ఏడు దేశాలు.. ఏడు స్వర్గాలు

EXPLORE THE SEVEN HEAVENS IN SOUTH EAST ASIA WITH  HASTA-LA-VISA  - Sakshi

వీసా అవసరం లేకుండా ఏడు సర్వాంగ సుందరమైన ఆగ్నేయాసియా దేశాల పర్యటన. ఆహా... నిజంగా వింటుంటేనే ఇప్పుడే విమానం ఎక్కేయాలనిపిస్తోంది కదా! నిజంగా ఈ ఏడు దేశాలు ఏడు స్వర్గాలు.. ఆ మాదిరి అనుభూతిని అందిస్తానంటోంది ఎయిర్‌ ఏసియా. ఆసియాలోని ఈ ఏడు మహా అద్భుతమైన ప్రాంతాలను చుట్టి రావడానికి డిస్కౌంట్‌ ధరల్లో టిక్కెట్లను అందిస్తోంది ఎయిర్‌ఏసియా. చక్కని చలికాలంలో మధురమైన టూర్‌ను ఆహ్వానించడానికి, బ్యాగులన్నీ సర్దేసుకుని ఆసియా టూర్‌కు వెళ్లిరండి. ఈ సందర్భంగా మీకోసం అందిస్తున్న టూర్‌ వివరాలు...

మలేషియా..
ట్విన్ టవర్స్‌ను పోలిన భవంతులు, ప్రపంచంలో అ‍త్యంత ఎత్తైన కట్టడం మెనరా టవర్స్, మలేషియా రాజుల ప్యాలెస్‌, బటు గుహలు, బీచ్‌లు, ద్వీపకల్పాలు ఈ దేశ ప్రత్యేకతలు. రాజధానిగా ఉన్న కౌలాలంపూర్‌కు ఆగ్నేయాసియా ప్రాంతాల్లో విశిష్ట స్థానముంది. ఎంతో అద్భుతమైన, విభిన్న దేశంగా మలేషియాకు ఎంతో పేరుంది. ప్రతి ఒక్కరికీ ఈ దేశం ఆతిథ్యమిస్తోంది. సౌకర్యవంతమైన జోన్‌లో మీరు నివసించాలనుకుంటే, బెస్ట్‌ ప్లేస్‌గా మలేషియానే చెప్పుకోవచ్చు. మనోహరమైన చరిత్ర, సంస్కృతికి ఇది ప్రతీక. వివిధ రకాలైన రుచికరమైన వంటకాలకు పెట్టింది పేరు మలేషియా.

సింగపూర్‌...
మరో విలక్షణమైన దేశం సింగపూర్‌. చక్కటి పర్యాటక కేంద్రం అయిన ఈ దేశంలో మలయ్, చైనా, భారత దేశీయులు ఎక్కువగా స్థిరపడటంతో విభిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. పర్యాటకంగానే కాక విలాసాలకు, వినోదాలకు పేరుపొందిన దేశం​ సింగపూర్. ఆకాశాన్నంటే భవంతులు, మాల్స్‌, జంతు ప్రదర్శనశాల, భూగర్భంలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ వరల్డ్, రాత్రివేళలో అద్భుతమైన లేజర్ షోలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నోరూరించే వంటకాలు, లగ్జరీ హోటల్స్‌, పురాతన నిర్మాణాలు కూడా ఇక్కడ ప్రత్యేకతే. సింగపూర్‌నే లయన్‌ సిటీ, ది రెడ్‌ పోర్ట్‌ అని పిలుస్తూ ఉంటారు. ఆగ్నేయాసియాలో దేశాల్లో కల్లా అత్యంత పాపులర్‌, ఖరీదైన టూరిస్ట్‌ ప్లేస్‌ గార్డెన్‌ సిటీ ఇక్కడే ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఈ-వీసా సర్వీసుతో ఈ అపూర్వమైన ప్రాంతాలను చుట్టి వచ్చేయండి. 

