మేం బతుకుతామనుకోలేదు..! | Kayakers lucky escape as ice cap collapses in Alaska | Sakshi
Sakshi News home page

మేం బతుకుతామనుకోలేదు..!

Aug 20 2019 6:03 PM | Updated on Aug 20 2019 6:07 PM

హిమానీ నదుల్లో బోటింగ్‌ చేస్తే భలే మజాగా ఉంటుంది కదా! మరి ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు శిఖరాలు కుప్పకూలిపోయి భయానక వాతావరణం సృష్టిస్తే.. ఏమైనా ఉంటుందా? ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సరిగ్గా ఇదే సంఘటనను ప్రత్యక్షంగా చూశారు ఇద్దరు వ్యక్తులు. అమెరికాలోని అలస్కాలో యూట్యూబ్ ఛానల్‌ను నడిపే ఇద్దరు వ్యక్తులు శనివారం స్పెన్సర్‌ హిమానీ నది సమీపంలో సాహసయాత్రకు దిగారు. అయితే అక్కడి మంచు కొండలు ఒక్కసారిగా కుప్పకూలడంతో నదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో వారు ప్రయాణిస్తున్న పడవ అతలాకుతలమైంది. 

అయినప్పటికీ మంచు విస్ఫోటన దృశ్యాల్ని కెమెరాలో బంధిస్తూ దానికి చేరువగా వెళ్లాలని చూశారు. కానీ ప్రకృతి ప్రతాపం చూపించడంతో వారు వెనుదిరగక తప్పలేదు. ఈ వీడియోను వారు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మేం ఇంకా బతికే ఉండటం మా అదృష్టమంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ సాహస యాత్రలో ఎలాంటి గాయాలు తగలకుండా బయటపడ్డామని వారి అనుభూతిని పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘చావు తప్పి కన్ను లొట్టపోయింది’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement