకు డబ్బులు ఇచ్చానో లేదో మీకెందుకు?
మెగా గుమ్మడి!
ఆపరేషన్ సిందూర్.. స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత?
RCB vs CSK: స్టేడియంలో వీఐపీ కుటుంబాల ఘర్షణ
ప్రసాదంలో పాము పిల్ల
మరాఠా ధీశాలి రాణి 'అహల్యా బాయి' జీవితంపై సినిమా
తాడిపత్రిలో టెన్షన్.. ఎస్పీ జగదీష్ తీరుపై చర్చ
సినిమా

ఆ డ్రామాలు నాకు నచ్చవు: కేతికా శర్మ
‘‘కెరీర్ పరంగా హ్యాపీగా ఉన్నాను. హిట్, ఫ్లాప్స్ మన చేతిలో ఉండవు. ఓ నటిగా పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంటుంది. ఇండస్ట్రీలో కొనసాగడం లక్‌గా భావిస్తున్నా’’ అన్నారు కేతికా శర్మ. శ్రీవిష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘సింగిల్’. ఈ చిత్రంలో కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా కేతికా శర్మ మాట్లాడుతూ– ‘‘సింగిల్’ సినిమాలో ఆడీ కంపెనీలో పని చేసే పూర్వ అనే అమ్మాయిపాత్ర చేశాను.పూర్వ స్వతంత్ర భావాలున్న అమ్మాయి. ఈ మూవీలోని లవ్‌స్టోరీ వినోదాత్మకంగా, ఆసక్తికరంగా ఉంటుంది. అల్లు అరవింద్‌గారి సమర్పణలో గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరినందుకు హ్యాపీగా ఉంది. కామెడీ చేయడం చాలా కష్టం. అందుకే ఈ సినిమా ఇంట్రవెల్ సీక్వెన్స్ చాలా సవాల్‌గా అనిపించింది. ఇక ‘రాబిన్ హుడ్’ సినిమాలో నేను చేసిన ‘అదిదా సర్ప్రైజ్’లాంటి డ్యాన్స్ మూమెంట్స్ ఈ మూవీలో లేవు.సెట్స్‌లో దర్శకులు ఏదీ చెబితే అది చేస్తాను. అలా ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ చేశాను. ఈ సాంగ్‌లోని కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌పై భిన్నా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భవిష్యత్‌లో అలాంటి మూమెంట్స్‌పై జాగ్రత్తలు తీసుకుంటా. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు. మీరు లైఫ్‌లో సింగిల్‌గా ఉన్నారా? అన్న ప్రశ్నకు... ‘‘ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నాను. రిలేషన్షిప్ అంటూ లేనిపోని డ్రామాలు నాకు నచ్చవు. నిజాయితీగా ఉండాలి. రైట్ పర్సన్ దొరికితే... ప్రేమిస్తాను’’ అని చె΄్పారు కేతికా శర్మ.

పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!
పవన్ కల్యాణ్.. 'హరిహర వీరమల్లు' షూటింగ్ ఎట్టకేలకు ముగించారు. అప్పుడెప్పుడో 2020 జనవరిలో మొదలైతే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తాజాగా మంగళవారంతో తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. దీంతో ఇప్పుడు రిలీజ్ డేట్ పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ విడుదల ఎప్పుడు ఉండొచ్చు?(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' షూటింగ్ 2020 జనవరిలో మొదలైంది. తర్వాత కొన్నిరోజులకే లాక్ డౌన్ రావడం, తర్వాత ఎన్నికలు, పవన్ ఎమ్మెల్యేగా గెలవడం.. ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ అలా అలా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు మమా అనిపించారు.లెక్క ప్రకారం ఈ మే 9న థియేటర్లలోకి సినిమా వస్తుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు రావట్లేదని క్లారిటీ వచ్చేసింది. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దగ్గర మే 30 తేదీ వినిపించింది. కానీ ఈ తేదీకి కూడా రావడం కష్టమేనేమో అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఓటీటీ హక్కుల్ని దక్కించుకున్న అమెజాన్ సంస్థ.. మే 30 తేదీపై పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జూన్ రెండో వారం అని అంటోంది.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!)ప్రస్తుతానికైతే విడుదల తేదీపై చర్చలు జరుగుతున్నాయి. ఏదనేది ఓటీటీ సంస్థ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు.. ఇలా ఓటీటీ సంస్థ చెప్పినదానిబట్టి రిలీజ్ చేస్తుండటమే దీనికి కారణం అని చెప్పొచ్చు.మరోవైపు పవన్ సినిమా వచ్చే దానిబట్టి విజయ్ 'కింగ్డమ్' రిలీజ్ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయాలని ఫిక్సయ్యారు. కానీ పవన్ వస్తే మాత్రం తప్పుకోవడం గ్యారంటీ. మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: మంచం పట్టిన 'బలగం' నటుడు.. ప్రస్తుతం దీనస్థితిలో)

సితార ఎక్కడా తగ్గట్లే.. చీరలో స్టైలిష్ గా శ్రీలీల
చిన్న వయసులోనే గ్లామరస్ గా సితారచీరలో శ్రీలీల బ్యాక్ లెస్ పోజులుబేబీ బంప్ తో ఈవెంట్ లో పాల్గొన్న కియారామేకప్ లేకుండా కనిపించిన నభా నటేశ్హాలీవుడ్ స్టైల్లో కనిపిస్తున్న ప్రియాంక చోప్రాహిట్ 3 శ్రీనిధి చీర స్టిల్స్.. చూస్తే మెల్ట్ అవ్వాల్సిందేడ్యాన్స్ తో ఎంటర్ టైన్ చేసిన మంచు లక్ష్మీ View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by sitara (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

ఎట్టకేలకు '100' కొట్టేసిన సూర్య
సూర్య లేటెస్ట్ మూవీ 'రెట్రో'. తెలుగులో రిలీజైన మొదటిరోజు నుంచే ఘోరమైన టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా పెద్దగా రావట్లేదు. మరోవైపు తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి టాక్, వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఎలాగోలా వంద మార్క్ దాటేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.గతేడాది సూర్య నటించిన కంగువ సినిమా రిలీజైంది. దీనిపై సూర్యతో పాటు అభిమానులు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డిజాస్టర్ అయింది. దీంతో 'రెట్రో'తో కమ్ బ్యాక్ గ్యారంటీ అనుకున్నారు. కానీ ఇది తమిళనాడు వరకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. తాజాగా ఐదు రోజుల తర్వాత రూ.104 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)ఎలాగైతేనేం సూర్య మూవీకి రూ.100 కోట్లు వచ్చేశాయి. ఈ విషయంలో అందరూ సంతోషంగా ఉన్నప్పటికీ తెలుగులోనూ హిట్ అయ్యింటే ఈ నంబర్స్ మరింత పెరిగేవి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరోవైపు నాని హిట్ 3 చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.101 కోట్ల గ్రాస్ వచ్చింది. ఈ రోజు పోస్టర్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ లెక్కన చూసుకుంటే సూర్య కంటే నానినే ముందున్నాడు.ప్రస్తుతం సూర్య.. తమిళ నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ దీపావళికి రిలీజ్ ఉండొచ్చని అంటున్నారు. దీని తర్వాత తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సూర్య సినిమా చేయబోతున్నాడు. అధికారికంగా ఇదివరకే ప్రకటించేశారు కూడా.(ఇదీ చదవండి: జీవితంలో ఇంకెప్పుడు దాని గురించి మాట్లాడను: సమంత)
న్యూస్ పాడ్‌కాస్ట్

పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..

దుష్ట పాకిస్తాన్ భరతం పట్టడానికి ముహూర్తం ఖరారు... ఈ వారాంతంలోపే భారీ ఆపరేషన్ జరిగే అవకాశం... బుధవారం రాష్ట్రాల్లో మాక్‌డ్రిల్స్

యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో చంద్రబాబు సర్కారు అడ్డగోలు ఒప్పందం... అత్యధిక ధరకు 400 మెగావాట్ల విద్యుత్ కొనడానికి అంగీకారం

అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో

ప్రతి ఇంటినీ చంద్రబాబు మోసం చేశారు: వైఎస్ జగన్ ఆగ్రహం

దేశవ్యాప్తంగా జనగణనతో పాటే కులగణన: కేంద్రం కీలక నిర్ణయం

ఏపీలో అంతులేని అవినీతి, అంతా అరాచకమే: వైఎస్ జగన్

రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ఏపీలో కేంద్ర సంస్థలకైతే కోట్లు.. ఉర్సా సంస్థకైతే ఊరకే!
క్రీడలు

ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్ సింధూర్తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా

IND vs SA: ఫైనల్ బెర్త్ లక్ష్యంగా...
కొలంబో: ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నీలో ఫైనల్ బెర్త్ లక్ష్యంగా భారత మహిళల జట్టు నేడు దక్షిణాఫ్రికాతో పోరుకు సిద్ధమైంది. వరుస విజయాలతో జోరుమీదున్న భారత్‌కు గత మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక చెక్ పెట్టింది. దీంతో వరుసగా 8 విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ పరాభవం నుంచి వెంటనే బయట పడాలని, ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో హర్మన్‌ప్రీత్ బృందం బరిలోకి దిగుతోంది. నిజానికి భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్‌కు అర్హత సాధిస్తుందనే క్లిష్టమైన సమీకరణమైతే లేదు. అమ్మాయిల బృందం రెండు విజయాలు, నెట్‌రన్‌రేట్ పరంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయినాసరే తుదిపోరుకు ముందే మళ్లీ గెలుపుబాట పట్టాలని భారత మహిళల జట్టు భావిస్తోంది. మరోవైపు ఇంతవరకు అసలు బోణీనే కొట్టలేకపోయిన సఫారీ మహిళల జట్టు లంక గడ్డపై పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫేవరెట్‌గా... ఈ సిరీస్‌లో గత పరాజయం మినహా భారత జట్టు అన్ని రంగాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఓపెనింగ్‌లో ప్రతీక రావల్ సూపర్‌ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు అర్ధసెంచరీలు సహా 163 పరుగులతో సత్తా చాటుకుంది. స్మృతి మంధాన తన బ్యాటింగ్ పవర్‌ను చూపెట్టాల్సి ఉంది. హర్లీన్ డియోల్, కెపె్టన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మలు రాణిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో స్నేహ్ రాణా ఈ సిరీస్‌లో అద్భుతంగా బౌలింగ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణితో పాటు హైదరాబాద్ బౌలర్ అరుంధతి రెడ్డి, కాశ్వీ గౌతమ్‌లు కూడా నిలకడగా రాణిస్తుండటంతో ఈ మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఒత్తిడిలో దక్షిణాఫ్రికా ఈ టోరీ్నలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన సఫారీ అమ్మాయిల జట్టు గెలుపు కోసం పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాటర్ల నిలకడలేమి జట్టుకు ప్రతికూలంగా మారింది. కెపె్టన్ లారా వోల్వర్ట్, తజ్మిన్ బ్రిట్స్ భారత్‌తో గత మ్యాచ్‌లో బాగా ఆడినప్పటికీ లంకతో చేతులెత్తేశారు. గుడాల్, మెసో, సునే లుస్ సమష్టిగా రాణిస్తేనే పటిష్టమైన భారత్‌కు సవాల్ విసురుతుంది. లేదంటే ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్’ ఓటమి తప్పదు! ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనక దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతే ఆఖరి పోరుతో సంబంధం లేకుండా ఆతిథ్య లంక, భారత జట్లు అమీతుమీకి అర్హత సంపాదిస్తాయి. తుదిజట్లు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్, ప్రతీక రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమీమా, రిచా ఘోష్, దీప్తిశర్మ, కాశ్వీ గౌతమ్, అరుంధతీ, స్నేహ్ రాణా, శ్రీ చరణి. దక్షిణాఫ్రికా: లారా వోల్వర్ట్, తజ్మిన్ బ్రిట్స్, లారా గుడాల్, కరబొ మెసో, సునే లూస్, క్లొ ట్రయాన్, డెర్క్సన్, నదిన్ డిక్లెర్క్, మసబత క్లాస్, ఎమ్‌లాబా, అయ»ొంగ కాకా.

KKR vs CSK: నిలవాలంటే గెలవాలి
కోల్‌కతా: డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ భవితవ్యం ఈ మ్యాచ్‌లో తేలనుంది. ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కోల్‌కతా ఉంటుందా లేదంటే లీగ్‌తోనే సరిపెట్టుకుంటుందా అనే విషయం నేడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంది. మరోవైపు ధోని బృందం ఇది వరకే లీగ్ నుంచి ని్రష్కమించింది. అయితే ఐపీఎల్ కెరీర్ చరమాంకంలో ఉన్న ధోని ఆటతీరును, లోయర్‌ఆర్డర్‌లో క్రీజులోకి వస్తున్న తీరును పరిశీలిస్తే ఈ సీజనే చివరిదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదే జరిగితే... భారత విఖ్యాత స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌లో తాను ఆడే ఆఖరి పోరును ధోని చిరస్మరణీయం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చెన్నైకి నామమాత్రమైనా... నైట్‌రైడర్స్‌కు కీలకమైన ఈ పోరు ఆసక్తికరంగా జరగడం ఖాయం. బ్యాటింగే కోల్‌కతా బలం కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు బ్యాటింగే బలం. ఇప్పటికే ఈ సీజన్లో నాలుగుసార్లు 200 పైచిలుకు పరుగుల్ని సాధించింది. లక్నోతో ఎదురైనా 239 పరుగుల భారీ లక్ష్యఛేదనలోనూ నైట్‌రైడర్స్ 4 పరుగుల తేడాతోనే ఓడింది. దీన్నిబట్టి చెప్పొచ్చు కోల్‌కతా బ్యాటర్ల బలమెంతో! తొలిదశను పక్కన బెడితే గత రెండు మ్యాచ్‌ల్లో చేసిన 200 ప్లస్ స్కోరు కేకేఆర్ ప్లేఆఫ్స్‌కు ఎంత కష్టపడుతుందో సూచిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్లతో జరిగిన ఈ మ్యాచ్‌ల్లో ఏ ఒక్కరి విధ్వంసంతోనూ, ఒకరిద్దరి మెరుపు ఇన్నింగ్స్‌లతోనూ అంతపెద్ద స్కోరు సాధ్యమవలేదు. బ్యాటింగ్ ఆర్డర్ అంతా మూకుమ్మడిగా రాణించింది. గుర్బాజ్, కెపె్టన్ అజింక్య రహానే, అంగ్క్రిష్ రఘువంశీ, రసెల్ అందరూ బ్యాట్లకు పని చెప్పారు. ఇక అంతకుముందు ఢిల్లీతో జరిగిన పోరులో ఏ ఒక్కరు కూడా అర్ధసెంచరీ సాధించలేదు. అయినాసరే టాపార్డర్ 20 ప్లస్ స్కోర్లు, రింకూ సింగ్ (36), టాప్‌స్కోరర్ రఘువంశీ (44) చేసిన పరుగులతోనే కోల్‌కతా సులువుగా 200 పైచిలుకు స్కోరును సాధించింది. బౌలింగ్‌లోనూ వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్‌ల స్పిన్ మ్యాజిక్ ప్రత్యర్థులను చుట్టేస్తుంది. వైభవ్ అరోరా, హర్షిత్ రాణాలు తమ పేస్ బౌలింగ్‌లో నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి సమష్టి ప్రదర్శన సొంతగడ్డపై ఈ మ్యాచ్‌లో కనబరిస్తే కోల్‌కతాకు ఎదురే ఉండదు. చెన్నైకిది చేదు సీజన్ ఐపీఎల్‌కే వన్నెతెచ్చిన టీమ్‌లలో చెన్నై ముందు వరుసలో ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన 17 సీజన్లలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే). 5 టైటిల్స్‌తో ముంబై ఇండియన్స్‌తో సమానంగా ఉన్నప్పటికీ... పదిసార్లు ఫైనల్ చేరిన (5సార్లు రన్నరప్) ఏకైక జట్టు సీఎస్కే. లీగ్ చరిత్రలో ఇంతటి ఘనచరిత్ర కలిగిన ధోని జట్టుకు ఈ సీజన్ అత్యంత చెత్తగా సాగుతోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లాడితే రెండంటే రెండే మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఏకంగా 9 పరాజయాలతో లీగ్ నుంచి ని్రష్కమించిన సూపర్‌కింగ్స్‌కు మిగిలిందల్లా మిగతా మ్యాచ్‌లు ఆడి గెలవడమే! జోరు మీదున్న కోల్‌కతాను ఆపుతుందా... మరో భంగపాటుతో అట్టడునే నిలుస్తుందో చూడాలంటే చీకటి పడేదాకా ఆగాల్సిందే!

MI vs GT: ముంబై జోరుకు బ్రేక్
ముంబై: ఐపీఎల్–2025లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్రకు కాస్త విరామం... వరుసగా ఆరు విజయాలతో కొనసాగించిన జోరుకు గుజరాత్ టైటాన్స్ బ్రేక్ వేసింది. మంగళవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో గుజరాత్ 3 వికెట్ల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) ముంబైపై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. విల్ జాక్స్ (35 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సూర్యకుమార్ యాదవ్ (24 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 43 బంతుల్లో 71 పరుగులు జోడించారు. చక్కటి బౌలింగ్‌తో ముంబైని తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో టైటాన్స్ సఫలమైంది. అనంతరం గుజరాత్ 19 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసి గెలిచింది. శుబ్‌మన్ గిల్ (46 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), జోస్ బట్లర్ (27 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్), రూథర్‌ఫర్డ్ (15 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఛేదనలో 14 ఓవర్ల తర్వాత 107/2తో గుజరాత్ మెరుగైన స్థితిలో నిలిచింది. చేతిలో 8 వికెట్లు ఉన్న జట్టు మరో 36 బంతుల్లో 49 పరుగులే చేయాలి. గుజరాత్ విజయం లాంఛనమే అనిపించింది. ఈ దశలో వానతో చాలా సేపు ఆట ఆగిపోయింది. అంతా చక్కబడి మ్యాచ్ మొదలైన తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుమ్రా, బౌల్ట్ చెలరేగిపోవడంతో గుజరాత్ బ్యాటింగ్ తడబాటుకు లోనైంది. తర్వాతి 4 ఓవర్లలో 25 పరుగులు చేసిన జట్టు 16 బంతుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. 2 ఓవర్లలో 24 పరుగులు చేయాల్సిన ఉన్న సమయంలో మళ్లీ భారీ వర్షంతో ఆట ఆగిపోయింది. దాంతో ఆటను ఒక ఓవర్ కుదించి డక్‌వర్త్–లూయిస్ ప్రకారం గుజరాత్ లక్ష్యాన్ని 19 ఓవర్లలో 147గా నిర్దేశించారు. దాంతో చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరమయ్యాయి. చహర్ వేసిన ఈ ఓవర్లో టైటాన్స్ 15 పరుగులు చేసి విజయాన్నందుకుంది. స్కోరు వివరాలు: ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సుదర్శన్ (బి) సిరాజ్ 2; రోహిత్ (సి) ప్రసిధ్ (బి) అర్షద్ 7; జాక్స్ (సి) సుదర్శన్ (బి) రషీద్ 53; సూర్యకుమార్ (సి) షారుఖ్ (బి) సాయికిషోర్ 35; తిలక్ (సి) గిల్ (బి) కొయెట్జీ 7; పాండ్యా (సి) గిల్ (బి) సాయికిషోర్ 1; నమన్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 7; బాష్ (రనౌట్) 27; చహర్ (నాటౌట్) 8; కరణ్ శర్మ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–2, 2–26, 3–97, 4–103, 5–106, 6–113, 7–123, 8–150. బౌలింగ్: సిరాజ్ 3–0–29–1, అర్షద్ 3–0–18–1, ప్రసిధ్ 4–0–37–1, సాయికిషోర్ 4–0–34–2, రషీద్ ఖాన్ 4–0–21–1, కొయెట్జీ 2–0–10–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 5; గిల్ (బి) బుమ్రా 43; బట్లర్ (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; రూథర్‌ఫర్డ్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 28; షారుఖ్ (బి) బుమ్రా 6; తెవాటియా (నాటౌట్) 11; రషీద్ ఖాన్ (ఎల్బీ) (బి) అశ్వని 2; కొయెట్జీ (సి) నమన్ (బి) చహర్ 12; అర్షద్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19 ఓవర్లలో 7 వికెట్లకు) 147. వికెట్ల పతనం: 1–6, 2–78, 3–113, 4–115, 5–123, 6–126, 7–146. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–1, బౌల్ట్ 4–0–22–2, బుమ్రా 4–0–19–2, హార్దిక్ పాండ్యా 1–0–18–0, కరణ్ శర్మ 2–0–13–0, అశ్వని కుమార్ 4–0–28–2, జాక్స్ 1–0–15–0.
బిజినెస్

లాభాల్లోంచి నష్టాల్లోకి..
ముంబై: భారత్ – పాకిస్తాన్ల మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా మంగళవారం సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 80,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 24,380 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు సానుకూలంగా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, యూఎస్–చైనా వాణిజ్య చర్చల నేపథ్యంలో పరిమిత శ్రేణిలో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 80,481 వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు పతనమై 24,331 వద్ద కనిష్టాన్ని తాకాయి. ఫెడ్ వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చనే అంచనాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ⇒ ఆటో, టెక్ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. బీఎస్ఈలో రంగాల వారీగా సూచీల్లో రియల్టీ 3.5%, విద్యుత్, సర్వీసెస్ 2.5%, యుటిలిటీ, ఇండస్ట్రీయల్, క్యాపిటల్ గూడ్స్ 2%, కన్జూమర్ డ్యూరబుల్స్ ఒకటిన్నర శాతం నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు 2%కి పైగా క్షీణించాయి.

పసిడి.. మళ్లీ లక్షకు చేరువలో
న్యూఢిల్లీ: పసిడి మరోసారి ర్యాలీ చేసింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారం 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 లాభపడి రూ.99,750 వద్ద ముగిసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా టారిఫ్‌లపై చేసిన ప్రకటన, భౌగోళిక ఉద్రిక్తతలతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. జ్యుయలర్ల నుంచి కొనుగోళ్లు పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం రూ.2,400 పెరిగి రూ.99,300 వద్ద స్థిరపడింది. ‘‘ట్రంప్ ఫార్మాస్యూటికల్స్‌పై, అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం టారిఫ్‌లను ప్రతిపాదించారు. దీంతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి, అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో సురక్షిత సాధనమైన బంగారానికి తిరిగి డిమాండ్ ఏర్పడింది’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా తెలిపారు. బుధవారం యూఎస్ ఫెడ్ పాలసీ సమీక్ష వివరాల కోసం మార్కెట్ భాగస్వాములు ఎదురుచూస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఇక ఢిల్లీలో వెండి ధర కిలోకి రూ.1,800 పెరిగి రూ.98,500కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో 3,400 డాలర్లపైకి అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ర్యాలీ కొనసాగుతోంది. ఔన్స్‌కు 100 డాలర్ల వరకు పెరిగి 3,422 డాలర్ల స్థాయికి చేరింది. అమెరికా డాలర్ బలహీనత సైతం బంగారం ధరల పెరుగుదలకు దారితీసినట్టు హెచ్డీఎఫ్సీ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.

'2032 నాటికి దేశంలో 12 కోట్ల ఈవీలు'
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ మరియు కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ విడుదల చేసిన ఒక నివేదికలో.. 2032 నాటికి ఇండియాలో 12.3 కోట్ల వాహనాలు ఉంటాయని వెల్లడించింది.దేశం అభివృద్ధి వైపు సాగుతున్న సమయంలో.. 2070 నాటికి సున్నా ఉద్గారాలను సాధించడమే లక్ష్యంగా వాహన కొనుగోలుదారులు, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే 2030 నాటికి భారతీయ రోడ్లపై ఉన్న వాహనాల్లో 30 శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలి. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.ఎలక్ట్రిక్ వాహన వినియోగం లేదా కొనుగోలును పెంచడానికి ఫేమ్-2 వంటి స్కీమ్స్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఫోర్ వీలర్స్ డిమాండును ప్రోత్సహించడానికి మాత్రమే కాకుండా.. పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల పెంపుకు కూడా దోహదపడుతుంది.ఇదీ చదవండి: చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!2030 నాటికి ఎలక్ట్రిక్ టూ వీలర్స్, త్రీ వీలర్లు 80 శాతానికి, ఫోర్ వీలర్స్ 30 శాతం, కమర్షియల్ కార్లు 70 శాతం, ఎలక్ట్రిక్ బస్సులు 40 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన మౌలిక సదుపాయాలు పెరిగితే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం దేశంలో 76000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 2032 నాటికి 21 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని సమాచారం.

చదరపు అడుగు రూ.2.75 లక్షలు: రియల్టీలోనే సరికొత్త రికార్డ్!
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ 'ఉదయ్ కోటక్'.. ముంబైలోని వర్లి సీ-ఫేస్‌లో ఒక నివాస భవనాన్ని రూ. 400 కోట్లకంటే ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేశారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.2.75 లక్షలు అని సమాచారం. దీంతో ఇది దేశీయ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే అత్యధిక ధరగా రికార్డ్ క్రియేట్ చేసింది.కోటక్ ఫ్యామిలీ ఇప్పటికే ఈ భవనంలోని 24 ఫ్లాట్లలో 13 ఫ్లాట్లను రిజిస్టర్ చేసుకుంది. తాజాగా మరో 8 ఫ్లాట్లను రూ. 131.55 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఒక్కో ఫ్లాట్ 444 నుంచి 1004 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. వీటి ధర రూ. 12 కోట్ల నుంచి రూ. 27.59 కోట్లు. మిగిలిన 3 ఫ్లాట్లకు ఎంత చెల్లించారో వెల్లడించకపోయినా, మొత్తం భవనం విలువ రూ. 400 కోట్లను దాటినట్లు తెలుస్తోంది. ఈ భవనంలోని 173 చదరపు అడుగుల ప్లాట్ ధర రూ. 4.7 కోట్లు కావడం గమనార్హం. అయితే ఇందులోనే 1396 చ.అ ఫ్లాట్ ధర రూ. 38.24 కోట్లు. ఇది ముంబైలోని నాగరిక వర్లి ప్రాంతంలో అరేబియా సముద్రం.. ముంబై తీరప్రాంత రహదారికి అభిముఖంగా ఉంటుంది.కోటక్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ మొత్తం ప్లాట్లను ఒకటిగా చేసి మళ్ళీ రీడెవల్పెమెంట్ ఏమైనా చేస్తుందా?, లేక ఉన్నది ఉన్నట్లుగానే ఉంచుతుందా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన విషయాలను కోటక్ కుటుంబం అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: ఇండియన్ రైల్వే డిజిటల్ క్లాక్ డిజైన్ పోటీ: రూ.5 లక్షల ప్రైజ్
ఫ్యామిలీ

