
న్యూఢిల్లీ: ఆర్థిక కార్యకలాపాలు అధిక స్థాయిల్లో ఉండే అన్ని జిల్లాల్లోనూ తక్షణమే అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్ జోన్లుగా గుర్తించే విషయంలో జిల్లాల ఆర్థిక ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. రెడ్‌జోన్ ప్రాంతాల్లోనూ ఉన్నత స్థాయి భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా పరిశ్రమలు, వ్యాపారాలను అనుమతించాల్సిన అవసరాన్ని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలియజేసింది.