అధికారిని చెప్పు‌తో కొట్టిన టిక్‌టాక్ స్టార్ | Watch: Tiktok Star Sonali Phogat Slaps a Man With Chappal In Haryana | Sakshi
Sakshi News home page

అధికారిని చెప్పు‌తో కొట్టిన టిక్‌టాక్ స్టార్

Jun 5 2020 6:45 PM | Updated on Mar 21 2024 8:42 PM

చండీగఢ్‌‌: టిక్‌టాక్ స్టార్ సోనాలి ఫొగ‌ట్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. గ‌త ఎన్నిక‌ల్లో హ‌ర్యానాలో బీజేపీ నుంచి పోటీ చేసిన‌ ఆమె.. "భార‌త్ మాతాకీ జై" అని నిన‌దించని వారిని పాకిస్తానీయులుగా వ‌ర్ణిస్తూ వార్త‌ల్లోకెక్కిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆమె మ‌రోసారి దురుసు ప్ర‌వ‌ర్త‌న‌తో వార్త‌ల్లో నిలిచారు. ధాన్యం మార్కెట్‌లో అధికారిని చెప్పు తీసుకుని కొట్టారు. ఈ ఘ‌ట‌న‌ హ‌ర్యానాలో చోటుచేసుకుంది. సోనాలి ఫొగ‌ట్ కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బాలాస్మంద్‌లోని ధాన్యం మార్కెట్‌ను స‌మీక్షించేందుకు వెళ్లింది. ఈ క్ర‌మంలో అక్క‌డున్న మార్కెట్ సెక్ర‌ట‌రీతో ఆమెకు వాదులాట జ‌రిగింది. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన సోనాలి అత‌నికి చెంప‌దెబ్బ రుచి చూపించింది. 

అంత‌టితో ఆగ‌కుండా చెప్పు తీసుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా కొట్టింది. దీనికి సంబంధించిన‌ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై సొనాలి మాట్లాడుతూ అత‌ను దుర్భాష‌లాడుతూ, త‌న‌ను అవ‌మానించ‌డం వ‌ల్లే కొట్టాల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. మార్కెట్ సెక్ర‌ట‌రీ మాత్రం తానేమీ అన‌క‌ముందే సోనాలి త‌న‌పై దాడి చేసింద‌ని చెప్పుకొచ్చాడు. కాగా టిక్‌టాక్‌తో గుర్తింపు సంపాదించుకున్న సోనాలి ఫొగ‌ట్‌కు బీజేపీ గ‌తేడాది ఎన్నిక‌ల్లో హ‌ర్యానాలోని ఆదంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ ఇచ్చింది. ఆమె గెలుపు త‌థ్య‌మ‌నుకున్న‌ప్ప‌టికీ అందరి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఓట‌మిపాలైంది.

Advertisement
 
Advertisement
Advertisement