మంచి పుచ్చకాయను గుర్తించండి ఇలా!
వేసవిలో లభించే పుచ్చకాయలు అందరికీ ఇష్టం, అంతకంటే చల్లని నేస్తాల వంటివి అనొచ్చు. వాటి సహజమైన తీపి, అధిక నీటి శాతం వాటి రిఫ్రెషింగ్ రుచితో పాటు కలర్‌ఫుల్ రూపం కూడా సమ్మర్లో వాటిని తిరుగులేనివి పండుగా నిలబెట్టాయి. ఈ పుచ్చకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలూ అనేకం...పుచ్చకాయ కేవలం అలసిపోయినప్పుడు రిఫ్రెష్ చేసే పండు మాత్రమే కాదు, అవసరమైన పోషకాలతో కూడా నిండి ఉంటుంది. దాదాపు 9092% నీటితో కూడిన పుచ్చకాయ, వేసవి వేడి సమయంలో హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన ఎంపిక. ఒక 100 గ్రాముల పుచ్చకాయ ద్వారా దాదాపు 16 కేలరీలు లభిస్తాయి తక్కువ కేలరీల పండుగా, బరువును నియంత్రించుకునే వారికి పుచ్చకాయ అనుకూలంగా ఉంటుంది. దీనిలో సి, ఎ, బి6 విటమిన్లు అలాగే పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడటం వలన ఈ పండు అధిక రక్తపోటు ఉన్నవారికి మరింత ప్రయోజనకరం. దీని విటమిన్ సి కంటెంట్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేసి వివిధ వ్యాధులకు దారితీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. పుచ్చకాయ జీర్ణక్రియకు సహాయపడుతుంది, దానిలోని ఇనుము శాతం కారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. పండులోని ఎరుపు భాగాన్ని తరచుగా అత్యంత రుచికరంగా పరిగణిస్తారు, అయితే చర్మం దగ్గర ఉన్న లేత ఆకుపచ్చ రంగులో ఉండే భాగం సైతం ఎక్కువ పోషక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యపరంగా పుచ్చకాయ వల్ల ఎన్నో లాభాలు ఉన్నప్పటికీ, దానిని కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. వేసవి నెలల్లో, రోడ్డు పక్కన ఎర్రగా, కోసిన పుచ్చకాయ రూపం ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో చాలా కల్తీ పుచ్చకాయలు ఉన్నాయి, మరి తాజా, ఆరోగ్యకరమైన పుచ్చకాయను కొనుగోలు చేస్తున్నారని తెలుసుకోవడం ఎలా? నాణ్యత లేని పండ్ల ద్వారా మోసపోకుండా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా ఉండడం ఎలా? ఇప్పుడు చూద్దాం..కల్తీ పుచ్చకాయ అంటే హానికరమైన రసాయనాలు, రంగులు లేదా ఆర్టిషియల్ రిపైనింగ్ ఏజెంట్లను ఉపయోగించి దాని రూపాన్ని లేదా బరువును పెంచడానికి తారుమారు చేసిన పండు. సాధారణ కల్తీ పద్ధతుల్లో దాని గుజ్జును ఎర్రగా కనిపించేలా చేయడానికి ఆర్టిషియల్ కలర్‌ను ఇంజెక్ట్ చేయడం, బరువు పెంచడానికి నీటిని జోడించడం లేదా తాజాదనాన్ని కాపాడటానికి రసాయనాలను ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. ఈ పద్ధతులు మన ఆరోగ్యానికి హానికరం, కాబట్టి విశ్వసనీయ విక్రేతల నుంచి మాత్రమే పుచ్చకాయలను కొనుగోలు చేయడం సహజ పక్వత సంకేతాలను తనిఖీ చేయడం ముఖ్యంమంచి పుచ్చకాయను ఎలా గుర్తించాలి? పుచ్చకాయను కొనుగోలు చేసేటప్పుడు, రంగు ముఖ్యం. నిస్తేజమైన చర్మం ఉన్న దాని కంటే శక్తివంతమైన, తగిన రంగు కలిగిన పుచ్చకాయ మంచి ఎంపిక. పక్వానికి ముఖ్య సూచిక దానిని తట్టినప్పుడు వచ్చే శబ్దం బోలుగా ఉండే, తేలికపాటి శబ్దం పండు నీటితో నిండి ఉందని మంచిదని సూచిస్తుంది. అదనంగా, ఏవైనా మచ్చలు లేదా గాయాలు ఉన్నాయా అని పుచ్చకాయను తనిఖీ చేయాలి, ఎందుకంటే ఇవి నష్టం లేదా చెడిపోవడాన్ని సూచిస్తాయి. పుచ్చకాయ అడుగున పసుపు మచ్చల కోసం ఉండాలి. అలా మచ్చలు ఉంటే ఈ పుచ్చకాయను సరైన సమయంలో సహజంగా పండించారని అర్ధం. అయితే, లేత లేదా తెల్లటి మచ్చలు ఉంటే పండు పూర్తిగా పక్వానికి రాకముందే కోసినట్లు అర్ధం View this post on Instagram A post shared by Adithya Nataraj 🇮🇳 (@learnwithadithya) (చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!)

జపాన్‌లో శాకాహారమా..? సలాడ్లతో సరిపెట్టుకోవాల్సిన పనిలేదు..
అందమైన దేశంలో ఒకటిగా పేరుగాంచింది జపాన్. అక్కడ నగరాలన్నీ ప్రకృతి రమణీయతతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. తప్పక పర్యటించాల్సిన దేశమే అయినా..పర్యాటకులకు ఇబ్బంది కలిగించేది ఆహారం. అందులోనూ శాకాహారులే అయితే మరింత సమస్య. అక్కడ ఏది ఆర్డర్ చేసిన అందులో తప్పనిసరిగా ఏదో ఒక నాన్‌వెజ్ ఉంటుంది. తినాలంటేనే భయం భయంగా ఉంటుంది. అందుకే అక్కడ పర్యటించే టూరిస్ట్‌లు స్టోర్స్‌లో దొరికే సలాడ్లు వంటి ఇతర పదార్థాలపై ఆధారపడతారు. ఇక అలా ఇబ్బంది పడాల్సిన పనిలేదు అంటూ జపాన్‌లో కూడా శాకాహారం దొరుకుతుందని చెబుతోంది బాలీవుడ్ నటి బర్ఖాసింగ్. ఇంతకీ జపాన్‌లో ఎక్కడ శాకాహారం లభిస్తుందంటే..జపాన్‌లో ఒసాకా, క్యోటో, టోక్యో అంతట మనకు శాకాహార భోజనం లభిస్తుందట. ఇక్కడ అందించే వంటకాల్లో చేపలు లేదా మాంసాన్ని జోడించకుండా టమోటా ఆధారిత రెసిపీలు ఎక్కువగా దొరుకుతాయట. అక్కడ పూర్తి శాఖాహారం తోకూడిన వేగన్ మెనూ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందట. అందువల్ల ఎలాంటి సంకోచంల లేకుండా నచ్చిన వంటకాలన్నీ ఆస్వాదించొచ్చు అని చెబుతున్నారు నటి బర్ఖాసింగ్. చాక్లెట్ గ్యో ఐస్ క్రీం, సోబా నూడుల్స్ వంటి టేస్టీ టేస్టీ వంటకాల రుచి చూడొచ్చట. ఇక కోకో ఇచిబన్యా రెస్టారెంట్ కూరగాయలతో చేసిన కర్రీలకు ఫేమస్ అట. అక్కడ మనకు తెలియని కొంగొత్త కూరగాయల రుచులు మైమరిపిస్తాయని చెబుతోంది బర్ఖాసింగ్. అలాగే అక్కడ ఉండే చిన్న చిన్న స్టాల్స్ మెత్తటి చీజ్‌కేక్, కస్టర్డ్ నిండిన పాన్కేక్లకు పేరుగాంచినవని చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా, బాలీవుడ్ నటి, మోడల్ బర్ఖాసింగ్ పలు సినిమాలు, టీవీ షోల్లో నటించింది. అంతేగాదు వైవిధ్యభరితమైన నటనకు ప్రసిద్ధిగాంచిన నటి బర్ఖాసింగ్. View this post on Instagram A post shared by Barkha Singh (@barkhasingh0308) (చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

గడ్డకట్టిన మంచుపై పరుగు పందెం..! సత్తాచాటిన భాగ్యనగరవాసులు
ఆత్మవిశ్వాసం ఉండాలే గానీ అసాధ్యం అంటూ ఏదీ ఉండదు? అరుదైన సాహసాలు చేయాలనే తపన ఉండాలే గానీ..అద్భుతాలు సృష్టించవచ్చు.. ఘనమైన ప్రతిభను పొందవచ్చు.. అంటున్నారు హైదరాబాద్ నగరానికి చెందిన అడ్వెంచర్ టూరిస్టులు. నగరంలో సాహసికులు పెరుగుతున్న కొద్దీ వైవిధ్య భరిత సాహసాలు కూడా వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో నగరానికి చెందిన నలుగురు భిన్న రంగాలకు చెందిన ఔత్సాహికులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వతంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించిన పాంగోంగ్ ఫ్రోజెన్ లేక్‌లో హాఫ్ మారథాన్‌లో పాల్గొని హైదరాబాద్ నగరం నుంచి ఆ ఘనతను దక్కించుకున్నారు. లద్దాఖ్, ఫిబ్రవరి 24–25, 2025: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్‌గా ప్రసిద్ధి పొందిన పాంగోంగ్ ఫ్రోజెన్ సరస్సు మారథాన్ ఈ ఏడాది కూడా లద్దాఖ్‌లో ఘనంగా జరిగింది. ఇది కేవలం రన్నింగ్ ఈవెంట్ మాత్రమే కాకుండా, హిమాలయాల్లో వేగంగా కరుగుతున్న హిమనీనదాలపై మరియు వాతావరణ మార్పుల ప్రభావంపై చైతన్యాన్ని పెంచే ప్రయత్నం కూడా. రన్ విశేషాలివీ.. హిమాలయాల్లో కరుగుతున్న హిమనీనదాలు, తగ్గుతున్న మంచు సరస్సుల వల్ల భవిష్యత్తు మార్పులపై అవగాహన కల్పించటం కోసం లద్దాఖ్‌లోని పాంగోంగ్ సరస్సులో 4,273 మీటర్ల ఎత్తులో 2023లో మొదటిసారి ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ మారథాన్, గిన్నిస్ వరల్డ్ రికార్డులో ‘అత్యంత ఎత్తులో జరిగే మంచు సరస్సు మారథాన్’గా గుర్తింపు పొందింది. తాజా రన్లో అమెరికా, నేపాల్, కొరియా, ఆ్రస్టేలియా, భారత్‌కు చెందిన అంతర్జాతీయ రన్నర్లు పాల్గొన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లు జరగకపోవచ్చని హెచ్చరిస్తూ, పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ నిర్వహించే ఈ మారథాన్‌ను ‘ది లాస్ట్ రన్’ అని కూడా పిలుస్తారు. నగరానికి చెందిన ప్రవీణ్ గోయెల్, నవీన్ సింకా, బిక్కినా వెంకట రాజేష్ రతన్ నలుగురూ వేర్వేరు రంగాలకు చెందిన వారు. అయితే వీరంతా.. సమవయస్కులు కూడా కాదు. అయితేనేం.. అభిరుచి వారిని కలిపింది. ఆత్మవిశ్వాసం వారిని విజయ శిఖరాన నిలిపింది. ‘ఇంట్లో వాళ్లు వద్దనే చెప్పారు. కానీ.. అప్పటికే సైక్లింగ్, రన్నింగ్ వంటివి అలవాటయ్యాయి. అందుకే దీన్ని ప్రయత్నించడం భయం అనిపించలేదు’ అని చెప్పారు వ్యాపారి ప్రవీణ్గోయెల్. ‘16 డిగ్రీల చలిని పట్టించుకోకుండా కదులుతూ ఉండటానికి చేసిన మానసిక ప్రయత్నం..ఫలించింది. భయాన్ని అధిగమించడానికి సహాయపడింది’ అని భారత నావికాదళంలో అధికారిగా పనిచేసే రతన్ (29) చెప్పారు. ‘గత 15 సంవత్సరాలుగా మారథాన్ రన్నర్, బ్యాడ్మింటన్ ఆటగాడిగా అనుభవం ఉంది. అయినప్పటికీ ఇది పూర్తిగా ప్రత్యేకం అంటున్నారు ఐటీ నిపుణులు నవీన్ సింకా (45). పరుగులో మా ముఖాలు మొద్దుబారిపోయాయి. మా దగ్గర ఉన్న నీరు కూడా పరుగు మధ్యలో గడ్డకట్టుకుపోయింది’ అంటూ గుర్తు చేసుకున్నారు. ‘గ్లోబల్ వార్నింగ్ కారణంగా, పాంగోంగ్ త్వరలో గడ్డకట్టడం ఆగిపోవచ్చు’ అని మరో ఐటీ ప్రొఫెషనల్ (50) రాజేష్ చెప్పారు. ‘తనకు ఇది వ్యక్తిగత రికార్డ్ కన్నా ఎక్కువ అని, ఈ రన్లో ఇమిడి ఉన్న సందేశమే తనకు ముఖ్యమని అంటున్నారాయన. లాస్ట్ రన్ పేరు ఆకర్షణీయంగా అనిపించవచ్చు కానీ.. దాని వెనుక అంతరార్థం మాత్రం ఆందోళనకరం’ అని చెప్పారు.విభిన్న నేపథ్యాల నుంచి..నావికాదళ అధికారి, కార్పొరేట్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్వేర్ నిపుణుడు, ఐటీ మారథానర్ – వంటి విభిన్న నేపథ్యాలున్నప్పటికీ, ఈ నలుగురూ అవరోధాలను అధిగమించి అనూహ్యమైన రికార్డు సాధించారు. నగరానికి తిరిగి వచ్చిన వారి ప్రయాణం కొత్త లక్ష్యాల దిశగా సాగనుంది. ఐరన్ మ్యాన్ గోవా అనే ఈవెంట్‌పై రతన్ తన దృష్టి పెట్టారు. కిలిమంజారోను అధిరోహించాలని నవీన్ యోచిస్తుంటే, రాజేష్ 6000+ మీటర్ల హిమాలయ శిఖరంపై సూపర్ రాండన్నూర్ సైక్లింగ్ హోదాను గురిపెట్టారు. పాంగోంగ్ నుంచి కొత్తగా ప్రేరణ పొందిన ప్రవీణ్ మరిన్ని సాహసాలను అన్వేషిస్తున్నారు.(చదవండి: 16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..)

16 ఏళ్లకే బ్రెస్ట్ కేన్సర్ సర్జరీ..! జస్ట్ 15 రోజుల్లేనే మిస్ వరల్డ్ వేదికకు..
హైదరాబాద్ వేదికగా మరికొద్ది రోజుల్లో 72వ మిస్ వరల్డ్ – 2025 పోటీలు జరగనుండటం విధితమే. దీనిలో దాదాపు 120 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంటులు భాగస్వాములు కానున్నారు. ఇందులో భాగంగా నగరానికి చేరుకున్న మిస్ వరల్డ్ థాయిలాండ్ 2025 ‘ఓపాల్ సుచాత చువాంగ్ శ్రీ’ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో సోమవారం సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని సింఘానియాస్ వస్త్ర దుకాణంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్న ‘ఓపాల్ ఫర్ హర్’కు మద్దతుగా సింఘానియాస్ చీరలు, లెహంగాలను ధరించారు. తన ఫ్యాషన్ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..!! గ్లోబల్ వేదికగా ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుండటం సంతోషంగా ఉంది. అనూహ్యంగా.. మిస్ థాయ్లాండ్గా మిస్ వరల్డ్ వేదికకు సిద్ధం కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే పట్టింది. నా జీవితంలో ఇదొక మిరాకిల్. తక్కువ సమయంలో ఈ అవకాశం రావడం నా అదృష్టం. ప్రోత్సాహాన్ని అందించిన థాయ్ ప్రజలకు, అంతర్జాతీయ అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటా. ఈ వేదికపై విజేతగా నిలవడమే నా దేశానికిచ్చే రిటర్న్ గిఫ్ట్. పుట్టి పెరిగిందంతా థాయ్‌లాండ్ ఫుకెట్‌లో. విద్యాభ్యాసం అక్కడే చేశాను. ఉన్నత చదువులకు బ్యాంకాక్ వచ్చాను. అక్కడి నుంచి నా ఫ్యాషన్ ప్రయాణం మొదలైంది. ఆ బాధ నాకు తెలుసు.. సామాజిక బాధ్యతలో భాగంగా రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాను. 16 ఏళ్ల వయసులో నాకు బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. ఇందులో భాగంగా నాన్ క్యాన్సరస్ లంప్‌ను తీసేశారు. ఆ అవస్థలు, వేదన నాకు భాగా తెలుసు. అందుకే.. రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటాను. ముందస్తు చికిత్స–గుర్తింపు అవసరముంది. మహమ్మారిపైన అవగాహన కల్పించడమే జీవిత లక్ష్యం. మిస్ థాయ్లాండ్గా నా స్వరాన్ని వినిపిస్తున్నాను. ఇలాంటి సామాజిక బాధ్యతల్లో భాగంగా ‘ఓపాల్ ఫర్ హర్’లో పాలుపంచుకున్నా. థాయ్ ప్రజలకు స్ఫూర్తినిస్తూ.. ప్రపంచానికి సేవచేస్తాను. ఈ విషయాల్లో మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆతిథ్యం అదుర్స్.. ఎయిర్ పోర్ట్‌లో లభించిన స్వాగతం సత్కారాలు చూసి ఆశ్చర్యపోయాను. ఇంతటి ఘనమైన ఆతిథ్యం జీవితంలో ఇదే మొదటిసారి. హైదరాబాద్ విశిష్టతల గురించి విన్నాను.. ఇది పెరల్ సిటీ అని ఇక్కడికి వచ్చాక తెలిసింది. నాకు ఆభరణాలంటే ఎంతో ఇష్టం. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ వెళ్లి ఆభరణాలు కొనుక్కుంటాను. చార్మినార్, పెద్దమ్మతల్లి టెంపుల్‌కు కూడా వెళతాను. (చదవండి: 24 ఏళ్లకే న్యాయమూర్తిగా..! తండ్రి ఫెయిలైనా..తనయ సాధించింది..!)
ఫొటోలు


తిరుమలలో వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)


భారత్ తడాఖా.. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ విలవిల (ఫొటోలు)


మిస్ వరల్డ్ పోటీల విలేకరుల సమావేశంలో నందినీ గుప్తా, సోనూసూద్ (ఫొటోలు)


ఘనంగా తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభం (ఫొటోలు)


మెట్‌గాలా 2025 ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ (ఫోటోలు)


'శుభం' కోసం తెగ కష్టపడుతున్న సమంత (ఫొటోలు)


భాగ్యశ్రీ బోర్సే బర్త్ డే స్పెషల్.. కిక్ ఇచ్చే ఫోటోలు చూశారా..?


గోదావరి ప్రజల ఆరాధ్య దైవం.. శ్రీ తలుపులమ్మ తల్లి దేవాలయం (ఫొటోలు)


#MetGala2025 : చరిత్ర సృష్టించిన కియారా.. మొదటిసారి బేబీ బంప్‌తో ఇలా! (ఫొటోలు)


కుమారుడి ధోతి వేడుక.. ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి మంజుల (ఫొటోలు)
అంతర్జాతీయం

'ట్రంప్‌తో ప్రపంచం నాశనం'
వాషింగ్టన్: వ్యక్తిగత జీవితంతోనే కాదు.. రాజకీయ అభిప్రాయాలతోనూ వివాదాస్పదమైన హాలీవుడ్ నటుడు సీన్ పెన్ (Sean Penn) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. అంతేకాదు.. హంతకుడైన అసూయపూరిత జీవిత భాగస్వామిగా అభివర్ణించారు. డెమొక్రటిక్ ప్రతినిధి ఎరిక్ స్వాల్వెల్‌తో కలిసి జిమ్ అకోస్టా పాడ్ కాస్ట్ ‘ది జిమ్ అకోస్టా షో’లో పెన్ మాట్లాడారు.తనకు కాకపోతే ఇంకెవ్వరికీ దక్కవద్దన్న ధోరణి ట్రంప్‌లో ఉంటుందన్నారు. తన అధికారంతో విధ్వంసానికి పాల్పడే స్వార్థపూరిత వ్యక్తిగా ట్రంప్‌ను అభివర్ణించారు. మూడోసారి అధ్యక్ష పదవికోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు పెన్ పైవిధంగా సమాధానమిచ్చారు. ఇక డెమొక్రాట్ అయిన ఎరిక్ స్వాల్వెల్ (Eric Swalwell) మాట్లాడుతూ.. నియంతలెప్పుడూ తమ వారసత్వాన్ని కొనసాగించడానికి ప్రణాళికలు వేయలేదన్నారు. తనను తాను రక్షించుకోవడానికి దేశాన్ని ఏం చేయడానికైనా ట్రంప్ సిద్ధమవుతారని వ్యాఖ్యానించారు. చదవండి: దయలేని ట్రంప్.. ఈసారి సినిమాలపై సుంకం

భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్ మరో మిసైల్ ప్రయోగం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ ఫతహ్ అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిసైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో ఈ మిసైల్ టెస్ట్ ప్రధానంగా మిస్సైల్ హార్డ్‌వేర్,సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించడం, అలాగే మిసైల్‌లో ఉపయోగించిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్తాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిసైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది.కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ మిలటరీ చర్యలు పాకిస్తాన్-భారతదేశాల మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ఈ దారుణానికి ఒడిగట్టింది. పాక్‌పై భారత్ ఆంక్షలుదీనికి ప్రతిగా, భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.ఏక్షణంలోనైనా పాక్‌పై భారత్ దాడిప్రధానమంత్రి మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత సైన్యం పాకిస్తాన్‌పై ఏ క్షణంలో మెరుపు దాడి చేసే దిశగా సన్నాహాలు కొనసాగిస్తోంది.

యుద్దానికి రెడీ.. పాక్‌లో అఖిలపక్ష భేటీలో ఆర్మీ అధికార ప్రతినిధి
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ దాడులు చేస్తుందనే కారణంగా పాక్‌కు భయం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా యుద్ధ సన్నద్దతపై వివరణ ఇచ్చినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. భారత్ యుద్ధ సన్నద్దత వేళ పాకిస్తాన్ అలర్ట్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా పాక్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌తో నెలకొన్న పరిస్థితులను సివిల్, మిలిటరీ నాయకత్వం.. అఖిలపక్ష భేటీలో చర్చించినట్టు సమాచారం. భారత్ దాడి చేస్తే తమ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలకు పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి వివరించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం పీటీఐ హాజరు కాలేదని సమాచారం.ఇదిలా ఉండగా.. భారత్ పర్యటనకు ముందు పాక్‌లో పర్యటిస్తున్న ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాక్‌లో దిగిన వెంటనే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారాలని వ్యాఖ్యాలు చేశారు. ఇక, అంతకుముందు.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌లకు మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధమని అబ్బాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

దయలేని ట్రంప్.. ఈసారి సినిమాపై సుంకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్ వార్’లో భాగంగా హాలీవుడ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్, వార్నర్ బ్రోస్ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.
జాతీయం

Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది.పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. This video captures the moment an Indian missile hit Bahawalpur, Pakistan, during 'Operation Sindoor' — a series of retaliatory attacks for last month’s Pahalgam bombing that killed 26 people, which India blames on Pakistan. pic.twitter.com/9g0yzHhYVB— Al Jazeera English (@AJEnglish) May 6, 2025సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్.. పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాన్ని కుదిపేసిన వినయ్ నర్వాల్ ఘటన ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. దెబ్బకు దెబ్బ తీసిందిఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.

ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ ఇలా.. 1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడులు.2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.2:30 AM శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు.3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.4:00 AM ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులుభారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది.

కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.

Operation Sindoor: పాక్ ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..రాత్రంతా పర్యవేక్షించిన ప్రధాని మోదీ
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. భారత సాయుధ దళాలు బుధవారం ఉదయం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై మిస్సైల్ దాడులు జరిపింది. భారత్ జరిపిన ఈ మెరుపు దాడిలో దాదాపు 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు మరణించారు. 60 మంది గాయపడ్డారు. భారత్ జరిపిన దాడిని పాకిస్తాన్ అంగీకరించింది. తమ భూభాగంలో ఆరు చోట్ల దాడులు జరిగాయని, ఎనిమిది మంది చనిపోయారని తెలిపింది. ఇక ఇండియన్ ఆర్మీ విజయవంతగా నిర్వహించిన ఈ ఆపరేషన్ సిందూర్‌ను (OperationSindoor)ప్రధాని మోదీ రాత్రంతా సమీక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ కేంద్రంగా ఉన్న బహావల్పూర్ సహా పంజాబ్ ప్రావిన్స్‌లోని ఐదు ప్రదేశాలు, పీఓకేలోని నాలుగు ప్రదేశాలు ఈ దాడులు జరిగాయి. వీటిలో మురిద్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం సైతం ఉంది. "प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో బుధవారం తెల్లవారు జామున ఉదయం 1:44 గంటలకు ఆపరేషన్ సింధూర్‌పై ప్రకటన చేసింది. తాము దాడులు నిర్వహించింది ఉగ్రవాద స్థావరాలేనని, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదని స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ న్యూఢిల్లీ నుంచి నేరుగా సమీక్షించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, గూఢచార సంస్థల ఉన్నతాధికారుల నుండి నిరంతరంగా సమాచారం అందుకుంది. మంగళవారం రాత్రి నుంచే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో ప్రధాని పలుమార్లు మాట్లాడారు. పహల్గాం ఘటన అనంతరం ప్రభుత్వ గూఢచార సంస్థల ద్వారా పొందిన కీలక నిఘా సమాచారం ఆధారంగా పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచాఉరం. దాడుల అనంతరం భారత ప్రభుత్వం ముఖ్య అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదించింది. అమెరికా, యూకే , రష్యా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాధికారులను భారత ఉన్నతాధికారులు సంప్రదించి ఈ దాడులు గురించి పూర్తిగా వివరించారు.
ఎన్ఆర్ఐ

సలహా కమిటీ అడుగులు ముందుకు..
మోర్తాడ్ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్ఆర్ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.యూఏఈలోని ఆల్‌కూజ్ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్ సలహా కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది. బాధిత కుటుంబాలకు భరోసా యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్ సత్యప్రసాద్ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.చదవండి: స్మిత సబర్వాల్ ధిక్కార స్వరం!శనివారం జరిగిన శ్రీనివాస్ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

