
సాక్షి, సినిమా: శ్రీ రెడ్డి చేపట్టిన టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీలోకి పవన్ కల్యాణ్‌ను లాగమని చెప్పింది తానేనని విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అల్లు అరవింద్ వెంటనే స్పందించారు. రాంగోపాల్ వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని అల్లు అరవింద్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. దీనిపై తాజాగా స్పందించిన వర్మ.. పవన్ కుటుంబానికి క్షమాపణలు చెబుతూనే అల్లు అరవింద్‌పై పలు ప్రశ్నలు సంధించారు. పవన్ విషయంలో వెంటనే స్పందించిన అరవింద్.. శ్రీ రెడ్డి విషయంలో ఎందుకు కామెంట్ చేయలేదంటూ ప్రశ్నించారు.
‘పవన్ మీకు, మీ కుటుంబానికి మరొకసారి క్షమాపణలు చెబుతున్నాను. ఇంకెపుడు మీపై, మీ కుటుంబంపై ఎలాంటి నెగటివ్ కామెంట్‌లు చేయనని నా వృత్తి మీద ఒట్టేసి చెబుతున్నా’ అని పేర్కొన్నారు.
లక్షల మంది అభిమానులు ఉన్న పవన్ కల్యాణ్‌ను అలాంటి మాట అనిపించి తననకు తాను దేశ ద్రోహం చేసుకున్నాను తప్పా ఇండస్ట్రీకి కాదనే విషయం అరవింద్ తెలుసుకోవాలన్నారు. ఇక్కడ ఇండస్ట్రీకి ద్రోహం చేశానన్న వ్యాఖ్యలకు అర్ధం లేదని వర్మ బదులిచ్చారు. ‘పవన్ ఆకాశమంత ఎత్తున్న సూపర్ స్టార్ లీడర్.. అతని స్థాయి తగ్గించడానికి ఆఫ్ట్రాల్ నేను ఎవరిని? నా వెనుక ఎవరు లేరు.. ఏ పార్టీ లేదు’ అని వర్మ తెలిపారు.