అనంతపురం జిల్లా రాప్తాడు మండల కళాకారుల కాలనీలో పోలీసులు శనివారం తెల్లవారుజామున నాకా బందీ చేపట్టారు.
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కళాకారుల కాలనీలో పోలీసులు శనివారం తెల్లవారుజామున నాకా బందీ చేపట్టారు. తిరుపాల్ అనే వ్యక్తిని దుండగులు హత్య చేసి పూడ్చి పెట్టిన దారుణం రెండు రోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో కాలనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు ఓ సీఐ, ఐదుగురు ఎస్‌ఐలతో పాటు మొత్తం 80 మంది వరకు పోలీసులు కళాకారుల కాలనీలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ఈ కాలనీలో స్థానికేతరులు ఎవరూ ఉండడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేశారు.