
సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్ నియంత్రణకు ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటించి సహకరించాలని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు కోరారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో కలిసి విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకులను పారిశుద్ధ్య కార్మికులకు మంత్రులు అందజేశారు.
కార్యక్రమంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలంతా తూచ తప్పకుండా పాటించాలని కోరారు. ప్రజల సహకారంతోనే త్వరితగతిన కరోనాను నియంత్రించ వచ్చని' ఆయన పేర్కొన్నారు. జిల్లా మంత్రి అవంతి మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఆందోళనతో ఉంటే ఇలాంటి సమయంలో చంద్రబాబు రాజకీయాలు చేయడం తగదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు దేశం నాయకులు కరోనా నియంత్రణకు సహకరించినా మేం స్వాగతిస్తామని' మంత్రి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డాల రామరాజు, నడింపల్లి రామరాజు, ఎర్ర వరం బాబు, ఆదిరెడ్డి మురళి దాసరి రాజు పాల్గొన్నారు. చదవండి: ఆయన ఎక్కించే ఎల్లో వైరస్ ఎంత డేంజరంటే!
భీశెట్టి దంపతుల మృత్యుంజయ హోమం
అనకాపల్లి ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి దంపతులు వారి స్వగృహంలో రాష్ట్ర ప్రజలు కరోనా బారిన పడకుండా సుభిక్షంగా ఉండాలంటూ మహాగణపతి మృత్యుంజయ హోమం నిర్వహించారు.