టంపాలో నాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు
ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణ కోసం కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లను టంపాలో నాట్స్ నిర్వహించింది. మొత్తం 12 వాలీబాల్ జట్లు, 5 మహిళా త్రోబాల్ జట్లు, 350 మందికిప గా తెలుగు క్రీడాకారులు ఈ టోర్నమెంట్లతో తమ ప్రతిభను చాటేందుకు పోటీ పడ్డారు. క్రీడాకారులను ప్రోత్సాహించేందుకు వారి కుటుంబ సభ్యులు కూడా రావడంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. మహిళల త్రోబాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతిని సన్‌షైనర్స్ జట్టు కైవసం చేసుకుంది. పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ ఛాంపియన్లుగా డైనమిక్ రచ్చ జట్టుగా నిలిచింది. టోర్నమెంట్ విజేతలకు బహుమతులు జూలై 4 నుండి 6 వరకు జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాల్లో బహుమతులు పంపిణి చేయనున్నారు. నాట్స్ కమ్యూనిటీ సేవల బృందం నుండి రంజిత్ పాలెంపాటి అవిశ్రాంత కృషి ఈ టోర్నమెంట్లు దిగ్విజయంగా జరగడంలో కీలక పాత్ర పోషించింది.నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది తెలిపారు. క్రీడాకారులు టోర్నమెంట్లో చూపిన క్రీడాస్ఫూర్తిని మల్లాది ప్రశంసించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, మాధవి యార్లగడ్డ, అపర్ణ కొడాలి, కార్తీక్ తుమ్మటి, శ్రీకాంత్ పాత్ర, శ్యామల, విజయ్ చిన్నం తదితరులు ఈ టోర్నమెంట్ల నిర్వహణకు తమ మద్దతును, సహకారాన్ని అందించారు. జూలైలో జరిగే అమెరికా తెలుగు సంబరాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేలా ఇదే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు వివిధ రకాల క్రీడా పోటీలను నాట్స్ టంపాలో నిర్వహించనుంది. నాట్స్ సంబరాల కమిటి, నాట్స్ క్రీడా కమిటీలు ఈ పోటీల నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగనుంది. నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి లు విజేతలకు శుభాకాంక్షలు తెలియచేసారు. అందరూ టంపా తెలుగు సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

NATS శాండియాగో లో నాట్స్ చాప్టర్ ప్రారంభం
శాండియాగో : ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన విభాగాలను ప్రారంభిస్తూ తెలుగు వారికి మరింత చేరువ అవుతోంది. ఈ క్రమంలోనే శాండియాగోలో నాట్స్ విభాగాన్ని ప్రారంభించింది. నాట్స్ శాండియాగో చాప్టర్ సమన్వయకర్తగా ప్రశాంతి ఊడిమూడి, మహిళా సాధికార సలహా మండలి సమన్వయకర్తగా హైమ గొల్లమూడికి బాధ్యతలు అప్పగించారు. శాండియాగో నాట్స్ సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా కామ్య శిష్ట్లా, సోషల్ మీడియా సమన్వయ కర్త గా తేజస్వి కలశిపూడి, సేవా కార్యక్రమాల సమన్వయకర్త గా రామచంద్ర రాజు ఊడిమూడి, క్రీడా స్ఫూర్తి సమన్వయ కర్తగా సత్య హరిరామ్, ఆది మోపిదేవి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీరామనవమి నాడు శాండియాగో లో నాట్స్ విభాగం ప్రారంభం కావడం ఆనందంగా ఉందని శాండియాగో నాట్స్ సమన్వయకర్త ప్రశాంతి ఊడిమూడి అన్నారు. శాండియాగో లో నాట్స్ తెలుగు వారికి శ్రీరామరక్షలా మారేలా తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. చాప్టర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తనుష్ భగవత్ ,వీణ-ఋత్వ ఊడిమూడి గానామృతం, వయోలిన్‌తో ధ్రువ గౌరిశెట్టి ,పియానోతో విహాన్ మండపాక అందరిని అలరించారు. ( మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి,నాట్స్ సెక్రటరీ మధు బోడపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ మద్దినేని పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లాస్ ఏంజెలెస్ చాప్టర్ నుండి నాట్స్ ప్రోగ్రామ్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిలుకూరి,జాతీయ మహిళా సాధికారత సమన్వయ కర్త రాజ్యలక్ష్మి చిలుకూరి,లాస్ ఏంజెలెస్ చాప్టర్ సమన్వయ కర్త మురళి ముద్దన, హెల్ప్ లైన్ సమన్వయ కర్త శంకర్ సింగం శెట్టి పాల్గొన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ఆధ్వర్యంలో నూతన చాప్టర్ సభ్యులను మనోహర్ మద్దినేని సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి తమ అభినందనలు సందేశం ద్వారా పంపారు. భవిష్యత్తులో శాండియాగో నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి భరోసా ఇచ్చారు. అమెరికాలో తెలుగు సమాజ అభివృద్ధి దిశగా నాట్స్ జాతీయ వ్యాప్తంగా ఎంతో కృషి చేస్తుందన్నారు. అమెరికాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవ కార్యక్రమాల గురించి మదన్ పాములపాటి వివరించారు. శాండియాగో చాప్టర్ ఏర్పాటులో నాట్స్ జాతీయ మీడియా కో ఆర్డినేటర్ కిషోర్ నారే కీలక పాత్ర పోషించడం అభినందనీయమని అన్నారు. శాండియాగోలో ఇక నుంచి తెలుగువారికి నాట్స్ అండగా ఉందనే భరోసాను కల్పించే దిశగా శాండియాగో నాట్స్ సభ్యులు కృషి చేయాలని కోరారు.

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
క్రైమ్

ఓయో రూమ్‌కు తీసుకువెళ్లి.. రహస్య వీడియోలు
సాక్షి,హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను వేధిస్తున్న యువకుడికి నగర షీ–టీమ్స్ బృందాలు చెక్ చెప్పాయి. ఇతడితో పాటు మరికొందరు పోకిరీలు, నిరాధార ఫిర్యాదులు చేస్తున్న యువతిని పట్టుకున్నట్లు డీసీపీ డాక్టర్ ఎన్జేపీ లావణ్య మంగళవారం తెలిపారు. నగరానికి చెందిన ఓ యువకుడు (30) ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళతో కొన్నాళ్లు స్నేహం చేశాడు. ఆపై ఇరువురూ కలిసి ఓయో రూమ్‌కు వెళ్లగా... సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను రహస్య కెమెరాతో రికార్డు చేశాడు. ఆపై వాటిని బయటపెడతానంటూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అలా కాకుండా ఉండాలంటే తాను చెప్పినట్లు చేయాలంటూ మూడు ఆప్షన్లు ఇచ్చాడు. తాను కోరినప్పుడల్లా రావాలని, తనతో సన్నిహితంగా ఉండటానికి మరికొందరు మహిళలను ఏర్పాటు చేయాలని, రూ.లక్ష ఇవ్వాలని చెప్పిన యువకుడు వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని కోరారు. ఎట్టకేలకు «ధైర్యం చేసిన ఆ మహిళ షీ–టీమ్స్‌ను ఆశ్రయిస్తూ తనకు ఉన్న నాలుగో ఆప్షన్ చూపింది. నిందితుడిని పట్టుకున్న బృందాలు అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాయి. న్యాయమూర్తి అతగాడికి మూడు రోజుల సాధారణ జైలుశిక్ష విధించారు. బేగంపేటకు చెందిన ఓ యువతి తన సహోద్యోగులతో కలిసి ఓ వేడుక చేసుకున్నారు. దీన్ని వారికి తెలియకుండా పక్క ఇంట్లో ఉండే ప్లంబర్ (34) రికార్డు చేశాడు. మర్నాడు ఆ వీడియోలు చూపిస్తూ మహిళలను బెదిరించడం మొదలెట్టాడు. తనతో సన్నిహితంగా ఉండాలని లేదంటే ఆ వీడియోలు ఆన్లైన్లో పెడతానని వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ నిందితుడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడిని నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నివసించే యువతి ఇటీవల ప్రజావాణిలో ఓ ఫిర్యాదు చేశారు. ఓ గుర్తుతెలియని వ్యక్తి తనపై లైంగికదాడి చేశారని అందులో పేర్కొన్నారు. ప్రజావాణి నుంచి ఈ ఫిర్యాదు షీ–టీమ్స్‌కు రాగా.. అధికారులు బాధితురాలిని సంప్రదించి గోపాలపురం ఠాణాకు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె చేస్తున్న దందా వెలుగులోకి వచి్చంది. పోలీసులనే టార్గెట్‌గా చేసుకుంటున్న ఈ యువతి వివిధ కారణాలు చెప్తూ వారి ఫోన్లు తీసుకుంటుంది. వాటి ద్వారా అశ్లీల చిత్రాలను తన నెంబర్‌కు ఫార్వర్డ్ చేసుకుంటుంది. వీటిని చూపిస్తూ ఆ పోలీసులనే బెదిరించి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రజావాణిలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరోపణలపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే జీహెచ్ఎంసీ వాహనం డ్రైవర్ ఓ మహిళను వేధించారు. చెత్త వెయ్యడానికి వచ్చే ఆమెను చూస్తూ అభ్యంతరకర, అశ్లీల పనులు చేసేవాడు. దీనిపై బాధితురాలు షీ–టీమ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా డెకాయ్ ఆపరేషన్ చేసిన అధికారులు సదరు డ్రైవర్‌ను పట్టుకుని కోర్టులో హాజరుపరిచాయి. న్యాయస్థానం అతడికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. ∙ బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, ఆపై బెదిరింపులకు దిగుతున్న ముగ్గురిని పట్టుకున్న షీ–టీమ్స్ వారిపై పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయించాయి. ఛత్రినాక, జూబ్లీహిల్స్, మాదన్నపేటలకు చెందిన యువకులు బాలికల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నారు. ఆపై డబ్బు కోసమో, తనతో సన్నిహితంగా ఉండాలనో బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై ఫిర్యాదులు అందుకున్న షీ–టీమ్స్ నిందితులపై సంబంధిత ఠాణాల్లో పోక్సో కేసులు నమోదు చేయించాయి. మరోపక్క బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల్ని వేధిస్తున్న 49 మంది పోకిరీలను షీ–టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.

కన్నీటి నిశ్చితార్థం
నిశ్చితార్థం చేసుకుని, త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి మార్చురీలో శాశ్వత విశ్రాంతి తీసుకుంటోంది. కుమార్తె పెళ్లి గురించి కోటి కలలు కన్న తల్లిదండ్రులదీ అదే దుస్థితి. నిశ్చితార్థం గోరింటాకు ఇంకా ఆరలేదు, అప్పుడే మృత్యువు పంజా విసిరింది. సాగరలో వేడుకను పూర్తి చేసుకుని బాగల్‌కోట జిల్లాలో తమ ఇంటికి వెళ్తుండగా, దారిలోనే ప్రయాణం ముగిసింది. కారు లారీని ఢీకొనడంతో కుటుంబం కడతేరిపోయింది.హుబ్లీ/ శివమొగ్గ(కర్ణాటక): వారంతా ఒకే కుటుంబ సభ్యులు. కూతురికి నిశ్చితార్థం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు. ఇంతలో విధి చిన్నచూపు చూసింది. లారీ– కారు ఢీకొన్న ఘటనలో కాబోయే పెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, బంధువుల అమ్మాయి దుర్మరణం చెందారు. మంగళవారం ఉదయం హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి క్రాస్‌లో జాతీయ రహదారిలో ఈ ఘోరం జరిగింది. వివరాలు... ఈ ప్రమాదంలో విఠల శెట్టి (55), భార్య శశికళ (40), కుమార్తె శ్వేతా శెట్టి (29), కుమారుడు సందీప్ (26), అన్న కుమార్తె అయిన అంజలి (26) దుర్మరణం చెందారు. వీరి స్వస్థలం శివమొగ్గ జిల్లా సాగర వద్ద మూరుకై అనే గ్రామం. బాగల్‌కోటెలోని కులగేరి క్రాస్‌లో హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవించేవారు. సోమవారం శివమొగ్గ జిల్లా సాగరలో శ్వేతకు కుందాపుర యువకునితో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో బంధుమిత్రులు పాల్గొన్నారు. త్వరలోనే పెళ్లి పెట్టుకుందామని తీర్మానించుకున్నారు. అలాగే సాగరలోనే కొత్తగా కట్టిన ఇంటిలో గృహ ప్రవేశం చేశారు. 8:30 సమయంలో.. రెండు వేడుకలను ముగించుకుని మంగళవారం తెల్లవారుజాము 4 గంటలప్పుడు సంతోషంగా సాగర నుంచి కారులో బయలు దేరారు. సుమారు 8:30 సమయంలో ఘటనాస్థలిలో కారు, అహ్మదాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్తున్న లోడ్ లారీ–వేగంగా ఢీకొన్నాయి. సందీప్ కారును నడుపుతున్నట్లు తెలిసింది. ఈ ధాటికి కారులోని ఐదుగురూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలి రక్తసిక్తమైంది. ప్రజలు హుబ్లీ గ్రామీణ పోలీసులు చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. లారీలో చిక్కుకున్న కారు కారు లారీ లోపలికి దూసుకుపోవడంతో బయటకు తీయడం కష్టసాధ్యమైంది. కారు మొత్తం తుక్కయింది. కష్టమ్మీద మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పెద్దసంఖ్యలో బంధువులు చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనాస్థలిని ఎస్పీ బ్యాకోడ పరిశీలించారు. లారీ డ్రైవర్ మాట్లాడుతూ కారు అతివేగంగా వచ్చి తన లారీని ఢీకొట్టిందని చెప్పాడు.

బంగ్లాదేశ్ నుంచి నగరానికి వచ్చిన యువతి..
బంజారాహిల్స్: ట్రావెల్ ఏజెంట్ సహకారంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి వ్యభిచారం చేసేందుకు అర్ధరాత్రి ఆ దేశ సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించింది. మొదట పశ్చిమ బెంగాల్ చేరుకున్న ఆమె అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి, చివరకు హైదరాబాద్‌కు చేరుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు వ్యభిచార గృహంపై చేసిన దాడిలో పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే..బంగ్లాదేశ్, మాణిక్‌గోంజ్ జిల్లాకు చెందిన యువతి (23) 2024లో రకీబ్ అనే ట్రావెల్ ఏజెంట్ సహాయంతో అర్ధరాత్రి దేశ సరిహద్దు దాటి పశ్చిమ బెంగాల్ లోకి ప్రవేశించింది. కొంతకాలం పాటు అతను ఆమెకు ఆ రాష్ట్రంలోనే ఆశ్రయం కల్పించాడు. ఆమెకు సిమ్‌కార్డు సైతం సమకూర్చి బెంగళూరుకు తీసుకెళ్లి అక్కడ మూజమ్ అనే వ్యక్తికి అప్పగించాడు. నెల రోజుల పాటు గదిలో ఉంచిన మూజమ్ ఆమెతో వ్యభిచారం చేయించాడు. ఆ తర్వాత ఆమె బెంగళూరులోని కోరమంగళకు పారిపోయి, బంగ్లాదేశ్‌కు చెందిన మిస్తి అనే స్నేహితుడిని కలుసుకుంది. అతని వద్ద రెండు నెలల పాటు తలదాచుకుంది. మిస్తి ఆమెను అఖిల్ అనే వ్యక్తికి అప్పగించగా, వ్యభిచారం చేస్తే ఎక్కువ జీతం ఇస్తానని అఖిల్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో అఖిల్ సూచన మేరకు గత నెల 21న బస్సులో హైదరాబాద్ చేరుకున్న ఆమె అతని ఇంట్లో 10 రోజులు ఉంది. ఆ తర్వాత సదరు యువతి మరిన్ని డబ్బులు సంపాదించేందుకు నాయక్ అనే వ్యక్తిని ఫోన్లో సంప్రదించింది. నాయక్ ఆమెను గత నెల 30న జూబ్లీహిల్స్‌లోని మింట్ లీవ్స్ సరీ్వస్‌డ్ అపార్ట్మెంట్ రూం నెంబర్–112లో దించేందుకు క్యాబ్ ఏర్పాటు చేశాడు. కస్టమర్లను సంప్రదించి గదికి పంపుతానని నాయక్ ఆమెకు చెప్పాడు. అయితే వ్యభిచార దందాపై పోలీసులకు సమాచారం అందడంతో సదరు అపార్ట్మెంట్లోని గదిపై సోమవారం దాడులు నిర్వహించిన పోలీసులు బంగ్లాదేశ్ యువతితో పాటు కస్టమర్లను అరెస్టు చేశారు. యువతిని పునరావాస కేంద్రానికి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య వివాహేతర సంబంధం.. పిల్లలకు ఉరేసి.. తండ్రి ఆత్మహత్య
కొండాపూర్ (సంగారెడ్డి): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అవమానంగా భావించిన భర్త, తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచి్చన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి విగతజీవిగా కనిపించాడు. ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన సుభాష్.. భార్య మంజుల, కుమారుడు మరియన్ (13), కూతురు ఆరాధ్య (9)తో కలిసి మల్కాపూర్‌లోని సా యినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుభాష్ సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్య మంజుల ప్రవర్తనలో మార్పు రావడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంజుల 5 రోజుల కిందట ఎవరికీ చెప్ప కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భావించిన సుభాష్ అవమానభారం భరించలేకపోయాడని, దీంతో పిల్లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. సుమారు 5 రోజుల కిందటే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలం వద్ద 4 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు.
వీడియోలు


ఆపరేషన్ సిందూర్.. మధుసూదన్ కుటుంబ సభ్యుల రియాక్షన్


సీమాంతర ఉగ్రవాదాన్ని అణచడానికి భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది


ఫ్యాన్స్ కి భారీ షాక్ ఇచ్చిన రజనీకాంత్


ఆపరేషన్ సిందూర్.. అనే పేరు పేరెందుకు పెట్టారంటే?


పాక్ ను సర్వనాశనం చేయడానికి ఇది మంచి అవకాశం


అర్దరాత్రి ఆపరేషన్ సిందూర్.. భారత్ మెరుపు దాడి


ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థుల ధర్నా


ఆపరేషన్ సిందూర్ పై ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్ మీట్


ఆపరేషన్ సింధూర్ పై ఏపీ ప్రజల రియాక్షన్


ఆపరేషన్ సింధూర్ పై వైఎస్ జగన్ ట్వీట్