ఎవరి తోడు, అండ లేకుండా 22 ఏళ్లుగా..!

రోండోనియా రాష్ట్రం అమెజాన్‌ అడవుల గుండా వెళ్తే ఈ ఒంటరి మనిషి కథ మొదలవుతుంది. 1996లో తొలిసారిగా ది ఇండియన్‌ ఫౌండేషన్‌ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. తాజాగా దాన్ని బయపెట్టింది. చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. చాలా దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. అతన్ని చివరిసారిగా ఈ మే నెలలో చూసినట్లు ఇండియన్‌ ఫౌండేషన్‌ బృంద ప్రతినిధి అల్టెయిర్‌ అలగైర్‌ చెబుతున్నారు. అడుగు జాడల ఆధారంగా అతన్ని వెంబడిస్తూ.. అతని జీవన శైలిపై అధ్యయనం చేస్తూ వస్తున్నారు. ‘అతనో శాఖాహారి. దుంపలు, పండ్లు మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. వీడియో వైరల్‌ అవుతుండగా.. అతని గురించి లక్షల్లో ఎంక్వైరీలు వచ్చిపడుతున్నాయని అలగైర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top