థాయ్‌లాండ్‌...
థాయ్‌ శోభ గురించి ఎవరికి తెలియదు చెప్పండి? బీచ్‌ రిసార్టులు, అమేజింగ్‌ ఫుడ్‌, బడ్జెట్‌లో ధరలతోనే థాయ్‌లాండ్‌ ఆగ్నేయాసియా దేశాల్లో ట్రావెల్‌ హబ్‌గా నిలుస్తోంది. ప్రతి రిసార్ట్‌, హోటల్‌ కూడా పర్యాటకుల వినోదాల కోసం ప్రత్యేక ఏ‍ర్పాటు చేస్తోంది. ఒక్కసారి థాయ్‌లాండ్‌ను సందర్శిస్తే, ఇక జీవితంలో మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది. 

కంబోడియా...
అద్భుతం, ఆశ్చర్యం కలగలుపుగా ఉండేదే కంబోడియా. ఈ దేశాన్ని సందర్శించే ప్రతి ఒక్కర్నీ ఇది ఫుల్‌గా ఆకట్టుకుంటోంది. ప్రాచీన, ఆధునిక ప్రపంచాల సమ్మేళనంగా ఉంటుంది. దీంతోనే కంబోడియా ప్రారంభమైంది. సంప్రదాయంగా, భాషాపరంగా వైవిధ్యం కొనసాగుతున్న ప్రపంచదేశాలలో కంబోడియా ఒకటి. ఎంతో బాధాకరమైన చరిత్రను ఈ దేశం కలిగి ఉన్నప్పటికీ, తన ప్రజలతో ఇది ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. అతిథులకు మాత్రం ఈ దేశం ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన మనోహరమైన ప్రదేశంగానే నిలుస్తోంది.

లావోస్‌...
ఆగ్నేయాసియా దేశాల్లో మరో ప్రత్యేకమైన ప్రదేశం లావోస్‌. దీన్ని గురించి చెప్పుకోకుండా ఎలా మర్చిపోతాం. పర్యాటకులు తరుచు థాయ్‌లాండ్‌ను సందర్శించకపోయినప్పటికీ, లావోస్‌ సందర్శిస్తే చాలు ఆ మధురానుభవాన్ని అందించగలదు. ప్రత్యేకమైన బీచ్‌లు, వన్యప్రాణులతో ఎల్లప్పుడూ అలరించే అరణ్యాలు లావోస్‌ స్పెషల్‌. ఆగ్నేయాసియా దేశాల్లో ఇది చాలా చిన్నది, కానీ మహా అద్భుతమైన ప్రదేశం. పర్వతాలు, నదులు, వాటర్‌ఫాల్స్‌, గుహలు ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆగ్నేయాసియా దేశాల్లో ఎంతో రమ్యమైన ప్రదేశం లావోసే‌. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మనోహరమైన ప్రదేశాన్ని తిలకించడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఎయిర్‌ఏసియాలో పర్యటించడానికి సిద్ధం అవండి.

హాంకాంగ్‌....
ఆహారం, షాపింగ్‌, సంప్రదాయాల పరంగా తూర్పు, పడమర సంస్కృతుల కలయికనే హాంకాంగ్‌. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో చైనీస్ సాంస్కృతిక మూలాలు బ్రిటిష్ కాలంలో పశ్చిమ దేశ సంస్కృతితో ప్రభావితం కావడమే ఇందుకు ప్రధాన కారణం.  దేశంలో ప్రతి మూలన వినోదం దొరుకుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ దేశంలో ద్వీపకల్పాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఫుడ్‌కు ఈ సిటీ ఎంతో ప్రాచుర్యం. హాంకాంగ్‌కి మీ జర్నీ ఎంతో సౌకర్యవంతంగా ఉండటానికి ఈ-రిజిస్ట్రేషన్‌ సర్వీసు కూడా అందుబాటులో ఉంది. 

ఇండోనేషియా...
వైవిధ్యతే ఇండోనేషియాకు మూలం. చల్లని తెల్లని ఇసుక నుంచి బాలి అగ్నిపర్వతాల వరకు విభిన్నకరమైన వాతావరణ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇండోనేషియాలో జాకర్త ఎంతో శక్తివంతమైన అందమైన నగరం. ఈ దేశంలో ప్రతి ప్రదేశం ఓ ప్రత్యేకమైన క్వాలిటీని కలిగి ఉంటుంది. ఆగ్నేసియాలో 17వేలకు పైగా ద్వీపకల్పాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అరణ్యాలు, బీచ్‌లు, గుహలు, అగ్నిపర్వతాలు అన్నీ కూడా ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top