Health Benefits Of Blue Tea: బ్లూ టీ తాగితే అందం అమాంతం పెరుగుతుందా? ఇన్ని లాభాలున్నాయా?

Unbelievable Health Benefits Of Blue Tea - Sakshi

చాలామందికి పొద్దున లేవగానే టీ తాగనిదే రోజు గడవదు. గ్రీన్ టీ, జింజర్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ వంటి ఎన్నో వెరైటీలు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్‌ అవుతున్న టీ బ్లూ టీ. అపరాజిత పూలతో ఈ టీని తయారు చేస్తారు.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ బ్లూ టీని ఒక్కసారి తాగితే మళ్లీ విడిచిపెట్టరట. ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి? బ్లూ టీతో కలిగే బెనిఫిట్స్‌ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.

► బ్లూ టీనే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్‌ టీ, శంఖు పువ్వు అని  కూడా పిలుస్తారు. ఇది నీలం రంగులో ఉంటుంది.
► బ్లూ బటర్‌ఫ్లై పీ ఫ్లవర్స్‌ను నీటిలో మరిగించి ఈ హెర్బల్‌ టీని ప్రిపేర్‌ చేస్తారు. 
► ఇందులోని ఆంథోసైనిన్ సమృద్దిగా ఉండటం వల్ల ఈ టీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 
► యాంటీ యాక్సిడెంట్లు బ్లూ టీలో ఎక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఈ టీని తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
► బ్లూ టీ తాగడం వలన వాంతులు, వికారం నుంచి ఉపశమనం పొందవచ్చు
► బ్లూ టీలో ఉంటే యాంటీ గ్లైసటీన్ ప్రాపర్టీస్ వలన చర్మం ఆరోగ్యంగా ఉంఉటంది. ముడతలు రాకుండా యవ్వనంగా కనిపిస్తారు. 
► బ్లూ టీలోని ఆంథోసైనిన్ కారణంగా జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. 
► షుగర్‌ పేషెంట్స్‌ రెగ్యులర్‌ టీ కాకుండా బ్లూ తాగితే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. 
► అలసట, చికాకుగా ఉన్నప్పుడు ఈ బ్లూ టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
► బ్లూ టీలో కెఫిన్‌ ఉండదు. కాబట్టి రోజుకు రెండుసార్లు అయినా హ్యాపీగా ఈ టీని తీసుకోవచ్చు.
► ఈ టీ బరువు తగ్గడానికి సహాయపడుతుందని అధ్యయనాల్లో తేలింది. 
► డిప్రెషన్‌, యాంక్సైటీగా అనిపించినప్పుడు బ్లూ టీ ఓ కప్పు తాగితే వెంటనే మూడ్‌ ఛేంజ్‌ అయ్యి యాక్టివ్‌ అవుతారట. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top