Fairness
-
బ్లూ టీ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
చాలామందికి పొద్దున లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న టీ బ్లూ టీ. అపరాజిత పూలతో ఈ టీని తయారు చేస్తారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ బ్లూ టీని ఒక్కసారి తాగితే మళ్లీ విడిచిపెట్టరట. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి? బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ► బ్లూ టీనే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ, శంఖు పువ్వు అని కూడా పిలుస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది. ► బ్లూ బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్‌ను నీటిలో మరిగించి ఈ హెర్బల్ టీని ప్రిపేర్ చేస్తారు. ► ఇందులోని ఆంథోసైనిన్ సమృద్దిగా ఉండటం వల్ల ఈ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ► యాంటీ యాక్సిడెంట్లు బ్లూ టీలో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ► బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు ► బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంఉటంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. ► బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. ► షుగర్ పేషెంట్స్ రెగ్యులర్ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ► అలసట, చికాకుగా ఉన్నప్పుడు ఈ బ్లూ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ► బ్లూ టీలో కెఫిన్ ఉండదు. కాబట్టి రోజుకు రెండుసార్లు అయినా హ్యాపీగా ఈ టీని తీసుకోవచ్చు. ► ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. ► డిప్రెషన్, యాంక్సైటీగా అనిపించినప్పుడు బ్లూ టీ ఓ కప్పు తాగితే వెంటనే మూడ్ ఛేంజ్ అయ్యి యాక్టివ్ అవుతారట. -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్‌లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..
మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ సాయమవుతుంది. కప్పు నీటిలో ఒక మందార పువ్వు వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. రోజూ రెండు మూడు పుదీనా ఆకుల్ని నమిలి మింగుతుంటే జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది. వేపాకు, యాంటీ సెప్టిక్గాన, క్రిమి సంహారిణిగానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు) -
ఈ డివైస్‌తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..
సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్.ఈ ఎల్ఈడీ మెడికల్ డివైస్ (యాక్నే లైట్ షాట్).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. అంటే ట్రీట్మెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట. ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్‌తో రూపొందిన ఈ మినీ మెషిన్.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్‌ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ! -
నొప్పిలేకుండా ఇంట్లోనే వ్యాక్సింగ్.. ఈ మెషిన్ ఉంటే భలే సులువు
బ్యూటీ లవర్స్‌కి అన్నింటి కంటే అతిపెద్ద సమస్య అవాంఛితరోమాలే. నెలకోసారి పార్లర్‌కి వెళ్లి వాక్సింగ్ చేయించుకోవడం.. లేదంటే ఇంట్లోనే రకరకాల సాధనాలతో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం.. తప్పించుకోలేని సమస్యగా మారుతుంది. అదంతా ఓ విసుగు వ్యవహారం. ఆ సమస్య.. విసుగును కట్ చేస్తుంది ఈ హెయిర్ రిమూవల్ డివైస్. నొప్పి తెలియకుండా.. సమయమూ ఎక్కువ తీసుకోకుండా శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ లేజర్ హెయిర్ రిమూవల్ డివైస్.. అప్‌గ్రేడ్ వెర్షన్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే విడుదల చేయడంతో చర్మం కందిపోదు, ఎరుపెక్కదు. దీనిలో 5 లెవెల్స్ ఉంటాయి. అయితే సున్నితమైన భాగాలను బట్టి ఆ లెవెల్స్‌ని పెంచుకోవడం, తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. ఇందులో మాన్యువల్ మోడ్‌ని.. ప్రధానంగా బికినీ లైన్, అండర్ ఆర్మ్స్, వేళ్లు, పై పెదవి.. భాగాల్లో రోమాలను తొలగించడానికి ఉపయోగించాలి. దీనిలోని ఆటో మోడ్‌ని.. చేతులు, కాళ్లు, పొట్ట, వీపు వంటి ఏరియాల్లో వెంట్రుకలను తొలగించడానికి యూజ్ చేయాలి. ఇది ఎరుపు, తెలుపు, గ్రే కలర్ వెంట్రుకలను తీయడానికి పనిచేయదు. ఇది కేవలం ఎనిమిది నిమిషాల్లో మొత్తం బాడీని క్లీన్ చేయగలదు. అయితే ముందుగా షేవ్ చేసుకుని.. ఆ తర్వాత ఈ డివైస్‌తో ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్ని వినియోగించే సమయంలో మెషిన్‌తో పాటు వచ్చే ప్రత్యేకమైన కళ్లజోడును ధరించడం మంచిది. సరిగ్గా నాలుగు వారాల పాటు.. దీని మెనూ బుక్‌ని ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ ధర సుమారు 7,829 రూపాయలు. ఇలాంటి లేటెస్ట్ మోడల్స్‌ని కొనుగోలు చేసే ముందు రివ్యూలు చదివి.. ఆర్డర్ చేయడం మంచిది. -
జుట్టు రాలుతోందా? సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..
వేసవిలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. జుట్టు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం ΄పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సాధనాలను, కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినా, సరైన ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. ►ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు చక్కెర గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ►జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది. ►ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోకపోవడం ఉత్తమం. ►ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన విషపదార్థాలు తీవ్ర జుట్టు సమస్యలకు దారి తీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి జుట్టును కా΄ాడుకోవాలనుకునేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మేలు. ►తేనె, పెరుగు హెయిర్ మాస్క్‌తో సులభంగా ఉపశమనం లభిస్తుంది: ►ప్రస్తుతం చాలామందిలో జుట్టు చివరి భాగాల్లో చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటినే స్పి›్లట్ ఎండ్స్ అంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తేనె, పెరుగు హెయిర్ మాస్క్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె వేసి రెండూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక గంట΄ాటు అలా వదిలేయాలి. బాగా ఆరిన తర్వాత జుట్టును తక్కువ గాఢత గల షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. వేసవిలో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు ►అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మికి గురికావడం వల్ల జుట్టు చిట్లడం, పల్చబడడం జరుగుతుంది. ►స్విమ్మింగ్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎందుకంటే పూల్ నీటిలో ఉండే క్లోరిన్ జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపి జుట్టు రాలేలా చేస్తుంది. ►వేసవిలో చెమట వల్ల జుట్టు రాలడం అనేది సర్వసాధారణం. ►వేడి వాతావరణం చుండ్రును తీవ్రతరం చేస్తుందని అంటారు, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, తాత్కాలికంగా జుట్టు రాలిపోతుంది. అలోవెరా జెల్ అలోవెరా జెల్‌ను జుట్టు మీద అప్లై చేయడం చాలా మంచిది. దానివల్ల జుట్టు మెరవడంతోబాటు మృదువుగా కూడా మారుతుంది. అంతేకాదు, చుండ్రు లేదా జుట్టు రాలడానికి కారణమయ్యే ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల జుట్టు లోపలి భాగంలో బలపడుతుంది. కొబ్బరి పాలతో మసాజ్ జుట్టు రాలడానికి శీఘ్ర రెమెడీ కొబ్బరి ΄ాలతో తలకు సున్నితంగా మసాజ్ చేయడం. ఆ తర్వాత తలకు వెచ్చని టవల్ చుట్టడం. రెగ్యులర్ హెయిర్ వాష్, కండిషనింగ్‌తో ఈ చిట్కాను అనుసరించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది.